దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను, మోడీ, అమిత్ షా నిర్వీర్యం చేస్తున్నారని, దేశంలోని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తుంటే, కేసీఆర్, జగన్ సినిమా చూసారు. 15వ ఆర్ధిక సంఘం కండీషన్స్ చూస్తే, దక్షిణాది రాష్ట్రాలను నాశనం చేసే కుట్ర చేస్తున్నారని, దక్షినాది రాష్ట్రాలు కలిసి పోరాటం చేస్తే, అప్పుడు కూడా కేసీఆర్, జగన్ సినిమా చూసారు. దేశంలో అన్ని వ్యవస్థలు, మోడీ, షా నాశనం చేస్తుంటే, అప్పుడు కూడా కేసీఆర్, జగన్ సినిమా చూసారు. దేశంలో అన్ని పార్టీలు ఏకం అయ్యి, మోడీ పై అవిశ్వాస తీర్మానం పెడితే, మొదటి సారి, అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా డ్రామా ఆడింది కేసీఆర్, రెండో సారి అక్కడ నుంచి పారిపోయింది జగన్. ఇలా మోడీ పేరు చెప్తే, తడుపుకునే కేసీఆర్, జగన్, ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఫిడేల్ వాయిస్తూ, ఫిడేల్ ఫ్రంట్ అని ఒకటి మొదలు పెట్టారు. మొన్నటి దాకా హడావిడి చేసిన, ఎవరూ దేకలేదు.
ప్రతిపక్షల్లో చీలిక తేవటమే ఈ ఫిడేల్ ఫ్రంట్ ఉద్దేశం. అందుకే ఇప్పుడు ఎన్నికలు రిజల్ట్స్ 23 న వస్తాయి కాబట్టి. మోడీ, షా ను వ్యతిరేకించే 21 పార్టీలను ఏకం చేసిన చంద్రబాబు ప్రయత్నాలను విఫలం చేసి, ఆ పార్టీల్లో చీలిక తేవటానికి, కేసీఆర్ మళ్ళీ మొదలు పెట్టారు. అయితే, ఇక్కడ కేసీఆర్ చాలా తెలివిగా తన టూర్ ప్లాన్ చేసారు. అసలు ఈయన చేసేది తీర్ధయాత్రలు. ఎలాగూ ఆ రాష్ట్రాలకు గుడిలు, గోపురాలు చూడటానికి వెళ్తారు కాబట్టు, సియం హోదాలో, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులను కలిసి, ఫెడరల్ ఫ్రంట్ అనే నాటకం ఆడుతూ ప్రజలను గొర్రెలను చేసే ఎత్తుగడ. ఎవరన్నా ఈయన బుట్టలో పడితే అమిత్ షా ప్రశంసలు ఉంటాయి, లేకపోతే కేసీఆర్ కు పోయేది ఏమి ఉండదు.
అందుకే ఈ రోజు కేరళ పర్యటనకు వెళ్లిన తెలంగాణ కేసీఆర్ ఈ సాయంత్రం అనంతపద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లిన కేసీఆ, సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. తరువాత వెళ్లి కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. మరో రెండు రోజుల్లో తమిళనాడు వెళ్లనున్న కేసీఆర్ అక్కడ ముద్నుగా, రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కేసీఆర్ సందర్శిస్తారు. తరువాత ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఇల్లా తీర్ధయాత్రలకు కుటుంబంతో కలిసి వెళ్తూ, అక్కడ రాజకీయ నాయకులని కలిసి, ఎదో ఫిడేల్ ఫ్రంట్ అంటూ ప్రజలను గొర్రెలను చేస్తున్న కేసీఆర్ కు నిజంగా హాట్స్ ఆఫ్.