మార్గం ఏదైతేనేమీ ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఫామ్‌-7 అస్త్రాన్ని ఎంచుకున్న వైసీపీ కుట్రలను పోలీసులు ఛేదిస్తున్నారు. మొత్తం 376 కేసుల్లో ఇప్పటి వరకూ 2,288 మందిని గుర్తించిన పోలీసులు వారిలో ఎక్కువ మందిని విచారించారు. అందులో 83శాతం మంది జగన్‌ పార్టీ సానుభూతిపరులు, వైసీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సీడాక్‌ నుంచి ఐపీ అడ్ర్‌సల వివరాలు అందగానే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ నుంచి మంత్రి పరిటాల సునీత వరకూ మంత్రులు, పలువురు కీలక టీడీపీ నేతలను వైసీపీ లక్ష్యంగా చేసుకుంది. సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెకు సంబంధించిన చంద్రగిరి నియోజకవర్గంలో 19,225 దరఖాస్తులు అందితే విచారణలో తొలగించింది 8 మాత్రమే.

game 27032019

కళా వెంకట్రావు నియోజకవర్గమైన ఎచ్చెర్లలో 6,363 ఓటర్లను తొలగించాలంటూ ఫామ్‌-7 దరఖాస్తులు అందగా విచారణలో తొలగింపునకు అర్హమైనవి రెండు మాత్రమే. ఇంకా 16 విచారణలో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో 9,748 వస్తే అనర్హులంటూ తొలగించింది కేవలం ముగ్గురినే. విజయనగరం జిల్లాలో మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న బొబ్బిలిలో 5,904 దరఖాస్తులు వస్తే తొలగించింది ఐదు మాత్రమే. విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని భీమిలిలో 7,815 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెట్టిన వ్యక్తులు 101 మాత్రమే అర్హులపేర్లు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో స్వతంత్ర ఎమ్మెల్యే వర్మను సైతం ప్రత్యర్థులు వదల్లేదు.

game 27032019

ఆయన ప్రాతినిధం వహిస్తోన్న పిఠాపురంలో 5,231 ఓట్లు తొలగించేందుకు దరఖాస్తులు అందితే వాటిలో 127 మాత్రమే అర్హతగలవి. మైలవరంలో మంత్రి ఉమామహేశ్వరరావును దెబ్బ కొట్టేందుకు ప్రత్యర్థులు 6,334 ఓట్ల తొలగింపునకు వేసిన ఎత్తుగడ తిరగబడింది. మొత్తం విచారణ అనంతరం కేవలం 126 ఆమోదించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల ఓట్లు తొలగించేందుకు 7,859 దరఖాస్తులు వస్తే గురజాలలో తొలగించింది 239 మాత్రమే. అనంతపురం జిల్లా ధర్మవరంలో 6వేలకుపైగా వచ్చిన దరఖాస్తుల్లో 1100 తొలగించారు. వీటితోపాటు రాజాం, ఆముదాలవలస, చీపురుపల్లి, అనకాపల్లి, అనపర్తి, భీమవరం, చింతలపూడి, మార్కాపురంలలో వేలల్లో ఫామ్‌-7 దరఖాస్తులు అందగా వందల్లోనే తొలగించినట్లు తెలిసింది.

 

 

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వైసీపీ ప్రలోభాల పర్వం మరింత ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు విచ్చలవిడిగా నగదు, మందు పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా, పార్వతీపురంలో జగన్ సభకు వచ్చిన వారికి విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వ్యవహారం ఏబీఎన్ చేతికి చిక్కింది. టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని, తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపుల తాట తీస్తామని, మద్యం నియంత్రణ చేస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్ సభ కోసం మందు పంపిణీ చేసి జనాన్ని తరలిస్తున్నారు. వైసీపీ టోపీలు పెట్టుకుని, కండువాలు వేసుకుని, పార్టీ జెండాలు పట్టుకుని తాగి ఊగిపోయారు. అయితే నగదు పంపిణీలో తేడా రావడంతో కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వచ్చినందుకు ఇస్తామన్నంత డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమని కిందిస్థాయి కార్యకర్తలు నిలదీశారు. దీంతో ఈ వ్యవహారం రోడ్డున పడింది.

