వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార యాత్రలు పగలు ఆంధ్రప్రదేశ్‌లో, రాత్రుళ్లు హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌లో అన్నట్లుగా సాగాయి. ఇంకా వింత ఏంటి అంటే, ఈ రోజు పోలింగ్ అని తెలిసినా, నిన్న కూడా హైదరాబాద్ లోటస్ పాండ్ లో నే ఉండిపోయారు. జగన్‌ పార్టీ ఈసారి తెలంగాణలో పోటీ చేయడంలేదు. ఆంధ్రప్రదేశ్‌పైనే తన శక్తులన్నింటినీ కేంద్రీకరించి ప్రచార పోరాటం ముగించింది. ప్రచారం సాగే రోజుల్లో చివరి ప్రసంగం తరువాత, సహజంగా నేతలు అక్కడే బస చేస్తారు. అక్కడ వసతులు లేవనుకొంటే, సమీప పట్టణంలో విశ్రాంతి తీసుకొంటారు. ఏమైనా రాష్ట్రంలోనే మకాం వేస్తారు. ఆ సమయంలో మరునాటి ప్రచార వ్యూహాలపై ముఖ్యులతో సమాలోచనలు జరుపుతారు. కార్యకర్తలను కలుసుకొంటారు. ఈ రాజకీయ సంప్రదాయానికి విరుద్ధంగా, జగన్‌ ప్రచారాన్ని ముగించుకొని ప్రతిరోజూ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ వెళ్లారు.

jagan 11042019

టీఆర్‌ఎస్‌ పెద్దల సలహాలు, సూచనల మేరకు తన ప్రచార వ్యూహాలకు ఆయన పదును పెట్టుకొనేవారని, దానికోసమే ఎంత రాత్రయినా హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌లోని తన నివాసానికి చేరుకొనేవారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైఎస్‌ జగన్మోహన రెడ్డి మొత్తం 24 రోజులపాటు రాష్ట్రంలోని 13 జిల్లాలను చుట్టేశారు. ఈ క్రమంలో 68 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక్కోసారి మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లారు. ఇలా పగలంతా రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఏగూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్లుగా, సాయంత్రానికి మాత్రం లోట్‌సపాండ్‌ నివాసానికి జగన్‌ చేరుకుంటూ వచ్చారు. రాజకీయ మంత్రాంగం కోసం ప్రత్యేకంగా ‘‘వార్‌ రూమ్‌’’ను ఆయన తన నివాసంలో ఏర్పాటు చేశారు.

jagan 11042019

ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్‌ రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌తో సహా ముఖ్యనేతలంతా అక్కడ ఎన్నికల వ్యూహాలపై ప్రణాళికలు రచించారు. ఎప్పటికప్పుడు ఈ నేతలు అక్కడి నుంచే టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపేవారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉంటూ, రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు సాగించడం, పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయడం సహజం. దీనికి భిన్నంగా పొరుగు రాష్ట్ర రాజధానిలో కూర్చొని రాజకీయ వ్యూహాలను రచించిన తీరుపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా మారింది. పాదయాత్రలో తిరగని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా చేరుకోవాలని వైఎస్‌ జగన్‌ తొలుత ఆలోచించారు. ఏమయిందో ఏమోగానీ ఆ యాత్ర అర్ధంతరంగా రద్దయింది. ఒకవేళ బస్సు యాత్ర చేపడితే, అక్కడే బస చేయాలి. అప్పుడు తన రహస్య మిత్రులను కలుసుకోవడం వీలు కాదని జగన్‌ భావించారని చెబుతున్నారు.

 

 

వైసీపీ నేత.. ఆ పార్టీ తరఫున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పొట్లూరి వరప్రసాద్‌కు (పీవీపీ) సెబీ షాక్‌ ఇచ్చింది. ఆయనకు చెందిన పీవీపీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ షేర్ల క్రయవిక్రయాలను సోమవారం నుంచి నిలిపివేసింది. సెబీ మార్గదర్శకాలను, నిబంధనలను ఉల్లంఘించినట్లు.. ముఖ్యంగా, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, వేలాదిమంది షేర్‌హోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి వాటిని ప్రధాన కంపెనీలో విలీనం చేసి లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రచారం చేసి.. తద్వారా మదుపర్ల నుంచి పెట్టుబడులు వచ్చి షేరు ధర పెరిగిన తర్వాత ప్రమోటర్లు తమ షేర్లను విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సెబీ గతంలోనే భారీ జరిమానా విధించింది.

