వైసీపీ నాయకులు జిల్లాలో దొనకొండ ప్రాంతంపై దృష్టి సారించారు. ఇక్కడ భూముల కొనుగోళ్లుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఇటీవల వైసీపీ నాయకులు, వారి తరఫున రియల్‌ ఎస్టేట్‌ దళారుల తాకిడి పెరిగింది. ఇప్పటికే బేరసారాలు ప్రారంభయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంత వాసులతో పాటు విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి కూడా వైసీపీ నేతలు భూములను పరిశీలించి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలలోనూ స్పల్పంగా పెరుగుదల కనిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం కలిగిన వారే ఆవైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జగన్ సియం అయితే అమరావతి మూసేసి, దొనకొండ రాజధాని చేస్తారనే ప్రచారం బాగా చేస్తున్నారు.

donakonda 06052019

2014 సాధారణ ఎన్నికల సందర్భంగా వైసీపీ అధికారాన్ని చేపడితే దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. కడప జిల్లాకు చెందిన వారు, ప్రత్యేకించి వైసీపీలో కొందరు ముఖ్యనాయకులు అప్పట్లో ఆప్రాంతంలో ముందస్తుగానే భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తాడేపల్లికి సమీపంలో రాజధాని ఏర్పాటు పక్రియ ప్రారంభించింది. అయితే దీన్ని జగన్‌ వ్యతిరేకించారు. పైగా ఇటీవల ముగిసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అమరావతి విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. దీంతో జగన్‌ అధికారంలోకి వస్తే రాజధాని ఏర్పాటు విషయంలో మార్పులు చోటు చేసుకోవచ్చన్న అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దొనకొండ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల్లో క్రమేపీ వేగం పుంజుకున్నాయి.

 

donakonda 06052019

ప్రధానంగా వైసీపీ నాయకులే ఎక్కువగా ఆప్రాంతానికి వచ్చి భూముల కొనుగోలుకు శ్రీకారం పలుకుతున్నారు. జిల్లాలోని ఓ వైసీపీ నేత, పారిశ్రామిక వేత్త ఇటీవల ఒంగోలులో తనకున్న ఒక విలువైన స్థలాన్ని విక్రయించారు. ఆయన కూడా ఆ డబ్బులను వెచ్చించి దొనకొండ సమీపంలో భూముల కొనుగోలుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ పారిశ్రామిక కారిడార్‌కు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. భూముల సేకరణ జరిగింది. కొన్ని పరిశ్రమలు ఏర్పాటుకు సంస్థలు ముందుకు వచ్చినట్లుగా గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఒక మాఫియాగా ఏర్పడి, లేని హడావిడి చేస్తూ దొనకొండలో రియల్ ఎస్టేట్ రేట్లు పెంచేసి హడావిడి చేస్తుంటే, సామాన్య ప్రజలు మాత్రం, 2014లో ఇంతకంటే ఎక్కువే చూసాం అంటూ పెదవి విరుస్తున్నారు.

ఎన్నికల పోలింగ్‌ అనంతరం తొలిసారిగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై విహంగ వీక్షణం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 70శాతం పూర్తయ్యాయని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. స్పిల్ వే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం పూర్తయితే… కరువును జయించినట్లేనన్నారు. కాఫర్ డ్యామ్ లో 52శాతం పని పూర్తయ్యిందన్నారు. డయాఫ్రం వాల్ వంద శాతం పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఉన్నాయన్నారు.

polavaram 06052019

30లక్షల క్యూసెక్కులు వదిలేలా గేట్ల నిర్మాణం జరుగుతుందన్నారు.25.72 మీటర్ల స్పిల్ వే పూర్తి చేసుకున్నామన్నారు. ప్రాజెక్టుకు రూ.16,493 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కేంద్రం సహకరించకున్నా… రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు. కేంద్రం 6,727 కోట్లు ఇచ్చిందని.. ఇంకా 4,631కోట్లు రావాల్సి ఉందన్నారు. 1941 నుంచి ప్రతి ఎన్నికల సమయంలో పోలవరంపై మాట్లాడారన్నారు. పోలవరంపై 90 సమీక్షలు జరిపానని, 30సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించానన్నారు. 40లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. 980 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం స్పిల్ వే పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల పోలవరం పనులు కొద్దిగా నెమ్మదించిన మాట వాస్తవమేనన్నారు.

polavaram 06052019

ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలేమీ అడగకపోవడంతో ‘ ఓకే ఇంక.. మీకేమీ డౌట్లు లేవు కదా. ప్రతిపక్ష పార్టీ మాదిరిగా. వాళ్లకు వాళ్లే డౌటు’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులంతా నవ్వేశారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు రాగానే మీడియా మిత్రుల చిరకాల డిమాండ్ అయిన ఇళ్ల స్థలాల కేటాయింపును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబు చేపట్టే సమీక్షలపై కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రాన్ని ధిక్కరిస్తూ పోలవరంలో పర్యటించారు. పోలవరం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ దూరంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు పోలవరం పర్యటన ముగిసింది. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు, గేట్ల బిగింపు మొయిన్ డ్యామ్ పనులను ఆయన పరిశీలించారు. చంద్రబాబు పర్యటనలో పరిమిత సంఖ్యలోనే అధికారులు హాజరయ్యారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్ మాత్రమే హాజరయ్యారు.

