టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో సుమారు 50 మంది పోలీసులు సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు పోట్లదుర్తిలోని రమేష్ నివాసంలో తనిఖీలు జరిగాయి. పోలీసులు వచ్చినప్పుడు రమేష్ ఇంట్లోనే ఉన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. పోట్లదుర్తిలోని ఆయన ఇంటిలోకి 50 మందికి పైగా పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు సీఎం రమేష్ బెడ్‌రూమ్‌లోకి సైతం ప్రవేశించారు. దీంతో టీడీపీ ఎంపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే ఎస్పీ ఆదేశం మేరకే సోదాలు చేస్తున్నామని చెప్పారు

kadapa 05042019

దాదాపు గంటసేపు తనిఖీలు కొనసాగాయి. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఇదే సమయంలో రమేష్‌ను పోలీసులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. మొన్న టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు సీఎం రమేష్ అక్కడికి వెళ్లారు. ఎవరి ప్రొద్భలంతో ఈ సోదాలు చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. కడప జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు సీఎం రమేష్ అండగా ఉంటున్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేసినట్లు టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. కడప జిల్లా ఎస్పీని ఇటీవలే ఈసీ బదిలీ చేసింది. వైసీపీ నేతల పిర్యాదుతో రాహుల్ దేవ్‌ను బదిలీ చేసి ఆ స్థానంలో అభిషేక్ మహంతిని నియమించారు. ఇప్పుడు ఆయన ఆదేశాల మేరకే పోలీసులు తనిఖీలు చేశారు.

kadapa 05042019

పోలీసుల తనిఖీలపై సీఎం రమేష్‌ మండిపడ్డారు. కేవలం తెదేపా నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ తనిఖీలు జరిగినట్లు అనుమానం కలుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం తమ వైపు ఉన్నంతవరకూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. బెదిరిస్తే భయపడేందుకు సిద్ధంగా లేమని, ఇవన్నీ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించేందుకేనని ఆరోపించారు. ప్రజల నుంచి సానుభూతి కోసం వైకాపా నేతలు ఎన్ని నాటకాలైనా ఆడతారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని భాజపా, జగన్‌ కుమ్మక్కై ఈ దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ పట్టటం లేదు... ఏపి ప్రజల మూడ్ అర్ధం కావటం లేదు.. ప్రతి సారి లాగే, ఈ సారి కూడా ప్రజల నాడి పట్టటంలో జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. తినే తిండిని పెంటతో పోల్చిన వ్యక్తికి సలాం కొడుతూ, ఆంధ్రా వాడి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడు జగన్. పదే పదే కేసీఆర్ ను పొగుడుతూ, ఏపి ప్రజల సెంటిమెంట్ తో నాకు పని లేదు అంటున్నారు. తాజగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా ఇవే వ్యాఖ్యలు చేసారు. మోదీ, కేసీఆర్‌పై వైసీపీ అధినేత జగన్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఏపీ ఎన్నికల వేళ జాతీయ మీడియాకు జగన్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సదరు జర్నలిస్ట్‌తో జగన్ మాట్లాడుతూ... మోదీ దృఢ చిత్తం ఉన్న నాయకుడని, మళ్లీ ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

jaganinterview 03042019

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై జగన్ నోరు మెదపకపోవడం కొసమెరుపు. రాహుల్‌ అమేథీలో ఓడిపోతారేమో, అందుకే దక్షిణాది నుంచి పోటీ అని జగన్‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్‌కు జగన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ కోసం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ మద్దతిస్తున్నారని, ఆ మద్దతు ఏపీకి అత్యవసరమని జగన్‌ చెప్పారు. జగన్‌ మనసులో మాట బయటపెట్టారని జాతీయ మీడియా కామెంట్‌ చేస్తుండటం విశేషం. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తానంటే ఎందుకు అభ్యంతరం? కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్ అన్నారు.

