టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు రోడ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే విమర్శనాస్త్రాలు గురిపెట్టారు. పోలవరం ప్రాజక్టును ఏటీఎంగా మార్చుకుని కేంద్రం నుంచి నిధులు పిండుకుంటున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు దీటుగా బదులిచ్చారు. "పోలవరం మనకందరికీ ఏటీఎం అంట! అసలు ఏటీఎంల్లో డబ్బులే లేవు. పోలవరంలో కూడా డబ్బుల్లేవు. రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వట్టిపోయిన ఏటీఎంగా మార్చేశారు. పోలవరం పూర్తిచేయడం నరేంద్ర మోదీకి ఇష్టంలేదు. అనేక అడ్డంకులు సృష్టించాడు. నేనిప్పుడు హామీ ఇస్తున్నాను, డిసెంబరు లోపల ప్రాజక్ట్ పూర్తవుతుంది. మోదీ, కేసీఆర్, జగన్... మీ ఇష్టం వచ్చింది చేసుకోండి! నా సత్తా ఏంటో చూపించి పోలవరం పూర్తిచేస్తాం.

polavaram 01042019

ఇప్పుడు చెబుతున్నా.. పోలవరం అంటే 'ఏటీఎం' కాదు... యస్.. పోలవరం అంటే 'ఏటీడబ్ల్యూ'. 'ఏటీడబ్ల్యూ' అంటే ఎనీ టైమ్ వాటర్ ఇన్ ద స్టేట్. ఒక బటన్ ఆన్ చేస్తే ఏ ఊరికి కావాలనుకుంటే ఆ ఊరికి నీళ్లు వెళతాయి. కరెంటు మాదిరిగా నీటి భద్రత ఇచ్చే బాధ్యత నాదే. ఎక్కడ కుళాయి తిప్పినా నీళ్లే. 24×7 నీళ్లు తెప్పిస్తా. గుజరాత్ లో మీరు చేయలేకపోయారు, నేనిక్కడ చేస్తున్నా, అదే మీకు కుళ్లు" అంటూ మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు తంబళ్లపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఐదేళ్లు నేనెలా పరిపాలించాను, నువ్వెలా పరిపాలించావు? నీ పాలనలో దేశంలో ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారా? ఉద్యోగాలు పోయాయా? లేదా? ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందా? లేదా? ఆదాయం రెండింతలు చేస్తామన్నారు, ఎక్కడైనా వచ్చిందా?

polavaram 01042019

కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదాయం 128 శాతం పెంచిన ఏకైక ప్రభుత్వం మనదే. తిరుపతి సభలో నదుల అనుసంధానం చేస్తామని చెప్పారు, చేశారా మరి? మేం చేశాం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి చూపించాం. పోలవరం మన జీవనాడి, అదేదో ఈయనిచ్చినట్టుగా చెబుతున్నారు. జాతీయ ప్రాజక్ట్ అని, అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నరేంద్ర మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.మోదీకి ఓ ముని శాపం ఉంది, నిజం చెబితే తల వెయ్యి వక్కలైపోతుంది. అందుకే మోదీ ఒక్క నిజం కూడా మాట్లాడరు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అమరావతిని చూస్తే మోదీకి కడుపు మండిపోతోందని అన్నారు. ఆయన అహ్మదాబాద్ కంటే మన అమరావతి మించిపోవడం మోదీకి నచ్చడంలేదని తెలిపారు. "నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నమ్మకద్రోహి. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు. ప్రత్యేక హోదా కోసం 29 సార్లు తిప్పుకున్నాడు. నాకంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చి నాకే కథలు వినిపిస్తున్నాడు. నేను 95లో ముఖ్యమంత్రి అయితే, 2002లో వచ్చాడీ మోదీ. అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారు మీరు, అందుకు మాకేం బాధలేదు. కానీ ఆంధ్ర ప్రజలను కించపరిస్తే సహించేదిలేదు. మీ బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. మీ స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి. మీ దగ్గరున్న డిపార్ట్ మెంట్లను మాపై ప్రయోగించి ఊడిగం చేయించుకోవాలనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. మీకు ఊడిగం చేయాలనుకుంటే... ఉన్నాడు జగన్!" అంటూ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు.

