ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో సమర్పించిన ఒక పత్రంలో సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కొద్దిసేపు పార్టీ వర్గాలను గందరగోళపరిచింది. కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు, మంగళగిరి అభ్యర్థి లోకేశ్‌లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలియజేస్తూ అధికారిక పత్రాన్ని నామినేషన్‌ పత్రాలతో జతపర్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నివసిస్తున్న వారు అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు. దీన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం మంజూరుచేసిన పత్రాలలో తండ్రి అనే కాలమ్‌ వద్ద భర్త అని ఆంగ్లంలో ఉంది. దీన్ని గమనించకుండానే అధికారులు సంతకం చేసేశారు.

jenda 24032019

చంద్రబాబునాయుడు నారా.. భర్త ఖర్జూరనాయుడు నారా అని ఒక పత్రంలో, లోకేశ్‌ నారా.. భర్త చంద్రబాబునాయుడు అని మరో పత్రంలో ఉన్న పొరపాటు అధికారుల దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వారు స్పందించి సంబంధిత ధ్రువపత్రాలను మళ్లీ మంజూరు చేశారు. గుమాస్తా తప్పిదంగా గుర్తించామని, దీని వల్ల నామినేషన్ల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు. అయితే ఈ పొరపాటును గుర్తించిన వైసీపీ, ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా టీం, ఇదేదో పెద్ద స్కాం అయినట్టు, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం మొదలు పెట్టారు. ప్రజా సమస్యలు ఏమి లేక, ఇలాంటివి ప్రచారం చేస్తూ, ఆనందం పొందుతున్నారు.

jenda 24032019

మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి నారా లోకేష్ స్తిర, చర ఆస్తులు, అప్పుల వివారాలను ఎన్నికల అధికారులకు తెలిపారు. తన భార్యా, కుమారుడి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ఆయన వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిట్నరింగ్ అధికారికి ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన దగ్గర 253 కోట్ల 68 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట‌్‌లో పేర్కొన్నారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా జరిపించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసిన పిటిషనర్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. వ్యాజ్యం దాఖలు చేయడానికి ఉన్న అర్హతేమిటో చెప్పాలని ఆదేశించింది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమైన పిటిషనర్‌ తరఫు న్యాయవాది.. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా జరిపించాలని కోరుతూ అనీల్‌కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

court 23032019

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తున్న సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హతేమిటని ప్రశ్నించింది. ప్రజా సమస్యలపై పోరాడతారని, విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి ఘటనపై పిల్‌ దాఖలు చేశారని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది తెలిపారు. అంతమాత్రాన సీబీఐ దర్యాప్తు కోరడానికి అర్హత ఉందని ఎందుకు అనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. మరో న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. వివేకానందరెడ్డి భార్య/కుటుంబ సభ్యులు.. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఓ వ్యాజ్యం దాఖలు చేస్తున్నారని ఆ వ్యాజ్యంపై విచారణ జరపాలని కోరారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

సినిమా రంగంలో మోహన్ బాబు రూటే సెపరేటు.సినిమాల్లో ముందుగా హీరోగా ప్రవేశించినా..ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆపై హీరోగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకున్న నటుడు మోహన్ బాబు. సినిమాల్లో దాసరి శిష్యుడిగా అడుగుపెట్టి..ఆ తర్వాత అన్న సీనియర్ ఎన్టీఆర్ అండదండలతో తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆపై టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసారు. రాజ్యసభ సభ్యత్యం ముగిసిన తర్వాత మోహన్ బాబుకు చంద్రబాబుకు దూరం పెరిగింది. తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉన్న చంద్రబాబుపై పెద్దగా ఫైర్ అయింది లేదు. ఇక వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మోహన్ బాబు ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది.

