‘తమ యజమానిని ఎలాగైనా సీఎం చేయాలన్నదే లక్ష్యం.. అందుకు ఎవరిపైన అయినా విషం కక్కేందుకు సిద్ధం. కల్పిత వార్తలతో మమ్మల్ని మానసికంగా బెదిరించడం ఈ సమాజానికే నష్టం. సమాజ హితం కోరేందుకే పత్రికలు, పార్టీలు ఉన్నాయా లేదా తమ స్వలాభం కోసం పోలీసులపై విషం చిమ్మేందుకా?’ అని రాష్ట్ర పోలీసులు మండిపడుతున్నారు. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు కొందరు ఉన్నతస్థాయి పోలీసు అధికారులపై ఒక రాజకీయ పార్టీకి చెందిన పత్రిక రాస్తోన్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీ అధికారం చేపట్టాలంటే ప్రజా విశ్వాసం గెలుచుకోవడమే మార్గం తప్ప పోలీసుల్ని నిందించడం కాదని హితవు పలికారు. పోలీసు ఉన్నతాధికారులను టార్గెట్‌ చేసి కింది స్థాయి కేడర్‌ను భయపెట్టాలన్న కుట్ర కోణం తప్పుడు వార్తల్లో కనిపిస్తోందని రాయలసీమకు చెందిన ఒక పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.

police 26032019

పొరుగు రాష్ట్రాల నుంచి పోలింగ్‌కు ముందే ఇక్కడికి భారీగా డబ్బులు తెచ్చేందుకు ఎత్తుగడ వేసిన ఒక రాజకీయ పార్టీ.. అటువైపు పోలీసులు చూడకుండా ముందుగానే మైండ్‌గేమ్‌ ఆడుతోందన్నారు. ఇలాంటి కుట్రలు తిప్పికొడతామని హెచ్చరించారు. రాష్ట్రాలు నియమించుకున్న డీజీపీల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆర్పీ ఠాకూర్‌ మార్పు తథ్యం అంటూ పుట్టించారని.. కానీ 2018 జూలై 3 తర్వాత మాత్రమేనని తీర్పులో పేర్కొన్న విషయం ఇలాంటి కల్పిత వార్తలు సృష్టించే వారికి కనపడదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి ఎద్దేవా చేశారు. జూన్‌ 30న నియమితులైన ఏపీ డీజీపీ విషయంలో ఇది వర్తించబోదని స్పష్టంగా ఉన్నా.. కిందిస్థాయి పోలీసుల్లో గందరగోళం సృష్టించేందుకు వేసిన ఎత్తుగడ ఫెయిల్‌ అయిందన్నారు.

police 26032019

విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతపై కోడికత్తితో దాడి సమయంలో అన్ని జిల్లాల ఎస్పీలు, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌తో మంగళగిరిలోని పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో డీజీపీ సమావేశమయ్యారని విశాఖ జిల్లా కు చెందిన పోలీస్‌ అధికారి తెలిపారు. దాడి విషయం తెలియగానే అక్కడి పోలీసులతో కమిషనర్‌ మాట్లాడగా.. నిందితుడి ఫోన్‌లో జగన్‌తో కలిసి తీసుకున్న ఫొటో ఉందన్న విషయం తెలిసిందన్నారు. విమానాశ్రయ సిబ్బంది ఇచ్చిన లేఖలో జగన్‌కు సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్లు ఉందనే సమాచారం అందిందన్నారు. ఇదే సమయంలో ఒక టీవీచానల్‌ చేసిన హడావుడి, జగన్‌ పార్టీ నేతలు ఇచ్చిన స్టేట్‌మెంట్లు చూసిన ఏ పోలీసుకైనా రాష్ట్రంలో అల్లర్లు రెచ్చగొడుతున్నారని అర్థమవుతుందని, శాంతిభద్రతలు అదుపు తప్పకూడదన్న ఉద్దేశంతోనే అసలు విషయాన్ని డీజీపీ వెల్లడించారని ఆ పోలీసు అధికారి స్పష్టం చేశారు. అలా చేయకపోయి ఉంటే బెజవాడలో రంగా హత్య జరిగినప్పటి రోజు పునరావృతమయ్యేదేమో! అన్నారు. ‘శాంతిభద్రతలపై అధికారులతో మాట్లాడటమే డీజీపీ కర్తవ్యం. ఇది వదిలేసి రోడ్డుపై ఆయన లాఠీ పట్టుకుని నిలబడతారా? స్టేషన్లో కూర్చుని ఎఫ్‌ఐఆర్‌ రాసుకుంటారా? అని మరొకరు ప్రశ్నించారు. ఆయన ఠాకూర్‌ కులం ఈ రాష్ట్రంలోనే లేదని, కానీ ఆయనకెందుకు కులం ఆపాదిస్తున్నారో అర్థం కావడం లేదని మరో పోలీసు పెదవి విరిచారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపు చేస్తున్న తమ బాస్‌పై ఇంత అక్కసు ఎందుకు వెళ్లగక్కుతున్నారని మండిపడుతున్నారు.

