ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలవడం చారిత్రక అవసరమంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను జగన్ స్వయంగా తెలుసుకున్నారు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం తీసుకొస్తారన్న నమ్మకం ఉందన్నారు. జగన్‌కు ఒక విజన్‌ ఉందని.. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఏపీలో జగన్ హవా నడుస్తోందని.. ఎక్కడ చూసినా రావాలి జగన్-కావాలి జగన్‌ నినాదం వినిపిస్తోందన్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి 20కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారని ఓవైసీ జోస్యం చెప్పారు.

supreme 07042019

జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక లెజెండ్‌.. ఏపీలో ముస్లింలందరూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉన్నారన్నారు. ముస్లింలు మాత్రమే కాదు.. అన్నివర్గాల ప్రజలు జగన్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలన, చంద్రబాబుపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు అసదుద్దీన్. బాబు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని.. ముస్లింలకు ఆయన చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదని ధ్వజమెత్తారు. బాబును ముస్లింలు ఎప్పటికీ నమ్మరు..బాబుకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అన్నారు.. అయితే బీజేపీతో అంటకాగుతున్న జగన్ పై, ఒక్క మాట కూడా అనకపోవటం విశేషం. ఏదేమైనా ఏపి పై దాడి చెయ్యటానికి, హైదరాబాద్ నుంచి అందరినీ వాడుతున్నాడు జగన్.

బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌.కె. అడ్వాణీ మరో ఇరవైరోజులు ఆగివుంటే బ్లాగులో ఆయన చేయిచేసుకొని ఐదేళ్ళు పూర్తయ్యేది. ఈ కాలంలో బ్లాగులు ఎవరు చదువుతార్లే అని ఊరుకున్నారో, మోదీ పాలనమీద వ్యాఖ్యానించేందుకు ఇంతకాలమూ ఏ ఒక్క అంశమూ దొరకలేదో తెలియదు కానీ, ఇప్పుడు హఠాత్తుగా ఓ ఐదువందల పదాలు సంధించి మోదీని సరైన సమయంలో శిక్షించారు. ఇంతటి మంచిమాటలు, ఇన్నేసి హితవులు వల్లించడానికి అడ్వాణీ అర్హుడేనా అన్న విమర్శ అటుంచితే, ఆయన మాటలన్నీ వర్తమానానికి సరిగ్గా వర్తించేవే. మోదీమీద అక్కసుతోనైనా అడ్వాణీ వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలతో విభేదించాల్సిందేమీ లేదు. అడ్వాణీ మితభాషీ కాదు, మృదుభాషీ కాదు. నీళ్ళు నమలడం చేతకాదు. అనుకున్నది నేరుగా పదునుగా చెప్పగలిగే తెగువ ఆయనలో ఉంది. ఇందుకు భిన్నంగా, ఎంతోకాలం తరువాత రాసిన ఈ నాలుగువాక్యాలు కూడా నర్మగర్భంగా, బీజేపీ అలాలేదు, ఇలా చేయలేదు అంటూ సుతిమెత్తని మాటలతో సాగాయి. తన రచన రాజకీయంగా రచ్చరేపుతుందనీ, స్వపక్ష మోదీని ఇరకాటంలో పడేస్తుందనీ, మోదీ వ్యతిరేకశక్తులకు ఆయుధంగా ఉపకరిస్తుందని అడ్వాణీకి తెలుసు.

