పింఛను ఇవ్వడానికి వచ్చామంటూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, రావులపాలెంలో ఇద్దరి వృద్ధురాళ్ల మెడల్లోని బంగారు తాళ్లను దుండగులు అపహరించారు. రావులపాలెంలోని ఊబలంక రోడ్డులో ఒంటరిగా జీవిస్తున్న 74 వయసు గల మంగాయమ్మ ఇంటికి వెళ్లిన దుండగులు....పింఛను డబ్బు ఇవ్వడానికి వచ్చామంటూ దుండగులు ఆమె ఇంటిలోకి ప్రవేశించారు. ఫోటో తీయాలని ఇంట్లోకి ప్రవేశించిన వారు... ఆమె మెడలోని 5 కాసుల బంగారు తాడు లాక్కుని పరారయ్యారు. కొత్తపేట మండలం పలివెలలో పింఛను ఇవ్వడానికి ఫోటో తీయాలని.... దాని కోసం బంగారు తాడు తీయాలని చెప్పటంతో ఆమె తాడు తీసి పక్కన పెట్టారు. ఇదే అదనుగా చూసిన దుండగులు దాన్ని తీసుకుని పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణ కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని వినతి చేశారు. పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది వస్తుంటారని అందువల్ల ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం జరిపారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజావేదిక భవనం గురించి చర్చించి వైఎస్ జగన్‌కు లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖపై సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

letter 05062019 1

ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని ఆనుకుని ఉన్న ప్రజా వేదిక భవనాన్ని ఆయన నివాస భవనంగా వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని టీడీపీ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రస్తుతం ఒక ప్రైవేటు భవనంలో ఉంటున్నారు. ఆయన దానికి ప్రతి నెలా అద్దె చెలిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు నివాస భవనాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ప్రజా వేదిక భవనాన్ని ఇస్తే సౌకర్యంగా ఉంటుందని, దీనిని ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ పంపాలని నిర్ణయించారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ నిర్మించిన పార్టీ కార్యాలయం విశాలంగా ఉన్నందున.. పార్టీ రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యేవరకూ దానిని వినియోగించుకోవడంపై ఆలోచన చేయాలని నిశ్చయించారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు తరువాత తొలిసారి విశాఖ పర్యటనకు వెళ్లారు. విశాఖలోని శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి సీఎం జగన్ పట్టువస్త్రాలు, ఫలాలు సమర్పించారు. సీఎం హోదాలో తనను కలిసేందుకు వచ్చిన జగన్‌ను స్వరూపానంద స్వామి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దాడారు. విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారికి జగన్‌తో ప్రత్యేక పూజలు చేయించారు. సీఎం జగన్‌తో స్వరూపానంద ఏకాంతంగా చర్చలు జరిపారు.విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదా పీఠానికి చేరుకున్న జగన్‌కు పీఠం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠానికి చేరుకున్న జగన్‌ ..స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పీఠం అధిదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

jagan 04062019 1

2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా జగన్‌ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీస్సులు పొందారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మళ్లీ ఆశీస్సులు పొందారు. ఈ నెల 8న మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో మంత్రుల పేర్ల విషయమై స్వరూపానందేంద్రతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరిపోతారంటూ వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క ఆయన నాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటూ, అసంత్రుప్తిలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. నిన్న తెదేపా అధినేత చంద్రబాబు వద్ద జరిగిన సమావేశానికి హాజరైన ఆయనకు లోక్‌సభలో పార్టీ ఉపనేతగా, విప్‌ పదవి కట్టబెట్టారు. అంతకు ముందు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా, రామ్మోహన్‌నాయుడును లోక్‌సభాపక్ష నేతగా చంద్రబాబు నియమించారు. దీనిపై ఎంపీ కేశినేని నాని మనస్తాపానికి గురయ్యారు. తనకు పార్టీలో ప్రాధాన్యం కల్పించటం లేదని అసంతృప్తితో విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు కేశినేని హాజరుకాలేదు. నిన్నటి సమావేశంలో పార్టీ కట్టబెట్టిన పదవులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో స్పందించారు.

nani 05062019

‘‘లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు. నా కంటే సమర్థుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నా. విజయవాడ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు. వారి ఆశీస్సులు నాకున్నాయి. పార్టీ ఇచ్చే విప్‌ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. మరోసారి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెప్పారు.

nani 05062019

టీడీపీ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరనున్నట్లు గత కొద్ది రోజులుగా వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. నితిన్ గడ్కరీని అందుకే కలిశారని, చేరిక ఖాయమని ఓ వార్త హల్‌చల్ చేసింది. తాజాగా చంద్రబాబు నియమించిన విప్‌ పదవిని తిరస్కరించడానికి కారణం కూడా ఇదేనంటూ వైసీపీ అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని స్పందించారు. బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. ఇక విప్ బాధ్యతలు అప్పగించడంపై స్పందిస్తూ.. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కానీ ఆ పదవిని తాను స్వీకరించలేనని, తాను అంత సమర్థుడిని కాదని కేశినేని నాని చెప్పుకొచ్చారు.

Advertisements

Latest Articles

Most Read