 

మొన్న తన కొడుకులును వేసుకుని, తిరుపతిలో రచ్చ రచ్చ చేసిన మోహన్ బాబు, ఈ రోజు తన ముసుగు తొలగించారు. ఎన్నికల 20 రోజులు ముందు, నాకు డబ్బులు రావాలి, చంద్రబాబు మోసం చేసాడు అంటూ, హడావిడి చేసిన మోహన్ బాబు అసలు నైజం ఇప్పుడు బయట పడింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న కుట్రలో, తానూ ఒక భాగస్వామిని అని చెప్పకనే చెప్పారు మోహన్ బాబు. ఈ రోజు మోహన్ బాబు వైసీపీలో చేరారు. మోహన్ బాబు లోటస్‌పాండ్‌‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా.. వైఎస్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

mohababu 26032019

పార్టీలో చేరిన అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. తాను పదవి ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. తెలుగు ప్రజల మేలు కోసమే వైసీపీలో చేరానన్నారు. "ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబుతో ఎన్నోసార్లు మాట్లాడాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇంకా రూ. 19 కోట్లు రావాలి. మూడు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని చేయలేదు. కాపు విద్యార్థులకు రావాల్సిన రూ. 2 కోట్లు ఇవ్వలేదు. వైసీపీలో చేరాలని జగన్‌ మూడేళ్ల కిందటే అడిగారు. ఏపీకి జగన్‌ సీఎం అయితే బాగుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశిస్తే కార్యకర్తగా ప్రచారం చేస్తా. రేపు లేదా ఎల్లుండి ప్రచారానికి నేను వెళ్లొచ్చు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

mohababu 26032019

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ హయాంలో కీలకనేతగా మోహన్ బాబు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తరువాత తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు గెంటారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారు. వైసీపీతో మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబుకు రాజ్యసభ సీటిచ్చి ఢిల్లీకి పంపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కలెక్షన్‌కింగ్ కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మంచు మనోజ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ప్రజాసేవ చేయాలని హైదరాబాద్‌ను వదిలి తిరుపతికి వెళ్లడంతో అప్పట్లో మోహన్ బాబు కుటుంబం మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటోందని.. అందుకే ప్రజలకు దగ్గరయ్యేందుకు కార్యక్రమాలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మద్దతు తీసుకుంటే తప్పేంటని జగన్‌ మాట్లాడుతున్నారని, వెయ్యి కోట్లు తీసుకున్నట్లు మీరు చూశారా అని జగన్‌ మాట్లాడుతున్నారని, ఆంధ్రావాళ్లు దొంగలు అన్న కేసీఆర్‌తో జగన్‌ ఎలా కలుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ పదేళ్లు హైదరాబాద్‌లో ఉంటే అనాథలుగా ఉండేవాళ్లమని ఆయన అన్నారు. "తెలంగాణ నుంచి లక్ష కోట్ల ఆస్తులు రావాలి.. వాటా ఇవ్వలేదు. కేంద్రం కూడా మనకు అన్యాయం చేసింది. జనాభా ప్రకారం ఆస్తులు ఇవ్వాలని సుప్రీం కూడా చెప్పింది. విభజన హామీలు ఇంకా నెరవేరలేదు... ప్రత్యేక హోదా రాలేదు. కేసీఆర్‌ డబ్బులకు కక్కుర్తి పడి జగన్‌ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. జగన్‌ కేసులకు భయపడి సరెండర్ అయ్యారు. "

cbn 26032019

"రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేలా రాజకీయాలు చేస్తే ఖబడ్దార్‌. ఏపీపై కేసీఆర్‌ పెత్తనాన్ని ఒప్పుకుంటారా?. రాష్ట్రంలో కరువు, తుఫాన్లు సమస్య కాదు.. కోడికత్తి పార్టీనే సమస్య. కేసీఆర్‌కు జగన్‌ దాసోహం. ఆయనతో కలిస్తే తప్పేంటి ఇప్పుడే అన్నారు. కేసీఆర్‌ ఎందుకు పోలవరంపై సుప్రీంకు వెళ్లాడు. దీనిపై జగన్‌ సమాధానం చెప్పాలి. కేసీఆర్‌ను జగన్‌ సపోర్ట్ చేస్తుంటే మీకు కోపం రాదా? రక్తం ఉడికిపోతోంది. జగన్‌...హైదరాబాద్‌ వెళ్లి లోటస్‌పాండ్‌లో ఉండు. తెలంగాణలో పోటీ చెయ్‌.. కేసీఆర్‌ దగ్గర మంత్రిగా ఉండు. ఆంధ్రా ప్రజలు దేశంలో పౌరులు కాదా.. మనకు రోషం లేదా?. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఏపీలో వచ్చి పోటీ చేయాలి. "

