ఎన్నికల ఫలితాలకు నెల రోజులు ముందు నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈసీ కూడా విజయసాయి ఏది చెప్తే అది చేసేస్తుంది. సీఎం సమీక్షలు జరిపితే తప్పేంటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి,వైసీపీకి ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖపై సమీక్ష జరుపుతామన్నారు.

somireddy 23042019

ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నారు సోమిరెడ్డి. ఎవరైనా తన సమీక్షను అడ్డుకొంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. సీఎం మంత్రులు ఇంట్లో కూర్చోవాలా ? అంటూ ఆయన మండిపడ్డారు. 43 రోజులు ప్రజలను గాలికి వదిలేయ్యమంటారా అని అన్నారు. పరిపాలించే హక్కు రాజ్యంగం మాకు కల్పించిందన్నారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతుంటే, ఈసీ బాధ్యత వహిస్తుందా? లేక ప్రభుత్వమా అంటూ సోమిరెడ్డి నిలదీశారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ తెలియని ఆనం ఆర్థిక మంత్రిగా ఎలా పనిచేశారంటూ ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పై తెలంగాణ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో.. ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారన్నది విజయసాయి అభ్యంతరమట.

somireddy 23042019

ఇది ఇలా ఉంటే, తెలంగాణాలో మాత్రం, అసలు ఏ విధమైన హద్దులు లేకుండా ప్రభుత్వం నడిచేస్తుంది. ఓవైపు ఎన్నికల నియమావళిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ సర్కారు ఏకంగా 49 మంది ఉన్నతాధికారులకు పదోన్నతి కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతితో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందినవారిలో 26 మంది ఐఏఎస్ లు, 23 మంది ఐపీఎస్ అధికారులున్నారు. ఇందుకోసం టి-సర్కారు 15 జీవోలు జారీచేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రమోషన్ ఇచ్చారు.

ఇటీవల కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ముంబైకి చేరుకున్న అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరులో ఉన్న లోపాలపై అఖిలపక్ష నేతలతో చంద్రబాబు చర్చించారు. మరి కాసేపట్లో వీబీ చవాన్ కూడలిలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం విజయవాడకు చంద్రబాబు చేరుకుంటారు.

kodandaram 23042019

వీవీ ప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు పై నిర్వచించిన అఖిల పక్ష సమావేశానికి తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం కూడా హయరయ్యారు. తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు ఆయన ఆ భేటీలో పాల్గున్నారు. ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. చాలా దేశాలు బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపునకు 6రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాలని.. అది కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు.

kodandaram 23042019

వీవీప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోలాలన్నారు. ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఉదయం లోపాలు వస్తే మధ్యాహ్నానికి సరిచేసే పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో సీఈవో కూడా ఓటు వేసేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ హయాంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

తెలంగాణ లో ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడ్డాయి...మొత్తం తప్పుల తడక 50 వేల మంది మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యారు...ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జిల్లా టాపర్ అయిన ఒక అమ్మాయికి తెలుగు లో 98 మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరం ఆ అమ్మాయి తెలుగులో ఫెయిల్ అయ్యింది... ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు...ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు ఏంటో తెలుసా ఇంటర్మీడియెట్ బోర్డు వైఫల్యం అది కూడా కొన్ని మీడియా సంస్థల్లో మాత్రమే... ఇదే ఘటన ఆంద్రప్రదేశ్ లో జరిగితే మీడియా బోర్డు తప్పిదం అని వార్తలురాసేవా? చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం...17 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న చంద్రబాబు... మ్యాథ్స్ రాని ఏపీ ప్రభుత్వం అని వార్తలు వచ్చేవి...ఇంతకీ తెలంగాణ లో జరిగింది ఏంటి ?10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ని పొట్టన పెట్టుకుంది ఎవరో తెలుసా ? ఘనత వహించిన కేటీఆర్... అయన ఈ మధ్య లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా?డేటా దొంగలు దొరికారు అబ్బా, కొడుకు జైలుకే ...ఈవీయం మెషిన్ల ను టాంపరింగ్ చెయ్యడం అసాధ్యం...టెక్నాలజీ కనిపెట్టిన చంద్రబాబు ఈవీయం మెషిన్లకు బయపడుతున్నాడు... బాబు ఇక ఇంటికే అని కేటీఆర్ చిట్ చాట్ చేయడం మీడియా వాటిని హెడ్ లైన్స్ లో ఇవ్వడం అందరం చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈవీయం మెషిన్ల ను టాంపరింగ్ చెయ్యోచ్చు అని కేసీఆర్ స్వయంగా అన్న విషయం మీడియా కి తెలియదా?ఇక ఇంటర్మీడియేట్ ఫలితాలకు కేటీఆర్ కి లింక్ ఏంటి అనేగా మీ అనుమానం? హైదరాబాద్ లో ఎన్నో గొప్ప ఐటీ స‌ర్వీసెస్ అందించే సంస్థలు ఉన్నాయి వారికీ కాకుండా గ్లోబరేనా అనే సంస్థ కి ఇంటర్ ఫలితాల విడుదల చేసే టెండర్ దక్కింది.

