ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోకపోవడంపై.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. ఎన్నికల సంఘం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘అసలు మీరేం చేస్తున్నారు. ఎంత మందికి నోటీసులు పంపారు. మీ అధికారాలు ఏంటో మీకు తెలుసా? ఒక వేళ సరైన సమాధానాలు ఇవ్వకపోతే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను పిలవాల్సి వస్తుంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ మాట్లాడుతూ.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా.. ఈ కేసు క్లోజ్ అయ్యిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఈసీ ప్రతినిధి హాజరు కావాలని.. కుల, మతపర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ec 15042019

అయితే, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతిపై ఈసీ కొరడా ఝళిపించింది. ఎన్నికల వేళ ఇరువురు నేతల ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న యోగి ఆదిత్యనాథ్‌, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అ అంశాన్ని పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. ఫిర్యాదులు అందినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 7న ఇద్దరు నేతలూ మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసీ కనీసం ప్రస్తావించడంగానీ, దానిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన గానీ చేయలేదని.. దీనిపై న్యాయస్థానం జోక్యంచేసుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది.

ec 15042019

మతపరమైన, సైనికపరమైన, దేశభద్రతకు సంబంధించిన అంశాలపై రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రసంగాల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అసలు ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ఇలాంటి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించింది. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసిన ఒకట్రెండు గంటల్లోనే ఈసీ చర్యలు చేపట్టింది. మతపరమైన వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ఉదయం 6గంటల నుంచి 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యలుచేసిన మాయావతిపై 48గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయవద్దని ఆంక్షలు విధించింది.

ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన తొమ్మిదిమంది వృద్ధులు తుదిశ్వాస విడిచారు. గురువారం గుంటూరు జిల్లా వేమూరు మండలం కుచ్చెళ్లపాడుకు చెందిన షేక్‌ బీజాన్‌బీ(100) కుటుంబసభ్యుల సాయంతో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలారు. అదే జిల్లా అమరావతి మండలం కర ్లపూడికి చెందిన రిటైర్డ్‌ పోస్టల్‌ ఉద్యోగి దేవరకొండ ప్రసాద్‌(70) మనవరాళ్లతో పోలింగ్‌ బూత్‌కు వెళ్లి సిబ్బందికి గుర్తింపుకార్డు చూపిస్తూనే కుప్పకూలి మరణించారు. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంకు చెందిన శీరం మాణిక్యం(64) పోలింగ్‌ క్యూలో ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కృష్ణాజిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌(57) క్యూలో విపరీతంగా చెమటలు పట్టి గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించేలోగానే మరణించారు.

old 14042019

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తొలుసూరుపల్లికి చెందిన బగాది సరస్వతి(85) కుటుంబసభ్యుల సాయంతో వీల్‌చైర్‌లో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. తిరిగి ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలోనే ఆమె మరణించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం మోగులూరుకు చెందిన బోజేడ్ల లీలావతి(75) ఎండ 40 డిగ్రీలు ఉందని కుటుంబసభ్యులు వారిస్తున్నా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. ఓటు వేసి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మొగిలమ్మ(85) ఓటు వేసి ఇంటికి వెళ్లగానే వడదెబ్బతో మృతి చెందారు. అనంతపురం జిల్లా రొద్దం మండలంలో మండ్లి గంగమ్మ(70) ఉదయం 11 గంటలకు జెడ్పీ స్కూల్‌లో ఓటు వేసి ఎండలో ఇంటికి తిరిగివచ్చి ప్రాణాలు వదిలారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు కల్పించనందునే వృద్ధులు వడదెబ్బకు మరణించారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు.

old 14042019

చివరి ఓటు చంద్రబాబుకే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన బండారు ముసలయ్య(75) ‘పింఛన్‌ పెంచిన చంద్రబాబునే గెలిపించాలి.. మా బాబునే గెలిపించాలి..’ అంటూ ఎన్నికల ముందు నుంచి అందరికీ చెబుతూ ఉండేవారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన హుషారుగా నడుచుకుంటూ గ్రామంలోని 15వ నంబరు పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటు వేశారు. అంతే ఉత్సాహంగా బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన మరణించినట్టు తెలియడంతో కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు. చంద్రబాబును గెలిపించాలంటూ ఉదయం కూడా హడావుడి చేశాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ వెళ్లారు. అక్కడి ప్రభుత్వంతో రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటికే ఏడేళ్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ కంపెనీ, ఫ్రెంచి ప్రభుత్వం మధ్య పన్నుల వివాదం నడుస్తోంది. దాదాపు రూ.1200 కోట్లను పన్నుల కింద చెల్లించాలని ఫ్రెంచి ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. దానిని రూ.56 కోట్లకు తగ్గించాలని అంబానీ కంపెనీ కోరుతోంది. అందుకు ఫ్రెంచి ప్రభుత్వం ససేమిరా అంటోంది. కానీ, మోదీ ఫ్రాన్స్‌ వెళ్లి రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన ఆరు నెలలకు ఈ వివాదం సమసిపోయింది. అంతకుముందు ససేమిరా అన్న ఫ్రెంచి ప్రభుత్వం పన్ను చెల్లింపులో భారీ రాయితీ ఇచ్చింది. కేవలం రూ.56 కోట్లు చెల్లించాలని అనిల్‌ అంబానీ కంపెనీతో రాజీ కుదుర్చుకుంది. ఫలితంగా, అనిల్‌ అంబానీ కంపెనీకి ఏకంగా రూ.1125 కోట్ల లబ్ధి చేకూరింది. ఇప్పటికే రాఫెల్‌ స్కాం వివరాలను బయటపెట్టిన ప్రముఖ ఫ్రెంచి పత్రిక ‘లె మాండ్‌’ తాజాగా ఈ వివరాలను బయటపెట్టింది. ఈ మేరకు శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది.

