ఓ కోవర్టుతో టీడీపీ నేతలు తనపై నిందలు వేయించారని ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళుతున్నానని చెప్పారు. లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందని ఆమె సహాయకుడు కోటి ఆరోపించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కోటి వెనుక ఎవరు ఉన్నారో తేలిపోతుందన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి చంద్రబాబు, బాలకృష్ణతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడే బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారని కోటి అనే వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు రావడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లక్ష్మీపార్వతి స్పందిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని హీనంగా చూపే కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.

game 27032019

కోటి విషయమై లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘దండుపాళ్యం డైరెక్టర్ ఓ అభిమానిగా ఇతడిని వెంటపెట్టుకుని ఓరోజు మా ఇంటికి వచ్చాడు. అమ్మా వీడు(కోటి) జూనియర్ ఆర్టిస్ట్ గా వేషాలు వేస్తుంటాడు’ అని చెప్పాడు. దీంతో నేను మర్యాదగా పలకరించాను. ఈ సందర్భంగా మాదీ వినుకొండే అమ్మా.. ఏదైనా పనుంటే చెప్పండి అని కోటి అడిగాడు. దీంతో తాను‘ ఏం వద్దులే బాబూ.. అసెంబ్లీలో మందులు ఇస్తారు మాకు. మా అమ్మకు తెచ్చిపెట్టు’ అని చెప్పాను. ప్రతీనెలా మా అమ్మకు మందులు తెచ్చి ఇచ్చేవాడు. ఇలా మా అమ్మకు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఇస్తూ ఇంట్లోవాళ్లకు దగ్గరయ్యాడు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందని ఇప్పుడు అర్థమవుతోంది’ అని తెలిపారు.

game 27032019

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తర్వాత చాలా మంది ప్రజలు అమితంగా గౌరవిస్తున్నారని, అభిమానం పెరిగిందని చెప్పారు. కుటుంబ గౌరవం కోసమే తాను మౌనంగా ఉన్నాననీ, తాను గుట్టు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల చరిత్ర రోడ్డున పడుతుందని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి రాగానే తానేంటో చూపిస్తానని హెచ్చరించాడు. గత 25 ఏళ్లుగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవమానాలను తాను భరిస్తూ వచ్చానని లక్ష్మీపార్వతి తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ లను త్వరలో జైలుకు పంపకపోతే తాను ఎన్టీఆర్ భార్యనే కాదని శపథం చేశారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఇకపై చట్టపరంగా ముందుకు వెళతానని హెచ్చరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెందిన గ్యాంగులు తనపై దాడికి ప్రయత్నించాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడికి సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడికి యత్నించినవారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు వారం రోజుల పాటు వాయిదా వేయాలని ఈసీని కోరినట్లు కేఏ పాల్ చెప్పారు. అయితే ఎన్నికలు వాయిదా వేసే అధికారం తమకు లేదని ద్వివేది చెప్పారన్నారు. తాను ఎంపీ కావడం ఖాయమని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌కు రాజకీయ అనుభవం లేదన్నారు. జగన్‌ సీఎం అయితే రాష్ట్రం రావణకాష్టం అవుతుందన్నారు.

game 27032019

చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి ఆగిపోతుందని, గ్లాసు, ప్యాన్‌, సైకిల్‌కు ఎవరూ ఓటేయొద్దని కేఏ పాల్ కోరారు. మాయావతి మాయలో పవన్‌ కల్యాణ్‌ పడ్డారని, యూపీలో మాయావతి అవినీతిలో నెంబర్‌వన్ అని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌కు మాయావతి ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు. నిన్న అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తన హోటల్ గదిలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తాను గది తలుపు వేసేశానని పేర్కొన్నారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. గతంలో తనపై ఆనంద్.ఇన్ హోటల్ లో దాడి చేసేందుకు ప్రయత్నించిన బ్యాచే ఇప్పుడు మరోసారి దాడికి ప్రయత్నించిందని, తనకు ప్రాణహాని ఉందని అన్నారు. ఈ విషయాన్ని చెప్పి, తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని కోరితే, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఓ గన్ మెన్ ను ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. నిన్న రాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో దాడి జరిగిందని కేఏ పాల్ తెలిపారు.