court 23032019

ఆ తర్వాత మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ..రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకోవడంతో వైయస్ ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి దగ్గరైంది. ప్రస్తుతం మోహన్ బాబు ఏ పార్టీలో లేకపోయినా.. తెలుగు దేశం అధినేతతో గత కొంత కాలంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. అదే సమయంలో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు సకాలంలో రాకపోవడంతో ఆయన ధర్నాకు దిగారు. ఈ ధర్నా వెనక రాజకీయ కారణాలు లేకపోలేదని అందరు చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న మోహన్ బాబు ఈ ధర్నాకు దిగడం వెనక జగన్మోహన్ రెడ్డికి వైసీపీ హస్తం ఉందని తెలుగు దేశం వర్గాలు వాదిస్తున్నాయి.

court 23032019

మరోవైపు వైసీపీకి చెందిన నటుడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పోసానితోనే బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయించడం వెనక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ తతంగం అంతా చూస్తుంటే సరిగ్గా ఎన్నికల సమయంలో చంద్రబాబును ఇరుకున పెట్టేందకు జగన్ ఆడుతున్న డ్రామాలని తెలుగు దేశం వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఈ వ్యవహరం ఏపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌... సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పెన్నా ప్రతా్‌పరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యా రు. తదుపరి విచారణను ఈ నెల 29కి కోర్టు వాయిదా వేసింది.

court 23032019

జగన్‌ తనకు రూ.339.89కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య భారతి పేరున రూ.92.53కోట్లు, పిల్లలు వైఎస్‌ హర్షిణిరెడ్డి పేరున రూ.6.45కోట్లు, వైఎస్‌ వర్షారెడ్డి పేరున రూ.4.59 లక్షల ఆస్తులున్నట్లు వివరించారు. ఏటా రూ.12.30 కోట్ల ఆదాయ పన్ను కడుతున్నట్లు వెల్లడించారు. బీఎండబ్ల్యూతోపాటు మూడు స్కార్పియోలు, చేతిలో రూ.43,560 నగదు ఉందని, తనకు బంగారు ఆభరణాలు ఏమీ లేవని తెలిపారు. తనతోపాటు, భార్య, ఇద్దరు పిల్లల పేరున బ్యాంకులో డిపాజిట్లు ఉన్నట్లు వివరించారు. కాగా 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో ప్రస్తావించిన ఆస్తుల కంటే ఇప్పుడు తగ్గాయి. ఆనాడు రూ.416.68 కోట్లు ఆస్తులు, రూ.137.2 కోట్ల అప్పులు చూపించారు. రూ.13.92 కోట్లు వార్షికాదాయం ఉందని పేర్కొన్నారు. తనపై మొత్తం 39 కేసులున్నట్లు అఫిడవిట్‌లో జగన్‌ ప్రస్తావించారు. ఇందులో చాలా వరకూ విచారణలో ఉన్నాయని వాటి వివరాలు వెల్లడించారు. వీటిల్లో సీబీఐ, ఈడీ దర్యాప్తులో ఉన్న కేసులు ఉన్నాయి. మొత్తం 47 పేజీల అఫిడవిట్‌ అందజేశారు.

court 23032019

జగన్‌ ఆస్తులు: ఆస్తులు రూ.339.89కోట్లు, అప్పులు రూ.1.19 కోట్లు, ఒక బీఎండబ్ల్యూ, 3 స్కార్పియోలు, చేతిలో నగదు రూ.43,560, డిపాజిట్లు 7.65లక్షలు, ఏటా కడుతున్న ఆదాయ పన్ను రూ.12.30కోట్లు, ముందస్తు పన్ను చెల్లింపులు రూ.7,67,29,900, రిసీవబుల్స్‌ టీడీఎస్‌ రూ.41,55,063, వ్యవసాయ భూముల విలువ రూ.42.44లక్షలు, వ్యవసాయేతర భూముల విలువ రూ.8.42 కోట్లు, వాణిజ్య భవనాల విలువ రూ.14.46కోట్లు, నివాస భవనాల విలువ రూ.35.30కోట్లు, భారతి సిమెంట్స్‌, కార్మల్‌ ఏషియా, క్లాసిక్‌ రిటైల్‌ హరిషా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సందూర్‌ పవన్‌ కంపెనీ, సరస్వతి పవర్‌, సిలికాన్‌ బిల్డింగ్స్‌లో ఉన్న షేర్ల విలువ రూ.262.44 కోట్లు

Advertisements

Latest Articles

Most Read