ప్రభుత్వాలు ఎంత బాగా పని చేసినా, ప్రభుత్వం తరుపున ఎంత వ్యక్తిగత లబ్ది ప్రజలకు ఇచ్చినా, ఎన్నికల ముందు రోజు, ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిన వాడే కింగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాలు అలా మారిపోయాయి. ప్రజలు అలా మార్చేసారు అనటం కరెక్ట్ ఏమో. తెలుగుదేశం నేతల కంటే, వైసీపీ నేతలు డబ్బులు ఎక్కువ ఇచ్చిన చోట్ల, పరిస్థితి ఏంటి అన్నది అంతు పట్టటం లేదు. ఇలాంటి స్థానాలు రాష్ట్రంలో సుమారు 20 వరకు ఉన్నట్లు సమాచారం. ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి కంటే వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది. కొందరికి ఆర్థిక ఇబ్బందులు, మరికొందరిలో ధీమా దీనికి కారణంగా తెలుస్తోంది. పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు ప్రభుత్వం తరఫున ఇచ్చిన రూ.10 వేలు తమకు సానుకూల ఓటును తెస్తుందన్న విశ్వాసం తెలుగుదేశం అభ్యర్థుల్లో బలంగా ఉంది.

game 27032019

మహిళా ఓటుబ్యాంకు తమకేనన్న వాతావరణమూ కనిపించింది. దీంతో కొందరు అభ్యర్థులు ఎన్నికలను కాస్త తేలిగ్గా తీసుకున్నారని అంటున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ఆర్థిక ఇబ్బందులతో వైసీపీతో సమంగా ఎన్నికల ఖర్చు చేయలేకపోయామని అభ్యర్థులే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి స్థానాల్లో ఫలితం ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నెలరోజుల ముందే వైసీపీ నేతలకు అందాల్సిన సంచులు అందిపోయాయి. ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల ఖర్చుకు అనుగుణంగా సిద్ధమైపోయారు. కోస్తా, ఉత్తరాంధ్రల్లోనూ వారం-పదిరోజుల ముందే వైసీపీ నేతలు అన్ని సన్నాహాలూ చేసుకున్నారు. పంపకాలు కూడా నాలుగు రోజుల ముందే చేసేశారు.

game 27032019

తెలుగుదేశం అభ్యర్థులు పలుచోట్ల చివరి నిమిషంలో పాట్లు పడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ప్రభుత్వ పథకాల మంచిపేరు తమను గెలిపిస్తుందన్న ధీమాతో ఖర్చును నియంత్రించుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి, నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, కృష్ణా జిల్లాలో తిరువూరు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు.. ఇలా పలు స్థానాల్లో వైసీపీ కంటే ఆర్థికపరంగా తెలుగుదేశం పార్టీ వెనకబడిందని అంటున్నారు. ఎన్నికలు ఎన్నికలే.. పథకాలు పథకాలే అన్నట్లుగా అభ్యర్థులు వ్యవహరించాల్సిందని, కానీ ఇలా అరకొరగా ఎన్నికల వ్యూహం చేయడం వల్ల ఏమవుతుందోనన్న ఆందోళనను పార్టీ నేతలే కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం.. వైసీపీ నేతలు ఎంత డబ్బు వెదజల్లినా, ప్రలోభాలకు గురిచేసినా తమదే విజయమని ధీమాగా చెబుతున్నారు ఇప్పుడు ఆర్థికపరంగా ఇబ్బందిపడ్డ స్థానాల్లో పలు చోట్ల పార్టీకి 5-10వేల మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నవే. వైసీపీ నేతల ఆర్థిక ప్రలోభాలు ప్రభావం చూపినా.. ఆయా స్థానాల్లో ఎక్కువ చోట్ల మెజారిటీ తగ్గుతుంది తప్ప విజయం ఖాయం అని ధీమా కనబరుస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు... ప్రజాసమస్యలపై తక్షణం స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నేతలకు సూచించారు. పంటను అమ్ముకునే పరిస్థితి లేకపోతే నిరాశకు గురవుతారని, సూక్ష్మ సాగు, సేధ్యం పనులు కోడ్‌ వల్ల ముందుకు సాగడంలేదని అన్నారు. దీని వల్ల ఉద్యాన పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయిన చోట్ల అభివృద్ధి కుంటుపడకుండా... ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా పాలన సాగాలని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

game 27032019

కోడ్‌ నెపంతో పాలన కుంటుపడొద్దని అన్నారు. శాంతిభద్రతల విషయంలో... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించొద్దని ఈసీ ఆదేశాలివ్వాలన్నారు. అధికారులు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో టీడీపీ 100శాతం కాదు... 1000శాతం గెలుస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో ఇంతటి చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. క్యాంప్‌ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ, జూన్‌ 8దాకా మన ప్రభుత్వం ఉందని, ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్రం ఒకపక్క మనపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని, ఎన్నికల్లో పోటీలో లేనివారిపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్కరిపైనా ఐటీ, ఈడీ దాడులు లేవని ఆయన విమర్శించారు.

