తొడగొట్టి చెబుతున్నా... పుట్లూరు, యల్లనూరు మండలాలకు హెచ్చెల్సీ నీరు తెప్పిస్తానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. స్థానికంగా ఆదివారం నిర్వహించిన ప్రచారసభలో టీడీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణితో కలిసి మాట్లాడారు. సమితి ప్రెసిడెంట్‌ అయినప్పటి నుంచి పలుమార్లు మా పొలాలకు వదలకుండా మీకు హెచ్చెల్సీ నీరు వదిలామన్నారు. ఈ మండలంలో రెండు కుటుంబాలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని, టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిలను గెలిపిస్తే అలా జరగదన్నారు. ప్రతి మహిళ గుండెల మీద చేయివేసుకొని చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు.

game 27032019

కొందరికి కొన్ని మండలాల్లో అందలం ఎక్కిస్తే ఇప్పుడు మాకే ఎదురుతిరిగారన్నారు. ప్రజల అండ ఉండగా మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరని తెలిపారు. హెచ్చెల్సీ నీరు గండికోట నుంచి తెప్పిస్తామన్నారు. రెడ్డి...రెడ్డి అంటూ గ్రామాల్లో ఊరేగుతున్నారు కానీ కులం అన్నం పెట్టదన్నారు. మంచితనంతోనే ఏ రెడ్డి అయినా గెలుస్తాడని తెలిపారు. చీనీచెట్లు నరికిన వారినే మీరు ఆదరిస్తున్నారని విమర్శించారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పుట్లూరు పుల్లారెడ్డి, కులశేఖర్‌రెడ్డి, బ్రహ్మయ్య, రవి, చంద్రశేఖర్‌చౌదరి, రామాంజనేయులు పాల్గొన్నారు.

నగరి నియోజకవర్గంలో అలకలు వీడిన అసమ్మతి నేతలు ఐక్యతా రాగం ఆలపిస్తూ ప్రచారంలోకి దిగడంతో తెలుగుదేశం పార్టీ తిన్నగా బలపడుతోంది. టికెట్ల ఖరారు ఆలస్యం కావడంతో ప్రచారం కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే పరిచయం అక్కర లేని దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌కు గ్రామాల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. తొలుత టికెట్‌ కోసం ప్రధానంగా విద్యాసంస్థల నేత అశోకరాజు, బీసీ నేత పాకారాజలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. వీరికి మద్దతుగా సీనియర్‌ నాయకులు గంధమనేని రమేష్‌ చంద్రప్రసాద్‌, ఏఎం రాధాకృష్ణ, పోతుగుంట విజయబాబు, కొరపాటి నరేంద్రలు నిలిచారు. చివరికి గాలి భానుప్రకాష్‌ను టికెట్‌ వరించింది. ఈ ఎంపిక అనేక వడపోతల వల్ల ఎంపిక ఆలస్యం అయింది. ప్రస్తుతం వీరిలో ఓ ఇద్దరు మినహా మిగిలిన నేతలు బహిరంగ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

game 27032019

ఇప్పటికే అశోకరాజు విజయపురం, నగరి, వడమాలపేటలలో ప్రచారాన్ని నిర్వహించారు. పాకారాజ కూడా తన వంతుగా నగరిలోని తన మొదలియార్‌ వర్గాన్ని టీడీపీకి అనుకూలంగా సమాయత్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక టికెట్‌ కోసం తటస్తురాలుగా ప్రయత్నించిన డా. సుభాషిణి కూడా తన క్షత్రియ బంధువర్గంతో అంతర్గత సమావేశాలు నిర్వహించి టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా పని చేయాలని కోరుతున్నారు. రేపటి నుంచి ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. గాలి భానుప్రకాష్‌ మాత్రం ఐదు మండలాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరో పక్క అసమ్మతి నేతలతో చర్చలు జరిపి ప్రచారంలోకి దింపుతున్నారు. ఆయన భార్య శిరీష, పెదనాన్న గాలి ధనంజయలునాయుడు కూడా ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు.