పార్టీ ఆయనకు టికెట్‌ ఇచ్చివున్నా, అమిత్‌ షా ఎగరేసుకుపోయిన గాంధీనగర్‌ స్థానమో, మరొక నియోజకవర్గమో దక్కివున్నా అడ్వాణీ మరో ఐదేళ్ళపాటు బ్లాగువైపు కన్నెత్తిచూసేవారు కాదేమో! పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు ఏటా వస్తూనే ఉన్నాయి కనుక, ఈ హితవు చెప్పడానికి అడ్వాణీ గత సందర్భాలనూ వాడుకొని ఉండవచ్చు. అడ్వాణీ రచన వెనుక వర్తమాన పరిస్థితులపై ఆవేదన కన్నా, పార్టీ తనను పక్కన బెట్టిందన్న అక్కసు అధికంగా పనిచేసిందన్న విమర్శ కాదనలేనిది. ‘దేశం ముందు, పార్టీ తరువాత, చివరకు నేను’ అంటున్న అడ్వాణీ ఈ రచనతో ఎన్నికల ముందు పార్టీని దెబ్బతీసి, ‘నేనే ముందు, పార్టీయే తరువాత’ అని తేల్చేశారని మోదీ వర్గం విమర్శ. పార్టీలో ఉంటూనే నచ్చినపార్టీకి ఓటేయ్యండన్న పరోక్ష సందేశం ఎలా ఇస్తారన్న ప్రశ్న కూడా సరైనదే. అద్వానీ రచనకు ప్రతిస్పందనగా ‘మా బాగా చెప్పారు’ అంటూ మోదీ కాస్తంత వ్యంగ్యంగా ఏవో వ్యాఖ్యలు చేసి నష్టనివారణకోసం ఓ తెలివైన ప్రయత్నం చేసిప్పటికీ పెద్ద ప్రయోజనం లేకపోతున్నది. బీజేపీ విలువలుగా ఏకరువుపెట్టినవన్నీ అడ్వాణీ కాలంలో కనిపించాయా? అన్న ప్రశ్న అటుంచితే, మోదీ హయాంలో రాజకీయం మరింత దిగజారి, సమస్త వ్యవస్థలు దెబ్బతినిపోయిన ఈ సంక్షోభ సందర్భంలో ఈ మాటలకు ఎంతో విలువ ఉన్నది.

భిన్నత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువల గురించి ఆయన తగిన సమయంలో మాట్లాడారు. మోదీ పక్షాన ఉన్నవారు మాత్రమే దేశభక్తులుగా, మిగతావారంతా దేశద్రోహులని బీజేపీ నాయకులు నిర్లజ్జగా ముద్రవేస్తున్న దశలో అడ్వాణీ మాటలు ఇటువంటివారిపై ప్రభావం చూపితే సంతోషించాల్సిందే. ప్రత్యర్థులకూ, శత్రువులకూ మధ్య తేడా చెరిపేస్తూ విపక్ష నేతలపట్ల మోదీ–షా ప్రదర్శిస్తున్న కరుకువైఖరిని ప్రశ్నించడం సముచితమైనదే. ఈ మంచిమాటలేవో ఆయన ఎప్పుడో చెప్పివుంటే తన తొలిప్రాధాన్యం దేశానికే, ఆ తరువాతే పార్టీ అన్న అభిప్రాయానికి మరింత విలువ, గౌరవం దక్కేవి. ఈ ఐదేళ్ళకాలంలో మోదీ ప్రభుత్వం తమకు నచ్చనివారిని వరుసపెట్టి దేశద్రోహ నేరంపై జైళ్ళలోకి నెట్టినప్పుడు, కుట్రకేసులు బనాయించినప్పుడూ, గోరక్షణ పేరిట మైనారిటీలపై మూకదాడులు సాగినప్పుడు, న్యాయవ్యవస్థ, సీబీఐ సహా పలు వ్యవస్థలు దెబ్బతినిపోతున్నప్పుడు ఆయన ఇలా నోరువిప్పివుంటే బాగుండేది. ఈ విలువలను గుర్తుచేసి, పార్టీని గాడినపెట్టడానికి మార్గదర్శక్‌మండల్‌లో ఉన్న ఆయన ముందుకు వందలాది సందర్భాలొచ్చాయి. సమస్యలు, సంక్షోభాలు దేశాన్ని కుదిపేస్తున్న ఏ తరుణంలోనూ నోరువిప్పని ఆయన ఇప్పుడు ఇవీ మనం పాటించాల్సిన విలువలంటూ గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన నోరుతెరిచినందుకు అభినందించాల్సిందే. మరో నలుగురు ఆ బాటలో నడిచి నాలుగు మంచిమాటలు చెబితే దేశానికి మంచిదే.