pvp 10042019

దాదాపు రూ.20 కోట్ల దాకా జరిమానాను పీవీపీ వెంచర్స్‌ చెల్లించాల్సి ఉంది. అయితే, పలు అవకాశాలిచ్చినప్పటికీ సదరు సంస్థ జరిమానా చెల్లించకపోవడంతో సెబీ కఠిన నిర్ణయం తీసుకుంది. కాగా.. పీవీపీ దీనికి సంబంధించిన వివరాలను తన ఎన్నికల అఫిడవిట్‌లోనూ పేర్కొన్నారు. సెబీకి తాను దాదాపు రూ. 7 కోట్లు చెల్లించే అంశంపై ముంబై సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌ఏటీ)లో విచారణ జరుగుతోందని అందులో వెల్లడించారు. కంపెనీ నిర్వాకం కారణంగా ట్రేడింగ్‌ నిలిపివేయటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. సెబీ నిర్ణయంతో వేలాది మంది వాటాదారులు నష్టపోయారని మార్కెట్‌ వర్గాలంటున్నాయి.

pvp 10042019

జరిమానాను చెల్లించేందుకుగాను.. పీవీపీ వెంచర్స్‌కు తమ భూములను ఇవ్వడానికి అభ్యంతరం లేదని రెండు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి స్పష్టం చేశాయి. ఆరేటి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ రియల్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు మొత్తం 53 ఎకరాల భూమిని అందించేందుకు ముందుకు వచ్చాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ వెల్లడించింది. ఈ భూములు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామ పరిధిలోని 609 సర్వే నెంబరులో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయంలో 7 వేర్వేరు నెంబర్లతో కూడిన ఒరిజినల్‌ సేల్‌డీడ్స్‌ను తమకు అందించారని వివరించింది. ఈ భూములను విక్రయించడం కాని, కొనుగోలు చేయటాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేసింది.

 

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విశ్వసనీయత మునుపెన్నడూ లేనంతటి అథమ స్థాయికి దిగజారిందని మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు. భయంతో కూడిన ప్రవర్తనే ఇందుకు కారణమన్నారు. ఈసీ విశ్వసనీయత, పనితీరుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సవాళ్లు, సంక్లిష్టతలు ఎదుర్కొంటూనే.. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎంతోకాలంగా గౌరవనీయమైన చరిత్ర కలిగిన ఈసీ ప్రస్తుతం విశ్వసనీయత సంక్షోభంతో బాధపడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి.. అధికార పార్టీకి ప్రమేయం ఉన్న కేసులపై స్పందించే విషయంలో ఈసీ విఫలమవుతోందని ఆరోపిస్తూ 66 మంది మాజీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు.

ec 10042019 4

ఏశాట్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం, మోదీ బయోపిక్‌ చిత్రం, ‘మోదీ: ఓ సామాన్యుడి ప్రస్థానం’ వెబ్‌ సిరీస్‌ విడుదల, నమోటీవీ ఛానల్‌ ప్రసారం విషయంలో అలసత్వం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. ఏశాట్‌ క్షిపణిపై ప్రధాని బహిరంగ ప్రకటన చేసేందుకు ప్రస్తుతం దేశానికి వచ్చిన తక్షణ భద్రతా ముప్పేమీ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రసారసంస్థ ద్వారా ప్రకటన చేయకూడదని, అయినా ఈసీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించలేదని ఆక్షేపించారు. ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత ప్రభుత్వ విజయాలను ఏకరవు పెట్టడం ఉల్లంఘన కిందే వస్తుందని పేర్కొన్నారు. ఈనెల 11న విడుదలయ్యేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ జీవితకథ చిత్రానికి ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడాన్నీ వారు ఆక్షేపించారు. ఈ చిత్రం నిర్మాణం, పంపిణీ, ప్రచారం వంటి వాటికైన ఖర్చులన్నింటినీ మోదీ ఎన్నికల వ్యయంలో కలపాలని డిమాండ్‌ చేశారు. ఇది ఒక రాజకీయ నేత దొడ్డిదారిగుండా ఉచితంగా ప్రచారాన్ని పొందే యత్నమని విమర్శించారు.

