బీహార్‌లో రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా కొద్దిరోజుల ముందు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నించారంటూ నిన్న లాలూ సతీమణి రబ్రీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీతో తిరిగి పొత్తు పెట్టుకునేందుకు పలుమార్లు తమ ఇంటికి వచ్చిన ఆయనను తానే వెళ్లగొట్టినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రశాంత్ కిశోర్ ఇవాళ తీవ్రస్థాయిలో స్పందించారు.

tejasei 13042019

‘‘అధికారం, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసుల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్నవారు... తామే సత్యానికి సంరక్షకులమని చెప్పుకుంటున్నారు. పొత్తుకోసం ఎవరు ఎవరికి ఆఫర్ చేశారో తేల్చుకునేందుకు లాలూతో పాటు ఎప్పుడైనా మీడియా ముందు కూర్చునేందుకు నేను సిద్ధం..’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై సీఎం నితీశ్ కుమార్ స్పందించాలంటూ తేజస్వి యాదవ్ సవాల్ విసిరారు. ‘‘నితీశ్ కుమార్ ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఆయన బయటికి వచ్చి మాట్లాడాలి. ప్రశాంత్ కిశోర్ మమ్మల్ని కలిసింది వాస్తవం.

tejasei 13042019

లాలూ పుస్తకంలో కూడా ఇది రాసి ఉంది. దీనిపై ప్రశాంత్ కిశోర్ ఏదైనా ట్వీట్ చేసే ముందు నితీశ్‌తో మాట్లాడడం మంచిది..’’ అని పీకేపై తేజస్వి కౌంటర్ విసిరారు. కాగా రబ్రీ దేవి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రశాంత్ కిశోర్ చేసిన తాజా ట్వీట్‌పై ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ స్పందిస్తూ.. ‘‘ప్రశాంత్ కిశోర్ ఎందుకు ఈ ట్వీట్లు పెడుతున్నారు? ప్రస్తుతం ఆయన అడ్డంగా ఇరుక్కున్నారు. అసలు సినిమా ముందుంది..’’ అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30కి ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు బృందం కలవనుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మంత్రులు, ఎంపీలతో సీఎం సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చిస్తున్నారు. అలాగే వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో టీడీపీ రివిజన్ పిటిషన్ వేయనుంది. అయితే చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తారనే సమాచారం కూడా వస్తుంది. అయితే, ఇలా జరిగితే, దేశ వ్యాప్తంగా మోడీ బండారం బయట పడుతుంది అనే ఉద్దేశంతో, చంద్రబాబు కనుక ధర్నా లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తే, వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించనట్టు తెలుస్తుంది. ఈ సమాచారం తెలుసుకున్న చంద్రబాబు, నిరసన ఎలా తెలపాలి, దేశానికీ మోడీ చేసిన పని ఎలా చెప్పాలి అనే దాని పై సమాలోచనలు జరుపుతున్నారు.

cbn delhi 13042019

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, హింస, సాంకేతిక సమస్యలనే ఆయుధాలుగా ఎక్కుపెట్టారు. దీంతో ఎన్డీయే రహిత రాజకీయ పార్టీలన్నీ చంద్రబాబు అభ్యంతరాలపై చర్చిస్తున్నాయి. మరోసారి ఒకే వేదికగా పోరాటం సాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈవీఎంలు పనిచేయక లక్షలాది మంది ఓటర్లు మండుటెండలో నానా ఇబ్బందులు పడ్డారని అర్థరాత్రి వరకూ పోలింగ్ నిర్వహణతో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ, బీజేపీ పిర్యాదు చేస్తే ఆఘమేఘాలపై అధికారులను బదిలీ చేయడం తప్ప ఈసీ సరైన పద్ధతిలో ఓటింగ్ నిర్వహణకు బాధ్యత తెలపలేదని తప్పుబట్టారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని తప్పుబట్టే పరిస్థితిని తీసుకొచ్చారని అనుమానించే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.

