హోదాకు కేసీఆర్‌ మద్దతు తీసుకుంటే తప్పేంటి.. అని వైసీపీ అధినేత జగన్‌ అన్న వ్యాఖ్యల దుమారం ఐదురోజులు గడిచినా చల్లారడంలేదు. హోదాపైన, ఆంధ్రుల గురిం చి గతంలో కేసీఆర్‌ అండ్‌ కో చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం జగన్‌ ప్రసంగాన్ని పోల్చి చూపుతూ పలు కథనాలు వెలువడు తున్నాయి. సోషల్‌ మీడియాలో కేసీఆర్‌ అండ్‌ కో వ్యాఖ్యలు విస్తృతంగా విహరిస్తు న్నాయి. దీంతో జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఎన్నికల బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రా ద్వేషులతో జగన్‌ చేతులు కలిపారని ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్‌ బలం చేకూర్చారని వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతుగా నిలుస్తారన్నట్లు జగన్‌ అంటుండగా.. గతంలో కేసీఆర్‌, కేటీ ఆర్‌, హరీష్‌రావు, కవితలు అందుకు విరు ద్ధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో ఏపీలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

game 27032019

కేసీఆర్‌ ఏపీ హోదాకు మద్దతిస్తానన్నారని జగన్‌ చెప్తున్న మాటలు.., హరీష్‌ వ్యాఖ్యలతో అబద్ధమని తేలిపోవడంతో జిల్లాలో వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు ఆపాలని, అమరావతికి పెట్టుబడులు రాకుండా నిలువరించాలని కేసీఆర్‌ అండ్‌ కో విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌ జనం కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్‌ మద్దతిస్తే తప్పేంటి...? అని జగన్‌ నిర్భయంగా చేసిన వ్యాఖ్యలు వైసీపీకి తీవ్ర నష్టాన్ని తెస్తాయని ఆ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

game 27032019

ఇది చాలదన్నట్లు కేటీఆర్‌... జగన్‌ మద్దతు తమకేనని, ఆయన మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పుతామని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వీటికి తోడు కేసీఆర్‌తో గొడవపడి తే ఒక చుక్కనీరు రాదు అని జగన్‌ అన్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పు మన్నా యి. ఈ విషయాలన్నీ వైసీపీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైసీపీకి ఓటేస్తే పెత్తనమంతా కేసీఆర్‌ చేతికి వెళుతుందని సీఎం చంద్రబాబు చేస్తున్న విమ ర్శలకు జగన్‌, కేటీఆర్‌ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఏపీ హోదాకు కేసీఆర్‌ ఎప్పుడు మద్దతు ఇవ్వలేదని, పైగా మద్దతు ఇస్తానన్న వారిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్‌ వ్యాఖ్యలు సెల్ఫ్‌గోల్‌లా మారాయిని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

 

‘ముఖం చాటేస్తున్న ప్రజలు... తల పలిగేలా ఎండ..!’ ప్రధానమంత్రి మోదీ వచ్చి వెళితే ఈ రెండింటినీ తట్టుకునే శక్తి వస్తుందనుకున్న రాష్ట్రంలోని బీజేపీ అభ్యర్థులు మరింత నీరసించారు. మోదీ కర్నూలు పర్యటన ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో మెజారిటీ అభ్యర్థులు ‘ఎందుకు పోటీ చేస్తున్నామా?’ అని తలలు పట్టుకొంటున్నారు. నామమాత్రపు ప్రచారం కూడా నిర్వహించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పార్టీకి ఏపీలో గడ్డు పరిస్థితి నెలకొంది. ప్రచారంలో ఎక్కడా జనం రాకపోగా.. వీళ్లను చూడగానే ముఖం చాటేస్తున్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు మాకొద్దు బాబోయ్‌ అని పారిపోతున్నారు. కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, కడప జిల్లాలో ఒక లోక్‌సభ అభ్యర్థి వెంట వెంటనే ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర పార్టీలో ఆందోళన మొదలైంది.

