ఎన్నికల సమయంలో విజయవాడలో భారీ హవాలా రాకెట్ బయటపడింది. రూ.1.70 కోట్ల హవాల సొమ్ము తేలడం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకూ మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన అభినవ్‌రెడ్డి 12 కంపెనీలు స్థాపించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. తాజాగా మిర్చిని విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. విజయవాడలోని వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి విశాఖకు చెందిన నాగరాజును నియమించుకున్నాడు. అతడు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న మనోరమ హోటల్‌లో ఒక్కడే ఉంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. విశాఖకు చెందిన నానితో కలిసి అభినవ్ చెప్పిన వారి వద్దకు వెళ్లి రోజుకు రూ.10-25 లక్షల వరకూ వసూలు చేసి ఆ మొత్తాన్ని రూమ్‌లోనే ఉంచేవారు.

nani 03042019

ఒకరోజు నాగరాజుకు అభినవ్ ఫోన్ చేసి ఎన్నికల సమయం కావడంతో పోలీసులు ఎక్కడైనా ఆపి తనిఖీ చేసి డబ్బులు పట్టుకుంటే వారితో వాదనకు దిగొద్దని చెప్పాడు. ఈ మాటలు విన్న నాని డబ్బులు కొట్టేసేందుకు పథకం వేశాడు. తన స్నేహితుడు రవీంద్రకు విషయం చెప్పాడు. ఇద్దరూ గత నెల 18, 19 తేదీల్లో రెక్కీ నిర్వహించారు. ఈ నెల 25న నాగరాజు, నాని కలిసి వ్యాపారుల నుంచి రూ.45 లక్షలు వసూలు చేశారు. అదే రోజు రవీంద్ర మైలవరానికి చెందిన హర్షవర్దన్, భవానీ శంకర్, 17 ఏళ్ల బాలుడు విజయవాడకు వచ్చారు. నాని నాగరాజు బైక్‌పై విజయవాడకు చేరుకోగానే మిగిలిన ముగ్గురూ టాస్క్‌ఫోర్స్ పోలీసుల వేషం వేసుకుని వారిని ఆపారు. బ్యాగును తనిఖీ చేయగా.. రూ.45 లక్షలు బయటపడటంతో లెక్కలు అడిగారు. కొద్ది సేపటికి రవీంద్ర ఇన్‌స్పెక్టర్ వేషంలో వచ్చాడు. అతడు రాగానే హర్షవర్దన్, భవానీ శంకర్‌తో పాటు బాలుడు నాగరాజుపై దాడి చేశారు. మొత్తం డబ్బు చూపించమనడంతో మనోరమ హోటల్‌కు తీసుకొచ్చారు. రూంలోని రూ.1.70 కోట్లు ఎత్తుకుపోయారు. దీంతో నాగరాజు, నాని, దాసు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.45 లక్షలనూ పంచుకోవాలని డిసైడ్ అయ్యారు.

