ఎన్నికల్లో గెలవలేమని 6 నెలల ముందే మోదీ, జగన్‌కు తెలుసని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారంతా ఎన్ని వేల కోట్లు వెదజల్లినా ప్రజాతీర్పును మాత్రం మార్చలేరని చెప్పారు. మోదీ, అమిత్‌ షాకు వ్యవస్థల నాశనంతో సంతృప్తి లేదన్నారు. అందుకే ఇప్పుడు ఏకంగా ఈసీకే తూట్లు పొడిచే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థల మనుగడకే బీజేపీ పెను ప్రమాదంగా మారిందన్నారు. అందుకోసమే సేవ్ డెమోక్రసీ-సేవ్ కానిస్టిట్యూషన్ ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా అన్యాయాలను ఎదుర్కోవాల్సింది ప్రజలేనని పిలుపునిచ్చారు. అలాగే జగన్, కేసీఆర్ కుట్రలను భగ్నం చేయాల్సింది కూడా జనమేనని తెలిపారు. భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నామని, ఈ ధర్మపోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేయాలని కోరారు.

game 27032019

ఇంటలిజెన్స్ డీజీకి ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉంటుందా..? , నిఘా విభాగాధికారిని బదిలీ చేయడం ఏపీపై కక్ష సాధింపేనన్నారు. జగన్ కోరేదే మోదీ చేస్తాడు...జగన్ అడిగిందే కేసీఆర్‌ ఇస్తాడని స్పష్టంచేశారు. మోదీ, అమిత్‌షా, కేసీఆర్‌, జగన్ ఏపీకి దుష్టచతుష్టయమని వెల్లడించారు. మూడు పార్టీలకు పోయేకాలం దాపురించిందన్నారు. అందుకే ఇన్ని దుర్మార్గాలు-దాష్టీకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరానికి టీఆర్‌ఎస్‌ అడ్డుపుల్లలు, పదేపదే కొర్రీలు పెడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని వివరించారు. ఏపీ రైతుల్లో ఆనందం చూసి కేసీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమ చెరువుల్లో నీళ్లు చూసి ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు.

game 27032019

అలాగే వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు సమాధి చేసే కుట్ర జరుగుతుందన్నారు. సిట్ నివేదిక బయటకు రాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని వివరించారు. హంతకుల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు. గొరిల్లా యుద్ధంలో జగన్ సిద్ధహస్తుడు.. దొంగ దెబ్బ తీసి పారిపోవడం జగన్‌కు అలవాటేనన్నారు. నిన్న ఏ-1 జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో పత్తాలేడని ఎద్దేవాచేశారు. ఏ-2 విజయసాయి రెడ్డి నిన్న కలుగులో నక్కాడన్నారు. అంటే ఎక్కడో కుట్రలకు స్కెచ్‌లు వేసినట్లేనని చెప్పారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌ పెత్తనానికి ఓటేసినట్లేనని వివరించారు. దేశానికి నరేంద్రమోదీ ఒక విపత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు జగన్మోహన్ రెడ్డి తీవ్ర విపత్తుగా అభివర్ణించారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు అడ్డాల వెంకటరత్నం, రాహుల్‌దేవ్‌శర్మలను ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి ఆకస్మికంగా బదిలీ చేసింది. వారిని పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.నిఘా విభాగంలో ప్రస్తుతం తన తర్వాత అధికారికి బాధ్యతలు అప్పగించి వెంకటేశ్వరరావు రిలీవ్‌ కావాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు, బాధ్యతలు అప్పగించరాదని స్పష్టం చేసింది. శ్రీకాకుళం, కడప ఎస్పీలు వారి తర్వాతి ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణమే రిలీవ్‌ కావాలని ఆదేశించింది. వీరిని ఎన్నికల విధులు, బాధ్యతలకు దూరంగా ఉంచాలని పేర్కొంది.

