ఉద్యోగంలో ఉన్నంత వరకు పోలీసు మార్కు చూపించానని, ఇకపై రాజకీయాల్లో ఖద్దరు మార్కు ఏమిటో చూపిస్తానని విశాఖపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోన తాతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే ఉత్తమ పార్లమెంట్‌ నియోజకవర్గంగా విశాఖను తీర్చిదిద్దుతానన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్నికలైన తర్వాత కనిపించకుండా వెళ్లిపోయే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే విశాఖ ప్రజలకు ఇక్కడే ఉంటానని బాండ్‌పేపర్‌పై రాసిస్తానని ప్రకటించారు.

court 23032019

రాష్ట్రవ్యాప్తంగా తిరిగి జనసేనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని గుర్తించిన తరువాతే ఆ పార్టీలో చేరానన్నారు. విశాఖను భూకబ్జాలు, అక్రమాలు, అన్యాయం లేని అత్యంత ఆనంద నగరంగా మారుస్తానన్నారు. మరాఠా యోధుడు శివాజీ అతి తక్కువ సైన్యంతో మొఘల్‌ సామ్రాజ్యాన్ని జయించిన మాదిరిగా జనసేన పార్టీ కూడా తక్కువమంది కార్యకర్తల బలంతోనే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, ఎంపీగా పోటీ చేయాలంటే రూ.100 కోట్లు ఉండాలంటున్నారని ఆయన పేర్కొన్నారు.

court 23032019

కార్యక్రమంలో విశాఖ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి కోన తాతారావు, పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్‌, బొలిశెట్టి సత్య పాల్గొన్నారు. విశాఖ లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆస్తులు మొత్తం రూ.8.66 కోట్లగా నివేదించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నామినేషన్‌ వేసిన ఆయన ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు.

నవ్యాంధ్రలో కీలక రంగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులంతా ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా హైదరాబాద్‌లో పని చేసిన వారే. అక్కడ 15 నుంచి 30 ఏళ్లపాటు పని చేశారు. ఈ క్రమంలో అక్కడే ఇళ్లు, పొలాలు, స్థలాలు, ఫాంహౌ్‌సలు కొనుక్కున్నారు. కొందరికి బినామీల పేరుతో కూడా ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. ఆయా అధికారుల ఆస్తులు, వాటిలో లొసుగుల సమాచారాన్ని తెలంగాణ పెద్దలు బయటికి తీసినట్లు తెలుస్తోంది. వివాదాలు ఉండటం ఎంత సహజమో... లేని వివాదాలను సృష్టించడం అంత సులభం! ఈ సమాచారం తమ దగ్గరుందన్న విషయాన్ని నేరుగా కొందరు ఉన్నతాధికారులకే తెలిసేలా చేశారు. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తే... అంతే అనే సంకేతాలు పంపించారు. భాగ్యనగరంలో ఎంతోకొంత శాతం ఉల్లంఘనలు లేని నిర్మాణాలు భూతద్దం వేసి వెతికినా కనిపించవు. కానీ... పనికట్టుకుని ఏపీ డీజీపీ ఇంటి నిర్మాణం ఉల్లంఘనలపైనే అక్కడి అధికారుల దృష్టి పడింది.

court 23032019

ఉన్నట్టుండి ఇంటి ప్రహరీని కూల్చివేశారు కూడా! సదరు ఇంటి బయట ఉన్న ఉల్లంఘనలపై ముందుగానే సమాచారం సేకరించి... నేరుగా వెళ్లి గోడ కూలిస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో... వైసీపీ నేత ద్వారా పిటిషన్‌ వేయించినట్లు చెబుతున్నారు. ‘డీజీపీ ఇంటి ప్రహరీనే కూల్చివేశాం. మీరొక లెక్క కాదు’ అని ఇతర అధికార గణానికి హెచ్చరిక పంపారు. ‘ఫలానా అధికారి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడు’ అని వైసీపీ ఆరోపించడమే ఆలస్యం! హైదరాబాద్‌లో సదరు అధికారి చిట్టా బయటకు తీసి ‘ఇదిగో మీ పరిస్థితి’ అని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు తమపని తాము నిబంధనల ప్రకారం చేసుకుంటూ వెళతారు. రాజకీయ పక్షపాత ధోరణిని సాధారణంగా చూపించరు. ఎందుకంటే వారికి చాలా కెరీర్‌ ఉంటుంది. అది ముఖ్యం! అయితే ఒక రాష్ట్రం కేడర్‌లో ఉన్న అధికారులు ఆ రాష్ట్రాన్ని తన సొంతంగా భావించాలి.