అద్దంకిలో గ్రూపుల గోల సద్దుమణిగింది. కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య అనాదిగా నెలకొన్న వైరం దూరమైంది. అంతా కలిసిపోతున్నారు. ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం, అందుకు అనుగుణంగా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌ వైరి వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం అందుకు కారణమైంది. అనేక గ్రామాల్లో రెండు గ్రూపులు కలిసి పోవవడంతో ప్రశాంతత నెలకొంటోంది. కొద్ది గ్రామాల్లో మాత్రం ఇంకా టెన్షన్‌ కొనసాగుతోంది. అద్దంకి నియోజక వర్గంలో దశాబ్దాల నుంచి కరణం, గొట్టిపాటి వర్గీ యుల మధ్య వైరం ఉంది. ప్రస్తుతం ఇరువురు నా యకులు ఒకే పార్టీలో ఉండి పనిచేసేలా చేయటంలో చంద్రబాబు రచించిన వ్యూహం ఫలించింది.

game 27032019

ఎన్నికల పుణ్యమా అని అది మరింత సర్దుబాటుకు దారితీసింది. గత ఎన్నికల అనంతరం నెలకొన్న పరిణామాల్లో గొట్టిపాటి రవికుమార్‌ను సీఎం చంద్రబాబు పార్టీలోకి చేర్చుకున్నారు. రవికుమార్‌ టీడీపీలోకి చేరడంతో మళ్లీ పార్టీలో గొడవ మొదలైంది. ఆ సమయంలో రెండు కత్తులు ఒక వరలో ఎలా ఇమ డవో అలానే ఇరువర్గీయులు తెలుగుదేశంలో కొన సాగటం కష్టమే అని పలువురు వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు మాత్రం ఇరువురికీ న్యాయం చేస్తానన్న హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బల రాంకి ఎమ్యెల్సీ పదవి ఇచ్చారు. అదే సమయంలో కరణం వెంకటేష్‌కు న్యాయం చేయాలన్న ఉద్దేశం తో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ చైౖర్మన్‌గా నియమించారు.

game 27032019

ఇక ప్రస్తుతం చీరాల నుంచి బల రాంను పోటీకి దించటం ద్వారా ఇరువర్గీయులకు ప్రాధ్యాన్యం ఇచ్చినట్లయింది. దీంతో కరణం వర్గీ యులు కూడా సంతృప్తిచెందారు. అద్దంకి నియో జకవర్గంలోని అనేక గ్రామాల్లో గతంలో ఉన్న వర్గ విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పడి ఇరువ ర్గాల నాయకులు కలసి ముందుకు సాగుతున్నారు. గతంలో వర్గ విభేధాలతో అట్టుడికి గ్రామాల్లో ప్రశాంత వాతా వరణం ఏర్పడుతోంది. రెండు వర్గాలను కలుపుకొని పోయే విషయంలో ఎమ్మెల్యే రవికుమార్‌ కూడా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. గ్రామాలలో అందరినీ ఏకం చేస్తున్నారు. కొద్ది గ్రామాల్లో మాత్రం టెన్షన్‌ వాతావరణం ఉంది.

గెలుపు కోసం వైసీపీ శ్రేణులు సామదాన బేధ దండోపా యాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా గెలుపు కోసం కుయుక్తులు పన్నుతున్నాయి. తెలంగాణాలో జరిగిన ఎన్నికల అక్రమాలను ఆదర్శంగా తీసుకోవడమే కాక, ఆ రాష్ట్ర నాయకుల వద్ద.. ఎన్నికల్లో అక్రమాలపై తర్ఫీదు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులకు బెదిరింపు కార్యక్రమం పూర్తి కావడం, నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియడంతో ఇక టీఆర్‌ఎస్‌ నాయకులు తెలుగుదేశం ద్వితీయశ్రేణి నాయకులను ఎలా లొంగదీసుకోవాలనే విషయంపై వైసీపీ నాయకులకు, తెలంగాణాలో తాము అవలంబించిన పద్ధతులను నూరిపోస్తున్నారు. తెలంగాణాలో 25 లక్షల ఓట్లు తొలగించిన విధంగానే, ఆంధ్రాలో కూడా 9 లక్షల ఓట్లు తొలగించటానికి వైసీపీ నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకుల సలహాతోనే ఫారం-7 ద్వారా యత్నించిన విషయం తెలిసిందే.

game 27032019

అయితే తెలుగుదేశం శ్రేణులు అప్రమత్తమై ఓట్ల తొలగింపుపై దృష్టి సారించడంతో కుట్ర బయటపడింది. ఫారం -8 ద్వారా తిరిగి ఓట్లు పొందే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేపట్టినా, ఇంకా 2లక్షల ఓట్లు తొలగింపబడే ఉన్నాయి. ప్లాన్‌ఏ పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు తమ రాష్ట్రంలో అవలంబించిన ప్లాన్‌బిని అమలు చేయాలని తమ మిత్రులైన వైసీపీ నేతలకు సూచిస్తున్నారు. ఈమేరకు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నారు. ఇది ఫెయిల్ అవ్వటంతో, ప్లాన్ బి కి పదును పెడుతున్నారు... పోలింగ్‌ రోజున బూత్‌ల్లో ఉండే ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తారు. దొంగ ఓటర్లను గుర్తించడంలో వీరిది కీలకపాత్ర. సంస్థాగతంగా బలంగా ఉండే టీడీపీకి పోలింగ్‌ ఏజెంట్ల విషయంలో ఇప్పటి వరకు ఎదురు లేదు. ఈ బలమైన వ్యవస్థను తమ గుప్పిట పట్టాలన్న లక్ష్యంతో వైసీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.