vs reddy 27032019

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని నిబంధనలు స్పష్టంచేస్తున్నందున రాష్ట్రంలోని కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఈసీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ జీవో వెలువరించిన కాసేపటికే ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల ముందు ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ సహా, ఇద్దరు ఎస్పీల బదిలీకి కారణమేంటని ఎన్నికల సంఘాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఆర్థిక నేరస్థుడు విజయసాయిరెడ్డి పిటిషన్‌ ఆధారంగా బదిలీ చేస్తారా? అని నిలదీశారు. ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టాలని చూడడం సబబు కాదన్నారు. ఏ కారణంతో బదిలీ చేశారో సమాధానం చెప్పలేకపోతున్నారని చంద్రబాబు ఈసీకి లేఖ రాసారు..

vs reddy 27032019

అయితే, ఈ పరిణామాల నేపధ్యంలో, విజయసాయి రెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పుడు బయట పడి, వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని బయట పెట్టింది. శుక్రవారం విజయసాయి రెడ్డి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. అందులో విజయసాయి మాట్లాడుతూ, సోమవారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం, మంగళవారం ఈ ఆఫీసర్ల పై చర్యలు తీసుకుంటారు అంటూ నొక్కి మరీ చెప్పారు. అయితే, ఆశ్చర్యంగా, విజయసాయి రెడ్డి చెప్పినట్టే, జరిగింది. మంగళవారం రాత్రి, ముగ్గురు ఆఫీసర్లని బదిలీ చేసారు. ఇప్పుడు తెలుగుదేశం వాదనకి బలం చేకూరినట్టు అయ్యింది. మోడీ, జగన్, ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణల నేపధ్యంలో, విజయసాయి రెడ్డి వీడియో, బయట పడటంతో, వైసీపీ, బీజేపీ ఆత్మరక్షణలో పడ్డాయి... Video:https://www.facebook.com/VoteforTDP/videos/1204327776391244/

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హోరు రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఓవైపు బహిరంగ సభలు.. రోడ్ షో ప్రచారాలు.. మరోవైపు అంతర్గత వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే పథక రచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చలన్నీ టీడీపీ, వైసీపీ, జనసేన చుట్టే తిరుగుతుండగా.. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని అంతా లైట్ తీసుకుంటూ వచ్చారు. కానీ పాల్ అడుగులు చూస్తుంటే ఆయన వ్యూహం వేరే ఉందన్న విషయం అర్థమవుతోంది. అనంతపురంలో ఆయన నిలబెట్టిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే ఆయన టార్గెట్ ఎవరో తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో ప్రజాశాంతి పార్టీ తరుపున బరిలో నిలిపిన అభ్యర్థులంతా వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండటం గమనార్హం.

ka paul 27032019

కేఏ పాల్ ఏరి కోరి మరీ వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న వ్యక్తులనే ఎన్నికల్లో నిలిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, అనంతపురం అర్బన్, కల్యాణదుర్గం, రాప్తాడు, పెనుకొండ, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్నవారే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ తరుపున బరిలో దిగారు. అటు ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థి పేరుతో ఉన్న అభ్యర్థినే ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది.వైసీపీ తరుపున ఇక్కడి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీ చేస్తుండగా.. ప్రజాశాంతి పార్టీ తరుపున కూడా అదే పేరుతో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీకి సిద్దమయ్యారు. పెనుగొండలో ఎం శంకర్ నారాయణ వైసీపీ, ఎస్ శంకర్ నారాయణ ప్రజా శాంతి పార్టీ, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి తరఫున పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డిని బరిలో నిలబెట్టారు.