ఇది కేటీఆర్ ప్రోద్బలంతో జరిగింది అనేది తెలంగాణ పౌర సమాజం ఎరిగిన సత్యం. ఫలితాల విడుదల కి డేటా ఎంతో కీలకం... అదే డేటా అంటే తెలంగాణ పోలీసులు సజ్జనార్, స్టీఫెన్ రవీంద్ర పోయింది అని వెతుకుతున్నారే అదే. ఇంటర్ ఫలితాలు అయినా, పెట్రోల్ బ్యాంకులో పెట్రోల్ కొట్టించుకున్నా ఇప్పుడు ప్రతిదీ డేటా మీద ఆధారపడి ఉంటుంది...పేరున్న సంస్థలకు ఇస్తే ఉన్న డేటా ని ఒక పద్ధతి ప్రకారం క్రోడీకరించి ఫలితాలు ఇచ్చే వారు కానీ కేటీఆర్ కి పాపం డేటా అంటే తెలియదు అతనికి తెలిసింది సెంటిమెంట్ రాజకీయం...తీగ కట్ చేస్తాం అంటూ మీడియా ని బెదిరించడం...అసలు డేటా గురించి కనీస అవగాహన లేని ఒక కంపెనీ కి బాధ్యత అప్పగించి 10 లక్షల మంది విద్యార్థులు,తల్లితండ్రులు ఉసురు పోసుకున్న వారు మీడియా కు చాలా తెలివైన వాడిగా కనిపిస్తారు. 18 మంది చనిపోతే ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంది ? ఇక్కడే మరో ప్రశ్న ఉంది ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ని ఒక ఘనత వహించిన యాంకర్ మీరు తెలుగులో తప్పులు మాట్లాడుతున్నారు మిమ్మల్ని పప్పు అంటున్నారు..దీనిపై మీ స్పంద‌న ఏంటి అని దైర్యంగా ప్రశ్న అడిగాడు. త‌ల‌పండిన ఈ జ‌ర్న‌లిస్టు క‌మ్ యాంక‌ర్ మ‌థించి, ఎంతో అధ్య‌య‌నం చేసి మ‌రీ లోకేశ్‌ని అడిగిన ప్ర‌శ్న ఇది. దీనికి లోకేశ్ చాలా హుందాగా స్పందించాడు. లోకేశ్‌ని అడిగిన‌ట్టే..జ‌గ‌న్‌ని నువ్వు ల‌క్ష‌ల కోట్లు కొట్టేశావు క‌దా! అని అడ‌గ‌గ‌ల‌డా ఆ జ‌ర్న‌లిస్ట్ క‌మ్ యాంక‌ర్‌. దొర‌గారూ! మీ రాజ్యంలో 17 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు దీనిపై మీరేమంటారు? అని నిల‌దీయ‌గ‌ల‌డా? దొర‌గారి వ‌ర‌కూ అక్క‌ర్లేదు.. ఆయ‌న మ‌నుమ‌డు అదేనండి కేటీఆర్ కొడుకుని..బాబూ నువ్వు ఇలా ప‌ప్పులా త‌యార‌య్యావెందుకు? అని అడిగే ద‌మ్ముందా? అందుకే ఇటువంటి జ‌ర్న‌లిస్టుల‌ను ఎంతో ఉన్న‌త‌మైన వ్య‌క్తితం ఉన్న‌ వ్య‌భిచారుల‌తో పోల్చ‌డం నాక‌స్స‌లు ఇషంలేదు, అందుకే విటుల‌తో పోల్చాను. అయ్యా మీరు యాంక‌రా? దొర‌గారి ద‌గ్గ‌ర ప‌నిచేసే బ్రోక‌రా? మిమ్మ‌ల్నీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా.. టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఐటీ శాఖ నుంచే అనుమతులు ఇవ్వాలి. మరి 10 లక్షల మంది ఇంట‌ర్ మీడియ‌ట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న స‌ద‌రు కంపెనీకి అనుమ‌తి ఇచ్చింది అప్ప‌టి ఐటీ మంత్రి కేటీఆర్ గారు క‌దా యాంక‌ర్ గారు..ఆయ‌న‌ని ఈ త‌ప్పు మీదేనా? సిన్న‌దొరా! నీ కాల్మొక్తా బాంఛ‌న్ అని అడ‌గ‌గ‌ల‌వా?