game 27032019

మండలాలలో పుత్తూరు ఎంపీపీ గంజిమాధవయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ యుగంధర్‌, జయప్రకాష్‌, రవీంద్ర, డి.ఎస్.గణేష్‌, వడమాలపేట తుడా డైరెక్టర్‌ ధనంజయలునాయుడు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అబ్బరాజు, దాముయాదవ్‌, నగరి పార్టీ అధ్యక్షుడు బి.డి.భాస్కర్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు సురేష్‌, బాలాజీలు, విజయపురం పార్టీ అధ్యక్షుడు దశరథరాజు, బాలసుబ్రహ్మణ్యంరాజు, ధనంజయలునాయుడు, నిండ్ర పార్టీ అధ్యక్షుడు దశరథవాసు, రవినాయుడు, ధనంజయలునాయుడు, తన వంతుగా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇలా వరుసగా అసమ్మతి నేతలు అలకలు మాని ప్రచారంలో పాల్గొనడంతో పాటు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు అన్నీతానై నడిపించిన మాజీమంత్రి రెడ్డివారి చెంగారెడ్డి, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌కు మద్దతుగా ప్రచారానికి దిగడం శుభపరిణామం. ఏప్రిల్‌ 2వ తేదీ చంద్రబాబు పుత్తూరు పర్యటనలో చెంగారెడ్డి కూడా వేదిక పంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే టీడీపీకి మరింత ఊపు వస్తుంది. మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే లేట్‌గా ప్రచారం ప్రారంభించినా లేటెస్ట్‌గా భానుప్రకాష్‌ దూసుకుపోతున్నారు.

ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి వచ్చిన మోడీ, చంద్రబాబు టార్గెట్ గా రెచ్చిపోయారు. 45 నిమిషాల ప్రసంగంలో, ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించలేదు. మరోసారి జగన్ పై, విజయసాయి రెడ్డి పై, తనకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే అహర్నిశలు రాష్ట్రం కోసం పాటు పడుతున్న చంద్రబాబు పై మాత్రం, ఆరోపణలతో హోరెత్తించారు. ఒక పక్క నేను కాపలదారుడిని అంటూ ప్రచారం చేస్తున్న మోడీ, చంద్రబాబు అవినీతి చేసారు, పోలవరం లో అవినీతి, ఆ ప్రాజెక్ట్ లో అవినీతి, ఈ ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ ఊదరగొడుతున్నారు. మరి, నిజంగా చంద్రబాబు అవినీతి చేస్తుంటే, ఈ చౌకీదార్, ఎక్కడ ఉన్నాడు ? జగన్ దగ్గరకు ఈడీ, సిబిఐ వెళ్ళకుండా కాపలా కాస్తున్నారా ?

modi 01042019

ఇక పోలవరం పై మోడీ చెప్పిన డబ్బా అంతా ఇంతా కాదు. గత పాలకులకు పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కావాలని లేదని, 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్‌ని గాల్లో వేలాడదీస్తూనే ఉన్నారని ఆరోపించారు. మొదటి పార్లమెంట్‌ సమావేశాల్లోనే పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ పథకంగా ప్రకటించామన్నారు. పోలవరం నిర్మాణానికి రూ.7 వేల కోట్లు ఇచ్చామని, చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ ఒక ఏటీఎం అని మోదీ విమర్శించారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి టీడీపీకి లేదని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం అంచనాలను పెంచుతూ పోతున్నారని, పోలవరం అంచనాలు పెంచడం ద్వారా.. యూటర్న్‌ బాబు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌ రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

