ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ప్రచార జోరును పెంచేందుకు ఇప్పటికే 30 మంది స్టార్‌ క్యాంపెయినర్లను తెదేపా రంగంలోకి దించింది. సీఎం చంద్రబాబు ఓవైపు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయి నేతలను ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగం చేయడంలో సఫలీకృతమయ్యారు. భాజపా యేతర కూటమిలో భాగంగా ఉన్న రాజకీయ పార్టీల అగ్రనేతలను ఏపీలో ప్రచారానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో తెదేపా ఎన్నికల ప్రచారంలో మరింత జోష్‌ రానుంది.

star campaginers 27032019

సెక్యులర్ పార్టీల ప్రచారానికి తానెప్పుడూ సిద్ధమేనని, ఏపీలో చంద్రబాబు తరఫున ప్రచారం చేయనున్నానని చెప్పిన మాజీ ప్రధాని దేవెగౌడ బాటలోనే పలువురు జాతీయ స్థాయి ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి క్యూలు కడుతున్నారు. బీజేపీకి, వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు తరఫున టీడీపీకి ప్రచారం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను మరోసారి చాటేందుకు ఈ నేతలు సిద్ధమవుతున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమలోని కడప, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మంగళవారంనాడు పర్యటించగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పర్యటన తేదీలు కూడా ఖరారయ్యాయి.

star campaginers 27032019

ఈనెల 28, 31 తేదీల్లో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌ టీడీపీ తరఫున విజయవాడ, వైజాగ్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ, రాజకీయ ప్రముఖులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ తదితరులు సైతం ఏపీలో టీడీపీ ప్రచారానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 10 మంది అగ్రనేతలు చంద్రబాబుకు అండగా ప్రచారంలో పాల్గొననున్నారు. రోడ్‌షోల్లోనూ, బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. దేవెగౌడ, మమతా బెనర్జీ, శరద్‌పవార్‌, అఖిలేష్‌ యాద వ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, అరుణ్‌శౌరి ఈ జాబితాలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా టీడీపీకి మద్దతుగా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్‌ 2న ఆయన నెల్లూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో ఈసీ భాగస్వామ్యం కావడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిబంధనలను పట్టించుకోకుండా బదిలీ చేయడం సరికాదని తప్పుపట్టారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. లేఖను తీసుకుని ఇప్పటికే టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, జూపూడి ప్రభాకర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం రాసిన లేఖను ఈసీకి అందజేయనున్నారు. ఈసీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమరంలో రాత్రికి రాత్రే ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకోవడం తెలిసిందే.. నిఘా విభాగం బాస్‌ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

court 27032019

అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి సమాచారం అందించే, ముఖ్యమంత్రి రక్షణ బాధ్యతలు మాత్రమే చూసుకునే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు నిజానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదనీ, సీఎస్‌తో పాటు ఆయన కూడా ఈసీ పరిధిలోకి రారనీ, అయినా ఆయనపై వేటు వేయడం ఆశ్చర్యకరంగా ఉందనీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
వీరు ముగ్గురూ ఎలాంటి ఎన్నికల బాధ్యతలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ, హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది. ఇంటెలిజెన్స్‌లో తదుపరి సీనియర్‌ అధికారి ఆ విభాగం బాధ్యతలు చేపట్టాలని సూచించింది.

court 27032019

ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఫోన్లను కూడా ట్యాప్‌ చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఇటీవల పదేపదే ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గత నెలలో, వైసీపీ ముఖ్య నాయకులు విజయ్‌సాయిరెడ్డి గత శుక్రవారం, సాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు అందజేశారు. వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది. మరో పక్క, ఈ ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. లంచ్ విరామం తరువాత వాదనలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడం అభ్యంతరకరమని పిటిషన్‌లో పేర్కొంది. పిటిషన్‌పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల కమిషన్‌ నిన్న రాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ , ఏబీ వెంకటేశ్వరరావును హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌లో సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కడప, శ్రీకాకుళం ఎస్పీలు తమ తర్వాత ఉండే అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ వెల్లడించింది. ఇరువురు హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టులు చేయాలని, ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

