ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఏపీలో అందిన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని స్పష్టం చేసింది. నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలు టాప్ లో ఉన్నాయని తెలిపింది. ఓట్లను తొలగించాల్సిందిగా 9.5 లక్షల దరఖాస్తులు అందగా...1.41 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని ఈసీ పేర్కొంది. జనవరి 11వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత 1,41,822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో 3.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి తుదిజాబితాలో ఓటర్ల సంఖ్య 3.93 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. త్వరలోనే తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. కొత్తగా 21,16,747 మందిని చేర్చినట్లు ప్రకటించింది.

ec 23032019

జిల్లాలవారీగా నకిలీ ఓట్లను ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. శ్రీకాకుళం- 2,579, విజయనగరం- 5,166, విశాఖ- 2,407, పశ్చిమగోదావరి 8,669, ప్రకాశం- 6,040, నెల్లూరు- 3,850, కడప- 5,292, కర్నూలు- 7,684, అనంతపురం- 6,516, గుంటూరు- 35,063, తూ.గో- 24,190, కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052 నకిలీ ఓట్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఏపీలో గత రెండున్నర నెలల వ్యవధిలో లక్షా 41వేల 822 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. తొలగించిన ఓట్లలో 68,422 మృతి చెందిన వారివి, 64,083 ఓట్లు డబుల్‌ ఓట్లు ఉన్నవారివి, 8,698 ఓట్లు వలసవెళ్లిన వారివి, 480 ఓట్లు తప్పిపోయిన వారివి, 139 ఓట్లు ఇతర కారణాలతో తొలగించినవి ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్లు 10 లోపునే ఉన్నాయి.

ec 23032019

ఈ సందర్భంగా జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయని పేర్కొంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కృష్ణా జిల్లా నందిగామలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4,746 ఓట్లు తొలగించారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని 4425 ఓట్లు తొలగించారు. మాచర్ల, పెద్దాపురం, పామర్రు, ప్రత్తిపాడు, రంపచోడవరం, సత్తెనపల్లె, చిలకలూరి పేట, కర్నూలు, రాజాంపేట, వినుకొండ, పాణ్యం, పలమనేరు తదితర నియోజకవర్గాల నుంచి ఒక్కో చోట రెండువేల ఓట్లు కంటే ఎక్కువ తొలగించారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఒక్క ఓటు కూడా తొలగించకపోగా విశాఖపట్నం ఉత్తరం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల నుంచి ఒకే ఒక్క ఓటు చొప్పున తొలగించారు. ప్రత్యేక సమగ్ర విచారణ జాబితాను ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 11న ప్రచురించింది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి ఓట్ల తొలగింపు కోసం దాదాపు 9.50 లక్షల ఫారం-7 దరఖాస్తులు అందాయి.

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి మోహన్ బాబు, ఆయన కొడుకుల ట్విట్టర్ రాతల పై ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు మరోసారి విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోహన్ బాబు వంతపాడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం తన విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదంటూ సినీనటుడు మోహన్‌బాబు శుక్రవారం తిరుపతిలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మోహన్‌బాబుకి కౌంటర్ ఇవ్వడం, కుటుంబరావుకి మంచు మనోజ్ ఆధారాలతో సహా ప్రశ్నలు సంధించడం జరిగాయి. దీంతో శనివారం మీడియాతో మాట్లాడిన కుటుంబరావు మోహన్‌బాబు కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు.

mohanababu 23032019

‘మోహన్‌‌బాబు ఫ్యామిలీలో అందరూ నటులే. రాష్ట్రంలో ఇంతకంటే పచ్చి అబద్ధాలు చెప్పే కుటుంబం మరొకటి లేదు. మీ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించి.. వారి పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసి సొమ్ము చేసుకుంటున్నది మీరు కాదా? మేనేజ్‌మెంట్ సీట్ల పేరుతో విద్యార్థుల నుంచి ఏడాదికి 5-6 లక్షల రూపాయాలు వసూలు చేస్తోంది మీరు కాదా? సమాధానం చెప్పండి. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలుచేస్తూ లెక్చరర్స్‌కి మాత్రం తక్కువ వేతనాలు ఇస్తున్నారు. మీరు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలోనే మోహన్‌బాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అని అందరూ అనుకుంటున్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేద్దామనుకుంటే మీకే నష్టం. మీ బంధువైన వైఎస్ జగన్‌కు మేలు చేసేలా ఎన్నికల సమయంలో ఈ ఆందోళన ఎందుకు చేపట్టారు. ముసుగు తీసేసి వైసీపీ తరపున ప్రచారం చేసుకుంటే మిమ్మల్ని ఆపేదెవరు. మోహన్‌బాబు వారం రోజులుగా చెవిరెడ్డి అనే క్రిమిన‌ల్‌తో తిరుపతిలో తిరుగుతున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారు. పద్మశ్రీ వచ్చిన మహానటులు చాలామంది ఉన్నారు. కానీ మోహన్‌బాబు లాంటి నటుడికి ఆ పురస్కారం వచ్చినందుకు ఈరోజు బాధగా ఉంది.’ అని కుటుంబరావు ధ్వజమెత్తారు.