game 27032019

కృష్ణా జిల్లాలో కూడా ఇదే వ్యవహారం రిపీట్ అయ్యింది. ద్విచక్ర వాహనాల ర్యాలీకి వచ్చిన వారికి డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో వైసీపీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ర్యాలీకి వచ్చిన వారికి వైసీపీ నేతలు డబ్బులు పంచారు. ఈ వ్యవహారం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మరోవైపు, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీపై ఇతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

game 27032019

కొన్ని రోజుల క్రిందట ప్రకాశంలో కూడా ఇదే సీన్. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఈ దృశ్యాలు కనిపించాయి. వైసీపీ తరుపున ప్రచారంలో పాల్గొనే వారికి భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెబుతున్నారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. గంట పాటు జెండా పట్టుకుని వైసీపీ తరుపున ప్రచారంలో పాల్గొంటే రూ. 2000 ఇస్తామని కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నారట. అంటే రోజుకు ఓ కార్యకర్త మూడు గంటల పాటు ప్రచారంలో పాల్గొంటే ఏకంగా ఆరువేల రూపాయలు వైసీపీ నేతలు ముట్టచెబుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. కార్యకర్తలకు డబ్బులివ్వడంతో పాటు సిప్టుల వారిగా ప్రచారానికి తీసుకెళ్తున్నారు. ఒక కార్యకర్తకు గంటకు రెండు వేల రూపాలిస్తుంటే... రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారు... వాళ్లకు ఎంత సొమ్ము ముట్టచెబుతున్నారనేది ఇప్పడు సంచలనంగా మారింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీడీపీ మళ్లీ గెలిస్తే కలిగే లాభాలేంటి. ఒకవేళ రాక పోతే కలిగే నష్టాలేంటి... అనే అంశంపై విజయవాడకు చెందిన ఓ విద్యావంతుల బృందం వినూత్నంగా ప్రచారం చేస్తోంది. కొందరు విద్యావంతులు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం మళ్లీ వస్తే ఆంధ్రులు తొలిసారి తమ గడ్డపై నిర్మించుకుంటున్న రాజధాని అమరావతి దేశంలోనే అధునాతన నగరంగా రూపుదిద్దుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా, గోదావరి డెల్టాతో పాటు వాటిని అనుకుని ఉన్న జిల్లాలకు సాగునీటి భద్రత ఏర్పడుతుందని విద్యావంతుల బృదం ప్రచారం చేస్తోంది. అంతేకాదు పంచమ నదులు సంగమం ఆచరణ రూపం దాల్చుతుంది. నాగావళి, వంశదార, గోదావరిల్లోని మిగులు జలాలతో సీమ వరకు సాగునీరు అందుతుంది. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు పలుకుబడితో హోదా వస్తుంది. నిర్మాణంలో ఉన్నవి, ప్రతిపాదనలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రీనీవా, గాలేరు నగరి పూర్తవుతాయి. స్థిరమయిన విధానాలు, ప్రారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కొనసాగడం వల్ల ఇప్పటికే వచ్చిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలొస్తాయి. వాటి అనుబంధ పరిశ్రమలు వేగంగా వస్తాయి. ఉద్యోగ అవకాశాలతో పాటు భూముల రేట్లు పెరుగుతాయి. చంద్రబాబు దూరదృష్టి నిర్ణయాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు పెరుగడానికి ఇప్పటికే పడిన పునాది బలపడుతుంది.

