ఏపీలో ఎన్నిక‌ల్లో గెలిచిన కొద్ది రోజుల‌కే వైసీపీ ముఖ్య నేత విజ‌య సాయిరెడ్డికి ఝ‌ల‌క్. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్టించి విజయసాయిరెడ్డిని చైర్మన్ చేయడం దరదృష్టకరమని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ కె.పిచ్చేశ్వరరావు అన్నారు. నియమ నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా చేపట్టిన విజయసాయిరెడ్డి నియామకం చెల్లదని తేల్చి చెప్పారు. ఏపీ ఒలింపిక్ అసోసియేష‌న్ ఛైర్మ‌న్‌గా వైసీపీ సీనియ‌ర్ నేత రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది జ‌రిగిన 24 గంటల్లోగానే దీని పైన వ్య‌తిరేక‌త మొద‌లైంది. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్టించి విజయసాయిరెడ్డిని చైర్మన్ చేయడం దరదృష్టకరమని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ కె.పిచ్చేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఒలంపిక్ సంఘం రెండు వర్గాలుగా ఏర్పడి అనేక ఒత్తిళ్లకు గురైందన్నారు. ఒలంపిక్ సంఘం ఎన్నికలను గుర్తింపు పొందిన సంఘాలతో నిర్వహించామని, గత ప్రభుత్వంలో గుర్తింపులేని సంఘాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించారని చెప్పారు.

vsreddy 03062019

ఒలింపిక్ సంఘం ఎన్నికపై న్యాయ పరమైన పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. ఒలింపిక్ సంఘం గురించి ఆయ‌న అనేక విష‌యాల‌ను బ‌య‌ట పెట్టారు. ఒలంపిక్ సంఘం సభ్యుడైన పురుషోత్తం 2015లో కొత్త సంఘాన్ని, సొసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారని వివ‌రించారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఏపీలో ఉండాల్సి ఉండ‌గా..మద్రాస్ చిరునామాతో ఉందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పురుషోత్తం రిజిస్ట్రేషన్ చేయించిన సంఘం గుర్తింపు చెల్లద‌ని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని దుయ్య బ‌ట్టారు. నియమ నిబంధనలు పాటించకుండా .. లేని పదవి సృష్టించి విజయసాయిరెడ్డిని చైర్మన్‌గా చేయడం దురదృష్టకరం అన్నారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన విజయసాయిరెడ్డి నియామకం చెల్లదని స్ప‌స్టం చేసారు. ఒలింపిక్ సంఘం నియమ నిబంధనలు తెలుసుకోవాల్సిందిగా విజయసాయిరెడ్డి ,కృష్ణదాస్‌లను కోరుతున్నామంటూ పిచ్చేశ్వ‌ర రావు విజ్ఞ‌ప్తి చేసారు.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని రేపు  ప్రత్యేకంగా కలవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన జగన్‌ విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు జగన్  విశాఖ చేరుకొని స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. అనంతరం తిరిగి అమరావతి చేరుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను కలవలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

మన అమరావతి - మన రాజధాని అంటూ, అమరావతి అనే మాటకు ఎమోషనల్ గా ఆంధ్రుడు కనెక్ట్ అయిపోయాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీ అవుతుందని కలలు కన్నాడు. పనులు కూడా అలాగే సాగాయి. ఎటుచూసినా యంత్రధ్వనులు.. మహాసౌధాలను నిలబెట్టడానికి చీమలబారుల్లా కదులుతున్న శ్రామికజీవులు.. నేలమాళిగల్లోంచి కలల రాజధానిని ఆవిష్కరిస్తున్న ఇంజనీరింగ్‌ పనితనం.. పరుగులు తీస్తున్న ప్రణాళికలు.. ఇలా రాజధాని అమరావతిలో సందడి చేసిన జాడలు ఇప్పుడు కనిపించడం లేదు. రాజధాని విషయంలో కొత్త ప్రభుత్వం వైఖరి ప్రభావం అడుగడుగునా కనిపిస్తోంది. పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కార్మికులు స్వస్థలాలకు పోతున్నారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయం కళతప్పింది. గ్రీవెన్సులు, రాజధాని గ్రామాలలో కల్పించాల్సిన వసతులపై నిత్యం సమీక్షలుండేవి. ఇప్పుడా కోలాహలమే కనిపించడం లేదు.

amaravati 03062019

రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ నిర్మాణాలు నిధుల కొరత కారణంగా కొంతకాలం నిలిపివేసే పరిస్థితి వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి. అమరావతిలో వివిధ నిర్మాణాల కొనసాగింపు పై జగన్ సమీక్ష తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కొన్ని పనులను కొంతకాలం నిలిపివేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని అమరావతిని ఐదు ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక రూపొందించడం తెలిసిందే. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, రహదారులు, ఐకానిక్ వంతెన డిజైన్లు ఇప్పటికే ఖరారు చేయగా, అనేక పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

amaravati 03062019

రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటి వరకూ 1500 కోట్ల రూపాయలే కేటాయించగా, మరో 1000 కోట్లు మంజారు చేసినా, ఇంకా విడుదల కాలేదు. రాజధాని పరిధిలో 39,875 కోట్ల రూపాయల మేర పనులు జరుగుతుండగా, మరో 4,214 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి. మరో 7600 కోట్ల రూపాయల పనులు ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాల పనులు కొద్ది రోజులు నిలిపివేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వివిధ సందర్భాల్లో జగన్, అమరావతి పై చూపించిన అనాసక్తి ఇప్పుడు తెర మీదకు వస్తుంది. చూద్దాం చంద్రబాబు లేని అమరావతి, ఏమవుతుందో..

సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసీ వెల్లడించారు. అయితే గత 5 ఏళ్ళుగా జగన్ పై, జేసి వేసిన సెటైర్లు అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో బూతులు కూడా తిట్టారు. అలాంటి జేసి, ఇప్పుడు జగన్ పై తన అభిప్రాయం చెప్పారు.

jc diwakar 03062019

‘జగన్‌పై రాజకీయ విమర్శలు చేశా తప్ప ఎప్పుడూ ద్వేషించలేదు. జగన్‌ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అలాగని నేను పార్టీ మారాలనుకోవడం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంతి రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న అనుంబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. సుహృద్భావం ఉండేదని చెప్పారు. రాజకీయాలపై ప్రస్తుతం తనకు ఆసక్తి లేదన్నారు. అయితే ఎన్నికల సంఘంలో మార్పులు చేయాల్సిన అవసరముందని జేసీ అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చిన్న చిన్న గొడవలు సహజమేనని అన్నారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని జేసీ కితాబిచ్చారు.

Advertisements

Latest Articles

Most Read