ఎన్నికల వేళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్‌ ఆ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామం నగరంలో వైసీపీ వర్గాలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. మరో ఐదు రోజుల్లో పోలింగ్‌ జరగబోతున్న తరుణంలో సౌమ్యుడిగా పేరున్న తైనాల పార్టీని వీడడం, టీడీపీలో చేరడం ఉత్తర నియోజకవర్గంతోపాటు విశాఖ పార్లమెంట్‌ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌తో పాటు అభ్యర్థుల నుంచి తనకు ఎదురవుతున్న అవమానాలను భరించలేకే తైనాల పార్టీని వీడినట్టు ప్రచారం జరుగుతోంది.

lotuspond 07042019

న్యాయవాది అయిన తైనాల విజయ్‌కుమార్‌ 2005లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. జీవీఎంసీ ఫలితాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో తైనాల మద్దతు రెండు పార్టీలకు అవసరమైంది. ఆ సమయంలో తైనాల విజయ్‌కుమార్‌ నేరుగా అప్పటి సీఎం వైఎస్‌ను కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినప్పటికీ టిక్కెట్‌ దక్కకపోవడంతో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. మూడున్నరేళ్లపాటు పనిచేసిన అనంతరం ఆయన స్థానంలో అధిష్ఠానం మరొకరికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది.

lotuspond 07042019

టిక్కెట్ల కేటాయింపు తర్వాత తైనాల పట్ల పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఎందుచేతనో కొంత అసహనం ప్రదర్శిస్తూ వచ్చినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీనిని గుర్తించిన కొంతమంది అభ్యర్థులు కూడా తైనాలను దూరం పెట్టడం మొదలుపెట్టారని సమాచారం. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కనీసం ఫోన్‌ ఎత్తేవారు కాదని, అవహేళనగా మాట్లాడేవారని తెలిసింది. ఆ విషయాలను అక్కడున్న నేతలు తైనాలకు చెప్పడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని జగన్‌ను కలిసి వివరించాలని తైనాల యత్నించినా ఆయన కనీసం పట్టించుకోలేదని వివరిస్తున్నారు. తాజాగా శుక్రవారం లోటస్‌పాండ్‌కు వెళ్లిన తైనాలకు తిరిగి అలాంటి అనుభవమే ఎదురవడంతో ఏమాత్రం గుర్తింపు లేని పార్టీలో ఇంకా కొనసాగడం వ్యర్థమని గుర్తించి, పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంటున్నారు. దీనిని గుర్తించిన టీడీపీ నేతలు తైనాల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను పార్టీలో చేరేలా పావులు కదిపారు. దాంతో తైనాల టీడీపీలో చేరిపోయారు.

తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈరోజు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి మోత్కుపల్లి వచ్చారు. ఆయన్ను వైసీపీ నేతలు సాదరంగా లోపలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమని నిన్న మోత్కుపల్లి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో జగన్ తో ఈరోజు మోత్కుపల్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

motkupalli 07042019

‘బాబు ఓ అసమర్థుడు. ఆయనకు ఏపీలోనే దిక్కులేదు, ఇక తెలంగాణకు ఏం చేయగలడు’అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలంతా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారని, సీఎం పిలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. తెలుగుదేశం నుంచి దూరం అయిన తరువాత, ఎవరూ ఆయనను దగ్గరకు రానివ్వ లేదు. జగన్ మాత్రమే పిలిచి కుట్రలు పన్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. దళిత విద్యార్థి నాయకుడుగా మోత్కుపల్లి నర్సింహులు ఆలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు.

motkupalli 07042019

ఇక్కడ నుంచే వరుసగా ఆరుసార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచిన ఆయన ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో విద్యుత్‌, సాంఘిక సంక్షేమ, టూరిజం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో గవర్నర్ కావాలని అడగటం, బీజేపీ వేస్తున్న వేషాలు తట్టుకోలేక చంద్రబాబు బయటకు రావటంతో, ఆయన గవర్నర్ ఆశలు అడియాసాలు అయ్యాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు పై చేసిన విమర్శల కారణంగా టీడీపీ వేటుకు గురయ్యారు. ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ లోటస్ పాండ్ లో ప్రత్యక్షమయ్యారు.

Advertisements

Latest Articles

Most Read