చంద్రబాబు మళ్లీ వస్తారో.. లేదో అని తమ నిర్ణయాలు పెండింగ్‌లో పెట్టుకున్న పారిశ్రామిక వేత్తలు, సంస్థలు, విదేశీ పెట్టిబడిదారులు ఆయన మళ్లీ ఐదేళ్లు ఉంటారని తెలిస్తే ధైర్యంగా పెట్టుబడులు పెట్టాడానికి ముందుకు వస్తారు. టీడీపీ మళ్లీ గెలువకపోతే ఏం జరుగుతుందో కూడా విద్యావంతుల బృందం వివరిస్తోంది. టీడీపీ రాకపోతే అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటాయి. ప్రాధాన్యాలు మారి అమరావతిపై ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు వెనక్కి పోతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం కూడా తగ్గుతుంది. ఇది చంద్రబాబుకు పేరు తెచ్చిన ప్రాజెక్టు అనే కారణంగా డిజైన్ల మార్పు, కాంట్రాక్ట్ సంస్థల మార్పు వంటి ప్రతిపాదనలతో దాని రూపురేఖలు మార్చే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల జాప్యం జరుగుతుంది. నదుల అనుసంధానం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ప్రాధాన్యాలు మారిపోతాయి. తమకు పేరు రావాలన్న తపనలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పక్కకు పెట్టి కొత్తవాటిని ముందుకు తెచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఇదే జరిగింది. దీనివల్ల పాతవి ఆగిపోతాయి. కొత్తవి అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. సంక్షేమ పథకాల్లో కూడా మార్పుచేర్పులు మారుతాయి. పాత ప్రభుత్వ ముద్ర ఉన్న వాటివి కాకుండా తమకు పేరు తెచ్చేవి కావాలన్న తాపాయత్రంతో కొత్తపథకాలు ప్రవేశపెడుతారు. వీటికి డబ్బులు లేక పాతపథకాలు అటకెక్కుతాయి. దీని వల్ల పేదలు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కార్ ప్రభావం పెరుగుతుంది. తమకు ఇబ్బంది అనుకున్న పథకాలు, లేదా కార్యక్రమాల్ని తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా నిలిపివేస్తుంది. లేదా వేగం తగ్గేలా చూస్తుంది. ఉమ్మడి రాజధానిలోని ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం తన ఒత్తిడిని తగ్గించుకొనే ప్రమాదం ఉంది. సుమారు లక్ష కోట్ల విలువైన ఆస్తులపై వాటా కోల్పేయే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ మద్దతుతో పీఠమెక్కే వైసీపీ తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులకు దిగలేదు. ఏపీ ప్రభుత్వంలో కేసీఆర్ పలుకుబడి వల్ల హైదరాబాద్‌లోని ఆంధ్రులపై టీఆర్‌ఎస్ పట్టు మరింత పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, స్థిరాస్థి వ్యాపారులు అక్కడ ఆస్తులున్న వారు కేసీఆర్‌కు లోబడి ఉండాల్సి వస్తుంది. జగన్‌పై సీబీఐ కేసులు వల్ల కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న వైసీపీ సర్దుకుపోయే దోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్ర హక్కులు, అవసరాలపై వైసీపీ గట్టిగా అడగలేదు, పోరాడలేదు. అందుకు విద్యావంతుల బృందం మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఓటర్లను చైతన్య పరుస్తోంది.

 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత. ఆయన కొన్నేళ్లుగా.. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌పై ఓ రకంగా కక్ష గట్టారు. అదీ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులనే టార్గెట్‌గా చేసుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రా పోలీసులపై విరుచుకుపడుతున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదని కనీసం 50 సార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మొదటి నుంచి వైఎస్‌ జగన్‌ ఇదే వైఖరిని అవలంబిస్తున్నారు. సొంత రాష్ట్రంలోని అధికార వ్యవస్థల పట్ల వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. జగన్‌ ప్రసంగాల్లో పోలీసులు, అధికారుల పట్ల నమ్మకం లేదంటూ.. చెప్పడం పట్ల జనం కూడా ఆలోచనలో పడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తూ.. స్వరాష్ట్రంలోని వ్యవస్థలమీదే నమ్మకం లేకుంటే.. మరి.. జగన్‌మోహన్‌ను తాము ఎలా నమ్మాలని జనం పునరాలోచనలో పడ్డారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మాట్లాడితే నమ్మకం లేదంటున్నారు జగన్‌. పోలీసు వ్యవస్థ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొడుతున్నారు. గందరగోళ పరిస్థితులు సృష్టించడానికే ఇలా చేస్తున్నారా? పదే పదే ఈ వైఖరి అవలంబిస్తే పోలీసులు వెనక్కి తగ్గుతారనుకున్నారా ? పదుల సంఖ్యలో కేసులున్న తన జోలికి రారని డిసైడ్‌ అయ్యారా? వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికలకోసం నామినేషన్‌తో పాటు.. తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్వయంగా జగన్‌ ఈ వివరాలు పేర్కొన్నారు. 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు, పోలీస్‌స్టేషన్లు, కిందికోర్టుల్లో 13 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే.. స్వరాష్ట్రంలో రాజకీయాలు చేసే జగన్.. పొరుగు రాష్ట్రంలోనే నివసిస్తున్నారు.

ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పటికీ.. రాష్ట్రానికి చుట్టపు చూపుగానే.. వచ్చిపోతున్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో సొంత రాష్ట్రంలోని పోలీసులు తన జోలికి రాకుండా ఉండేందుకే జగన్‌.. రివర్స్‌ ఎటాక్‌ చేస్తున్నారా అన్న చర్చ ఏపీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. విశాఖ కమిషనర్‌ యోగానంద్‌ను నెట్టేసి సంగతి చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చిన జగన్‌ మోహన్‌రెడ్డి.. తాను ఎవరినీ మర్చిపోనని చెప్పుకున్నారు. 2017 జనవరి 26.. రిపబ్లిక్‌ డే రోజున విశాఖలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో అనుమతిలేని నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగన్‌ వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లిన జగన్‌.. ఎయిర్‌పోర్టు రన్‌వే పైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంలో.. అప్పటి విశాఖ పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ను పక్కకు తోసేయడంతో పాటు.. సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నెలరోజులకే కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌.. జిల్లా కలెక్టర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. పోలీస్‌ టు కలెక్టర్‌ అందరూ అవినీతికి పాల్పడుతున్నారని, నిన్ను కూడా సెంట్రల్‌జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

ఇలా.. ప్రధానంగా ఏపీ పోలీసులనే టార్గెట్‌గా చేసుకున్న వైఎస్‌ జగన్‌.. కోడికత్తి కేసు విషయంలో బోల్తా పడ్డారు. సంఘటన జరగ్గానే ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ కేసుపై దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పదులసంఖ్యలో సాక్షులను, అనుమానితులను ప్రశ్నించి మూలాలను కూడా వెలికి తీసేందుకు యత్నించారు. కానీ.. ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం లేదన్న జగన్‌.. కేంద్రప్రభుత్వ పెద్దలకూ ఫిర్యాదుచేశారు. ఏపీ పోలీసులు మినహా.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. ఫలితంగా ఉగ్రవాదంపై నిరంతరం నిఘా పెట్టే, దేశ భద్రతకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ తో మరోసారి కోడికత్తి కేసును దర్యాప్తు చేయించారు. కానీ.. ఎన్‌ఐఏ దర్యాప్తులో ఏ ఒక్క కొత్త అంశమూ బయటకు రాలేదు. ఏపీ పోలీసులు దర్యాప్తులో ఏం తేల్చారో ఎన్‌ఐఏ కూడా చివరకు అదే తేల్చింది. కానీ.. వైఎస్‌ జగన్‌ సహా.. వైసీపీ నేతలు ఆ సమయంలో నానాయాగీ చేశారన్న విమర్శలు వచ్చాయి. కీలక కేసులను దర్యాప్తు చేయాల్సిన ఎన్‌ఐఏ అధికారులను ఇంత చిన్న కేసులో జోక్యం చేసుకునేలా చేశారన్న ఆరోపణలు తలెత్తాయి. పైగా.. విశాఖలో కోడికత్తితో దాడి జరిగితే.. అవే రక్తపు మరకలతో జగన్‌ హైదరాబాద్‌ దాకా వచ్చారు. ఏపీలో కనీసం అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేయించుకునేందుకు కూడా నమ్మకం లేదన్న జగన్‌ తీరు ఎన్నికల సమయంలో ఆలోచనను రేకెత్తిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read