నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్‌ హ్యాట్రిక్‌ ఎంపీ ఎస్పీవైరెడ్డి మృతి తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అన్నారు. ఎస్పీవైరెడ్డి ఏప్రిల్‌ 30వ తేదీ రాత్రి 9.15 గంటలకు హైదరబాద్‌లోని బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. మే 2న ఎస్పీవైరెడ్డి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన పవన్‌కళ్యాణ్‌ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రత్యేకంగా శనివారం నంద్యాలకు వచ్చారు. బొమ్మలసత్రంలోని ఎంపీ ఎస్పీవైరెడ్డి ఇంటికి మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వచ్చారు. ఎస్పీవైరెడ్డి సమాధి వద్ద పవన్‌ కళ్యాణ్‌తో పాటు జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్‌, రామ్మోహన్‌రావు, మాదాసు గంగాధర్‌ పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.

pk 12052019

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఎస్పీవైరెడ్డి సతీమణి పార్వతి, కుమార్తెలు సుజల, అరవిందరాణి, అల్లుళ్లు శ్రీధర్‌రెడ్డి, సురే్‌షకుమార్‌, కుటుంబ సభ్యులతో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎస్పీవైరెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. అనంతరం విలేఖరులతో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ ఒక్క రూపాయికి రొట్టె, పప్పు పథకాన్ని ప్రారంభించిన ఎస్పీవైరెడ్డి ఒక్క రూపాయికే రైతులకు పైపులను బాడుగకు అందించి రైతు నాయకుడిగా చెరగని ముద్ర వేశారని అన్నారు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందారని అన్నారు. సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటాలు, దీక్షలు చేశారని అన్నారు. ఎస్పీవైరెడ్డి మరణంతో నైతిక విలువలు గల నాయకుడ్ని కోల్పోయామని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీవైరెడ్డి తమ పార్టీలోకి వస్తామనగానే మనస్ఫూర్తిగా ఆహ్వానించి టికెట్‌ ఇచ్చామని అన్నారు. అయితే అనారోగ్యంతో ఎస్పీవైరెడ్డి మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

pk 12052019

ఇది సందర్భంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తన పని తాను చేస్తానని, దాని ఫలితం గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పారు. నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్... ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. ‘మార్పుకి నాంది పడింది. అంతవరకు చెప్పగలను. నా పని నేను చేసుకుంటా. మిగతాది వదిలేస్తా. ఫలితాల మీద నేను చెప్పడం ఎందుకు? నేను చెప్పినంత మాత్రాన బాక్సుల్లో ఫలితాలు మారిపోవు కదా. ఏదేమైనా అందరూ గెలవరు కదా. ఒక్కరే గెలవాలి. వాళ్లెవరో చూద్దాం. ఈవీఎం స్లిప్పులను కొంత మేర లెక్కించాల్సిన అవసరం అయితే ఉంది. అది చంద్రబాబు కోరుతున్నట్టు 50 శాతమా,ఇంకా ఎక్కువా తక్కువా అనేది కొందరు పెద్దలు కూర్చుని చర్చించాలి.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రభుత్వ పథకాల అమల్లో ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి తేవడం వల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయిందని ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారమిక్కడ హ్యాపీ రిసార్ట్స్‌ సమావేశ ప్రాంగణంలో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ లోక్‌సభ సీటు పరిధిలోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నాయకులు మాట్లాడారు. ఆన్‌లైన్‌ విధానం గురించి ప్రస్తావించారు. ‘సార్‌.. మీరు అన్ని పథకాలకూ ఆన్‌లైన్‌ విధానాన్ని తెచ్చారు. దీనివల్ల పార్టీకి, ప్రజలకు మధ్య అనుబంధం లేకుండా పోయింది.

cbn 12052019

పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు నేరుగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి వచ్చేస్తున్నాయి. అంతకు ముందు పార్టీ నేతల చొరవతో ఇవి వచ్చేవి. దానివల్ల పార్టీ ప్రాధాన్యం ప్రజలకు తెలిసేది. ఆన్‌లైన్‌ విధానంలో పార్టీ ప్రమేయం లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు పార్టీని చులకనగా చూస్తున్నారు. ఇవి టీడీపీ ఇచ్చింది కాదని.. అర్హులం కాబట్టే లబ్ధి చేకూరిందని అనుకుంటున్నారు తప్ప.. టీడీపీ ప్రభుత్వ కృషి వల్ల వచ్చిందని భావించడం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా అవి వచ్చేవేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. దీనిపై మీరు పునరాలోచన చేయాలి’ అని వారు సీఎంకు సూచించారు. ఇందులో కొంత నిజం ఉన్నా.. మొత్తంగా సదుద్దేశంతో ఈ విధానం తెచ్చామని చంద్రబాబు వివరించారు. ‘పథకాల అమల్లో అవినీతిని తగ్గించడానికి ఆన్‌లైన్‌ విధానం తెచ్చాం. దానితోపాటు జాప్యం కూడా నివారించాలన్నది మన ఆలోచన. ప్రతి ప్రయత్నంలో కొంత మంచి.. కొంత సమస్యా ఉంటుంది. ప్రజలతో పార్టీ అనుబంధాన్ని పెంచడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం’ అని చెప్పారు. పార్టీ కార్యకర్తలను ఆదుకోవాల్సిన అవసరం గురించి కొందరు మాట్లాడారు. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

