జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం రోజున విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని అయోధ్య మైదానంలో జరిగిన ప్రచార సభలో అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతుండగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ ప్రసంగిస్తుండగా స్టేజ్ వెనుక భాగం నుంచి వచ్చిన ఓ అభిమాని ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. రెండు కాళ్లు పట్టుకోవడంతో పట్టు కోల్పోయిన పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. కాగా ప్రచార సభ మొదలైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

pk 05042019 1

పవన్ పట్టుకుని ఉన్న మైక్ కూడా విరిగిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పవన్‌ను పైకి లేపారు. వెంటనే ఆ అభిమానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి పవన్ యథావిథిగా ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా పలు సభల్లో పవన్‌‌ కోసం అభిమానులు స్టేజ్‌పైకి పరుగులు తీసి రావడం, ఆయన్ను హత్తు కోవడం.. పాదాభివందనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవాళ జరిగిన హఠాత్పరిణామంతో సభికులు, కార్యకర్తలు, అభిమానులు ఒకింత అవాక్కయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పసుపు-కుంకుమ పథకం నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనచేతన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఈ మేరకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. పసుపు-కుంకుమ పథకం అమలు విషయమై పూర్తి వివరాలు అందించాలంటూ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జగన్ బినామీ సంస్థ జనచేతన వేదిక ద్వారా పసుపు-కుంకుమ నిధులు అడ్డుకోవాలని పిటిషన్ వేశారని ఆరోపించారు. నిధులు రాకుండా అడ్డుకున్న వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

court 05042019

ఇదిలా ఉంచితే, ఎన్నికల నేపథ్యంలో ఈసీ పసుపు-కుంకుమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తుది దశ చెక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో వేసినట్టు సమాచారం. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన నగదు మొత్తాన్ని ముందుగానే బ్యాంకులో జమ చేసినట్టు తెలుస్తోంది. అయితే జగన్, విజయసాయి మాత్రం, ఎలాగైనా మహిళలకు , రైతులకు డబ్బులు అందకుండా చూడాలని, తద్వారా వీరందరూ చంద్రబాబుని తిట్టాలని ప్లాన్ చేసారు. అందుకే ఈసీ చెప్పినా సరే , కోర్ట్ కు వెళ్లి, మహిళలు, రైతుల నోట్లో మట్టి కొట్టాలని ప్లాన్ చేసారు.

court 05042019

కాని వీరి ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీలో పసుపు-కుంకుమ పథకానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ప్రభుత్వ తరుపు లాయర్ కోర్టులో అందజేశారు. పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఎన్నో కుట్రలు చేసి, రాష్ట్రాన్ని నష్ట పరచాలని చూస్తున్న జగన్, ఎలక్షన్ నాలుగు రోజులు ముందు కూడా, ఇదే రకమైన కుట్రలు పన్నుతూ ఉండటంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినా, జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారా అని అనుకుంటున్నారు.

విజయవాడ నడిబొడ్డున ధర్నా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై జరుగుతున్న ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ, ఆయన నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర సంస్థల దాడులకు నిరసనగా ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకునారు చంద్రబాబు నాయుడు . కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ తమపై దాడులకు యత్నిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసే కుట్రలో భాగంగా కేంద్ర సంస్థలను రంగంలోకి దింపింది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీన్ని ఇంతటితో ఆపేదిలేదని నిరసనలు కొనసాగుతాయని చెప్తున్నారు. పౌరుషానికి ప్రతీకగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహిద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

dharna 05042019

ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామనే స్ఫూర్తితో, తెలుగుజాతి కీర్తిని చాటుతూ ఈ కాగడాల ప్రదర్శనలు సాగాలని దిశానిర్దేశం చేశారు. 7న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్థనలు, పూజలు నిర్వహించాలని, కుట్రలపై సర్వమతాలు తమకు అండగా నిలుస్తున్నాయని సీఎం ఆకాంక్షించారు. గురువారం పూజారులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు కలిసి తమకు సంఘీభావం తెలిపారని.. రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలకు అన్ని మతాల వారిలోనూ కోపం, ఆవేదన ఉన్నాయన్నారు. జగన్ తమతోనే ఉంటాడని భాజపా నేతలు చెప్పడం ముస్లిం మైనార్టీల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచిందని సీఎం అన్నారు. 8, 9 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వీర తిలకం దిద్ది పౌరుషాన్ని రగిల్చాలని సీఎం సూచించారు. దేనికీ భయపడాల్సిన పనిలేదని, విజయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నామన్నారు.