jaganinterview 03042019

"మా మధ్య ప్రజల ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. జాతీయ స్థాయిలో మేం కోరుకునేదేమిటంటే మా మొర ఆలకించడానికి, మా వినతులు పట్టించుకోవడానికి ఎవరో ఒకరుండాలి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వక పోతే ఇక ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి? మాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఫెడరల్‌ ఫ్రంట్‌ తో కలిసి పోరాడతాం" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే, ప్రజల సెంటిమెంట్ ఏ మాత్రం పట్టించుకోకుండా, కేవలం కేసీఆర్ కు భయపడి, ఇలా భజన చేస్తున్నారని, ప్రజలు అనుకుంటున్నారు.

టీడీపీ నేత వల్లభనేని వంశీని తెలంగాణ పోలీసులు వెంబడించారు. కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకెళితే.. 2009 సమయంలో ప్రభుత్వం తనకు రక్షణ ఇవ్వడం లేదంటూ వంశీ ప్రైవేటు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఆయుధాలు దొరికాయంటూ ఆయుధాల చట్టం కింద వంశీపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును కొట్టివేయాలని 2013లో హైకోర్టులో వంశీ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. వంశీ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో పాటు కేసును కూడా కొట్టేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాలేదు.

vamsi 03042019

తాజాగా దీనిపై దృష్టిసారించిన తెలంగాణ పోలీసులు.. వంశీ కోర్టుకు హాజరుకావడం లేదంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మేరకు నాంపల్లి కోర్టు వంశీకి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇదిలాఉండగా, రాజకీయ కక్షతోనే తెలంగాణ పోలీసులు పిటిషన్ వేశారంటూ వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేసే రోజు కూడా, వంశీని కేసీఆర్ బెదిరించారు అనే వార్తలు వచ్చాయి. ‘‘విలువైన ఆస్తుల విషయంలో సమస్యలు తెచ్చుకోవద్దు. టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరితే మంచిది’’ అని తెలంగాణ ముఖ్య నేతలు సలహా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే వంశీ మాత్రం ముందుకు వెళ్లారు. దీంతో ఇప్పుడు మళ్ళీ వంశీని వెంటాడుతున్నారు...

తెలుగుదేశం అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లా మైదుకూరు తెదేపా అభ్యర్థి, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో రెండు బృందాలు సుమారు గంట నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి. ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్‌ నివాసంలో లేరు. ఆయన మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు సమాచారం. ఇంట్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండటంతో వారి సమక్షంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనే తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు చెప్పినట్టు సమాచారం.

game 27032019

మరోవైపు, ఈ సోదాలను పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఖండించారు. తన ఇంటిపై కుట్ర పూరితంగానే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెదేపా నేతల ఇళ్లపై కావాలనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చట్టానికి లోబడే తమ కంపెనీలు పనిచేస్తున్నాయని, ఒక్క రూపాయి కూడా అవకతవకలు జరగలేదని స్పష్టంచేశారు. తెదేపా గెలుస్తుందనే భయంతోనే జగన్‌, భాజపా కుమ్మక్కై కుట్రపూరితంగా తమను దెబ్బతీయాలనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆయన మీడియాకు చెప్పారు. ఐటీ దాడులు ఎన్ని చేసినా తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.

game 27032019

ఇది ఇలా ఉంటే, పుట్టా పై మరో దాడి కూడా జరుగుతుంది. ఓటర్లను బోల్తా కొట్టించేందుకు కడప జిల్లాలో వైసీపీ ప్రయత్నిస్తోందంటూ మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నమూనా బ్యాలెట్‌ను రూపొందించి వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకారం టీడీపీ అభ్యర్థికి రెండవ నంబర్‌ను, వైసీపీ అభ్యర్థికి నాలుగవ నంబర్‌ను ఈసీ కేటాయించింది. అయితే వైసీపీ రూపొందించిన నమూనా బ్యాలెట్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి నంబర్‌ను మూడుగా చూపించారు. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన పుట్టా, వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read