వైసీపీ ఇప్పటివరకు తాము టీడీపీతోనే తలబడుతున్నామని అనుకుంది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబుపై గురిపెట్టింది. ప్రతి ఘటనకు చంద్రబాబునే గురిపెట్టి విమర్శలు చేశారు. అంతా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు జరుగుతుందనుకున్నారు. కానీ పరిస్థితి మారిపోయింది. జనసేన పార్టీని గుర్తించడానికి కూడా ఇష్టపడని జగన్.. ఇప్పుడు తన ప్రసంగాల్లో చంద్రబాబుకు కొంత ప్రాధ్యానత తగ్గించి పవన్‌కల్యాణ్‌కు పాధాన్యం ఇస్తున్నారు. ఇక వైసీపీ నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి తన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కేటాయించారు. అడపాదడపా పాల్‌పై జగన్‌ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే వైసీపీకి మొదటగా టీడీపీ అనుకుంటే జనసేన, ప్రజాశాంతి పార్టీలు కూడా ఆందోళన కల్గిస్తున్నాయి. పర్చూరు నుంచి దగ్గాబాటి వెంకటేశ్వర్లు, పెనమలూరు నుంచి పార్థసారధి, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరావు, చంద్రగిరి నుంచి భాస్కర్‌రెడ్డి, పెనుకొండ నుంచి శంకర్ నారాయణ, రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు వీళ్లందరూ వైసీపీ అభ్యర్థులు కాదు. పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు.

game 27032019

అలా వైసీపీ అభ్యర్థులంగా పాల్ పార్టీలోకి ఫిరాయించలేదు. వైసీపీ అభ్యర్ధులు వేరు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు వేరు. కాకపోతే రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఒక్కటిగానే ఉన్నాయి. ఇలా 35 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు సరిపోలాయి. నామినేషన్ల ఘట్టం ముగిసేవరకు ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని వైసీపీ అంచనా వేయలేక పోయింది. అంతకుముందు నుంచి ప్రజాశాంతి పార్టీ గుర్తు మీద వైసీపీ పదేపదే ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. పాల్ పార్టీకి ఈసీ హెలికాప్టర్ గుర్తు కేటాయించాయింది. ఆ గుర్తును ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా అక్కడ పార్టీ గుర్తును ప్రచారం చేసేవారు. మొదట్లో వైసీపీ నేతలు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఈసీ జాబితాలో ఉన్న గుర్తును చూసిన తర్వాత వైసీపీకి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఎందుకుంటే హెలికాప్టర్ రెక్కలు, ఫ్యాన్ రెక్కల్లాగే స్పష్టంగా ఉన్నాయి.

game 27032019

జనసేన, ప్రజాశాంతి పార్టీలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజాశాంతి మాత్రమే వైసీపీకి మనశాంతి లేకుండా చేయలేదు. మరోవైపు పవన్ కూడా ఆ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన తరుపున నిలబడిన అభ్యర్ధుల్లో దాదాపు సగానికిపైగా వైసీపీ నేతలే. టికెట్ రాదని క్లారిటీ వచ్చేసిన తర్వాత వారంతా వెళ్లి జనసేన చేరారు. కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి. అదే సమయంలో పవన్, జగన్‌పైనే గురిపెట్టారు. ఆయనపై ఉన్న కేసులు వివేకానందరెడ్డి హత్య, అసెంబ్లీకి వెళ్లకపోవడం వంటి అంశాలపై గురిపెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో జగన్‌కు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. జనసేనాని టీడీపీ అధినేతను విమర్శించడం లేదని జగన్ మండిపడుతున్నారు. తనను ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారని, ఆయన చంద్రబాబు భాగస్వామి అని పవన్‌ను విమర్శిస్తున్నారు.