nani 03042019

టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొత్తం డబ్బు తీసుకుపోయారు కనుక ఇది కూడా ఆ లెక్కలోకే వెళుతుందని ప్లాన్ వేశారు. తలా రూ.15 లక్షలు తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ విషయాన్ని నాగరాజు.. అభినవ్‌రెడ్డికి చెప్పాడు. ఆయన దీనిపై కొత్తపేట పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. మొత్తం డబ్బుతో రవీంద్ర మైలవరంలోని తన ఇంటికి చేరుకుని డబ్బు ఎవరికీ కనిపించకుండా పెరట్లో దాచాడు. తరువాత విశాఖలోని నాని ఇంటికి చేరుకున్నాడు. ఎన్నికల డబ్బు అని అతని కుటుంబ సభ్యులకు రూ.22 లక్షలు ఇచ్చాడు. పోలీసులు ముందుగా నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. మిగతా వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి మిగతా కోటి 26 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అభినవ్ రెడ్డి ఎవరు? ఏంటనే విషయం సస్పెన్స్‌గా మారింది. ముంబైలోని కొందరు బ్యాంకు ఖాతాల్లో లక్షల్లో డబ్బు బదిలీ చేస్తుంటాడు. డబ్బు బదిలీ కాగానే ఒక కోడ్ అభినవ్ రెడ్డికి చేరుతుంది. ఆ కోడ్ అభినవ్‌కి చేరగానే.. విజయవాడలోని నాగరాజుకు చెప్పి ఆయా వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బు తీసుకోమనే వాడు. ఇదంతా హవాలా అని పోలీసులు నిర్థారించి, ఈడీ, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ డబ్బు పంపిణీకి హవాలాలో చేరిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో కొత్త విశేషాలకు నాంది పలికాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్కచోట కూడా ప్రధాన రాజకీయ పార్టీల తరుఫున గత ఎన్నికల్లో పోటీపడిన ప్రత్యర్థులు ఈసారి మళ్లీ తలపడటం లేదు. ఎపిలోని లోక్‌సభ స్థానాల్లో అంతా కొత్త ప్రత్యర్థులు ఉండడం విశేషం. ఈ ఎన్నికల్లో జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్‌పి కూటమి అభ్యర్థులు కూడా రంగంలో ఉండడం వల్ల, కొత్త అభ్యర్థుల పోటీ సహజమే అని భావించినా, టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌ కూడా ఎక్కువగా కొత్త వారికే టికెట్లు ఇచ్చాయి. రాజంపేట, కడప లోక్‌సభ స్థానాల్లో మినహా మిగిలిన 23 చోట్లా వైసిపి కొత్తవారిని పోటీలో నిలిపింది. టిడిపి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, హిందూపురం, చిత్తూరు నియోజకవర్గాల్లో పాత అభ్యర్థులే బరిలో ఉన్నారు. మిగిలిన అన్ని చోట్లా కొత్త అభ్యర్థులను పోటీకి దింపింది. లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన 320 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలు, 295 మంది పురుషులు ఉన్నారు. వారిలో సీనియర్లు పది శాతం మంది మాత్రమే ఉన్నారు.

శ్రీకాకుళంలో పోటీ పడుతున్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టిడిపి), దువ్వాడ శ్రీనివాస్‌ (వైసిపి), విజయనగరంలో పోటీకి నిలిచిన అశోక్‌ గజపతిరాజుకు (టిడిపి), బెల్లాన చంద్రశేఖర్‌ (వైసిపి), విశాఖపట్నం టిడిపి అభ్యర్థి ఎం.భరత్‌, వైసిపి అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ, జనసేన అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణలకు ఇవే తొలి ఎన్నికలు. అనకాపల్లిలోనూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఆడారి ఆనంద్‌ (టిడిపి), డాక్టర్‌ బి.వి.సత్యవతి (వైసిపి), చింతల పార్థసారథి (జనసేన) తొలిసారిగా పోటీ చేస్తున్నారు. కాకినాడలో పోటీలో ఉన్న చలమలశెట్టి సునీల్‌ (టిడిపి), వంగా గీత (వైసిపి), జ్యోతుల వెంకటేశ్వరరావు (జనసేన)లకు ఇవే మొదటి లోక్‌సభ ఎన్నికలు. అమలాపురంలో పోటీ పడుతున్న గంటి హరీశ్‌మాధుర్‌ (టిడిపి), చింతా అనురాధ (వైసిపి), డిఎంఆర్‌ శేఖర్‌ (జనసేన) తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. రాజమహేంద్రవరం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన మాగంటి మురళీమోహన్‌ స్థానంలో ఆయన కోడలు రూపాదేవిని టిడిపి పోటీకి నిలిపింది. నర్సాపురంలో పోటీపడుతున్న వేటుకూరి శివరామరాజు (టిడిపి), రఘురామ కృష్ణంరాజు (వైసిపి), కొణిదెల నాగబాబు (జనసేన) కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏలూరులో టిడిపి నుంచి మాగంటి బాబు గతంలో కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు. కోటగిరి శ్రీధర్‌ (వైసిపి), పెంటపాటి పుల్లారావు (జనసేన) మొదటిసారి లోక్‌సభ ఎన్నికల గోదాలో దిగారు. మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు (టిడిపి), బాలశౌరి (వైసిపి), బండ్రెడ్డి రామకృష్ణ (జనసేన)లలో టిడిపి అభ్యర్థి గతంలో పోటీ చేశారు.