game 27032019

మోదీ వచ్చి వెళితే మార్పు వస్తుందని ఆశపడ్డారు. అనుకున్నట్లే ఈ నెల 29న మోదీ కర్నూలుకు వచ్చి రాయలసీమను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ ఎన్ని చెప్పినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకోలేదు. అయినా పర్లేదని ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు జనం నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘వెనుక బడిన ప్రాంతం అంటూనే రూ.350 కోట్లు ఇచ్చి లాక్కున్నారుగా..!’ అని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు మోదీ ఇచ్చారని అభ్యర్థులు బదులిస్తుంటే.. ‘ఆయన ఇచ్చింది మాకు తెలుసులే..! చెంబుడు నీళ్లు, కాస్త మట్టి’ అంటూ ముఖంమీదే చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పోత్తుతో 4లక్షలకుపైగా ఓట్లు సాధించిన రాజంపేట లోక్‌సభ స్థానంలో అర్ధాంతరంగా వైదొలగిన బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ అభ్యర్థుల్లో చర్చనీయాంశమయ్యాయి.

game 27032019

‘రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ముందే అంచనా వేసిన సిటింగ్‌ ఎంపీలు జాగ్రత్త పడ్డారా?’ పార్టీ కేడర్‌లో ఇదే చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ మద్దతుతో 4 లక్షల ఓట్లు సాధించిన పురందేశ్వరి రాజంపేటలో పోటీ చేయనని ముందే చెప్పారు. విశాఖ రైల్వేజోన్‌ గురించి ప్రకటన రాగానే విశాఖ ఎంపీ సీటు కావాలని ఆమె పట్టుబట్టారు. సిటింగ్‌ ఎంపీ కంభంపాటి హరిబాబు గత ఎన్నికల్లో వైఎస్‌ విజయలక్ష్మిపై లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయన విశాఖ సీటును వదులుకుంటారని ఎవరూ అనుకోలేదు. పురందేశ్వరి మీ సీటు అడుగుతున్నారు అని పార్టీ పెద్దలు ఆయన చెవిన వేయగానే ‘నాకెలాంటి అభ్యంతరంలేదు. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా నన్ను సంప్రదించి ప్రకటించలేదు. అలాంటప్పుడు లోక్‌సభ సీటు కూడా మీ ఇష్టమే’ అని తేల్చేశారు. రైల్వేజోన్‌ ప్రకటన, ఉత్తరాది వారు ఎక్కువగా ఉండే సీటును హరిబాబు ఎందుకు వదులుకున్నారో.. ప్రస్తుతం బరిలో ఉన్న పురందేశ్వరి వాహనం వెనుక ఉన్న జనాన్ని చూశాక అర్థమవుతోందని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. నరసాపురం సిటింగ్‌ ఎంపీ గోకరాజు గంగారాజు కూడా పోటీకి ససేమిరా అన్నారు. కృష్ణంరాజు భార్యను పోటీ చేయించేందుకు అధిష్ఠానం ప్రయత్నించింది. ప్రభా్‌సను ప్రచారానికి తీసుకురావొచ్చని ఎత్తుగడ వేసింది. అందుకు బాహుబలి ససేమిరా అనడం, కృష్ణంరాజు కుటుంబసభ్యులు అయిష్టంగా ఉండటంతో చేసేదిలేక అక్కడ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును పోటీలోకి దించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయం భగభగమంటోంది. టీడీపీ, వైసీపీ పోరుతో ఏపీ రాజకీయ రణరంగం ఉత్కంఠగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, ముఖ్యమంత్రి స్వప్నం సాకారం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న జగన్.. అన్ని బాధ్యతలను ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించారు. మరి జగన్‌కు ప్రశాంత్ కిశోర్ ఇవ్వబోతున్న ఫినిషింగ్ గిఫ్ట్ ఏంటి? ప్రశాంత్ కిశోర్..ఈ పేరు లేకుండా వైసీపీని ఊహించలేం. ఎందుకంటే పీకేగా పేరుపొందిన ప్రశాంత్ కిశోర్ వైసీపీకి అన్నీ తానై నడిపిస్తున్నారు. ఆయన ఏం చెబితే జగన్ అదే చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ 2019లో ఎలాగైన అధికారపీఠం దక్కించుకోవాలని, తన స్వప్నమైన సీఎం పీఠం అధిరోహించాలని కంకణం కట్టుకుని మరీ పీకేను ఏపీ ఎన్నికల గ్రౌండ్‌లోకి దించారు.