cbn 26032019

"సాగర్‌ నుంచి మనకు రావాల్సి నీళ్లు రానివ్వడం లేదు. ఆంధ్రా ప్రజలు జగన్‌ను క్షమించరు. ప్రాణాలైన పొగొట్టుకుంటాం కానీ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టం. తెలుగుజాతి ఎవరి దగ్గర భిక్షం ఎత్తాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ఆటలు సాగనివ్వం. రాజధానికి మోదీ ఇచ్చింది 1500 కోట్లు. రైతులు 50 వేల కోట్ల విలువైన భూములు ఇచ్చారు. కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలు..సానుభూతి మాకు అక్కర్లేదు. కేసీఆర్‌..రాజధాని శంకుస్థాపనకు వచ్చి 500 కోట్లు ఇవ్వాలనుకున్నాడట. మీ ముష్టి అక్కర్లేదు.. మాకు రావాల్సిన లక్ష కోట్లు ఇవ్వండి. ’’ అని అన్నారు. ఆంధ్రా వాళ్లు తనకి ఊడిగం చేయాలి అన్న రీతిలో కేసీఆర్ కుట్రలు పన్నుతుంటే సహించొద్దని అన్నారు. అలాంటి వ్యక్తితో కలిస్తే తప్పేంటి అని జగన్ అంటున్నాడంటే.. అతడి వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. అవకాశం, వితండవాదంతో జగన్ తన బలహీనతలన్నింటినీ బహిర్గతం చేసుకుంటున్నాడని విమర్శించారు.

ప్రతి ఒక్కరూ సమాన గౌరవం పొందే లౌకిక, ప్రజాస్వామ్య భారతాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్య సాధనకు భావసారూప్యంగల పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. చంద్రబాబుకి అన్ని విధాలా అండగా ఉంటానని చాటిచెప్పేందుకే ఇక్కడ ప్రచారానికి వచ్చానని చెప్పారు. సోమవారం రాత్రి విజయవాడ చేరుకున్న ఆయన కొందరు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. చంద్రబాబు మైనార్టీల పట్ల తన సుహృద్భావాన్ని గతంలోనే నిరూపించుకున్నారని, ఇదే సందేశాన్ని రాష్ట్రంలోని మైనార్టీలకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఇస్తానని చెప్పారు.

farookh 26032019 1

‘‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సోదర రాష్ట్రాలు. రెండు రాష్ట్రాలు ఒకరి కష్టాల్లో మరొకరు పాలుపంచుకోవాలి. మోదీ ఒక్కరే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చగలరని కేసీఆర్‌ అనుకుంటే తప్పు.’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భాజపాయేతర పార్టీల కూటమిపై మాట్లాడుతూ ‘‘మేం ప్రజల కోసం మెరుగైన భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నాం. విజయం సాధిస్తామన్న ఆశ ఉంది’’ అని చెప్పారు. ఏపీకిచ్చిన ఏ హామీని కేంద్రంలోని భాజపా నాయకులు అమలు చేయలేదు..మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు అని ఆయన చెప్పారు.‘‘ బాలాకోట్‌ దాడులకు ముందు రామమందిరం గురించి మాట్లాడినవాళ్లు ఇప్పుడు మాట్లాడటం లేదు. దాడుల తర్వాత కశ్మీరులో ఉగ్రవాదం తగ్గిందా? పాక్‌కు నిజంగానే గుణపాఠం చెప్పగలిగారా?

farookh 26032019 1

సర్జికల్‌ దాడుల్లో 300 మంది... 500మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. నిజంగానే అంతమంది చనిపోతే... అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెట్టదా?’’అని ప్రశ్నించారు. మోదీ న్యూజిలాండ్‌ ప్రధానిని చూసి నేర్చుకోవాలని ఫరూక్‌ అభిప్రాయపడ్డారు. కోరేగావ్‌లో ఒక కుటుంబంపై 40 మంది గూండాలు దాడి చేస్తే, ఆ కుటుంబానికి మద్దతుగా ప్రధాని మోదీ ఒక్క మాటా మాట్లాడలేదు, అదే న్యూజిలాండ్‌ ప్రధాని మసీదులో జరిగిన దాడుల్లో చనిపోయిన వారికి చెందిన ప్రతి కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు. ‘‘ట్రిపుల్‌ తలాక్‌ కంటే మహిళా రిజర్వేషన్‌ ముఖ్యం కాదా?అని ప్రశ్నించారు. వాజ్‌పేయికి, మోదీ ఇద్దరూ ఒకే మాతృసంస్థ నుంచి వచ్చినా ఇద్దరికీ పోలికే లేదన్నారు. వాజ్‌పేయి 23 పార్టీల్ని ఏకతాటిపై నడిపించారని గుర్తుచేశారు. 370వ అధికరణను ఎవరూ తొలగించలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read