dharna 05042019

గురువారం టీవీలో కొన్ని సంఘటనలు చూస్తే అసహ్యం వేసిందని, వ్యక్తిగత జీవితాలను దిగజార్చుకుంటూ దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. క్యారెక్టర్ లేని వారంతా వైకాపాలోనే ఉన్నారని, అరాచకశక్తిగా మారిన వైకాపాను ఎదుర్కొంటూనే ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ముందుకు సాగాలని నేతలకు సూచించారు. కాగా, గత కొన్ని రోజులుగా పలువురు టీడీపీ నాయకులపై ఐటీ, పోలీసుల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులతో పాటు నారాయణ విద్యా సంస్థలు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీతో కుమ్మక్కయిన బీజేపీ, ఈసీని వాడుకుంటూ ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ.. దేశ ప్రజలకు, తమ పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ పార్టీ గురించి తన బ్లాగ్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. భాజపా శ్రేణులకు ఇది చాలా ముఖ్యమైన రోజు.. ఆత్మపరిశీలనతో పాటు గత జ్ఞాపకాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజు. భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరిగా నేను దేశ ప్రజలతో పాటు, కోట్లాది మంది భాజపా శ్రేణులతో నా అభిప్రాయాలను పంచుకోవాలని భావిస్తున్నాను. వారు చూపించిన అభిమానం, గౌరవాలకు నేను రుణపడి ఉన్నాను. ముందుగా నేను గాంధీనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. 1991 నుంచి వారు నన్ను ఆరుసార్లు ఎంపీగా గెలిపించారు. వారి ప్రేమ, మద్దతు నాకు ఎల్లప్పుడూ సంతోషాన్నిచ్చింది’ అని తెలిపారు.

adwani 05042019

‘రాజకీయపరంగా మాతో విభేదించే వారిని మేమెప్పుడూ శత్రువులుగా చూడలేదు. మా భావన భారత జాతీయవాదం మాత్రమే. అలాగే, మాతో రాజకీయంగా విభేదించే వారిని మేము ఎన్నడూ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించలేదు. ప్రతి పౌరుడి స్వేచ్ఛకు మా పార్టీ నిబద్ధతతో కట్టుబడి ఉంటుంది. రాజకీయపరంగా కూడా ఇదే తీరుతో ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని, దాని సంప్రదాయాలను కాపాడడం అనే విషయాలు భాజపాలో భాగస్వామ్యంగా ఉన్నాయి. అందుకే స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలతో పాటు మీడియా స్వేచ్ఛ, ఎన్నికల సంస్కరణలు, పారదర్శకతలను కాపాడడానికి భాజపా కట్టుబడి ఉంది. మన భారత ప్రజాస్వామ్య విలువలను బలపరచడానికి మనమంతా ఐక్యంగా పోరాడాలన్నదే నా కోరిక’ అని అడ్వాణీ తెలిపారు. మీడియా సహా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు.

adwani 05042019

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్‌కే ఆడ్వాణీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని భాజపా ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని ఆడ్వాణీ తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. అలాంటి గొప్ప నేతను సొంత పార్టీనే మర్చిపోవడం బాధాకరమంటూ.. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆడ్వాణీ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తన స్వార్థం కోసం మోదీ... పార్టీని, దేశాన్ని నాశనం చేసే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని మోదీలాంటి వ్యక్తి చేతిలో భాజపా ఉందని, ఆయనవల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, అదే విషయాన్ని ఇప్పుడు ఆడ్వాణీ సున్నితంగా చెప్పారని చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read