game 27032019

దీనికి స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అంతా తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ నాయకులే చేస్తుంటే వైసీపీ నేతలు కేవలం పాత్రధారులుగా ఉంటూ వారి చెప్పినట్టు నటిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సూచిస్తున్న ప్లాన్‌ బి ప్రకారం.. బూత్‌ల వారీగా ఏజెంట్లగా నియమితులైన వారి పేర్లు బయటకు రాగానే సదరు ఏజెంట్లను ప్రలోభపెట్టి.. లేకుంటే భయపెట్టి పోలింగ్‌ రోజున చివరి రెండు గంటలు తమకు అనుకూలంగా మలుచుకోవడమే ప్లాన్‌ బి లక్ష్యం. సహజంగా ఒక్కో పార్టీకి బూత్‌కి ఇద్దరు ఏజెంట్లు ఉంటారు (ఒకరు రిలీవర్‌) సహజంగా ప్రధానపార్టీల వారే బూత్‌ ఏజెంట్లను నియమించుకుంటారు. ప్లాన్‌(బి) ప్రకారం.. ఒక్కో బూత్‌లో ఏజెంట్ల సంఖ్యను బట్టి లక్షనుంచి రూ.2లక్షల వరకు ఖర్చుచేసి ఏజెంట్లను వారితోపాటు పోలింగ్‌ అధికారులను తమకు అనుకూలంగా లొంగదీసుకోవడానికి వైసీపీ శ్రేణులు సమయాత్తమవుతున్నాయి. దీంతో తెలుగుదేశం అప్రమత్తం అయ్యింది.

సార్వత్రిక సమరంలో గెలుపు మాదేనన్న ధీమా ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. పోటీలో ఉన్న జనసేన, కాంగ్రెస్‌, బీజేపీ స్వతంత్రులు ఎవరి గెలుపుకు గండి పెడతారోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని ఈసారి గెలుపుకు, వ్యూహ ప్రతివ్యూహాలకు నేతలు పదను పెడుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలించే అంశాలు చాలానే ఉన్నాయని, అందుకే మెజార్టీ స్థానాల్లో గెలుపు మాదేనని టీడీపీ వర్గాలు ధైర్యం వ్యక్తం చేస్తున్నాయి. సానుభూతి పవనాలు, ఓ సామాజిక వర్గం మద్దతు తమకే ఉన్నాయని, పట్టుకు ఎలాంటి ఢోకా లేదని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 133 మంది ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.

game 27032019

2014 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం ఒక్కటే టీడీపీకి దక్కింది. మిగిలిన తొమ్మిది స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటిలో కడప, పులివెందుల, రాయచోటి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు 30 వేల నుంచి 75వేల మెజార్టీ సాధించారు. రైల్వేకోడూరు నుంచి 1972 ఓట్లు, కమలాపురం నుంచి 5345 ఓట్లు అతి స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు ఆ స్థానాలు వదులుకోవాల్సి వచ్చింది. జమ్మమలడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 9 వేల నుంచి 12వేల ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అ భ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఆనాటి ఎన్నికల్లో టీడీపీ నేతలు మరింతగా కష్టపడి ఉంటే ఫలితాలు తారుమారు అయ్యేవి. అందుకనే ఈసారి టీడీపీ నేతలు గత ఫలితాలను విశ్లేషించుకుంటూ ఆ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో నడుస్తున్నారు. ప్రతిఇంటికి సంక్షేమం, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలుగా వారు పేర్కొంటున్నారు.

game 27032019

2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆ ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీ చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితులు. కారణం.. వైఎస్‌ సానుభూతితో పాటు జగన్‌ సీఎం అవుతారని ఆలోచనతో ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు. అయినా ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ గట్టిపోటీ ఇచ్చింది. దీంతో ఈ పర్యాయం ఇక్కడ గెలుపొందే అవకాశం ఉందని వీరు భావిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు తమకు సానుభూతి పవనాలు చెక్కుచెదరలేదని, జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గం తమవైపే ఉందని, ఈ సారి పట్టు సాధించుకుంటామంటున్నారు. పది నియోజకవర్గాల్లో 133 మంది ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభావం పెద్దగా లేకపోయినా జనసేన ప్రభావం మాత్రం రాజంపేట, రైల్వేకోడూరులలో కొంత ఉందని ప్రచారం సాగుతోంది. ఈసారి ఎవరు గెలిచినా భారీ మెజార్టీ అన్నది ఉండదు. స్వల్ప ఆధిక్యంతోనే గెలుస్తారని సమాచారం. దీంతో స్వతంత్రులు, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన అభ్యర్థుల ప్రభావం ఎవరిపై పడుతుందోనన్న ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read