 

మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు కుట్రలకు తెరతీశారు. ప్రజల అభిమానం చూరగొనడంలో ఘోరంగా విఫలమైన వైసీపీ నేతలు నేరగాళ్ల ముఠాలను దింపింది. తాము గెలిస్తే ఏం చేయగలమో చెప్పుకొని ఓట్లడిగేవారు కొందరైతే దొడ్డిదారి ప్రయత్నాలతో ముందుకెళ్లాలని మరికొందరు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేసిందో చెప్పుకుంటూ తాము గెలిస్తే ఇంకా ఏం చేయగలమో హామీ ఇస్తూ ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారిని ఽడీకొనడానికి వైసీపీ అభ్యర్థుల వద్ద సరైన మార్గం లేక అడ్డదారులను వెతుక్కుంటున్నట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.

game 27032019

వైసీపీ అధినేత జగన్‌ ఎక్కడికక్కడ ఇచ్చిన సూచనలతో టీడీపీకి చెందిన ఓటర్లను రద్దు చేయించే కుట్ర ఫారం-7 ద్వారా బయటపడింది. టీడీపీ నేతలు ఆ కుట్రను ముందుగానే పసిగట్టి ఓట్లు రద్దు గాకుండా అడ్డుకున్నారు. ఆ పన్నాగం పారలేదని ఎక్కడికక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా రాయదుర్గంలో భీమవరం నుంచి నేరగాళ్లను రప్పించి ప్రచారంలో వేసిన ఎత్తులు బయటపడ్డాయి. అలాగే రాప్తాడులోనూ కర్ణాటక నుంచి రప్పించిన బృందాలు కూడా పట్టుబడ్డాయి. మంత్రి కాలవ శ్రీనివాసులు కదలికలపై వైసీపీ నిఘా పెట్టింది. ఆయన కదలికలను ఎప్పటికప్పుడు వీడియోల్లో బంధిస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రచారాల వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారు. దీని కోసం భీమవరం నుంచి మనుషులను రప్పించారు.

game 27032019

300 మంది దాకా నియోజకవర్గంలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి వియ్యంకుడు శ్రీరామరెడ్డికి చెందిన మనుషులుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా భీమవరం బ్యాచ్‌ నుంచి ముప్పు ఉందని ఇప్పటికే మంత్రి కాలవ శ్రీనివాసులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా వీరిని అంతదూరం నుంచి ఎందుకు రప్పించాల్సి వచ్చిందనే సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీరికి సంబంధించి పూర్తి బాధ్యతను వైసీపీ తీసుకోవడంలో అంతర్యం ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది.

 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు ఇంటికి శనివారం వైసీపీకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వచ్చారు. కొందరు ఇంట్లోకి వెళ్లి.. తమ పార్టీలో చేరాలంటూ చర్చించారు. ఆ నాయకుడు ససేమిరా అన్నారు. వెంట వచ్చిన కార్యకర్తలు ఇంటి ముందు చాలాసేపు వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు జెండాలతో ఉన్న వైసీపీ నాయకుల ఫొటోలు, ఆయనను కలిసిన ఫొటోలు జోడించి పార్టీ మారాడంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగులు చేశారు. దీంతో ఆ నాయకుడు సొంత పార్టీకి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇదో మైండ్‌ గేమ్‌. నాయకుల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఓటర్లను అయోమయానికి గురిచేసే ఆట..! ఇందుకు మీడియా, సోషల్‌ మీడియా ఆయుధాలు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ముఖ్యనాయకులు తమ కార్యక్రమాలు చిత్రీకరించేందుకు సొంతగా కెమెరామెన్లను నియమించుకున్నారు.

game 27032019

అనుచరగణం ఎలాగూ వెంటుంటారు. వీరు ప్రచారంలో నాయకుల వెంట తిరుగుతూ కొత్త ఆలోచనలతో ఓటర్లను ఆయోమయంలో పడేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులు తమ పార్టీలోకి చేరారంటూ భ్రమ కలిగిస్తూ అసత్య, అర్థసత్యాలతో కూడిన ప్రచారం చేస్తున్నారు. తమ నాయకుడి వద్దకు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చినా క్లిక్‌ మనిపించడం.. వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి తప్పుడు ప్రచారం చేయడం ఇటీవల రివాజుగా మారింది. గుంటూరు శివారు ప్రాంతంలోని ఓటర్లకు, నాయకులకు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలోకి ఇటీవల చెరిన ఓ ’అన్న’ తన బలగంతో రాత్రివేళ్లలో బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. కాస్త పలుకుబడి ఉండి.. నాలుగు ఓట్లు వేయించగలిగిన వ్యక్తులను బెదిరించడం, ప్రతిపక్ష పార్టీకి సహకరించాలని ఒత్తిడి తేవడంపై ఫిర్యాదులు వస్తున్నాయి.