mohanababu 23032019

మోహన్ బాబు ఎంత పెద్ద నటుడో తనకైతే తెలియదని, పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి పెద్ద నటుడే అయ్యి ఉంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పద్మశ్రీ వచ్చిన మహానటులు చాలా మంది ఉన్నారని, కానీ మోహన్ బాబుకు వచ్చినందుకు బాధపడుతున్నానని చెప్పారు. మోహన్ బాబుకు డాక్టర్ రేట్ కూడా ఉందట అని అంటూ తనకైతే తెలియదని అన్నారు. మోహన్ బాబు విద్యను వ్యాపారంగా మార్చారని ఆయన విమర్శించారు. బిల్డింగ్ ఫీజులు, డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తు్నారని ఆయన ఆరోపించారు. లెక్చరర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయాల కోసమే మోహన్ బాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. మీ కాలేజీలో విద్యాశాఖతో విచారణకు సిద్ధమా అని ఆయన మోహన్ బాబుకు సవాల్ విసిరారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల బయట ఉన్న హోటల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్మే షాపుల వద్ద నుంచి కూడా గుడ్ విల్ తీసుకుంటున్నారని ఆ సంస్థల యాజమాన్యంపై కుటుంబరావు ఆరోపించారు. తమ విద్యా సంస్థల వల్లే ఈ హోటల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ కు వ్యాపారం జరుగుతోంది కనుక తమకు గుడ్ విల్ ఇవ్వాలని వారు అన్నట్టు ఆరోపణలు వచ్చినట్టు చెప్పారు. ముందు, మీ క్రెడిబులిటీ ఏంటో నిరూపించుకోండి? అని హితవు పలికారు. తమపై బురదజల్లాలని చూస్తే కుదరదని, మంచు కుటుంబం అంటే ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని కుటుంబరావు సూచించారు.

వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు. 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, పోలీసుస్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నాయని వివరించారు. వీటిలో అత్యధిక కేసులను కోర్టులు ఇంకా విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, జాతీయ గీతాన్ని అవమానించటం, explosive substance, preperation made for causing death, అనుచిత ప్రవర్తనలాంటి మరికొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

jaganaffidavit 230320198 1

సీబీఐ కేసులు.. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నెం.ఆర్‌సీ.19(ఎ)/2011 కింద కింది కేసుల నమోదు 1. సీసీ 26/2014 -సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇందూ- గృహనిర్మాణమండలి సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ, 11, 13(2) రెడ్‌విత్‌ 13(1)(సి)(డి) అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 2. సీసీ 28/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420, 468, 471, ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు 3. సీసీ 27/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇందూటెక్‌ జోన్‌ వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్‌ 9 -అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 4. సీసీ 26/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (పెన్నా సిమెంట్స్‌ వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420 ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 5. సీసీ 25/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (రఘురాం/భారతి సిమెంట్స్‌ వ్యవహారం) * సెక్షన్లు: 120బి 420, 107 రెడ్‌విత్‌13(2) రెడ్‌విత్‌ 13(1)(డి) అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 6. సీసీ 24/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇండియా సిమెంట్స్‌) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420, 420 ఐపీసీ, సెక్షన్‌ 9, 12 -అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

jaganaffidavit 230320198 1

7. సీసీ 12/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారం) సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 8. సీసీ 14/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ, సెక్షన్‌ 12- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 9. సీసీ 10/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (రాంకీ ఫార్మా వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, 471 ఐపీసీ, సెక్షన్‌ 9, 12 అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 10. సీసీ 9/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (జగతి పెట్టుబడులు వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420, 420, 471 ఐపీసీ * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 11. సీసీ 8/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ ఫార్మా కంపెనీల వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420 ఐపీసీ, సెక్షన్‌ 12 రెడ్‌విత్‌ 11 - అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

