చంద్రబాబు విదేశాలకు వెళ్ళిన టైంలో, ఆయన్ను అన్ని విధాలుగా బలహీన పరచటానికి అంటూ బీజేపీ , ఇటు వైసీపీ కంకణం కట్టుకున్నాయి. ఎన్నికల తరువాత కూడా రెస్ట్ తీసుకోకుండా, దేశమంతా తిరిగి ఈవీఎం ల పై ఉద్యమం చేసిన చంద్రబాబు, కుటుంబంతో కలిసి గడపటానికి వెళ్ళిన సమయంలో కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా చేసి, మరింతగా మానసికంగా బలహీన పరిచే కుట్ర చేస్తున్నారు. పార్టీ ఫిరాయించే అంశం బీజేపీ తీసుకోగా, కక్ష తీర్చుకునే పని వైసీపీ చేస్తుంది. నిన్నటికి నిన్న నలుగురు ఎంపీలను లాక్కున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే, చంద్రబాబుకి మరో షాక్ ఇచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించి, వెంటనే రంగలోకి దిగింది. చంద్రబాబు నివాసం పక్కనే ఉండే ప్రజా వేదికను, మేము వాడుకుంటామని, దానికి అయ్యే ఖర్చులు అన్నీ భరిస్తామని, ప్రజా వేదికను తమకు కేటాయించాలని గతంలో జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు.
అయితే చంద్రబాబు రాసిన ఈ లేఖను జగన్ పట్టించుకోలేదు. చంద్రబాబు లేని టైములో, దానిని వెంటనే స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించింది. ఇదే విషయం అక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యులకు చెప్పియా, అక్కడ టీడీపీకి సంబంధించిన సామాగ్రిని వెంటనే తరలించాలని సీఆర్డీయే అధికారులు ఆదేశించారు. అంతే కాదు, చంద్రబాబు వస్తే మళ్ళీ నిరసన తెలుపుతారాని, అందుకే ఈనెల 24న ప్రజావేదికలోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ప్రజావేదికను స్వాధీనం చేసుకోడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్డీయే అధికారులు ఉండవల్లిలోని ప్రజావేదిక వద్దకు వచ్చారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్నారని, ఆయన లేని టైములో ప్రజావేదిక భవనాన్ని స్వాధీనం చేసుకోవడం సరికాదని, ఆయన వచ్చిన తరువాత, ఆయనతో మాట్లాడాలని టీడీపీ నేతలు అన్నారు. మరో పక్క, చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా పడగొడతామని ఇప్పటికే, వైసీపీ నేతలు వార్నింగ్ లు ఇస్తున్నారు.