పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కీలక ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌ పనులను శుక్రవారం నుంచి నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుల బృందం మూడు రోజుల పాటు పునరావాస గ్రామాల్లో నిర్మాణాలు పరిశీలించారు. పునరావాసాల నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారాల విషయం, ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాల విషయంలో సంపూర్ణ నివేదికను కేంద్ర జలమండలికి అందజేయనున్న నేపథ్యంలో ఎగువ, దిగువ కాపర్‌ డ్యాం పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు సూచించారు. ప్రాజెక్టులో స్పిల్‌ వే స్పిల్‌ చానల్‌ పనులు మాత్రం జరగవలసి ఉండగా ఆ పనులు మందకొడిగా నడుస్తున్నాయి. పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.

polavaram 01062019

ప్రాజెక్టులో పనిచేసే భారీ వాహనాలు, యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్రషర్లు, టెలీ బెల్ట్‌ యంత్రాలు, కాంక్రీట్‌ మిక్సర్లు యంత్రాలు కూడా నిలిచిపోయాయి. మరికొన్ని భారీ వాహనాలు ఒక్కొక్కటిగా ప్రాజెక్టు ప్రాంతం నుంచి బయటికి తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలక పనులు నిర్వహించే భారీ వాహనాలు బయటికి తరలి వెళ్లిపోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముంపునకు సంబంధించిన కూడా రకరకాల సమాధానాలు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో పున పునరావాస ఏర్పాట్లు పూర్తయ్యే వరకు కాఫర్‌ డ్యామ్‌ పనులను నిలిపివేయాలన్న నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని పోలవరం అథారిటీ నిర్ణయించింది. ఈ మేరకు సమావేశం నుండే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నాం నుండి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు.

polavaram 01062019

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 1877 కోట్ల రూపాయలు చెల్లించాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఇఒ ఆర్‌కె జైన్‌ చెప్పారు. 2019 ఏప్రిల్‌ వరకు పోలవరం ప్రాజెక్టుకు రూ.16,418 కోట్లు ఖర్చుపెట్టారని, అందులో రూ.10,869 కోట్లు 2014 మార్చి నుంచి ఖర్చుపెట్టారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.6727 కోట్లు విడుదల చేసిందని, మిగిలిన మొత్తం రూ.4142 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. అయితే ప్రస్తుతానికి రూ.1887 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదనలు పంపిచామని తెలిపారు. ఇది కాక మరో రూ.1112 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని వాటికి సంబంధించిన బిల్లులు రాలేదని అన్నారు.

కొత్త ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించింది. సాధారణ పరిపాలన శాఖ, సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాల వివరాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా భౌగోళికంగా భిన్న పరిస్థితులు కలిగి ఉంది. డెల్టా, సముద్ర తీరం ఒకవైపు, మెట్టప్రాంతం మరోవైపు ఉంటుంది. జిల్లా మొట్టమొదట 1859 ప్రాంతంలో ఏర్పడింది. అప్పట్లో బందరు ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. తర్వాత 1904లో గుంటూరు జిల్లా నుంచి విడిపోయి కృష్ణా నది పేరుతో ఏర్పాటు అయింది. 1925లో కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడదీసి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో మూడు సార్లు జిల్లా స్వరూపం మారిపోయింది. ప్రస్తుతం ఉన్న జిల్లాను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఏలూరు పార్లమెంటు పరిధిలో జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు వారీగా ఏర్పాటు చేస్తే రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలోకి వెళ్లనున్నాయి. మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక జిల్లాలో ఏడు నియోజకవర్గాలు మాత్రం పరిమితం కానున్నాయి. జిల్లాలో గత ఏడాది వరకు 50 మండలాలు ఉండేవి. విజయవాడ అర్బన్‌ మండలం పునర్విభజన చేసి నాలుగు మండలాలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 53 మండలాలుగా జిల్లా ఆవిర్భవించింది. విజయవాడ గుడివాడ, నూజివీడు, బందరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రాన్ని మార్చాలని గత కొంతకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అధికారులు అంతా విజయవాడ నగరానికే పరిమితం అవుతున్నారు. జిల్లా కేంద్రం మూలకు ఉండటంతో ప్రజలు కలెక్టరేట్‌, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లేందుకు సమస్యగా ఉంది. అధికారులు సైతం అక్కడ నివాసం ఉండక అందుబాటులో ఉండటం లేదు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. అదికూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం భౌగోళికంగా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

రెండు జిల్లాలుగా కృష్ణాను విభజిస్తే విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. మచిలీపట్నం పరిధిలో బందరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాలు ఉండనున్నాయి. అయితే పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, యనమలకుదురులు మచిలీపట్నం జిల్లాలోకి చేరనున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం మచిలీపట్నం జిల్లా పరిధిలోకి వెళుతుంది. నగరం పరిసరాల్లోని పెద్ద పంచాయతీలు మచిలీపట్నం పరిధిలోకి చేరుతాయి. విజయవాడ జిల్లా పరిధిలో తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం పరిధిలోని తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందే జరగాల్సి ఉన్నా.. కేంద్రం స్పందించలేదు. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గాలను పునర్విభజన చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈసారి అది అమలు జరిగితే మళ్లీ స్వరూపం మారే అవకాశం ఉంది.

