హైదరాబాద్ లో కూర్చుని, చంద్రబాబు పై, ఏపి పై విషం చిమ్ముతున్న బ్యాచ్ కి, జగన్ మోహన్ రెడ్డి దగ్గరుండి, తన పార్టీలో చేర్చుకంటున్నారు. అంటే, మొన్నటి దాక వీళ్ళను దగ్గర ఉండి, ఒక ప్లాన్ ప్రకారం, ఈ విషం చిమ్మించింది, జగన్ మోహన్ రెడ్డే అనే విషయం ఇట్టే అర్ధమై పోతుంది. మొన్న మోహన్ బాబు, చంద్రబాబు పై ధర్నా అంటూ, అసంబద్ధంగా హడావిడి చేసి, ధర్నా చేసి, కుటుంబరావు చేతిలో లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకున్న సంగతి తెలిసిందే. తరువాత రోజే జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి, లోటస్ పాండ్ లో, తన మెడలో గోల్డ్ మెడల్ లాగా, వైసీపీ కండువా కప్పుకున్నారు. అంటే మొన్న చేసిన ధర్నా, ఎవరి కోసం చేసారో, ఎందుకు చేసారో అర్ధమైపోతుంది.

chini 28032019 1

అలాగే, పవన్ కళ్యాణ్, కేసీఆర్ పై విరుచుకుపడుతున్న తీరుతో, మరొక హైదరాబాదీ ఇబ్బంది పడుతూ ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్, కేసీఆర్ ఆంధ్రాకి చేసిన అవమానం గురించి మాట్లాడుతుంటే, చిన్ని కృష్ణ అంటే ఒక అవుట్ డేటెడ్ సినిమా రచియిత హడావిడి చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై విమర్శల పేరుతో, ఏపి పై తన ద్వేషాన్ని చూపించాడు. ఏపి దిగువ రాష్ట్రం అని, ఎగువ రాష్ట్రం అయిన తెలంగాణా ముందు తలదించుకుని ఉండాలని అన్నారు. అంతే కాదు, ఏపి రాష్ట్రాన్ని ఒక బాత్ రూమ్ తో పోల్చి, ముందు అది కంపు కొట్టకుండా కడుక్కోండి అంటూ ఏపి ప్రజలని అవమానించాడు, చిన్ని కృష్ణా. దీంతో, అతని మేడలో కూడా గోల్డ్ మెడల్ వేసాడు జగన్..

chini 28032019 1

పశ్చిమగోదావరిలోని పాలకొల్లులో నిర్వహించిన సభలో వైసీపీ అధినేత జగన్ ఈరోజు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దనీ, రాజన్న రాజ్యం తెచ్చుకుందామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పిల్లలందరినీ ఎంత ఖర్చయినా ఉచితంగా చదివిస్తామని జగన్ ప్రకటించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సినీ రచయిత చిన్ని కృష్ణ వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో భావోద్వేగానికి లోనైన చిన్ని కృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. చిన్ని కృష్ణతో పాటు ప్రముఖ ఎస్సీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, దళిత నేత గురుప్రసాద్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ జగన్ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై భారత ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలతో, తన పై చర్యలు తీసుకోవటం పై, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ కూడా ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసారు. నిన్న శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల వెంకటరత్నం కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ కూడా లేఖ రాసారు. వైకాపా నాయకులు తనపై భారత ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై తగిన విచారణ జరిపించాలని... బదిలీ అయిన కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కోరారు. విచారణలో తన తప్పుందని తేలితే... తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవొచ్చని, లేనిపక్షంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

kadapa 28032019

ఈ మేరకు బుధవారం ద్వివేదీకి ఆయన లేఖ రాశారు. ‘‘ఫిబ్రవరి 18న కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు చేపట్టా. అప్పటి నుంచి జిల్లాలో పర్యటిస్తున్నా. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా. అయితే మంగళవారం రాత్రి నన్ను బదిలీచేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఏ కారణంతో బదిలీ చేస్తున్నారనేది అందులో ప్రస్తావించలేదని’’ లేఖలో పేర్కొన్నారు. "వైకాపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నాపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఏ ఆరోపణలు ఆధారంగా చర్యలు తీసుకున్నారో అర్థం కావట్లేదు. నాపై వచ్చిన ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరిపిందా? లేదా? అనేది కూడా తెలీదు. 2010 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారినైన నేను ఎనిమిదేళ్లుగా సర్వీసులో ఉన్నా. ఎలాంటి మచ్చ లేని రికార్డు నాకుంది. కానీ ఎన్నికల సంఘం ఆకస్మికంగా బదిలీ చేయటం నా నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉంది. అందుకే వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తప్పెవరిదో తేల్చండి. " అని అన్నారు.

ఎన్నికల కమిషన్కు ఘాటుగా సమాధానం ఇచ్చిన శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం గారు నిజాయితీపరుడు కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి.. చెంప చెళ్ళుమనేలాంటి జవాబిచ్చిన శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం. సీఈఓ ద్వివేది కి లేఖ. విజయ సాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సాక్ష్యాలతో సహా నిరూపించిన ఎస్ పి. తనపై తప్పుడు ఆరోపణలు చేరిన విజయసాయి రెడ్డి బృందంపై 182 ఐపీసీ కింద కేసు వేయనున్న ఎస్ పి. విజయసాయి రెడ్డి కి శిక్ష తప్పని పరిస్థితి. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలి లేదా ఆరోపణలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఎస్ పి డిమాండ్. ఎంత స్పీడ్ గా విజయ సాయి రెడ్డి ఆరోపణల ఆధారంగా తనపై బదిలీ వేటు వేసారో అంతే స్పీడ్ గా తాను దోషో నిర్దోషో తేల్చాలన్న ఎస్ పి.

