సీబీఐ మాజీ జేడీ, విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి విశాఖలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. విశాఖలో నేరచరితులకు చోటివ్వమన్నారు. "లక్ష్మీనారాయణలా కేసులను మధ్యలో వదలిపెట్టను. నాది ఉడుం పట్టు, పడితే విడవను. నీతివంతమైన, సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం. కేసీఆర్‌కు జగన్‌ ఊడిగం చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్‌, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు జోలికి వస్తే వదలిపెట్టేది లేదు" అని చంద్రబాబు హెచ్చరించారు.

game 27032019

మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో ఎందుకు చేరాడో ఆయనకే తెలియదని, ఆయనకు ఓటేస్తే ఓట్లు చీలిపోయి వైసిపి గెలుస్తుందని చెప్పారు. నీటి ఎద్దడిని తీర్చుతాం... " విశాఖకు నీటి ఎద్దడిని తీర్చుతాం. విశాఖను కాస్మొపాలిటిన్‌ సిటీగా తయారుచేస్తా. సింహాచలం భూముల సమస్యను పరిష్కరిస్తాం. పేదలందరికీ అర్బన్‌ ఏరియాలు ఇళ్లు కట్టిస్తాం. విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.25లక్షలు ఇస్తాం. విశాఖతో అహ్మదాబాద్‌ ఎక్కడా పోటీ పడలేదు" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించే క్రమంలోనే ఆయన జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బదిలీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్‌ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారని, ఇప్పుడు సీఎస్‌ను బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరస్థులకు మోదీ కాపలాగాసే వ్యక్తి అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న తనను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, ఏం చేశారో చెప్పకుండా అధికారులను ఎలా బదిలీ చేస్తారని నిలదీశారు. రేపో, ఎల్లుండో తనను కూడా అరెస్టు చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం రోడ్‌షోలో మాట్లాడారు.

game 27032019

‘‘ఇటీవల ఓ కలెక్టర్‌ను మార్చారు. మొన్న ఇద్దరు ఎస్పీలను, ఇంటెలిజెన్స్‌ డీజీని మార్చారు. ఏం తప్పు చేశారని మార్చారో, ఎందుకు మార్చారో చెప్పాలి. కారణం లేకుండా మార్చారు. ఎన్నికల కమిషన్‌ ఇష్టానుసారంగా చేయడం న్యాయమా? కేంద్ర ఎన్నికల సంఘం పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా వ్యవహరించాలి. తెలంగాణలో 25లక్షల ఓట్లు తీసేశారు. ఎన్నికలు జరిగే చివరి క్షణంలో సారీ చెప్పారు. కోడికత్తి పార్టీ నేతలు దిల్లీకి వెళ్తారు. తిరిగి మనం ఓట్లు తీసేశామంటారు. ఫారం7తో సుమారు 7లక్షలు ఓట్లు తీసేశారు. ఈ వ్యవహారంపై సిట్‌ వేశాం. నిందితుల్ని పట్టుకొనేందుకు ఆధారాలు ఇవ్వమంటే ఎన్నికల కమిషన్‌ మీనమేషాలు లెక్కిస్తోంది. ఏ తప్పూ చేయని సీఎస్‌, డీజీని బదిలీ చేస్తారా? ఏం చేస్తారో చేయండి. లెక్క చేయను. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నా. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికల కమిషన్లను చూశా. ఈవీఎంలను కూడా మానిప్యులేట్‌ చేసే అవకాశం ఉందని పోరాటం చేసి వీవీప్యాట్‌లను సాధించుకున్నాం. దేశంలో 22 పార్టీలు కలిసి 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కపెట్టాలని కోరితే వీలుకాదని ఈసీఐ చెబుతోంది. ఆ పనిచేయకుండా సీఎస్‌, డీజీ, ఎస్పీలను మారుస్తారు. కోడికత్తి పార్టీకి సహకరిస్తారు. నేరస్థులకు సహకరిస్తారు. మోదీ నన్ను బెదిరిస్తున్నారు. నన్ను భయపడమంటారా? ప్రజల కోసం పోరాడటం నా తప్పా. ఊడిగం చేయమంటారా? నేనెప్పుడూ నేరాలను ప్రోత్సహించలేదు’’ అని చెప్పారు.

game 27032019

‘‘ఇష్టానుసారం దాడులు చేస్తే ఊరుకోం. ధర్మపోరాటం రాష్ట్రం కోసం చేశాను. భావితరాల కోసం చేశాను. నన్ను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? ఎమ్మెల్యేలపై దాడులు చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? సీఎస్‌, డీజీని బదిలీ చేస్తారా? రేపో, ఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు. చేయండి. జైలులో ఉంటాగానీ భయపడే సమస్యలేదు. నేను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడాను. మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రతిపక్షాలను భయపెడుతున్నారు. ఇష్టానుసారంగా చేస్తే ఖబడ్దార్‌ మోదీ.. నీ ఆటలు సాగవని చెప్పాను. నాపై ఈసీని ప్రయోగిస్తారా? చూద్దాం. భయపడను. అమిత్‌షా వచ్చి నాకు డోర్లు క్లోజ్‌ చేశానంటున్నారు. నీ డోర్‌ ఎవరడిగారు. నిన్ను మా రాష్ట్రం నుంచి బహిష్కరించాం. నీ కుటిల రాజకీయాలు మా రాష్ట్రంలో సాగవు. భావితరాలు సైతం మిమ్మల్ని క్షమించవు. అమిత్‌షా, మోదీని శాశ్వతంగా ఏపీ నుంచి బహిష్కరిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