ec jagan 27032019

వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి సమాచారం అందించే, ముఖ్యమంత్రి రక్షణ బాధ్యతలు మాత్రమే చూసుకునే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు నిజానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదనీ, సీఎస్‌తో పాటు ఆయన కూడా ఈసీ పరిధిలోకి రారనీ, అయినా ఆయనపై వేటు వేయడం ఆశ్చర్యకరంగా ఉందనీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కడప ఎస్పీపైనైతే ఫిర్యాదే లేదని గుర్తుచేస్తున్నాయి. సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకా హత్య కేసులో సన్నిహిత బంధువులపైనే అనుమానాలు తలెత్తడం, దీనిపై సిట్‌ విచారణ కీలక దశకు చేరి, అరెస్టులకు రంగం సిద్ధమైన తరుణంలో, నేరుగా ఎలాంటి ఆరోపణలు లేని కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మను బదిలీ చేయడం విచిత్రంగా ఉందని తెలిపాయి. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వైసీపీ చేసిన నిరాధార ఆరోపణను పరిగణనలో తీసుకొని ఈసీ బదిలీ చేసిందని వివరించాయి.

ec jagan 27032019

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గత నెలలో, వైసీపీ ముఖ్య నాయకులు విజయ్‌సాయిరెడ్డి గత శుక్రవారం, సాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు అందజేశారు. వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది. జగన్‌ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ చేస్తున్న దర్యాప్తు సరిగా లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి, వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీంతో కడప ఎస్పీగా ఉన్న రాహుల్‌ దేవ్‌ శర్మను బదిలీ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ అధికారి పోలీసు అధికారి యోగానంద్‌, చిత్తూరు, ప్రకాశం విజయనగరం ఎస్పీలు, తదితర పలువురు అధికారులపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

అసలు ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ప్రజాస్వామ్యం లేకుండా చెయ్యాలనే కుట్ర జరుగుతుందా ? ప్రజలు స్వేచ్చగా, అన్నీ ఆలోచించుకుని, ఎవరి ఓటు వెయ్యాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలి అనే ఆలోచన చేసే టైం కూడా లేకుండా, ఇన్ని కుట్రలా ? ఇన్ని కుట్రలు చేసి, ఏమన్నా సాధిస్తున్నారా అంటే, ప్రతిది సెల్ఫ్ గోల్. నిన్న రాష్ట్రంలో జరిగిన నాలుగు విషయాలు చూస్తే, జగన్ గురించి విస్తుపోయే నిజాలు బయటి రాబోతున్నాయా అనే సందేహం, వ్యక్తమవుతుంది. ఆ నాలుగు ఇవే..:1. ఎన్నికలు 15 రోజుల్లో పెట్టుకుని, ఇంత ముఖ్యమైన సమయంలో, జగన్ మోహన్ రెడ్డి, ప్రచారం చెయ్యకుండా, నిన్న అంతా, కేవలం హైదరాబాద్ లోని, తన లోటస్ పాండ్ కే ఎందుకు పరిమితం అయ్యారు ?

jagan 27032019

2.మొన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి, ఉన్నట్టు ఉండి, నిన్న అనారోగ్యం పేరుతో, బెంగుళూరు హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయ్యారు ? 3. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పై, సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని, సిట్‌ను ఆదేశించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు ? 4. నిన్న సాయంత్రం, కడప ఎస్పీ ఉన్న పలంగా బదిలీ అవ్వటం... ఈ నాలుగు విషయాలు దగ్గరగా గమనిస్తే, ఎదో పెద్ద విషయం బయటకు రాబోతుంది అని ముందే గ్రహించి, జగన్ మోహన్ రెడ్డి, నిన్నంతా ఎదో ప్లాన్ చేసారనే అనుమానం బల పడుతుంది.

jagan 27032019

గత రెండు రోజులగా మీడియాలో, వైఎస్ వివేక హత్య కేసులో అరెస్ట్ లు ఉండబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. వైఎస్ కుటుంబంలోనే వ్యక్తులే హత్య చేసారనే ఆధారాలు పోలీసులు వద్ద ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయాలు అన్నీ గమనిస్తే, జగన్ గురించి విస్తుపోయే నిజాలు బయటి రాబోతున్నాయా అనే సందేహం కచ్చితంగా కలుగుతుంది. ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోతే, హంతకుడుని పట్టుకోండి, శిక్ష వెయ్యండి అంటారు, కాని ఇక్కడ జగన్ మాత్రం, కోర్ట్ కి వెళ్లి మరీ, సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని, సిట్‌ను ఆదేశించాలని జగన్మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి, ఈ పరిణామాలతో, జగన్ మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే, అవును అనే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read