ఎన్నో ఏళ్ళ కష్టానికి ఫలితం దక్కింది. అది ఎలా దక్కింది అనేది పక్కన పెడితే, ప్రస్తుతం సియం పదవిలో ఉన్నారు వైఎస్ జగన్. 10 ఏళ్ళ నుంచి చంద్రబాబు పై పెంచుకున్న కక్ష అంతా తీర్చుకుంటున్నారు. ఇంకో 5 ఏళ్ళు ఎదురు లేదని, ఊళ్ళల్లో వైసీపీ క్యాడర్ రెచ్చిపోతుంది. దొరికిన వారిని దొరికినట్టు అని రకాలుగా హింస పెడుతున్నారు. ఇలా ఇంకో 5 ఏళ్ళు మమ్మల్ని అడిగే వారు లేరనుకుంటున్న టైములో ఢిల్లీ నుంచి వస్తున్న న్యూస్ విని గుండె గుబెల్ మంటుంది, వైసీపీ క్యాడర్ కు. కేసుల విషయం పైకి తెచ్చి, జగన్ ను లోపల వేసే వ్యూహం ఉన్నా, దానికంటే ఇబ్బంది కరమైన వార్తా ఇప్పుడు వైసీపీ క్యాడర్ ను వేదిస్తుంది. అదే మోడీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని కాదనలేక, అవును అనలేక, జగన్, విజయసాయి రెడ్డి పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇంతకీ అది ఏంటి అంటే, ప్రధాని మోడీ ఎన్నికల సంస్కరణల్లో భాగంగా తీసుకున్న జమిలి ఎన్నికల విధానం. దీని పై ఇప్పటికే అఖిల పక్ష సమావేశం జరగటం, దాని పై దాదపుగా అన్ని పార్టీలు ఒకే చెప్పటం కూడా అయిపోయాయి.
అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్న వార్తల ప్రకారం, 2022 నాటికి జమిలి ఎన్నికలకు వెళ్ళాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే జరిగితే రెండేళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే రెండేళ్ళ ముందే జగన్ సియం పదవిని వాదులుకోవాలి. తరువాత గెలుస్తామో, లేదో, రాజకీయ పరిస్థితితులు ఎలా ఉంటాయో అన్న బెంగ వైసీపీకి పట్టుకుంది. వచ్చే మూడేళ్లలో 18 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, కర్ణాటక అసెంబ్లీ ఏ క్షణమైనా పడిపోయే పరిస్థితి. ఇక 2023-24ల్లో 9 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఏపి కూడా ఉంది. వీటిని రెండేళ్ళ ముందుకు జరిపి, అన్ని రాష్ట్రాలకు, పార్లిమెంట్ కు 2022లోనే ఎన్నికలకు వెళ్ళాలని మోడీని నిర్ణయం తీసుకున్నారని, ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తునట్టు తెలుస్తుంది. ఈ విధానంతో అభివృద్ధి దూసుకువెళ్తుందని, ప్రతి సారి ఎన్నికల కోడ్ తో అభివృద్ది ఆగిపోకుండా సాగిపోతుంది అని, వ్యయం కూడా తగ్గుతుంది అని, బీజేపీ భావన.