‘‘హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? తెలంగాణా ఏమన్నా పాకిస్థాన్‌ అనుకుంటున్నారా? పౌరుషం లేదా? మనమింకా బతికున్నాం. ఇంకా విభజించే రాజకీయాలు చేయొద్దు. కేసీఆర్‌ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే పోనీలే పోనీలే అని వదిలే పరిస్థితి లేదు. భయపడుతూ భయపడుతూ ఎంతకాలం ఉంటాం? ధైర్యంగా ఉందాం’’ అని పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం భీమవరం సభలో అన్నారు. ‘‘ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే.. అలాంటి నాయకుల్ని మీ నాయకుడు జగన్‌ భుజానికెత్తుకెళ్తుంటే మీకెలా మనసొప్పుతోంది? అని వైసీపీ నాయకులను అడగండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘అంత హీనంగా తిడుతుంటే.. మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టి ఉంటుంటే మీకు పౌరుషమే రాలేదా?’’ అంటూ వైసీపీ అభ్యర్థులను తీవ్రంగా విమర్శించారు.

talasani 23032019

భీమవరం సభలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివా్‌సను ఉద్దేశించి ప్రస్తావిస్తూ కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి తీరును పవన్‌ ఎండగట్టారు. ‘తెలంగాణలో ఆంధ్రులు రాజకీయం చేస్తే తప్పా.. కేసీఆర్‌ మాత్రం ఆంధ్రా రాజకీయాలలో వేలు పెట్టవచ్చా?’ అని ప్రశ్నించారు. ఆయనకు ఆంధ్రా మీద అంత అభిమానం ఉంటే తన అభ్యర్థులను పోటీ చేయింవచ్చన్నారు. ‘‘టీఆర్‌ఎస్‌ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇక్కడకు వచ్చి వైసీపీకి మద్దతు ఇస్తారా? వారితో వైసీపీ వారు వంత పాడుతారా?’’ అని విమర్శించారు. ‘‘2014లో తలసాని తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఎన్నో తిట్లు తిట్టాడు.. పైగా నా ప్రచారం కోసం ఎదురుచూశారు. పవన్‌ ఎక్కడ? పవన్‌ ఎక్కడ? అంటూ పదే పదే ఫోన్‌లు చేస్తూ ఎదురుచూశారు. ఇప్పుడు ఇక్కడ అభ్యర్థికి మద్దతు ఇస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తలసాని శ్రీనివా్‌సగారూ దయచేసి విభజన రాజకీయాలను మానేయాలి. పద్ధతి కాదిది. రాష్ట్రాలు విడిపోయినాయి. శ్రీనివాస్‌ యాదవ్‌గారూ మీరు కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడ స్థాపించండి. భీమవరం నుంచి మీ అభ్యర్థిని నిలబెట్టండి.

talasani 23032019

కావాలంటే గ్రంధి శ్రీనివా్‌సగారినే నిలబెట్టుకోండి. మీరు ఛీకొట్టిన జగన్మోహన్‌ రెడ్డినే మళ్లీ సపోర్ట్‌ చేస్తున్నారు. ‘జగన్‌కు కేసీఆర్‌ అంటే భయం. కేసీఆర్‌ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది తప్ప నాకు ఆయనంటే భయం లేదు. అక్కడేదో నాకు ఇల్లుంది. ఆస్తులున్నాయి. పదెకరాల భూములున్నాయన్న భయం లేదు. ఏం భూములు తీసుకుంటారా? తీసుకోమనండి! ఎవడు తీసుకుంటాడు తెలంగాణలో మన ఇల్లు.. మన భూములు.. నేనూ చూస్తాను. ఏం.. తెలంగాణ పాకిస్థాన్‌ అనుకుంటున్నారా? ఏం పౌరుషం లేదా మనకి? ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మార్చేస్తారా మీరు? బతికున్నామండి ఇంకా ఇక్కడ చాలా మంది. విభజన రాజకీయాలు చేసే మనుషులం కాదు. కానీ.. మమ్మల్ని విభజిస్తామంటే చేతులు ముడుచుకుని కూర్చోం. గుర్తుపెట్టుకోండి. భరిస్తాం మర్యాదతోటి. ఇక్కడికొచ్చి అడ్డగోలుగా అడ్డదారిలో వచ్చి ఆంధ్రరాజకీయాల్లో వేలుపెడతారా? ఏం మాట్లాడతారయ్యా మీరు? పోన్లే పోన్లే.. అంటుంటే వచ్చి ఎక్కి తొక్కుతున్నారు ఒక్కొక్కళ్లు’’ అని ఆగ్రహంతో ఊగిపోయారు.

 

 

Advertisements

Latest Articles

Most Read