విజయవాడలో కేశినేని నాని (టిడిపి), పొట్లూరి వరప్రసాద్‌ (వైసిపి), ముత్తంశెట్టి లక్ష్మణ శివప్రసాద్‌బాబు (జనసేన)లలో నాని ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. మిగిలిన ఇద్దరూ కొత్తవారు. గుంటూరులో టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్‌ గత ఎన్నికల్లో పాల్గొన్నారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి (వైసిపి), బి.శ్రీనివాస్‌ (జనసేన) కొత్తవారు. నరసరావుపేటలో రాయపాటి సాంబశివరావు (టిడిపి), లావు కృష్ణదేవరాయులు (వైసిపి), నయూబ్‌ కమాల్‌ (జనసేన) తలపడుతున్నారు. వారిలో రాయపాటి సాంబశివరావు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేశారు. బాపట్లలో పోటీకి నిలిచిన శ్రీరాం మాల్యాద్రి (టిడిపి), నందిగం సురేశ్‌ (వైసిపి), కె.దేవానంద్‌ (బిఎస్‌పి)లలో టిడిపి అభ్యర్ధి గత ఎన్నికల్లో కూడా లోక్‌సభ బరిలో ఉన్నారు. ఒంగోలు నుంచి పోటీ చేస్తున్న శిద్దా రాఘవరావు (టిడిపి), మాగుంట శ్రీనివాసరెడ్డి (వైసిపి), బెల్లంకొండ సాయిబాబు (జనసేన) కొత్త ప్రత్యర్థులే. నంద్యాలలో పోటీలో ఉన్న మాండ్ర శివానంద్‌రెడ్డి (టిడిపి), పి.బ్రహ్మానందరెడ్డి (వైసిపి), ఎస్పీవై రెడ్డి (జనసేన) కొత్త ప్రత్యర్థులు. ఎస్పీవై రెడ్డి ఇంతకుముందు కూడా పోటీ చేశారు. కర్నూలు నుంచి పోటీలో ఉన్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (టిడిపి), డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ (వైసిపి), కె.ప్రభాకర్‌రెడ్డి (సిపిఎం) కొత్త ప్రత్యర్థులే. ప్రస్తుత టిడిపి అభ్యర్థి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. అనంతపురంలో జెసి పవన్‌కుమార్‌రెడ్డి (టిడిపి), తలారి రంగయ్య (వైసిపి), జగదీశ్‌ (సిపిఐ), హిందూపురంలో పోటీ చేస్తున్న నిమ్మల కిష్టప్ప (టిడిపి), గోరంట్ల మాధవ్‌ (వైసిపి), కరీముల్లా ఖాన్‌ (జనసేన), కడపలో ఆదినారాయణరెడ్డి (టిడిపి), వై.ఎస్‌.అవినాశ్‌రెడ్డి (వైసిపి), జె.ఈశ్వరయ్య (సిపిఐ) కొత్త ప్రత్యర్థులే. నెల్లూరు నుంచి పోటీ పడుతున్న బీద మస్తాన్‌రావు (టిడిపి), అదాల ప్రభాకర్‌రెడ్డి (వైసిపి), చండ్ర రాజగోపాల్‌ (సిపిఎం) కొత్త ప్రత్యర్థులు కావడం విశేషం. తిరుపతిలో పనబాక లక్ష్మి (టిడిపి), మినహా బల్లి దుర్గాప్రసాద్‌ (వైసిపి), డి.శ్రీహరిరావు (జనసేన) కొత్త ప్రత్యర్థులుగానే తలపడుతున్నారు. రాజంపేట నుంచి పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి డి.సత్యప్రభ, పివి.మిధున్‌రెడ్డి (వైసిపి), సయ్యద్‌ ముకరం చాంద్‌ (జనసేన) తరహాలోనే చిత్తూరులో ఎన్‌.శివప్రసాద్‌ (టిడిపి), మినహా రెడ్డప్ప (వైసిపి), పుణ్యమూర్తి (జనసేన) కొత్త ప్రత్యర్థులుగానే లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్యపై ఏపీ బీసీ, ఓబీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో కృష్ణయ్య మెలుగుతున్నారని, వైసీపీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రె్‌సకు, ఏపీలో వైసీపీకి అమ్ముడుపోయిన ఆర్‌.కృష్ణయ్య ఆటలు సాగనివ్వబోమని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు హెచ్చరించారు. తెనాలిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బీసీల ఆదరణతో ఎన్నో పదవులను అనుభవించి నేడు బీసీల పట్ల నయవంచకునిగా మారారని విమర్శించారు. తెలంగాణలో బీసీల సమస్యలను పక్కనపెట్టి అధికారం, డబ్బు కోసం వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రచారం చేస్తే బీసీలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