modi 01042019

చంద్రబాబు తన వ్యాపార సంస్థ హెరిటేజ్‌ కోసం మాత్రమే పని చేస్తున్నారని, తాను మాత్రం ఏపీ సాంస్కృతిక వారసత్వం కోసం నిలబడతానన్నానని మోదీ చెప్పుకొచ్చారు. చంద్రబాబును బాహుబలి సినిమాలో భళ్లాలదేవతో మోదీ పోల్చారు. మోదీ సభలో మొత్తం 45 నిమిషాల ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడ కూడా వైసీపీ జోలికిపోలేదు. ఏపీ ఆకాంక్షలను బీజేపీనే నెరవేరుస్తుందంటూ చెప్పుకున్నారు. బీజేపీ గెలుపును ఏపీ కోరుకుంటోందని మోదీ చెప్పారు. మోదీ ప్రసంగంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మోదీ అంత పచ్చి అబ్ధదాల కోరును ఇంతవరకు చూడలేదని టీడీపీ నేత బుచ్చయ్యచౌదరి అన్నారు. పోలవరానికి ఇంకా రూ.5 వేల కోట్లు బాకీ పడ్డారని, మీరిచ్చే రూ.7 వేల కోట్లతో ప్రాజెక్ట్‌ ఎప్పటికి పూర్తికావాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. రాజధాని కడతామని చెప్పి నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాజధానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1500 కోట్లేనని, అక్కడ రూ.58 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని బుచ్చయ్యచౌదరి తెలిపారు.

కడప జిల్లా రైల్వేకోడూరులో, గెలుపే లక్ష్యంగా ప్రచారంలో తెలుగుదేశం పార్టీ దూసుకునిపోతోంది. అయితే నాయకుల సమన్వయ లో పంతో వైసీపీ చతికిలపడి ఊగిసలాడుతోంది. వైసీపీలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు అన్నితానై చూసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా పట్టించుకునే స్థితిలో వైసీపీ లేదు. దీన్ని వీక్‌నెస్‌గా తీసుకున్న టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కస్తూరి ప్రధానంగా విశ్వబ్రాహ్మణులు, స్వర్ణ కారులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, ఆటో కార్మికులు, దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలను సైతం పార్టీలోకి తీసుకు వచ్చి వారి మద్దుతు కోరుకున్నారు.

pk 01042019 1

వారు టీడీపీకి మరిం త దగ్గరయ్యే విధంగా వ్యూహరచనలు చేస్తూ ముందుకు పోతున్నారు. టీడీపీని ఎక్కువగా మహిళలు ఆదిరిస్తున్నారు. పేదలు బ్రహ్మరథం పడుతున్నాయి. పసుపు-కుంకుమ పథకంతో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మహిళలకు నమ్మకం ఏర్పడింది. ప్రజలకు చంద్రబాబునాయుడే ఒక్కరే సామాజిక న్యాయం చేస్తారని ప్రజలు భావిస్తుం డడంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళుతోంది. ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో ముస్లింలు, బీసీలు, అగ్రవర్ణాలు మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావాలని కోరుకుంటున్నారు.

pk 01042019 1

అభివృద్ధి అంతా ఐదేళ్లలో చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేయడంతోనే రైల్వేకోడూరు నియోజకవర్గంలో బ్రిడ్జిలు, సిమెంట్‌ రోడ్లు, గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు, ఫించన్లు, పక్కాగృహాలు, రేషన్‌కార్డులు తదితరాలను అందించడంతో టీడీపీ ప్రజల్లో చొచ్చుకునిపోతోంది. ్ల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు, మంగంపేట పల్వరైజింగ్‌ మిల్లుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకులు మాచినేని విశ్వశ్వరనాయుడు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు బత్తిన గంగయ్యయాదవ్‌, నియోజకవర్గ నేత లు కట్టాబాలాజీ, దామోదర్‌రాజు, వెం కట్రామరాజు, యువనేత కొమ్మాశివ, బత్యాల వర్గీయుడు దివిటి మోహన్‌ ప్రచారం చేశారు.

Advertisements

Latest Articles

Most Read