హోం శాఖ సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే జి.కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందిలో పడ్డారు. హైదరాబాద్‌ను ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో హోం శాఖ మంత్రిగా శనివారంనాడే బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా తన డిప్యూటీని మందలించినట్టు తెలుస్తోంది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దొరికినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 2-3 నెలలకు ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని చెప్పారు.

amitshah 01062019

కాగా, ఆయన వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘మంత్రి బాధ్యతలు చేపట్టకుండానే కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం. ఎన్‌ఐఏ ఎన్నిసార్లు ఈ మాటను లిఖితపూర్వకంగా చెప్పిందో వెల్లడించాలి. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ అత్యధిక సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు చేస్తోంది. ఈ నగరంతో ఆయనకు శతృత్వం ఏమిటీ? ఆయనకు హైదరాబాద్‌ ఎదగడం ఇష్టంలేదు. ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఐసిస్‌ సభ్యులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడ్డారు.. మరి అది ఉగ్రవాదుల అడ్డా అని చెప్పగలరా..? బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడకూడదు.’’ ‘‘మూడు వందల సీట్లు గెలిస్తే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులు చేస్తారా..? పోనీ అదే చెప్పండి. భారత్‌ ప్రభుత్వం రాజ్యంగం ప్రకారం పనిచేయాలి. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదుగా. గత మోదీ ప్రభుత్వంలో లవ్‌ జిహాద్‌, ఘర్‌ వాపసీ, మూకదాడులు, దళితులపై దాడులు మొదలయ్యాయి. మీరు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతే మేము చట్టప్రకారం పోరాడతాము.’’

 

amitshah 01062019

‘‘మోదీ ఒకటి మాట్లాడుతారు.. కిషన్‌ రెడ్డి మరొకటి మాట్లాడుతారు.. మోదీ ఒకటి చెబుతారు.. వీహెచ్‌పీ మరొకటి చెబుతుంది.. మోదీ ఒకటి చెబుతారు.. గిరిరాజ్‌ మరోకటి చెబుతారు. మోదీ ఒకటి చెబుతారు.. యోగా బాబా ఇంకోటి చెబుతారు.. గందరగోళం సృష్టించడానికి ఇదొక వ్యూహం. చాలా చెబుతారు.. కానీ ఆచరించరు. నిన్న వచ్చిన నిరుద్యోగ డేటా ఉద్యోగాలు తగ్గిపోయాయని చెబుతోంది. ప్రజలను అసలు సమస్యలు చూడకుండా చేస్తారు. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వం మంచి పనులు చేస్తోంది. ఇక్కడి భినత్వంలో ఏకత్వాన్ని నమ్మే సంస్కృతి ఉంది. ఇక్కడ భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు విజయం సాధించవు’’ అని అసద్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలైనట్టు వచ్చిన మార్కులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థిని రీవెరిఫికేషన్‌ ఫలితాల్లో ఉత్తీర్ణురాలైనట్టు వెల్లడైంది. ఆమెకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 28 మార్కులు పెరిగినట్టు తేలింది. ఇంటర్‌ ఫలితాల తర్వాత ఆత్మహత్య చేసుకున్న సుమారు 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలకు అనామిక ఉదంతం సాక్ష్యంగా నిలుస్తోంది! ఈ రీవెరిఫికేషన్ ఫలితాల్ని ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో చూసిన ఆమె కుటుంబ సభ్యులు ఇంటర్‌ బోర్డుపై చర్యలకు డిమాండ్‌ చేస్తున్నారు.

inter 01062019 1

హైదరాబాద్ కోఠిలోని ప్రగతి మహా విద్యాలయలో ఇంటర్మీడియట్ సీఈసీ మొదటి సంవత్సరం చదివిన అనామిక.. గత నెల ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలను చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. పరీక్ష బాగా రాసినప్పటికీ ఎందుకు ఫెయిలైందో అర్థం కాక ఒత్తిడికి గురైంది. అన్ని సబ్జెక్టుల్లో పాసైనప్పటికీ.. తెలుగులో 20 మార్కులే వచ్చి ఫెయిలైనట్లు మార్కుల మెమోలో కనిపించడంతో బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆంగ్లంలో 64, ఎకనామిక్స్‌లో 55, సివిక్స్‌లో 67, కామర్స్‌లో 75 మార్కులు వచ్చినప్పటికీ.. తెలుగులో మాత్రం 20 మార్కులే వచ్చినట్లు మెమోలో కనిపించడంతో తీవ్ర ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడింది.

inter 01062019 1

అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడంతో.. అందులో అనామిక పాసైనట్టు వెల్లడైంది. తెలుగులో ఆమెకు 28 మార్కులు పెరిగి.. మొత్తం 48 మార్కులు వచ్చి ఉత్తీర్ణురాలైనట్లు ఇంటర్ బోర్డు తన వెబ్ సైట్‌లో పేర్కొంది. ఈ రోజు వెబ్‌సైట్‌లో తమ కుమార్తె పాసైనట్లు కనిపించడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read