 

cbn 12052019

శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి చెందిన పార్టీ నేతలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన సమీక్షకు ఆ నియోజకవర్గం నుంచి ఎవరూ హాజరు కాలేదు. రెండ్రోజుల క్రితం శ్రీకాకుళం సిటింగ్‌ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి తండ్రి మరణించారు. దీంతో ఆమె రాలేకపోయారు. ఆమె రావడం లేదని ఆ నియోజకవర్గ నేతలు కూడా ఎవరూ రాలేదు. మరోసారి అందరం కలిసి వద్దామన్న ఆలోచనతో వారు రాలేదని అంటున్నారు. దానిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యే రాకపోవడానికి కారణం ఉంది. కానీ నియోజకవర్గ నేతలు కూడా రాకపోతే ఎలా? పార్టీ ఒక సమావేశం పెడితే దానిని సీరియ్‌సగా తీసుకోవాలి. ఇక్కడ మేం కొన్ని విషయాలు చెబుతున్నాం. వాటిని అందరూ తెలుసుకోవాలి. ఏవో సాకులు చెప్పి రాకపోవడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు.

కార్యకర్తలు ఎప్పటికప్పుడు రాజకీయాలపై అధ్యయనం చేయగలిగినపుడే నేతలుగా ఎదుగుతారని, పార్టీకి అంకితభావంతో సేవలందించిన వారికే గౌరవం, పదవులుంటాయని టీడీపీ జాతీయ అధ్యక్షు డు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరి పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించిన టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 37 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల్లో మరింత జవాబుదారీతనం పెరగాలన్నారు. కేడర్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌లో పట్టును సాధించినపుడే రాజకీయ ఎదుగుల ఉంటుంద న్నారు. డబ్బులు సంపాదించే వాళ్లు పార్టీకి ఖర్చు పెట్టడం లేదని, డబ్బు సంపాదనలేని వాళ్లే పార్టీ కోసం ప్రాణాలను సైతం అర్పిస్తున్నారని చెప్పారు. ఆస్తులు అమ్ముకొని, ప్రాణాలకు తెగించి పసుపు జెండా గెలుపునకు కృషి చేస్తున్న కార్యకర్తలే టీడీపీ బలమని, ఈ విషయాన్ని గుర్తెరిగి అంకితభావంతో పనిచేసిన వాళ్లకే గౌరవం, పదవులు దక్కుతాయన్నారు.

cbn jagan 11052019

ప్రతి ఒక్కరికి పార్టీ సభ్యులతో కుటుంబ బాంధవ్యం ఉండాలని, అందరం కలసి వ్యవస్థగా పనిచేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. గత ఐదేళ్లలో వినూత్నమైన సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా నవ్యాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచి వారి అభిమానాన్ని చూరగొన్నామని చెప్పారు. రైతులు, మహిళలు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ సమ న్యాయం చేశామని, దీనితో అన్ని వర్గాలు పార్టీకి అండగా నిలిచాయన్నారు. ముఖ్యంగా మహిళలు, పింఛన్‌దారులు బారులుతీరి టీడీపీకి ఓట్లు వేశారని, బీసీ ఓటు బ్యాంకు నిలబెట్టుకుంటూనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పెంచుకున్నాము గనుకనే తెదేపా గెలవబోతోందన్నారు. సైకిల్‌ గెలుపుపై ఎటువంటి అనుమాల్లేవని, సీట్ల ఆధిక్యత పైనే విశ్లేషణ చేయడం జరుగుతోందని చెప్పారు. ఇది ఇలా ఉంటే, ఒక నాయకుడు మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి సియం అవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది అని చెప్తే, దానికి చంద్రబాబు అద్భుతమైన విశ్లేషణతో జగన్ రాడు అంటూ సమాధానం చెప్పూర్.