court 23032019

ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి. ఏపీ ఉన్నతాధికారులు కూడా అలాగే చేస్తున్నారు. కానీ... పొరుగు పెద్దల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో వారు తమపని తాము చేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన రెండు, మూడు వ్యవహారాల్లో... ఏపీలో ఉన్న అధికారులకు ఇలాంటి సంకేతాలే వెలువడ్డాయి. ఒకవైపు చంద్రబాబు ‘నువ్వా నేనా’ అన్నట్లుగా రాష్ట్రం కోసం కేసీఆర్‌ను ఢీకొంటుండగా... చంద్రబాబు వాదనను సమర్థించే వివరాలు బయటికి చెప్పొద్దు అని అధికారులకు హెచ్చరికలు వస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. విద్యుత్తు బకాయిలు, ఉమ్మడి ఆస్తుల విభజన తదితర విషయాల్లో గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ముందు, కోర్టుల్లో ఏపీ తరఫున బలమైన వాదన వినిపించాల్సిన బాధ్యత అధికారులదే. ఎవరి ప్రభుత్వమున్నప్పటికీ... రాజకీయ నాయకత్వం ఆ పని చేయలేదు. ప్రస్తుతం ఆయా అంశాలపైనా అధికారులు స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్థితి ఏర్పడింది. ‘చంద్రబాబును రాజకీయంగా ఒంటరి చేయాలనుకుంటే వాళ్ల ఇష్టం. దాంతో మాకు సంబంధం లేదు. కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మా పని మమ్మల్ని చేసుకోనివ్వకుండా బెదిరిస్తుండటం దారుణం’ అని ఉన్నతాధికారులు వాపోతున్నారు.

మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ బహిరంగంగా తెదేపాకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేకహోదా, విభజన హామీలు సాధించే సత్తా తెదేపాకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేస్తానని.. ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ట్రమంతటా పర్యటిస్తానని కొణతాల స్పష్టం చేశారు. తెదేపాకు మద్దతుగా కొణతాల ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన త్వరలో ఆ పార్టీ కప్పుకునే అవకాశముంది. కొణతాల ఏ పార్టీలో చేరతారనే విషయంపై గత కొన్ని నెలలుగా పలు ఊహాగానాలు వినిపించాయి.

court 23032019

తెదేపా, వైకాపాల్లో ఆయన దేనిలో చేరనున్నారనే దానిపై అనేక చర్చలు విస్త్రృతంగా ప్రచారం జరిగింది. ఓ దశలో తెదేపాలో ఆయన చేరిక ఖాయమైందని.. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ క్రమంలో ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్‌తోనూ భేటీ అయ్యారు. దీంతో ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెదేపాకు మద్దతుగా కొణతాలే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయడంతో ఆయన తెదేపాలో చేరడం ఇక లాంఛనమే కానుంది.

court 23032019

‘‘టీడీపీకి మద్దతు తెలపాలని నేను, నా అనుచరులు నిర్ణయించుకున్నాం. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తా. ఉత్తరాంధ్రకు మేలు చేసే పార్టీకి మద్దతు తెలపాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. కేంద్రం పోలవరం ప్రాజెక్టును కాలయాపన చేస్తోంది.ఆర్థిక లోటు విషయంలో కూడా అన్యాయం చేసింది. రైల్వేజోన్‌ వచ్చినా డివిజన్‌ పోయింది. చాలా హామీల అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్‌ ఏపీ హామీలపై తీర్మానం కూడా చేసింది’’ అని కొణతాల ప్రకటించారు.

నటుడు మోహన్‌బాబు వైఖరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం విద్యానికేతన్‌ విద్యా సంస్థలకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడం లేదని విద్యార్ధులతో కలిసి ఆయన నిరసనకు దిగడంపై పలువురు మండుపడుతున్నారు. మొదట ఆయన తీరును ఏపీ ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తప్పుబట్టారు. కుటుంబరావు గొంతులో మరి కొందరు గొంతు కలుపుతున్నారు. మోహన్‌బాబును వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య రానురానూ పెరుగుతూ వస్తోంది. తాజాగా మోహన్‌బాబుపై దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కోడలు సుశీల ధ్వజమెత్తారు. దాసరి తనకు గురువు అని చెప్పుకునే మోహన్‌బాబు తమను మోసం చేశారని మండిపడ్డారు. దాసరి నారాయణరావు చనిపోగానే ఆస్తులు అందరికీ సమానంగా పంచుతానని చెప్పిన ఆయన నేటికీ ఆ పని చేయలేదని సుశీల దుయ్యబట్టారు. మోహన్‌బాబు చర్య వల్ల తన కొడుకు మాస్టర్ దాసరి రోడ్డున పడ్డాడని, దాసరి మనవడికే న్యాయం చేయలేని మోహన్‌బాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఉచిత విద్య ముసుగులో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు వసూలు చేస్తున్నారని, దాసరి నారాయణరావు మాటలను దాసరి అరుణ్ వక్రీకరించి వైసీపీలో చేరారని సుశీల పేర్కొన్నారు.

court 23032019

మోహన్‌బాబుపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై మోహన్‌బాబు చీప్‌గా వ్యవహరించారని ఆరోపించారు. మోహన్‌బాబు సంస్థను నడిపిస్తున్నారా? బిజినెస్‌ చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై మోహన్‌బాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షానికి మోహన్‌బాబు వంతపాడుతున్నారని దుయ్యబట్టారు. మోహన్‌బాబు కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారని, ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని కుటుంబరావు తెలిపారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను చెప్పిన విషయాలపై బహిరంగ చర్చలకు సిద్ధమని కుటుంబరావు సవాల్ విసిరారు.

court 23032019

మోహన్‌బాబుపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి శివాజీ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్‌బాబు మాట్లాడారా అని నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సూచించారు.

 

Advertisements

Latest Articles

Most Read