cbn delhi 13042019

హస్తిన వేదికగా సాగుతున్న వ్యవహారాలపై కన్నెర్రజేశారు. ఢిల్లీ వేదికపైనే తేల్చుకుంటానని తేల్చి చెప్పారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల కమిషన్‌ అధికారాల దుర్వినియోగంపై కార్యాచరణ రూపొందించబోతున్నట్లు స్పష్టం చేశారు. 'సేవ్‌ డెమోక్రసీ... సేవ్‌ నేషన్‌' నినాదంగా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తానని ప్రకటించారు. రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకుండా.. అధికారాలను దుర్వినియోగం చేస్తున్న బండారాన్ని బట్టబయలు చేస్తానని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యఘట్టమైన ఎన్నికల నిర్వహణను బాధ్యతారాహిత్యంగా మార్చేశారని మండిపడ్డారు. తమకున్న అధికారాలను వినియోగించుకొని బాధ్యతలు నెరవేర్చాల్సిన ఈసీ.. తన విధులు పక్కనబెట్టి.. మోదీ కనుసన్నల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే దేశాన్ని కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఢిల్లీ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పారు.

విజయవాడలో పక్కపక్కనే ఉన్న రెండు పోలింగ్‌ బూత్‌లవి. ఒకదాంట్లో 1,250 మంది ఓటర్లున్నారు. మరొక దాంట్లో 532 మంది మాత్రమే. వాటి పక్క రోడ్డులోనే మరో బూత్‌లో 1100 మంది ఓటేయాలి. ఇక్కడ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఎన్నికల కమిషన్‌ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనలివి. నూటికి నూరు శాతం పోలింగ్‌ జరగడానికి ఈసీ ఏర్పాట్లు చేయలేదనేందుకు తార్కాణాలు. పోలింగ్‌కు నిర్దేశించిన సమయంలో 1200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారనే విషయాన్ని ఈసీ కనీసం ఆలోచించలేదు. ఇక, గ్రామాల్లో 2,500 వరకు ఓటర్లున్నచోట రెండు బూత్‌లు ఏర్పాటు చేశారు. అంటే, దాదాపు 1,250 మందికి ఒక బూత్‌ అన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ 45,900 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అంటే, సగటున ఒక కేంద్రంలో 857 మంది ఓటు వేయాలి. కానీ, నిర్దేశిత సమయంలో అంతమంది ఓటేయడం సాధ్యమవుతుందా? అంటే అనుమానమే. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది.

polling 12042019

సాయంత్రం 6 గంటల వరకూ క్యూలో ఉన్నవారికి అవకాశం ఇచ్చారు. మధ్య మధ్యలో ఈవీఎంలు మొరాయించడాలు, ఇతర ఇబ్బందులు షరామామూలే. ఒక ఓటరు ఓటేయడానికి కనీసం ఒక నిమిషం పడుతోంది. తొలుత ఓటరు తన స్లిప్పును సిబ్బందికి ఇస్తారు. ఆయన ఆ పేరును చదివి, నంబరు చెబుతారు. దానిని అన్ని పార్టీల ఏజెంట్లు సరిచూసుకుని టిక్‌ చేసుకుంటారు. అనంతరం ఆ స్లిప్పు నంబరును మరొకరు ఓ పుస్తకంలో రాసుకుని.. ఓటరు నుంచి వేలి ముద్ర లేదా సంతకం తీసుకుంటారు. తర్వాత వేలికి సిరా వేస్తారు. ఆ వెంటనే ఓటరు చేతికి రెండు స్లిప్పులు ఇస్తారు. వాటిని ఈవీఎంలు నిర్వహించే వారికి ఇవ్వాలి. వారు ఒక్కో దానికి 5 సెకన్ల వ్యవధిలో ఈవీఎంను రిలీజ్‌ (ఓటు వేయడానికి సిద్ధం చేయడం) చేస్తారు. ఓటు వేశాక వీవీప్యాట్‌ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీ రెండు ఓట్లకు 14 సెకన్లు అది ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఒక ఓటరుకు తక్కువలో తక్కువ నిమిషం పడుతుంది. మధ్యలో పేర్లు సరిపోలనప్పుడు, ఏజెంట్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు మరింత సమయం పడుతుంది. వృద్ధులు, నిరక్షరాస్యులు ఓటేసేటప్పుడు ఇంకాస్త ఎక్కువే పడుతోంది.