cbn jagan 11052019

రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడిన వైసీపీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీకి ఏవిధంగానూ పోటీదారు కాదని చంద్రబాబు అన్నారు. 26 విచారణలు చేయించినా ధీటుగా ఎదుర్కొని నిప్పులా నిలబడిన పార్టీ టీడీపీకి అరాచక శక్తులు, అవినీతి పరులకు నిలయమైన వైసీపీతో పోలికే లేదన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తొలి నుంచి వైకాపా విధ్వంసక పాత్ర పోషించిం దని, ప్రతికూల వాతావరణం సృష్టించి లబ్ది పొందాలని అనేక కుట్రలకు తెగబడిందన్నారు. పోలింగ్‌నాడు ప్రజలు ఓటు వేయడానికి రానీయకుండా బెదిరింపులు, దాడులకు పాల్ప డ్డారని, జగన్‌ కుట్రలకు తోడు మోడీ, కేసీఆర్‌ కుతంత్రాలు కూడా తోడయ్యాయని తెలిపారు. కానీ ఆ సమయంలో టీడీపీ ప్రతిచర్యలకు దిగకుండా సంయమనం పాటించడం తోపాటు ఎప్పటికప్పుడు ఓటర్లలో ధైర్యం నింపడంతో అధిక శాతం పోలింగ్‌ నమోదైందని గుర్తు చేశారు. 1983 తరువాత పెద్ద ఎత్తున పోలింగ్‌ జరగడం ఇప్పుడు సాధ్యమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంపై ధర్మపోరాటం చేసామని, దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో టీడీపీ విజయం సాధించిందని చెప్పారు. ఓటమి నైరాశ్యంతో ఉన్న మోడీ మానసిక ఒత్తిడితో దిగ జారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, 27 ఏళ్ల క్రితం మరణించిన రాజీవ్‌ గురించి విమర్శలు చేయడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపధ్యంలో ఇక మోడీ శకం ముగిసినట్లే అని, త్వరలో దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి అనుకూలంగా స్పష్టమైన తీర్పు వస్తుందని తెలుగుదేశం అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన కోల్‌కతాలో పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. తొలి ఐదు దశల ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకత అత్యంత స్పష్టంగా కనిపించింది. నెంబర్లు చెప్పను కానీ... 23వ తేదీ తర్వాత మోదీ గద్దె దిగడం మాత్రం ఖాయం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాల తరఫున ప్రధాని ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘‘మేమంతా బలమైన నాయకులమే. నరేంద్ర మోదీకంటే ఎవరైనా మెరుగే. ప్రధాని ఎవరన్నది ఫలితాల తర్వాత సమావేశమై నిర్ణయిస్తాం’’ అని తెలిపారు.

pti 11052019

వీలైతే ఫలితాలు వచ్చే 23వ తేదీనే విపక్షాల సమావేశం నిర్వహిస్తామన్నారు. పోలింగ్‌కు రెండురోజుల ముందు...అంటే 21వ తేదీన బీజేపీయేతర పార్టీల సదస్సు పెడదామని అనుకున్నా... దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని పోటీలో ఉన్నారా? అని ప్రశ్నించగా... దానిపై తమ మధ్య చర్చ జరగలేదన్నారు. తాను మాత్రం ప్రధాని పోటీలో లేనని... సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరిస్తానని చంద్రబాబు తెలిపారు. మోదీ కేవలం ప్రత్యర్థులపై బురదజల్లడం, దాడి చేయడం, విమర్శించడం తప్ప... ప్రజలకు ఇస్తున్న సందేశమేదీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. పాతికేళ్ల క్రితం మరణించిన రాజీవ్‌గాంధీని ఇప్పుడు ఎన్నికల్లోకి లాగడంలో హుందాతనం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇంత హీనమైన రాజకీయాలు ఎప్పుడూ లేవన్నారు.

pti 11052019

బెంగాల్‌లో మోదీ, అమిత్‌షా పదేపదే తిరుగుతున్నప్పటికీ... వారికి ఇక్కడ వచ్చే సీట్లేమీ ఉండవని చంద్రబాబు తెలిపారు. మమతా దీదీని మోదీ సవాల్‌ చేయలేరన్నారు. ఈ విషయం గమనించే మతతత్త్వం రెచ్చగొట్టాలని... బెంగాల్‌ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘‘ఎన్నికల సంఘం కూడా బీజేపీ తరఫున పని చేస్తోంది. తన విశ్వసనీయతను కోల్పోయింది’’ అని తెలిపారు. మరోవైపు... ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను మొన్నటివరకు మోదీ తీవ్రంగా విమర్శించారని, అక్కడ తమకు అనుకూల ఫలితాలు రావని తేలడంతో ఫణి తుఫానుకు సాయం ప్రకటించడం ద్వారా నవీన్‌ను దగ్గర చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

 

Advertisements

Latest Articles

Most Read