game 27032019

అంతా అన్న చూసుకుంటాడు.. మీరు మాకు పనిచేయాలనంటూ చోటామోటా నాయకులపై హుకుం జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులే పల్నాడు ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాలోను ఉంది. దిగువస్థాయి నాయకుల్ని ప్రలోభ పెడుతూ, బెదిరింపులకు పాల్పడుతూ ప్రత్యేకంగా ఓ ముఠా తిరుగుతోంది. గ్రామాల్లో పట్టున్న వారిని, అధికారులను హెచరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘గ్రామాల బాధ్యత మీకు అప్పగిస్తాం. ఎంత కావాలో చెప్పండి. ఏం కావాలో అడగండి. ఆ బూత్‌లతో మాకు మెజార్టీ రావాల్సిందే’నంటూ ముందు మర్యాదగా, తర్వాత బెదిరింపుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ప్రత్యర్థి పార్టీలోకి మారొద్దు... అంతర్గతంగా మాకు సహకరించాలి. మీ వైపు ఉన్న ఓట్లన్నీ మాకు పడేలా చూడండి. కావాల్సింది మేం చూసుకుంటాం’ అంటూ సంకేతాలు ఇస్తున్నారు. టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైన వారికి ఇలాంటి నజరానాలు ఎక్కువగా వస్తున్నాయి. నిరాశావాదులు ఎవరికీ తెలియకుండానే సమావేశాలు పెట్టి... ప్రత్యర్థి పార్టీలకు సహకరించేఆలా తమ వారికి సంకేతాలు ఇస్తున్నారు. వారికి వచ్చే ఆఫర్లను చెబుతూ.. ఈసారి వారికి పనిచేస్తే వచ్చే లాభాలను వివరిస్తున్నారు. ఈ కోవర్టు ఆపరేన్లు భారీగా జరుగుతున్నాయి.

మహిళల సాధికారతకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం.. వారికి రాజకీయాధికారం కట్టబెట్టే దిశగా మరింత ముందడుగు వేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా వారికి 20 టికెట్లు కేటాయించింది. వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌ 15 చొప్పున కేటాయించగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆంధ్రలో కేవలం ఆరుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం 175 స్థానాలకు గాను ఈ పార్టీల నుంచి 71 మంది మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి ముగ్గురు మహిళలకు అవకాశమిచ్చారు.

game 27032019

తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోనూ ముగ్గురు చొప్పున అవకాశం పొందారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో రెండేసి టికెట్లు ఇచ్చారు. జగన్‌ తన సొంత జిల్లా కడపలో మహిళలకు ఒక్క సీటూ కేటాయించలేదు. వివిధ రకాల సమీకరణల వల్ల గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి మహిళలకు సీట్లు ఇవ్వలేకపోయారు.175 స్థానాల్లోనూ పోటీ చేస్తున్న వైసీపీ, 8 జిల్లాల్లో 15 మం ది మహిళలను బరిలో నిలిపిం ది. కడప, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క మహిళను కూడా ఎంపిక చేయలేదు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది. వీరిలో మహిళలు 1,98,79,421, పురుష ఓటర్లు 1,94,62,339. అంటే పురుషుల కంటే 4,17,082 మంది మహిళలు అధికంగా ఉన్నారు.

game 27032019

కమ్యూనిస్టుల మొండిచేయి.. రాష్ట్రంలో 120 స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన.. మహిళల కు 15 సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా ఏడేసి స్థానాలను సీపీఐ, సీపీఎంలకు కేటాయించింది. కమ్యూనిస్టు పార్టీలు రెండూ ఒక్క సీటై నా మహిళలకు ఇవ్వలేదు. కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన మహిళలకు అవకాశమివ్వలేదు. సొంతగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ కూడా 15 సీట్లు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన 11 జి ల్లాల నుంచి కాంగ్రెస్‌ మహిళలను బరిలో నిలిపింది. బీజేపీ ఆరుగురికి మాత్రమే టికెట్లిచ్చింది. చిత్తూరు, కడప,కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అవకాశమే ఇవ్వలేదు.

 

Advertisements

Latest Articles

Most Read