polling 12042019

ఇవన్నీ తీసేసి.. సగటున నిమిషానికి ఒకరు ఓటేశారని అనుకున్నా.. గంటకు 60 మంది మాత్రమే ఓటేయగలరు. 11 గంటలకు 60 మంది చొప్పున 660 మంది ఓటేసేందుకు వీలుంటుంది. కానీ, సగటు ఓటర్ల సంఖ్య 857గా ఉంది. వీరంతా ఓటేయాలంటే అదనంగా దాదాపు రెండు గంటల సమయం కావాలి. 11 గంటలపాటు నిమిషానికి ఒకరు చొప్పున ఓటేస్తే మొత్తం ఓటర్లలో 76.99 శాతం మాత్రమే ఓటేయగలరు. ఇక, ఒక బూత్‌లో ఉన్న 1200 మందీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే 20 గంటల సమయం కావాలి. ఈసారి రాష్ట్రంలో 80 శాతానికిపైగా ఓటింగ్‌ జరిగింది. అందుకే, సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా బూత్‌ల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. ఎక్కువమంది ఓటర్లు ఉన్న బూత్‌ల వద్దే ఈ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల పోలింగ్‌ శాతం తగ్గడానికి ఇటువంటి నిర్ణయాలు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఓటు వేయడానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద క్యూలు కనిపించడంతో చాలామంది ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు.

 

 

పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో తెలుగుదేశం నేతలు పార్టీ గెలుచుకునే స్థానాల పై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చంద్రబాబు ఇమేజ్‌తో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడంతో టీడీపీకి సానుకూల ఓటింగ్‌ గణనీయంగా నమోదైందని అంచనా వేస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని పోలింగ్‌ బూత్‌లలో పురుఫుల కంటే మహిళా ఓటర్లు అధికంగా కనిపించారు. పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన మహిళలకు పసుపు-కుంకుమ అమలుచేయడం తమకు కలిసి వచ్చిందని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

tdp 12042019

విద్యా వంతులు, విద్యార్థులు టీడీపీకే మొగ్గుచూపారని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, రాష్ట్ర అభివృద్ధికి పథకాల రూపకల్పన, ఐటీ రంగం విస్తరణ, శాంతిభద్రతలు వంటి అంశాల వల్ల ఉన్నత, మధ్యతరగతి వర్గాలు టీడీపీకి మద్దతు తెలిపారని ఓటింగ్‌ సరళి పరిశీలించిన పార్టీ నేతలు తెలిపారు. ఇక పల్లెల్లో సంక్షేమం సూపర్ హిట్ అయ్యింది. ఓటు వేసే అవకాసం లేక, ఇంటికి వెళ్లి, మళ్ళీ తిరిగి రావటం చూస్తే,చ చరిత్రలో ఎప్పుడూ లేదని అంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ సరళిపై టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తున్నది. ప్రతి సెగ్మెంట్‌లో అభ్యర్థి విజయావకాశాలపై లెక్కలు వేస్తున్నది. 20-22 పార్లమెంట్‌, 120-130 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని టీడీపీ ఖాతాలో చేరతాయి? అనేది అభ్యర్థితో పాటు సీనియర్ల నాయకుల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు.

tdp 12042019

టీడీపీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై అభ్యర్థులు, పార్టీ నేతలు లెక్కలు వేయడంతో బిజీగా వున్నారు. కొన్నిచోట్ల గతం కంటే మెజారిటీ తగ్గవచ్చునని అంటున్నారు. అయినప్పటికీ మహిళల నిశ్శబ్ద ఓటింగ్‌ వల్ల ఆ స్థానాలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదని సీనియర్‌ నేత ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో కొన్ని స్థానాల్లో పరిస్థితి నువ్వా? నేనా? అన్నట్టుగా వుందని విశ్లేషించారు. ఇక్కడ కూడా మహిళలు, రైతులు, పింఛన్‌దారులు టీడీపీకి గంపగుత్తగా ఓటేశారని, అందువల్ల కొద్ది మెజారిటీతో అయినా నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా 130 దాకా గెలుచుకుంటాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఉదయం జరిగిన టెలి-కాన్ఫరెన్స్ లో ఇదే విషయం స్పష్టం చేసారు. ఈవీయం ల బధ్రత పై జాగ్రత్తలు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read