game 27032019

అప్పటి నుంచి ఆయన కాళ్లకు చక్రాలు కట్టుకుని ఏపీ నలుమూలలా తిరుగుతూనే ఉన్నారు. ఇంతగా తిరిగిన ఆయన చేసిన పనులేంటి? జగన్‌కు ఏం చెప్పారు? పాదయాత్ర ప్లాన్ పీకేదే అయినా ఆయనవల్ల వైసీపీకి ఒరిగేదేంటి? వైసీపీ కోల్పోయిదేంటి? అసలు పీకే వల్ల నిజంగానే వైసీపీ బలపడిందా? లేక బలహీనపడిందా? కులాలకు ప్రాధాన్యం ఉన్న ఏపీలో పీకే పాచికలు పనిచేస్తాయా? జగన్ అంచనాలు నిజమవుతాయా? అంటే ఏమో.. ఆయనేమో పీకేను నమ్మారు. తాము సొంత కేడర్‌నే నమ్ముకున్నామని వైసీపీ కిందిస్థాయి నేతలు అంటున్నారు.

game 27032019

అసలు జగన్ గెలుపు కోసం పీకే వేసిన స్కెచ్ ఏంటి? ప్రశాంత్ కిశోర్.. జగన్‌కు ఇచ్చే ఫినిషింగ్ టచ్ ఏంటి? అన్నదే ఇప్పుడు ఏపీ జనాలకంటే వైసీపీ కేడర్‌లోనే ఏక్కువగా ఆసక్తి రేపుతోంది. ఏదైనా తేడా కొడితే పీకే మళ్లీ సొంత రాష్ట్రానికి వెళతారు. మన పరిస్థితి ఏంటని ఫ్యాన్ పార్టీ నేతలు ఫరేషాన్ అవుతున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలను పీకే నాలుగు విభాగాలుగా విభజించారట. అందులో వైసీపీ గెలిచేవెన్ని? ఓడేవెన్ని? ఓ మేర మెజారిటీ వచ్చేవెన్ని? ఓటు బ్యాంక్ అసలు లేని స్థానాలెన్ని? ఇలా రకరకాలుగా ఆలోచించి పీకే ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ లెక్కలు బీహార్‌లో పనిచేస్తాయని, ఏపీలో పనిచేయవని వైసీపీ కేడరే చెబుతోంది.

 

కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల ప్రలోభాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓటర్లతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు భారీ స్థాయిలో ప్రలోభాలు ఎర వేస్తు న్నారు. విజయవాడకు చెందిన ఓ డివిజన్‌ స్థాయి నాయకుడికి డివిజన్‌లో మంచి పట్టు ఉండటంతో పాటు సుమారు 2 వేల మంది ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా ఉంది. దీంతో ఆయనపై వైసీపీ నేతల దృష్టి పడింది. తమకు అనుకూలంగా పనిచేస్తే లక్షల విలువైన ఫ్లాటును బహుమతిగా ఇస్తామని ఎర వేశారు. తనకు అలాంటి అవసరం లేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అంతకన్నా ఎక్కువ గౌరవం, పదవులు తనకు దక్కుతాయని సదరు నాయకుడు తేల్చి చెప్పడంతో వారి పాచిక పారలేదు.

game 27032019

ఇక, జిల్లాలో కీలక నియోజకవర్గాలుగా ఉన్న గుడివాడ, మైలవరం, గన్నవరం, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను ప్రలోభాలకు గురి చేసి తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నారు. తమ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని, తమకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తే చాలని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో తమకు అనుకూలంగా పనిచేసే కుల సంఘాల నాయకులకు సుమారు రూ.26 లక్షలు ఖరీదు చేసే ఇన్నోవా వాహనాలను బహుమతిగా ఇచ్చేందుకు వైసీపీ నేతలు ఒప్పందాలు చేసుకున్నారు.

game 27032019

మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ కులాల వారీగా యువజన సంఘాలను ఎంపిక చేసుకుని వారికి హార్నెట్‌, యూనికాన్‌, షైన్‌ వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలను ఇచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం చేయడం.. వైసీపీకి ఓటేసేలా ఓటర్లను ప్రభావితం చేయాలన్నది ఈ యువజన సంఘాలతో వైసీపీ నేతలు చేసుకుంటున్న ఒప్పందం. పోలింగ్‌ ముగిసిన వెంటనే తమకు పడిన ఓట్ల ఆధారంగా వాహనాలను అందజేస్తామని వైసీపీ నేతలు వారికి హామీ ఇస్తున్నారు. ఇక టీడీపీ గ్రామస్థాయి నాయకులనూ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఓటుకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, దాన్ని ఓటరుకు ఇవ్వాలని, ఎన్ని ఓట్లు తమకు వేయిస్తే అన్ని ఓట్లకూ రూ.5వేలు చొప్పున సదరు టీడీపీ నాయకుడికి ఇస్తా మని వైసీపీ నేతలు ప్రలోభ పెడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read