ka paul 27032019

ఉరవకొండలో వైసీపీ తరపున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తుంటే, విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి పాల్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కల్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉషా శ్రీచరణ్, ప్రజా శాంతి నుంచి ఉషారాణి నామినేషన్ వేశారు. రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ప్రజాశాంతి నుంచి డీ ప్రతాప్ బరిలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజా శాంతి పార్టీ నుంచి పగిడి వెంకరామిరెడ్డి నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. కేఏ పాల్ ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ది చేకూర్చేందుకే ఈ కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. అంతేకాదు, వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండేలా ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తు తెచ్చుకోవడం.. వైసీపీ కండువాలను తలపించే కండువాలతోనే ప్రచారం చేస్తుండటం.. ఇదంతా తమ పార్టీని దెబ్బ తీయడానికి చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని ఆరోపణలు చేస్తోంది. అయితే కేఏ పాల్ కూడా ఏ మాత్రం తగ్గటం లేదు. మా పార్టీ 2008లోనే పెట్టామని, మా పార్టీ గుర్తు, రంగులు జగనే కాపీ కొట్టారని పాల్ అంటున్నారు. హెలికాప్టర్ గుర్తు ఈసీ ఇచ్చినందని, మా పార్టీతో పోలిన వ్యక్తుల పర్లే జగన్ పెట్టారని, నేనే రివర్స్ కంప్లైంట్ ఇస్తానంటూ, పాల్ చెప్తున్నారు.

దేశంలో అన్ని వ్యవస్థలు నాశనం చేస్తున్న నరేంద్ర మోడీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైఖరి పై కూడా అనుమానాలు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. 31 కేసులు ఉన్న ఒక వ్యక్తి, నిబద్ధతత కలిగిన పోలీసులు పై కంప్లైంట్ చేస్తే, పోలీసుల పైనే చర్యలు తీసుకున్నారు. ఇంకా వింత ఏంటి అంటే, అసలు ఎన్నికల విధులకు సంబంధం లేని, ఇంటిలిజెన్స్ డీజీని బదిలీ చెయ్యటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సియం సహా, ప్రముఖుల బధ్రత చూసే ఇంటిలిజెన్స్ డీజీని ఎందుకు బదిలీ చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. కడప, శ్రీకాకుళం ఎస్పీ పై కూడా ఎలాంటి ఆరోపణలు లేవు, కాని వారిని కూడా బదిలీ చేసారు. అయితే, ఎస్పీల విషయంలో ఎలక్షన్ కమిషన్ కు హక్కు ఉంటుంది కాబట్టి, ఎవరూ ఏమి చెయ్యటానికి లేదు.

ec apgvot 27032019

కాని, ఇంటిలిజెన్స్ డీజీ విషయంలో మాత్రం, ఎలక్షన్ కమిషన్ కు హక్కు లేదు అనేది ప్రభుత్వ వాదన. కేవలం విజయసాయి రెడ్డి, జగన్ కోసం, మోడీ ఈ పని చేసారని, అందుకే ఈ విషయం పై కోర్ట్ లోనే తేల్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం ఆర్టికల్ 324 ఎన్నికల కమీషన్కి ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను మాత్రమే బదిలీ చేసే అధికారాన్ని కట్టబెట్టింది. ఎన్నికల కమిషన్ ఇంటెలిజెన్స్ డిజి నీ ఎన్నికల విధుల కోసం అడగనూ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అటువంటిది ఎన్నికల విధుల్లో లేని ఇంటెలిజెన్స్ డీజే ని బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదు ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించి మరి ప్రవర్తించింది అనేది ప్రభుత్వ వాదన. ఇదే విషయం కోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ కేసు రేపు హైకోర్ట్ లో రానుంది.

ec apgvot 27032019

అయితే, తమ హక్కులు ఎలక్షన్ కమిషన్ ఎలా భంగం కలిగిస్తుంది అంటూ ఏపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్‌ 721ను విడుదల చేసింది. ఇది పాత జీవోనే అని, దీన్ని మరోసారి రిలీజ్ చేసామని అంటున్నారు. దీని ప్రకారం, ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఇంటిలిజెన్స్ డీజీ పోస్టు ఈసీ పరిధిలోకి రానందున ఆయన బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొత్త జీవోను జారీ చేశారు. దీంతో, మోడీ, జగన్ చెప్పినట్టు ఆడుతున్న ఎన్నికల కమిషన్ పై, ఏపి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది అంటూ విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read