ec 10042019 4

యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ భారత సైన్యాన్ని మోదీసేనగా అభివర్ణించడంపై చర్య తీసుకోవాల్సిన ఈసీ మందలింపుతో సరిపెట్టిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ స్వతంత్రత, నిష్పాక్షికత, సమర్థత వంటివన్నీ ప్రస్తుతం రాజీ ధోరణిలో సాగుతున్నాయన్నారు. ఈసీ నిష్పాక్షిక పనితీరుపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లినా మన ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు. ఏపీలో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు, సీఎస్‌ బదిలీ, పశ్చిమబెంగాల్‌లో నలుగురు పోలీసుఉన్నతాధికారుల బదిలీలను లేఖలో ప్రస్తావించారు. తమిళనాడు డీజీపీ గుట్కా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, డీజీపీని తొలగించాలని విపక్షాలు కోరుతున్నా ఈసీ స్పందించడం లేదని లేఖలో ఉదహరించారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో రాజస్థాన్‌ మాజీ సీఎస్‌ సలాహుద్దీన్‌ అహ్మద్‌, పంజాబ్‌ మాజీ డీజీపీ జూలియో రిబేరియో, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్‌ సర్కార్‌, దిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, పుణె మాజీ పోలీసు కమిషనర్‌ మీరన్‌ బోర్వాంకర్‌ తదితరులు ఉన్నారు. ఏప్రిల్‌ 8న రాసిన 5 పుటల లేఖ ప్రతిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కూ ఉద్దేశించారు.

ఐదేళ్ల కిందట అన్యాయంగా జరిగిన విభజన కారణంగా కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని.. తనపై నమ్మకంతో పసిబిడ్డలాంటి రాష్ట్రాన్ని ప్రజలు తనకు అప్పజెప్పారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని గత ఐదేళ్లు కష్టపడ్డానని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. విభజన హామీలు నెరవేర్చాల్సిన కేంద్రం నమ్మకద్రోహం చేసిందని.. ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో మనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డం తిరిగిందని ఆరోపించారు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు నడిచానని చెప్పారు. అవినీతితో సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్ర ద్రోహులతో కొందరు చేతులు కలిపారన్నారు.

cbn letter 10042019

మన సాగునీటి ప్రాజెక్టులకి అడ్డుపడి అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు సిద్ధపడిన ఆ అనుభవం లేని నాయకుడిని నమ్మి రాష్ట్రాన్ని అప్ప చెబుదామా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ కథను లేఖలో ఆయన ప్రస్తావించారు. ‘‘ఒకసారి అడవిలో నాయకత్వానికి సెలయేరు, గొడ్డలి పోటీ పడ్డాయట. అందరి సంక్షేమాన్ని చూసే సెలయేరు కావాలా? చెట్లన్నీ అడ్డంగా నరికే గొడ్డలి కావాలా? అనే మీమాంస ఏర్పడింది. కొన్ని చెట్లు గొడ్డలి కర్రది మన కులం కదా.. నాయకుడిగా పెట్టుకుంటే తప్పేంటి అనుకున్నాయట. ఆ చెట్ల మాటలను మరో చెట్టు మీద నుంచి ఆసక్తిగా వింటున్న కుందేలు మధ్యలో కలగజేసుకుంది."

cbn letter 10042019

"మన మధ్య ఏ భేదం చూపకుండా అందరి సంక్షేమమే తన కులం అని భావించి సేవచేసే సెలయేటిని వదిలి.. అడ్డంగా నరికే గొడ్డలి కర్రను మీ కులమని ఓటేస్తే చెట్లన్నింటినీ నరికేసి చివరికి అడవి అంతరించిపోతే మన భవిష్యత్తు ఏం కాను? అని ప్రశ్నించిందట. దాంతో అడవిలో చెట్లన్నింటికీ జ్ఞానోదయమై చెట్లన్నీ పచ్చగా ఉండాలంటే మన నాయకుడిగా సెలయేరు ఉండాలని ఎన్నుకున్నాయట’’ అడవిలో చెట్లన్నింటికీ బాధ్యతను గుర్తు చేసిన ఆ కుందేలు మాటలు మన అందరికీ ఆదర్శం కావాలి అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read