modi 14042019

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత ఊతమిచ్చే వార్తను ఫ్రెంచ్ పత్రిక ‘లే మాండే’ ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం అనిల్ అంబానీ నేతృత్వంలోని ఓ కంపెనీకి సుమారు 162.6 మిలియన్ డాలర్ల మేలు జరిగినట్లు తెలిపింది. దీనిపై అనిల్ నేతృత్వంలోని కంపెనీ స్పందిస్తూ ఫ్రాన్స్ చట్టాల పరిధిలోనే వివాదాన్ని పరిష్కరించుకున్నామని తెలిపింది. అనిల్ అంబానీ నేతృత్వంలో ఫ్రాన్స్‌లో రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అనే టెలికాం కంపెనీ ఉంది. ఈ కంపెనీ పన్ను వివాదంలో ఇరుక్కుంది. భారత్-ఫ్రాన్స్ మధ్య రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత ఈ కంపెనీ పన్ను బాకీ 162.6 మిలియన్ డాలర్లను ఫ్రెంచ్ అధికారులు రద్దు చేశారని చెప్తూ ఓ కథనాన్ని ‘లే మాండే’ ప్రచురించింది.

modi 14042019

ఈ కథనంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పందించింది. ఫ్రెంచ్ అధికారుల పన్ను డిమాండ్ సమర్థనీయం కాదని, చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఇది 2008నాటి కేసు అని తెలిపింది. దీనిపై ఓ పరిష్కారాన్ని ఫ్రెంచ్ అధికారులతో ఆ దేశ చట్టాలకు అనుగుణంగా కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ పరిష్కారం వల్ల ఎటువంటి లబ్ధి జరగలేదని, పక్షపాతంతో వ్యవహరించలేదని వివరించింది. 2008-2012 మధ్య కాలంలో రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్‌కు ఆపరేటింగ్ నష్టాలు 2.7 మిలియన్ యూరోలు అని, అయినప్పటికీ ఫ్రెంచ్ పన్ను అధికారులు అత్యధిక పన్ను విధించారని, దీనిపై పరస్పర పరిష్కార ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.

 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ సరళి ఉత్కంఠభరింతంగా సాగింది. ఆయన గెలుస్తారా? లేదా? అన్నది రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో తెదేపా నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా పెద్దవారైన ఆయన ఇప్పుడు తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లకు చెబుతూ వచ్చారు.

pk 14042019

మరోవైపు వైకాపా వర్గీయులు గత అయిదు రోజులుగా భారీస్థాయిలో తాయిలాలు పంచారు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం వెళ్లారు. దీంతోపాటు పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో ఆది నుంచి పలు అవాంతరాలు ఎదురవుతానే ఉన్నాయి. ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. గురువారం పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్‌ విజయావకాశాల్ని సంక్లిష్టం చేశాయని తెలుస్తోంది. చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితుల్లో చాలామంది నిష్క్రమించారు.

pk 14042019

మరోపక్క ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో చాలామంది ఓటింగ్‌కు హాజరుకాలేదు. అయితే పవన్‌కు గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. అలాగే తెదేపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో సౌమ్యుడిగా, కష్టపడి పనిచేసే వ్యక్తిగా, పలు సమస్యల్ని సమర్థంగా పరిష్కరించిన నేతగా గుర్తింపు పొందారు. తెదేపాకున్న బలమైన ఓటుబ్యాంకు, తన అభిమానులు, తన నిర్ణయాల కారణంగా లబ్ధి పొందిన వారు ఓటేస్తే తాను సునాయాసంగా విజయం సాధిస్తానని పల్లా ధీమాగా ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read