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 10న జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజు ఉదయం ఈ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో సాధారణంగా మ్రంతి వర్గ సమావేశం జరగదు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గ సమావేశాన్ని కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతే నిర్వహించారు. అదే దారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేబినెట్‌ భేటీ నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫణి తుఫాను బాధితులకు సాయం, సహాయక చర్యలపై సమీక్ష, అకాల వర్షాల్లో రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వివిధ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

cs 06052019

నాలుగు జిల్లాల్లో కోడ్‌ సడలించిన నేపథ్యంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహణకు ఆటంకాలేవీ ఉండే అవకాశం లేదని కొందరు మంత్రులు భావిస్తున్నారు. ఈ సమావేశం నిర్వహణ అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆమోదించి మ్రంతి వర్గ సమావేశానికి పంపాల్సి ఉంటుంది. అయితే, ఆయన ఎలా స్పందిస్తారో తెలియరాలేదు. ఆయన వస్తారా లేక, ఆ రోజు సెలవు పెట్టి, ఇంచార్జ్ చీఫ్ సెక్రటరీగా ఎవర్ని అయినా పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంత జరిగిన తరువాత, ఆయన చంద్రబాబు ముందుకు రాలేరని, మరి ఆయన రాకపోతే బిజినెస్ రూల్స్ ప్రకారం క్యాబినెట్ ఎమన్నా చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది.

cs 06052019

కాగా, సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు అంశానికి సంబంధించి విపక్ష పార్టీల రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో వాదనలు ఎలా వినిపించాలనే విషయంపై ఇతర పార్టీల నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. మంగళవారం రాత్రి అక్కడ నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. బుధ, గురువారాల్లో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గురువారం రాత్రికి అమరావతి చేరుకుంటారు. ఈ పర్యటన కారణంగా ఈ నెల 7న నిర్వహించాల్సిన చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాల సమీక్ష వాయిదా పడింది.

 

2019 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి సంపూర్ణమైన మెజార్టీ సాధించి, సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మోడీ నుంచి అమిత్ షా దాకా, బీజేపీ నేతలు తోడ కొట్టి మరీ దేశం అంతా తిరిగి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాని బయట ప్రజలకి, విశ్లేషకులకు బీజేపీ గెలుపు పై ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. అయితే ఇప్పుడు సొంత పార్టీలోనే, బీజేపీ గెలుపు పై అనుమానాలు మొదలయ్యాయి. 5వ దశ పోలింగ్ జరుగుతున్న వేళ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాత్రం మెజార్టీ విషయంలో కొంత అనుమానాన్ని వ్యక్తం చేశారు. క్లీన్ మెజార్టీకి బీజేపీ కొంత వెనుకబడే అవకాశం ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 543 సీట్లుండే లోక్ సభలో 271 సీట్లను సొంతంగా గెలుచుకుంటే అంతకంటే ఆనందం మరొకకటి ఉండదని... కొన్ని సీట్లు తగ్గుతాయనే అంచనా వచ్చినట్టు, కాని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

rammadhav 06052019

అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై కూడా నోరు పారేసుకున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు జాతీయ రాజకీయాల్లో కింగ్‌మేకర్లు కావాలని కలగంటున్నారని, తమ వద్ద కింగే ఉన్నప్పుడు అలాంటి వాళ్లతో పనేలేదని రాంమాధవ్‌ అన్నారు. మే 23న ఫలితం ఏమొస్తుందో ప్రజలకు ఇప్పటికే తెలుసని, మోదీయే మళ్లీ ప్రధాని అవుతారన్నారు. దేవెగౌడ లాంటి ప్రాంతీయ పార్టీ నేత ప్రధాని అయినప్పుడు తామెందుకు కాలేమని ప్రాంతీయ పార్టీల నేతలు భావిస్తున్నారని విమర్శించారు. భారత్‌ సమర్పించిన ఆధారాల వల్లే మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిందని చెప్పారు.

rammadhav 06052019

కర్ణాటక ఎన్నికలు కాగానే సంచలనాలు చూస్తారు. అప్పుడు ఏపీ సంగతి, ఇక్కడి ముఖ్యమంత్రి సంగతి చూస్తామంటూ బరితెగించి బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ చేసిన హెచ్చరికలు తెలిసిందే. ఆ తర్వాత ఏం అయిందో కూడా అందరూ చూశారు. ఇవి కూడా అలాంటివే అంటున్నారు. దక్షిణాదిలో ఠికాణా లేని బీజేపీకి చివరకి చంద్రబాబు, కేసీఆర్, కుమారస్వామి, స్టాలిన్ వంటి నేతల సత్తా ఏంటో మే 23 తర్వాత తెలిసి వస్తుందని తెలుగు నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత, అలాగే కాశ్మీర్‌లో పీడీపీతో పొత్తు విఫలం అయి బీజేపీ ప్రభుత్వం పడిన తర్వాత రామ్ మాధవ్ పలుకుబడి పార్టీలో బాగా తగ్గింది. కర్నాటక ఎన్నికల పోలింగ్ ముగియగానే రామ్ మాధవ్ అయితే ట్విటర్లోనే చంద్రబాబును హెచ్చరించినంత పని చేసారు. అయితే మధ్యాహ్నం ఫలితాల సరళి మారి బీజేపీకి సీన్ లేదని తెలిసిన తర్వాత ఇక సదరు రామ్ మాధవ్ కనిపించనే లేదు. ఇప్పుడు ఇది కూడా ఇంతే అంటున్నారు విశ్లేషకులు....

Advertisements

Latest Articles

Most Read