ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హోరా హోరీ తలపడి, ఎన్నికల ఫలితాలు తరువాత జగన్ మొహన్ రెడ్డి, మాజీ ముఖ్యామంత్రి చంద్రబాబు ఒకే వేదిక పై కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు, ఇరు రాష్ట్రాలకు చెందిన నాయకులు రానున్నారు.జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గుంటారనే సమాచారం వచ్చింది. ఇదే కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు. అదే స‌మ‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు సైతం రాజ్‌భ‌వ‌న్ నుండి ఆహ్వానం వెళ్లింది. ఆయ‌న ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఉన్నారు. ఆయ‌న కూడా ఈ సారి ఇఫ్తార్ విందుకు హాజ‌ర‌వుతార‌ని చెబుతున్నారు.

jagan cbn 01062019

ఇక‌, రాజ్‌భ‌వ‌న్‌లో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగిన త‌ప్ప‌ని స‌రిగా హాజ‌ర‌య్యే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఇప్ప‌టికే ఆహ్వానం పంపారు. ఆయ‌న సైతం రాజ‌భ‌వ్‌న కార్య‌క్ర‌మానికి వ‌స్తార‌ని తెలుస్తోంది. దీంతో..ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఈ ముగ్గురూ ఒకే కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నార‌నే స‌మాచారంతో రాజ‌కీయంగా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో హోరా హోరీ త‌ల‌ప‌డిన టీడీపీ-వైసీపీ-జ‌న‌సేన అధినేత‌లు ఇప్పుడు ఎన్నిక‌ల ప‌లితాల త‌రువాత ఒకే చోట‌కు వ‌స్తున్నారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించ‌టం తో అందునా ఇఫ్తార్ విందు కావ‌టంతో చంద్రబాబు వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నయని చెబుతున్నారు. ఇక‌, వీరంతా ఒకే చోట‌కు వ‌స్తుండ‌టంతో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు..ఎటువంటి స‌న్నివేశాలు క‌నిపిస్తాయనే ఆస‌క్తి నెల‌కొని ఉంది. మరి చంద్రబాబు వెళ్తారో లేదో, మరి కొద్ది సేపట్లో తెలిసిపోతుంది.

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 9న మాల్దీవులు, శ్రీలంక పర్యటన నుంచి భారత్ కు చేరుకోనున్న మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ప్రధాని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు మోదీ తిరుమల టూర్ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులను ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళతారని చెప్పాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పదేళ్ల వయసున్న ఆ బాలుడి  వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారిని సైతం ఎదురుప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టాడు. తన పేరు శివకుమార్‌ అంటున్న ఆ కుర్రాడు.. తమది బాలతిమ్మయ్యగారి పల్లె అని చెబుతున్నాడు. ఈ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండల పరిధిలో ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడిని శిశు సంరక్షణ కేంద్రం లేదా అనాథ బాలల ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. అయితే అనాథ ఆశ్రమానికి వెళ్లేందుకు బాలుడు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అసలీ బాలుడు ముఖ్యమంత్రి ఇంటికి ఎలా వచ్చాడు, అతనితో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు.

ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి తెదేపా తరఫున శుభాకాంక్షలు తెలిపేందుకు రెండు రోజులపాటు ప్రయత్నించినా అవకాశం లభించలేదని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న గంటా.. ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ.. ‘జగన్‌ వద్దకు వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలపడానికి నాతో పాటు మా పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడును పార్టీ అధిష్ఠానం నియమించింది. జగన్‌ను కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్‌ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవు. ప్రతిపక్షంతో పాటు మీడియానూ బెదిరిస్తున్నట్లుగా మాట్లాడారు. ఎన్నికల వేళ నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల నుంచి అప్పుడే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెండర్ల రద్దు విషయంలో గత ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

tdp 01062019

దిల్లీలో మోదీని కలిశాక ప్రత్యేక హోదాపై స్పష్టంగా మాట్లాడలేక జగన్‌ డొంకతిరుగుడుగా వ్యవహరించారు. వృద్ధుల పింఛన్లు రూ.3వేలకు పెంచుతామని చెప్పి.. కేవలం రూ.250 పెంచి రూ.2,250కి పరిమితం చేశారు. మద్యపాన నిషేధం విషయంలోనూ మాట దాటవేస్తూ దశలవారీగా అమలుచేసి ఆఖరుగా హోటళ్లలో విక్రయిస్తామని అంటున్నార’ని వ్యాఖ్యానించారు. తెదేపా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకాభిప్రాయంతోనే ఎన్నుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ‘తెదేపాకు గెలుపోటములు కొత్తకాదు. గతంలోనూ ప్రతిపక్ష పాత్ర పోషించింది. త్వరలో పార్టీలో అంతర్గతంగా విశ్లేషించుకొని, పొరపాట్లను గుర్తించి, తిరిగి ప్రజల మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామ’ని గంటా వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read