బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో వైసీపీకి పరోక్షంగా మద్దతిస్తున్నారని గత కొన్నిపుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు పలువురు వైసీపీ నేతలు లీకులు వదలడంతో జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే స్వయాన విశాఖ నార్త్‌ వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రచారంలో చెప్పినట్లుగా వార్తలు వినవచ్చాయి. ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యుహ్యంలో భాగంగా చెప్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చెయ్యటంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట అన్న సంగతి తెలిసిందే. వాళ్ళని లొంగ దీసుకోవటం, మాట వినకపోతే, వారి పై తప్పుడు ప్రచారం చేసి, ప్రజల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చెయ్యటంలో ప్రశాంత్ కిషోర్ నెంబర్ వన్..

game 27032019

అయితే ఇప్పుడు ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి విష్ణు చెవిన పడటంతో ఎట్టకేలకు ఆయన మీడియా ముందుకొచ్చారు. విష్ణు మాటల్లోనే... "విశాఖ నార్త్‌ వైసీపీ అభ్యర్థి కేకే రాజు దుష్ప్రచారం చేస్తున్నారు. కేకే రాజుకు నేను మద్దతు ఇస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి ఓటేస్తే అవినీతిపరుడిని సమర్ధించినట్టే. మద్దతిస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే.. ఎవరూ నమ్మకండి" అని నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు విష్ణుకుమార్‌ రాజు పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభ్యర్థి, ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. దీంతో మరో సారి, జగన్ , ప్రశాంత్ కిషోర్ వేస్తున్న వేషాలు మరో సారి బహిర్గతం అయ్యాయి. ఎన్నికలు అయ్యే లోపు, వీళ్ళ చేష్టలకి ఎంత మంది బలి అవుతారో మరి.

ఆ కుటుంబానిది దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఓటమి ఎరుగదు.. జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానముంది. పార్టీ ఏదైనా..విజయం తన సొంతం కావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లో ముందుకు సాగారు. ఆ మేరకు వరుస విజయాలు చవిచూశారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్న ఏకైక నాయకుడిగా జిల్లా చరిత్రలో ఆయన స్థానం పదిలం. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. పార్లమెంటు బరిలో కూడా నిలిచి విజయం అందుకున్నారు. ఆయనే ప్రస్తుత అనంతపురం పార్లమెంటు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనంటూ తెలియనివారుండరు. నిక్కచ్చిగా మాట్లాడే నైజం ఆయనది. అందుకే ఆ యన రాజకీయాల్లో రాణిస్తున్నారనే అభిప్రాయముంది.

game 27032019

ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇక్కడే అసలు కథ మొదలైంది. తాను పోటీ చేయనని, తన స్థానంలో తన కుమారుడు జేసీ పవన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సూటిగా చెప్పి తన పంతం నెగ్గించుకున్నారు. తాజాగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా తన కుమారుడు జేసీ పవన్‌రెడ్డిని ఆయన బరిలో నిలిపారు. కుమారుడి విజయం కోసం ఆయన తన రాజకీయ చాణక్యం చాటుతున్నారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఓటమెరుగని కుటుంబం నుంచి తాజా ఎన్నికల్లో వారసత్వ రా జకీయానికి తెరతీశారు. ఆ విజయ పరంపర కొనసాగించాలనే లక్ష్యంతో తన దశాబ్దాల రాజకీయ అనుభవం రంగరించి వ్యూహాలకు జేసీ దివాకర్‌రెడ్డి పదును పెట్టే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు.

game 27032019

సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి రంగయ్య స్థానికేతరుడు కావడం తమకు కలిసి వచ్చే అంశంగా జేసీ వర్గీయులు పరిగణిస్తున్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. రంగయ్యకు మొదట హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అక్కడ తన సామాజికవర్గంలో పరిచయాలు చేసుకుంటున్న క్రమంలోనే.. తిరిగి అనంతపురం పార్లమెంటు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో అనంతపురం పార్లమెంటు పరిధిలో తన సామాజికవర్గానికి చేరువ కావడంలో రంగయ్య కొంత మేరకు సఫలీకృతం కాలేకపోయారనే వాదన వినిపిస్తోంది. పార్లమెంటు పరిధిలోని ఆయా నియోజకవర్గాల పార్టీ పెద్దలపైనే ఆధారపడాల్సిన పరిస్థితిని రంగయ్య ఎదుర్కొంటున్నారు. ప్రజల్లోకి నేరుగా వెళ్లి ఆ మేరకు ఓట్లు రాబట్టే పరిస్థితి తెచ్చుకోలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతూండడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రత్యర్థి ప్రతికూలతలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో జేసీ దివాకర్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారనే అభిప్రాయం రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంధి. దీనికితోడు వైసీపీ అభ్యర్థి స్థానికేతరుడు కావడంతో దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కాగా, ప్రచారంలో మాత్రం ఇరువర్గాలు ఎవరికి వారే అనే రీతిలో పోటీ పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

 