ఆ పిల్లలు ఇప్పుడు ఉన్నత పరీక్షలు, దేశ స్థాయి లో జరిగే ఎంట్రన్స్ పరీక్షలు ఎలా రాస్తారు?డేటా గురించి మీకు కనీస అవగాహన లేదా? కేటీఆర్ గారూ మీరు కాదా అసలు పప్పు అని మీ మ‌న‌సులోనైనా(ఎవ‌రికీ విన‌ప‌డ‌కుండా) ప్ర‌శ్నించే ద‌మ్ముందా? ఒక్కో మీడియా సంస్థ‌కీ ఒక్కో ట్యాగ్‌లైన్‌. మేము దేశాన్ని, ప్రజల్ని ఉద్దరించడానికి వచ్చాం అన్న మీడియా సంస్థలకు తెలంగాణలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు, తల్లితండ్రుల గుండెకోత ఎందుకు క‌న‌ప‌డ‌టంలేదు. ఇదే ఏపీలో ఒక్క విద్యార్థి ఆత్మ‌హ‌త్య జ‌రిగితే..మంత్రి నారాయ‌ణ‌పై ప్ర‌త్యేక క‌థ‌నాలు..ఆయ‌న‌కు వెన్నుద‌న్నుగా ఉన్న‌ది చంద్ర‌బాబే నంటూ స్పెష‌ల్ స్టోరీలు..చివ‌రికి బాత్రూమ్‌లో బాబాయ్ చంపేసి, గుండె పోటు అని తానే ప్ర‌క‌టించినా చంద్ర‌బాబుపైకి వేలెత్తి చూపించే తెగులు మీడియా.. టీడీపీ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల్లో ఆవు బొడ్డు చూసి...ఏదో అనుకుని ఎద్దని ప్ర‌చారం చేసి మొద్దు మీడియా మొఖాళ్లారా! తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌లో ఒక భార్య‌, భ‌ర్త‌లు వేరుగా వేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై ఆ ఆడ‌పడుచు మ‌నోవేద‌న‌ను ఎందుకు ప్ర‌చురించ‌లేదు. ఆమెకు తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన అన్యాయంపై చ‌ర్చ‌లు ఎందుకు పెట్ట‌లేదు. ఆవుని ఎద్ద‌ని న‌మ్మించేందుకు ముందుకొచ్చిన ఎద‌వ‌లారా... ప్ర‌భుత్వ‌మే జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఒక ఆడ‌కూతురికి అన్యాయం జ‌రిగితే... ఎక్క‌డుతున్నార‌య్యా! తెగులు జ‌ర్న‌లిస్టుల‌న‌బ‌డే ఎర్న‌లిస్టులూ! ఇప్పుడు చంద్రబాబు సౌమ్యుడు మనం ఏమి చేసినా చెల్లుతుంది అనుకోవచ్చు. ఏదో ఒక రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ తెలంగాణ‌ లాంటి ముఖ్య‌మంత్రి వ‌స్తే మీ ప‌రిస్థితి ఏంటి? ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి కి కనీస గౌరవం ఇవ్వాలి. లేకుంటే మా వార్తలు ఇవ్వాల్సిన అవసరం లేదు. హైద‌రాబాద్ కేంద్రంగా చిన‌జీయ‌ర్ కి కేసీఆర్ పాదాభివంద‌నాల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌తో త‌రిస్తూ ఉండండి.. ఎంతో బాధ, కోపంతో... ఒక ఆంధ్రుడు...

కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పారు. తరువాత శ్రీవారి ఆలయన్ని మన ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో లేకుండా చెయ్యాలని ప్లాన్ వేసారు. దీనికి బీజం వేస్తూ, తిరుమలను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరు చెయ్యవలసిందిగా సుప్రీంలో కేసు వేసారు రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత సుభ్రమణ్య స్వామి. ఈ విషయం పై అప్పట్లో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.. ఇలా కేసులు వేసి, మన వెంకన్న స్వామిని తన, హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలని, బీజేపీ పన్నాగం పన్నింది. అయితే కేంద్రం కంటే, రాష్ట్రం కంటే, వెంకన్నకు తనని తాను కాపాడుకోవటం బాగా తెలుసు. పావురాల గుట్ట సాక్షిగా అది రుజువైంది కూడా. టీటీడీ పై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్ట్ లో తేల్చుకోవాలని చెప్పెంది. దీంతో ఈ కేసు హైకోర్ట్ కు వచ్చింది.

ttd 23042019

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన గత మూడేళ్ల ఖర్చులపై బయటి వ్యక్తులతో ఆడిట్‌ నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా (రిజర్వు) వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సోమవారం విచారణలో సుబ్రమణ్యస్వామి నేరుగా వాదనలు వినిపిస్తూ.. దేవాలయాల నిర్వహణలో వివాదం తలెత్తినప్పుడే పరిపాలనాంశాల్లో ప్రభుత్వానికి పరిమిత కాలంతో అజమాయిషీ ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

ttd 23042019

ఆలయాల నిర్వహణ ప్రభుత్వం పనికాదని స్పష్టంగా పేర్కొందని తెలిపారు. 85ఏళ్ల నుంచి ప్రభుత్వం తితిదేను నియంత్రిస్తోందని చెప్పారు. సర్కారు తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. తితిదే విషయంలో ప్రభుత్వ జోక్యం లేదని తెలిపారు. తితిదే వ్యవహారాల్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఉందని చెప్పారు. తితిదే తరఫు న్యాయవాది లలిత వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక సలహాదారు, చీఫ్‌ అకౌంట్స్‌ అధికారి (ఎఫ్‌ఏసీఏవో) ఆడిట్‌ వ్యవహారాలను చూస్తుంటారని వెల్లడించారు. ఆడిట్‌ నిర్వహించలేదని పిటిషనరు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read