game 27032019

ఇదిలావుంటే, కేసీఆర్‌ మాటలు విని టీడీపీని ఓడించేందుకు కృష్ణయ్య కుట్ర చేస్తే తగిన బుద్ధి చెబుతామని ఏపీ ఓబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్‌ హెచ్చరించారు. తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్‌లో ఏం పని? ఇక్కడికొచ్చి బిసిల మధ్య చిచ్చుపెడితే చూస్తూ ఊరుకోం? అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్‌ అన్నారు. తన రాజకీయాలు తెలంగాణలో చేసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌ బిసిల జోలికొస్తే ఊరుకోబోమని ఆర్‌.కృష్ణయ్యను హెచ్చరించారు. గుంటూరులోని బిసి సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావుతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు.

game 27032019

బిసి సంక్షేమ సంఘం పార్టీలకతీతంగా పనిచేస్తుందని, బిసి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణలో బిసిల సమస్యలను పరిష్కరించలేని కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి బిసిలను వైసిపికి ఓటేయాలని ప్రచారం చేస్తాననడం సరికాదన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు మాట్లాడుతూ బిసిల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తామెవర్నీ ఉపేక్షించబోమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పలు పార్టీలు ఇచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించామని, బిసి జీవితాలతో చెలగాటమాడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో విడదల రజనీ, చంద్రగిరి ఏసురత్నం, అరవిందరావు గెలుపుకోసం సంఘం కృషి చేస్తుందని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా నియమించిన కేకే శర్మను తప్పించాలని ఈసీకి టీడీపీ విజ్ఞ‌ప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నియామకాన్ని సీపీఐకి కూడా వ్యతిరేకించింది. ఏపీలో ఎన్నికలకు కేంద్ర పోలీస్‌ పరిశీలకులుగా కేకే శర్మను నియమించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఆయన కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే కారణంతో పశ్చిమ్ బెంగాల్‌ ప్రభుత్వం శర్మ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు, గతంలో శర్మపై పలు ఫిర్యాదులున్నాయని, ఎలాంటి ఆరోపణలు లేని అధికారిని ఏపీలో ఎన్నికల పరిశీలకులిగా నియమించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

game 27032019

కాగా, కేకే శర్మ విషయంలో టీడీపీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టింది. ఈసీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని, ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన శర్మను రాష్ట్ర పోలీసు పరిశీలకుడిగా పంపడమే అందుకు నిదర్శనమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. ఈసీని కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తోందని, అందుకే బెంగాల్‌ సీఎం తిరస్కరించిన శర్మను కావాలనే ఏపీకి పంపారని ఆరోపించారు. కేంద్రం చెప్పుచేతుల్లో కేసీఆర్ సర్కారు సాగుతుంటే, దాని కనుసన్నల్లో వైసీపీ నడుచుకుంటోందని ధ్వజమెత్తారు. వీరందరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగకుండా కుట్రలు పన్నుతున్నాయని కనకమేడల దుయ్యబట్టారు.

game 27032019

వైసీపీ అధినేత జగన్‌ మంగళవారం ఎన్నికల ప్రచారం నిలిపేసి లోటస్‌పాండ్‌కు పరిమితమవ్వడమే దీనికి ఉదాహరణ అని ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని సినిమా నటులంతా టీఆర్ఎస్ ద్వారా వైసీపీలో చేరుతున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి టీడీపీ బూత్‌స్థాయి కార్యకర్తలపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రత్యర్థులను చంపుతామని బహిరంగంగా బెదరింపులకు పాల్పడినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి పక్షపాతవైఖరికి అద్దంపడుతోందని కనకమేడల ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read