ఎన్నికల ప్రచారం ఆఖరు దశకు చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేనాని పవన్‌కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ వీలైనంత తరుచుగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ వెళ్తుండడం ఒక్కేసాని రోజంతా అక్కడే ఉండిపోవడం చర్చనీయాశమైంది. ఇటీవల జగన్ ఎన్నికల ప్రచారానికి రాకుండా లోటస్ పాండ్‌‌లోనే ఉన్నారు. అ మర్నాడే రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. మళ్లీ మంగళవారం ఎన్నికల ప్రచారానికి రాకుండా రోజంతా లోటస్ పాండ్‌లోనే ఉండిపోయారు. ఈసారి ఎలాంటి స్కెచ్‌ వేశారో.. ఏమవుతుందోనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే వైసీపీ నేతలు కూడా జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు.

game 27032019

ఇలాంటి కీలక సమయంలో జగన్ అందుబాటులో లేకుండా లోటస్ పాండ్‌‌కు వెళ్లిపోతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన సినీతారల కోసం హైదరాబాద్‌లో ఉంటూ.. వారికి పార్టీ కండువాలు వేస్తూ దర్శనమిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు వాపోతున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రచారాన్ని ఆపీ మరీ లోటస్ పాండ్ వేదికగా వలసలను ప్రొత్సహిస్తున్నారు. నాటకీయ పరిణామాలతో నటుడు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. అంతకుముందు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని రోడ్డెక్కిన ఆయన తెల్లవారే వైసీపీలో చేరారు. మోహన్‌బాబుతో ఆయన కుమారుడు విష్ణు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరిన వెంటనే చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. వైసీపీలో చేరాలని జగన్‌ మూడేళ్ల కిందటే అడిగారని, ఏపీకి జగన్‌ సీఎం అయితే బాగుంటుందని మోహన్‌బాబు అభిప్రాయపడ్డారు.

game 27032019

లోటస్ పాండ్ వేదికగానే నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు వైసీపీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. సూపర్ డూపర్ అనేలా పాలన అందిస్తారని రాజశేఖర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తారని తెలిపారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. అయితే తాము గతంలో చూసిన జగన్ వేరు.. ఇప్పుడున్న జగన్ వేరని చెప్పారు. గతంలో వైసీపీలో ఉన్న ఈ దంపతులు.. జగన్‌తో విభేదాలు కారణంగా.. బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. గతేడాది చంద్రబాబుకు మద్దతు పలుకుతూ టీడీపీలో చేరారు. ఇప్పడు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

 

నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఓటర్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. జగన్‌ ఒక్క కనుసైగ చేస్తే చాలు ఒక్కరు కూడా మిగలరు.. చంపడమా? చావడమా? అంటూ అనిల్‌కుమార్‌ వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనిల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఈసీ ఆదేశించిందని తెలిపారు. ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించేందుకు ‘చావో రేవో’ అన్నట్లుగా ప్రయత్నించడం మామూలే. కానీ... వైసీపీ నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అంతకుమించిన మార్గం ఎంచుకున్నారు.

game 27032019

‘‘మనముం దు ఉన్నది ఒక్కటే! జగనన్న కోసం చంపడమా.. చావడమా! 2019లో రాష్ట్రంలో ఒక్క వైసీపీ జెండా మాత్రమే ఎగరాలి. ఒక్క కనుసైగ జగన్మోహన రెడ్డి చేసిననాడు ఎవ్వరూ మిగల రు’’ అని హెచ్చరించారు. కొన్ని నెలల క్రితం చేసిన ఈ ప్రసం గం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తెలిపారు. ‘ఎన్నికల యుద్ధంలోకి వెళ్తున్నందున సైనికుల్లాగా.. చంపడమో, చావడమో తప్ప వెనుతిరగవద్దు’ అని అన్నానని, వీడియోను కట్‌ చేసి ప్రచారంలో పెట్టారని మంగళవారం వివరణ ఇచ్చారు.

game 27032019

ఎన్నికల ముందు ‘ఓటు మల్లయ్య’.. ఎన్నికలయ్యాక ‘బోడి మల్లయ్య’! రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై ఉన్న వ్యంగ్యాస్త్రమిది! కానీ, చాలాచోట్ల వైసీపీ నేతలు పోలింగ్‌ ముగిసేదాకా కూడా ఆగలేకపోతున్నారు. నోరు పారేసుకుంటున్నారు. చేయి చేసుకుంటున్నారు. ‘వైసీపీకి ఓటు వెయ్యం’ అని చెబితే అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయించడం, ప్రచారానికి రాకపోతే ఏకంగా దాడులు చేయడం, బూతులు తిట్టడం... ఇలా ఒకటా రెండా! ఇక... శాసన సభలో, బయటా ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతలు రకరకాలుగా దూషించారు. ఇప్పటికీ దూషిస్తున్నారు. అధికారులు, పోలీసులపైనా ప్రతాపం చూపిస్తున్నారు. ఆయా దృశ్యాలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘వామ్మో వైసీపీ నేతలు... ఇప్పుడే ఇలా ఉంటే, మరి అధికారంలోకి వస్తే!’ అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు!

Advertisements

Latest Articles

Most Read