వైసీపీ కోడికత్తి పార్టీ కాదని.. తెలుగుదేశం పార్టీయే సుత్తి పార్టీ అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ‘కేంద్రం ఇచ్చిన కోట్లాది నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడంలేదు. అన్నింటా అవినీతిలో కూరుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి? వీటికి సీఎం బదులివ్వాలి’ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని, టీడీపీ అధికారం పోయాక చంద్రబాబు నాయుడిని కోర్టుల ముందు నిలబెడతామని చెప్పారు. ఈసీ సూచనల మేరకే ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు తప్పితే దాంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని నరసింహారావు పేర్కొన్నారు.

game 27032019

తెదేపా నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. . పోలీసులు కేంద్ర పరిధిలో పనిచేయరని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ఈసీకి అధికారాలు ఉంటాయని గుర్తుచేశారు. ప్రతి విషయానికీ చంద్రబాబు ప్రధాని మోదీని విమర్శించడం మానుకోవాలన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పట్టిన గతే తెలుగుదేశం పార్టీకి పడుతుందని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో దోపిడీ, అక్రమాల పాలన సాగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కాబోతుందన్నారు. అక్రమ రాజకీయాలకు ఈ ఎన్నికల్లో తరువాత తెరపడనున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి స్కీంలోనూ స్కామ్‌ జరిగిందన్నారు.

game 27032019

రాక్షస, దుర్మార్గపు రాజకీయాలకు మంత్రి యనమల రామకృష్ణుడు నాయకత్వం వహిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎక్కడ కనబడటం లేదన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, న్యాయమైన పాలన అందిస్తుందన్నారు. మంత్రి ప్రాంతం మంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉంటుందనుకున్నాను, కానీ ఇక్కడ 30 ఏళ్లుగా తుని ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. అందుకే ప్రజల్లో మంత్రి యనమలపై వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో కూడా బీజేపీని ఆదరించినట్లయితే ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు.

టీడీపీకి చెందిన కొందరు అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడుల విషయంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులను వివరణ కోరామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరగవచ్చా? లేదా? అనేది నియమావళిలో లేదన్నారు. అయితే, దాడులు జరిగినా.. అవి రాజకీయ కోణంలో ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులపై టీడీపీ నేతలు తనకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై అధికారులను వివరణ కోరామని, నివేదిక అందాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే టిడిపి నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము ఏది ఫిర్యాదు చేసినా, మా పరిధిలో లేదు, కారణం చెప్పనవసరం లేదు అంటారని, వైసీపీ ఏదన్నా చెప్తే, నిమషాల మీద ఆక్షన్ తీసుకుంటారని అంటున్నారు.

game 27032019

ఇక మరో పక్క ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు చేసే వ్యయంపై నిశితంగా పరిశీలిస్తున్నట్టు ద్వివేది చెప్పారు. ఆదాయపన్ను శాఖలో అత్యున్నత స్థాయిలో పని చేసిన అధికారి ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. డమ్మీ బ్యాలెట్‌ యూనిట్లను రాజకీయ పార్టీలు తయారు చేసుకుని ఓటర్లకు అవగాహన కల్పించవచ్చన్నారు. ఏ ప్రభుత్వ పథకమైనా షెడ్యూల్‌కు ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి ఉంటే ఎన్నికల సమయంలో అమలుకు ఇబ్బందిలేదన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులకు అన్ని అంశాల్లోనూ క్షుణ్ణంగా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఓటరు ఒకసారి మా త్రమే ఓటు వినియోగించుకునేలా మార్క్‌డ్‌ కాపీని త యారు చేస్తున్నట్టు చెప్పారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగదు, వస్తువుల పంపిణీపై నిఘా బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాల్లో మూడో వంతు కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, వాటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.

game 27032019

పోలీస్‌ దాడుల్లో ఇప్పటి వరకు రూ.97.26 కోట్ల నగదు, 92 కేజీల బంగారం, 267 కేజీల వెండి, పట్టుకున్నట్టు సీఈవో ద్వివేది తెలిపారు. 1,203 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. రూ.5.46 కోట్ల విలువైన విలువైన వివిధ రకాల వస్తువులు పట్టుకున్నామన్నారు. 999 వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఎక్సైజ్‌శాఖ రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్‌ చేసిందన్నారు. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల సరిహద్దుల్లో 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై తనకే కాకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులకూ ఫిర్యాదు చేయవచ్చునని ద్వివేది తెలిపారు. 13 మంది సీనియర్‌ పోలీస్‌ అధికారులు పోలీస్‌ పరిశీలకులుగా ఉన్నారు. వారి వివరాలు www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

Advertisements

Latest Articles

Most Read