game 27032019

‘‘సర్జికల్‌ స్ట్రైక్‌లో 350మందిని చంపేశాం అని మోదీ అన్నారు. కానీ అంతర్జాతీయంగా ఎక్కడా ఈ అంశాన్ని నిర్ధారించలేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోదీ భ్రష్టుపట్టించారు. సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ దారుణంగా వ్యవహరించాయి. మనం పోరాటం వల్లే వీవీ ప్యాట్లు వచ్చాయి. ఆఫీసర్లకు ట్రైనింగ్‌ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించారు. హైదరాబాదే కాకుండా ఇతర నగరాల నుంచీ ఓటేయడానికి వచ్చారు. ఒక కారును ఐదుగురు షేర్‌ చేసుకొని వచ్చి ఓటేశారు. కర్ణాటకలో నా ప్రచారం ప్లస్‌ అవుతుందని అక్కడి నేతలంటున్నారు. ఎన్నికల్లో సీబీఎన్‌ ఆర్మీ బాగా పనిచేసింది. ఎన్నికల్లో డబ్బు విపరీతంగా ఖర్చు చేశారు. ఎన్నికల్లో అక్రమాల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కేంద్రంలో బీజేపీకి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు’’ అని చంద్రబాబు జోస్యం చెప్పారు.

 

వేసవిలో నీటి ఎద్దడి సహజం.. ప్రతి సారి ప్రభుత్వం కాల్ సెంటర్ పెట్టి, ప్రజల సమస్యలు తెలుసుకుని, సియం, మంత్రులు సమీక్షలు చేసి, కొంత వరుకు అయినా, ఆ నీటి ఎద్దడి తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సారి కూడా చంద్రబాబు, అలాగే సమీక్ష చేస్తుంటే అడ్డుకోవలంటూ వైసీపీ , ఈసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఎంత పెద్ద నిర్మాణం అయినా, వేసవిలో వేగంగా చెయ్యాలి. పోలవరం, అమరావతి లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు అయితే, మరీ ముఖ్యంగా, ఈ టైం చాలా అవసరం. ఎందుకంటే, జూన్ నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి, పనులు సాగవు. అందుకే చాలా వరకు పని, ఈ మూడు నెలల్లో పని చెయ్యటానికి ప్రభుత్వాలు, కాంట్రాక్టు కంపనీలు ప్లాన్ చేసుకుంటాయి.

ycp 220442019

అందుకే చంద్రబాబు వీటి పై సమీక్షలు చేస్తే, అది కూడా తప్పు అంటూ వైసీపీ, ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇదేమీ తప్పుడు పని కాదు. లేదా, ఇప్పుడు చంద్రబాబుప్ అని చేస్తే, వచ్చే కొత్త ఓట్లు ఏమి లేవు, ఎన్నికలు అయిపోయాయి. పని చెయ్యండి అనటం కూడా తప్పుగా వైసీపీ చిత్రీకరిస్తుంది. ముఖ్యంగా వేసవిలో నీళ్ళు అందకుండా చేసి, ప్రజలను ఇబ్బంది పెట్టి, ఆ నెపం చంద్రబాబు పై నెట్టే కుట్రకు తెర లేపింది. ప్రజలు ఎంత ఇబ్బంది పడితే, చంద్రబాబుకు అన్ని చిరాకులు వస్తాయని, ఈ ప్రభావం, దేశ వ్యాప్తంగా పడి, చంద్రబాబు దేశ వ్యాప్తంగా చేస్తున్న పోరాటంలో, చెడ్డ పేరు రావాలని వైసీపీ ప్లాన్ చేసింది. దీంతో చంద్రబాబు కూడా అప్రమత్తం అయ్యారు.

ycp 220442019

మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేదాకా వెళ్ళు ఇలాగే ఇబ్బంది పెడతారని, పని చేసుకోనివ్వరని, అందుకే మనమే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, ప్రజల కోసం పోరాదామని పార్టీ నేతలకు చెప్పారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో తెదేపా ప్రజాప్రతినిధులతో ప్రజా సమస్యలు, తాగునీటి ఎద్దడిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషిచేయాలని సూచించారు. తాగునీరు వంటి సమస్యల పరిష్కారాన్ని సాధారణ పరిస్థితుల్లో మాదిరిగానే పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. రాష్ట్రమంతా ఒకే కుటుంబం అనే భావన ప్రజల్లో బలపడాలని.. శాంతిభద్రతలను ఎవరైనా రెచ్చగొడితే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల విధులు లేని అధికారులు రాష్ట్రాభివృద్ధి దృష్టికోణంలో బాధ్యతలు నిర్వహించాలని సూచించారు.

వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి శీతల ప్రదేశాలకు వెళ్తుంటారు. మన దేశంలో అయితే కొందరు కశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ ఇలా ఎవరి బడ్జెట్‌కు తగినట్లు వారు తమ ప్లాన్‌ను సిద్ధం చేసుకుని వెళ్తుంటారు. వారికి నచ్చిన ప్రదేశాల్లో కుటుంబసభ్యులలో కలిసి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో నిత్యం ప్రత్యుర్థులపై విరుకుపడే రాజకీయ నేతలు కూడా కాస్త చల్లబడడం కోసం శీతల ప్రదేశాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్ కూడా వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్తున్నారు. అత్యంత శీతల ప్రాంతమైన స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.

vsreddy 22042019

కాసేపట్లో హైదరాబాద్‌ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరనున్నారు. కుటుంబసభ్యులు సహా ఆయన విదేశి పర్యటనకు వెళ్తున్నారు. ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జగన్‌ విడిది చేయనున్నారు. ఈనెల 27 రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. గత సంవత్సరం వేసవిలో కుటుంబసభ్యులతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లారు. న్యూజిలాండ్‌లో ఆయన బంగీజంప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పర్యటనకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడానికి ఆయన సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

 

Advertisements

Latest Articles

Most Read