game 27032019

ఈ సమయంలో తన భద్రతాసిబ్బంది వెళ్లిపోయారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకా కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ కు వచ్చిన భీమవరం సీఐ కనీసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదని వాపోయారు. మీ ఫ్యాన్స్ సార్.. అంటూ వీరంతా తన గదిలోకి వచ్చేందుకు ప్రయత్నించారని కేఏ పాల్ తెలిపారు. దీంతో ‘రేపు ఉదయం 9.45 గంటలకు రండి.. మాట్లాడుకుందాం’ అని సూచించానన్నారు. అంతలోనే వారు గదిలోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో వేగంగా తలుపు వేసేశానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై పాల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఓరేయ్ జగన్.. దమ్ముంటే రారా.. నాతో డిబేట్ కు. చేతకాని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావ్. నేడు జడుస్తాను అనుకుంటున్నావా? నేను ప్రపంచాన్ని జడిపించి ఇక్కడకు వచ్చాను. మా బీ-ఫారాలను దొంగలించడమే కాకుండా నా మీదే దాడి చేయిస్తావా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. ఒకవేళ కేసీఆర్‌ అనుకూల ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని ఆరోపించారు. అలాగే రాజధాని సైతం తరలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ మేరకు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘నిజం విత్‌ శివాజీ’ పేరిట రాజధాని, పోలవరం తదితర అంశాలపై కొన్ని వీడియోలను ప్రదర్శించారు. తన దృష్టికి వచ్చిన అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. తనపై కొందరు కులాజీ అని ముద్ర వేస్తున్నారని తెలిపారు. తాను ఈ ప్రాంతం కోసం పోరాడుతున్నానని అన్నారు. రాజకీయ పార్టీల తరఫున కాకుండా ప్రజల తరఫున ప్రశ్నించానని గుర్తు చేశారు. ప్రశ్నించే వాడికి కులం అంటగుడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

game 27032019

కేసీఆర్‌ పోలవరం ఆపేస్తారు.. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సమయంలో తీసిన వీడియోను తొలుత శివాజీ ప్రదర్శించారు. 2021 అక్టోబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొందరు ఇంత పని జరుగుతుంటే అసలు గ్రాఫిక్స్‌ అని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సరైన వ్యక్తి అధికారంలోకి రాకపోతే ఈ ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆపేస్తారని ఆరోపించారు. వాళ్లు కోరుకున్న ప్రభుత్వం వస్తే తప్పక ఆపేస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ఓ సందర్భంలో పోలవరం అడ్డుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రదర్శించారు. సరైన నాయకుడిని ఎన్నుకోకుంటే 70 శాతం పూర్తయిన ప్రాజెక్టును అడ్డుకునే ప్రమాదముందని, ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని ఓటేయాలని విన్నవించారు. జగన్‌పై కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉందని అనుకోనని, ఆయన ఆడుతున్న పన్నాగాల్లో చిక్కుకోవద్దని హితవు పలికారు. కేసీఆర్‌తో స్నేహమంటే పులిపై స్వారీ చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

game 27032019

రాజధాని అభివృద్ధి కనిపించడం లేదా? అనంతరం అమరావతిలో పర్యటించినప్పటి వీడియోను శివాజీ ప్రదర్శించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీడియోలో చూపించారు. రాజధానిలో పర్మినెంట్‌ పేరుతో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పడలేదన్న జగన్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. జగన్‌ ఇంటికే మూడున్నరేళ్లు పడితే ఇంతపెద్ద రాజధాని నిర్మాణానికి ఆ మాత్రం సమయం పట్టదా? అని ప్రశ్నించారు. గ్రాఫిక్స్‌ అని మాత్రం విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రాజధాని నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారం నమ్మొద్దని సూచించారు. రాజధానిని వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎవరి సొమ్మని రాజధానిని తరలిస్తారని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులు, ఇక్కడి రైతులు పిచ్చివాళ్లా?అని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించడం గురించి వైసీపీ తన మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానంపై జగన్ మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు. జిల్లాలు, మండలాల పారిశ్రామికీకరణపై జగన్ కు ఏమాత్రం అవగాహన లేదని దుయ్యబట్టారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లాలంటే అన్ని అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళతారని ప్రశ్నించారు.

game 27032019

ఇన్ని నేరాలు, కేసులున్న వ్యక్తులను నమ్మి ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అని ప్రశ్నించారు. ‘నేరాలు-ఘోరాలు పార్టీ’కి ఓటేస్తే జీవితాంతం క్షోభ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగానికి వెళితే వ్యక్తిత్వం, చదువులకు సర్టిఫికెట్ అడుగుతారనీ, మరి రాజకీయాల్లో ఉండేందుకు క్యారెక్టర్ సర్టిఫికెట్ జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. రూ.63,000 కోట్ల రఫేల్ కుంభకోణానికి పాల్పడిన బీజేపీకి ఎవరైనా ఓటేస్తారా? అని అడిగారు. వైసీపీ 97 మంది నేరగాళ్లను ఈ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిందనీ, అలాంటి పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఈసారి టీడీపీ ఘనవిజయం సాధించడం సాధ్యమని జోస్యం చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read