srikakulam 27032019 1

ఇంతే కాక పరువు నష్టం దావా కూడా వేయనున్న ఎస్ పి. SI స్థాయి నుంచి ముప్పై ఏళ్ళ కష్టంతో ఈ స్థాయిని వచ్చాను. తప్పుడు ఆరోపణలతో నా ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీశారు. కుటుంబం, మిత్రులు, బంధువులు, సమాజం తాను వ్యక్తిత్వాన్ని అనుమానించే పరిస్థితి వచ్చిందన్న ఎస్ పి. నిజమేమిటో తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అన్న ఎస్ పి. ఇదే బాటలో ఇతర ఐపిఎస్ లు. విజయసాయి రెడ్డి తో పాటు ఇరుక్కున్న ఎలక్షన్ కమిషన్. పరువు నష్టం దావాలు ఎదుర్కోక తప్పని ఎలక్షన్ కమిషన్ సభ్యులు. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం, ఏ శిక్షణ అయినా వేసుకోండి అంటూ ఈసీకి లేఖ.. తన పై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని చెప్పిన ఎస్పీ..

srikakulam 27032019 1

రూ.50 కోట్లతో వెళ్తున్న నారయణ కాలేజీ వ్యాన్ కు ఎస్కార్ట్ ఇచ్చాను అంటూ, విజయసాయి తప్పుడు ఆరోపణలు చేసారని అన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ నాకు ఫోన్ చేసి, ఆ వ్యాన్ కు ఎస్కార్ట్ ఇవ్వమంటే, నేను ఇచ్చాను అంటూ చెప్పటం నిరాధారం అని అనంరు. మార్చ్ 18న నేను అసలు బయట లేనని, శాఖా పరమైన సమీక్షలో ఉన్నానని అన్నారు. కావలంటే ఫోటోలు, రికార్డులు చూడాలని, అవి కూడా జతపరిచారు. తన పరువు, ప్రతిష్ట భంగం కలిగించిన, విజయసాయి రెడ్డి పై, క్రిమినల్, సివిల్ చర్యలు చేపట్టాలని, కోరినట్టు చెప్పారు. మొత్తానికి నిబద్ధత కలిగిన ఆఫీసర్ లని, దొంగలు వేలెత్తి చూపితే ఎలా ఉంటుందో, ఎస్పీ చేసి చూపించారు.

విధి అంటే అదే. కొద్దీ గంటల క్రితం వరకు అతను జిల్లాకు ఎస్ పి. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ ఎస్ సర్ అని సెల్యూట్ కొట్టేవాళ్ళు. బదిలీ అయింది. తనదొక ఫిర్యాదు ఉంది. టు టౌన్ పోలీస్ స్టేషన్ కెళ్ళి అయ్యా ఇదీ నా విన్నపం, న్యాయం చెయ్యండి అని దరఖాస్తు పెట్టాడు. విధి అంటే అదే. అదే విధి విజయ సాయి రెడ్డి ని వెంటాడబోతోంది. తప్పుడు ఆరోపణలు చేసి ఢిల్లీ లో ప్రెస్ మీట్లు పెట్టి విర్రవీగే తాను ఇప్పుడిక శ్రీకాకుళం టు టౌన్ SI ముందు దోషిగా నిలబడి సంజాయిషీ ఇచ్చుకోబోతున్నాడు. ఎంత సంజాయిషీ ఇచ్చినా ఇవ్వాళ కాకపోతే రేపు దోషి గా నిర్ధారణ తప్పదు, శిక్ష తప్పదు. ఇది ఎవరి గొప్పదనమో కాదు. సత్యం, ధర్మం, న్యాయం - ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు. ఏ యుగంలోనయినా విశ్వాన్ని నడిపిస్తాయి.

kadapa 28032019

ఇదే విషయం పై ఎస్పీ వెంకటరత్నం నిన్న ఈసీకి కూడా లేఖ రాసారు. వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై భారత ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని... శ్రీకాకుళం నుంచి బదిలీ అయిన ఎస్పీ అడ్డాల వెంకటరత్నం ప్రకటించారు. విచారణలో తాను తప్పు చేసినట్లు తేలితే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, లేనిపక్షంలో తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విన్నవిస్తూ లేఖ రాశారు.

kadapa 28032019

విజయసాయిరెడ్డి ఫిర్యాదులోని ఆరోపణల ఆధారంగా తనను బదిలీ చేస్తూ ఎంత వేగంగా చర్యలు తీసుకున్నారో... అంతే వేగంగా తాను తప్పు చేశానో లేదో తేల్చాలని లేఖలో వెంకటరత్నం కోరారు. తనపై తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 182 కింద కేసు పెట్టాలని ఫిర్యాదు ఇవ్వటంతో పాటు, సివిల్‌, క్రిమినల్‌ పరువు నష్టం దావాలు వేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘ముప్పై ఏళ్లుగా నిజాయతీతో బతుకుతున్నా.. ఇప్పుడు ఒక్కసారిగా నా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు పరువు పోయింది.. నాపై ఆరోపణలు నిరూపించాలి లేదా నాపై తప్పుడు ఆరోపణలు చేసినవారి (విజయసాయిరెడ్డి)పై చర్యలు తీసుకోవాలి’ అని ఐపీఎస్‌ అధికారి వెంకటరత్నం అన్నారు.

Advertisements

Latest Articles

Most Read