వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మంగళవారం నిమిమించిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన సీఎంవోకి అధిపతిగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులుగా వ్యవహరించే అధికారుల మధ్య పని విభజన, వారు ఏయే శాఖల బాధ్యతలు నిర్వహించాలో ఆయనే నిర్దేశిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులంతా అజేయ్ కల్లమ్‌కి జవాబుదారీగా ఉంటారు. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఏ సమాచారమైనా పొందడానికి, అవసరమైన సలహాలివ్వడానికి ఆయనకు అధికారం ఉంటుంది. ఈ పదవిలో మాజీ సీఎస్ మూడేళ్ల పాటు కొనసాగుతారు.

ajay 05062019 1

ఆయన సేవలకు గాను వేతనం కింద ప్రభుత్వం నెలకు రూ.2.50 లక్షల చెల్లించనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన పదవీ విరమణ చేసిన సమయానికి టీఏ, డీఏలు ప్రభుత్వం చెల్లించేదో ఇప్పుడు అంతే మొత్తం చెల్లిస్తారు. వాహన సదుపాయం, వసతి కల్పిస్తారు. ఆయన పేషీలో తాత్కాలికంగా తొమ్మిది పోస్టులను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అజేయ కల్లం టీటీడీ ఈవోగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ ఛైర్మన్‌గా, ఆర్థిక, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.

ajay 05062019 1

ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసారు. రిటైర్డ్ అయిన తరువాత చంద్రబాబుని తిడుతూ, జగన్ కు దగ్గర అయ్యారు. రాజధాని అమరావతిలో స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని తెలిపారు. స్విస్‌ ఛాలెంజ్‌ లోపభూయిష్టంగా ఉందని, వైసిపీతో కలిసి అప్పట్లో గొడవలు చేసారు. రాజధాని భూములపై కూడా ఆయన ఓ పుస్తకం రాశారు. రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని ఆయన తన పుస్తకంలో ఆరోపించారు. ఇలా ప్రతి రోజు చంద్రబాబుకి వ్యతిరేకంగా పోరాటం చేసి, ఇప్పుడు జగన్ పక్కన చేరి, ఏకంగా రూ.2.50 లక్షల జీతం పొందబోతున్నారు. జగన్ రూపాయి జీతం వార్తా విని సంతోషించే లోపే, ఇలాంటి వార్తలు కూడా వినాల్సి వస్తుంది.

తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్లమెంటరీ పార్టీ పదవుల వ్యవహారంలో నాని అలకబూనిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన్ను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. కేశినేనితో ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు తెదేపా ఎంపీలంతా సీనియర్‌, జూనియర్‌ అనే తేడాలు లేకుండా పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో నాని మాట్లాడుతూ లోక్‌సభాపక్ష ఉపనేత, విప్‌ పదవులు వద్దని.. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినట్లు సమాచారం. గత ఐదేళ్లలో జరిగిన కొన్ని ఘటనలు, తన అసంతృప్తిగా కారణాలను కేశినేని వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కృష్ణా జిల్లాలోని పరిస్థితులపైనా చంద్రబాబుతో ఆయన చర్చించినట్లు తెలిసింది.

nani 05062019 1

పార్లమెంటరీ పార్టీ పదవుల విషయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అలకబూనారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నివాసంలో కేశినేని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో సమావేశమయ్యారు. కేశినేనితో ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు.. పార్లమెంటు సమావేశాల్లో కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా ముగ్గురూ కలిసి సమస్యలపై గళం వినిపించాలని చెప్పారు. సమావేశం అనంతరం గల్లా జయదేవ్‌ మీడియాతో మాట్లాడారు. తాము ముగ్గురమూ రెండోసారి ఎంపీలుగా గెలిచిన వాళ్లమేనని.. తమకు సీనియర్‌, జూనియర్‌ అనే తేడా ఏమీ లేదని చెప్పారు. తన పదవి మారుస్తానంటే తనకెలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. లోక్‌సభాపక్ష నేతగా ఉండటానికి తాను ఇష్టపడ్డానని అయితే.. ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సుజనాచౌదరి తప్పుకోవటంతోనే తనకు ఆ పదవి వచ్చిందని తెలిపారు. తనకు ఆసక్తి ఉన్నందునే ఆ పదవి తీసుకున్నానని జయదేవ్‌ వివరించారు. ప్రస్తుతానికి కేటాయించిన పదవుల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అజ్ఞాతాన్ని వీడి.. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగా.. మరికొన్నింటికి నోరు మెదపలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. విచారణ అనంతరం బయటికొచ్చిన రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మీడియాను కబ్జా చేసేందుకు మాఫియా ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్‌ అన్ని టీవీలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఉన్నట్టుండి రవిప్రకాష్‌ బాంబు పేల్చారు. అయితే మీడియాను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నదెవరు..? ఇంతకీ ఆ అమ్రిష్‌పురిలాంటి తెలంగాణలో ఎవరు..? అనే విషయాలపై మాత్రం రవిప్రకాష్ క్లారిటీ చెప్పేందుకు సాహసించలేదు.

ravi 05062019

జర్నలిస్టులంతా పోరాడాలి! "మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోంది. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి. దొంగ పత్రాలతో భూములు లాక్కొన్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారు. పోలీసుల సహకారంతో ‘మోజో’ టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారు. మీడియా కబ్జాపై జర్నలిస్ట్‌లంతా పోరాడాలి" అని రవిప్రకాష్‌ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యవహారంపై అటు టీవీ9 యాజమాన్యం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో గతంలో నామినేట్ పదవుల్లో నియమితులైనవారిలో కొందరు ఇప్పటికే స్వచ్చందంగా తప్పుకున్నారు. మరికొందరు ప్రభుత్వం తమను తొలగిస్తే గానీ తప్పుకోమని అంటున్నారు. దీంతో, దేవాలయాల్లో పాలక మండళ్లు కూడా రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిపై పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, నటుడు మోహన్ బాబు కూడా ఈ రేసులో ఉన్నట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ నేత మోహ‌న్‌బాబును తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించ‌నుంద‌నే వార్త‌ గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌పై మోహన్ బాబు ట్విట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

mohanababu 05062019

తాను ప‌ద‌వులు ఆశించి రాజ‌కీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. `నేను టీటీడీ చైర్మ‌న్ రేసులో ఉన్న‌ట్టుగా కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు. నా ఆశ‌యం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిగా చూడ‌డ‌మే. అందుకోసమే నా వంతుగా క‌ష్ట‌పడ్డాను. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముఖ్య‌మంత్రి అవుతాడ‌న్న న‌మ్మ‌కంతోనే నేను తిరిగి రాజ‌కీయాల్లోకి ప్రవేశించాను. అంతేగాని ఎలాంటి ప‌ద‌వులూ ఆశించి కాదు. ఇలాంటి పుకార్ల‌ను ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని మీడియాను కోరుతున్నాన‌`ని మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read