రాష్ట్ర రాజకీయాల్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ‘అరాచకీయ’ వ్యూహాలకు తెరలేస్తోంది. ప్రజల ఓట్లతో గెలవడమనే సంప్రదాయానికి పాతరేసి ‘ప్రత్యర్థి అభ్యర్థులను బరిలోంచి తప్పించడం’ అనే అసాధారణ కుట్ర రచిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం 10 మంది టీడీపీ అభ్యర్థులపై గురిపెట్టి... వారిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం కేంద్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుగుదేశం అధిష్ఠానానికి సమాచారం అందింది. నామినేషన్ల ఉపసంహరణలోపు పది మంది అభ్యర్థులను తప్పించగలిగితే.. టీడీపీ బలహీనంగా మారుతుందన్న అంచనాతో ఈ వ్యూహం ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగు ఒత్తిళ్లే దీనికి కారణమని టీడీపీ అధిష్ఠానం కూడా నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యూహం ఆ ఇద్దరితోనే ఆగిపోలేదని, జాబితాలో మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. రకరకాల మార్గాల్లో వీరిపై ఒత్తిడి తేవడం ద్వారా వీలైతే అసలు నామినేషన్‌ వేయకుండా ఆపడం... వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడం... అదీకాకపోతే, చివరి క్షణంలో ప్రచారాన్ని పక్కనపెట్టి మౌనం వహించేలా చూడటం! ఇలా ఏదో ఒక దశలో ఒత్తిడి తెచ్చి... ఆ స్థానాల్లో వెసీపీ గెలుపును సులువు చేయడమే ఈ వ్యూహం అసలు లక్ష్యం. ఏపీలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న చాలామంది అభ్యర్థులకు హైదరాబాద్‌లో వ్యాపారాలు, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి ఆర్థిక ప్రయోజనాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వాటిని పూర్తిగా తెంచుకొనే పరిస్ధితి లేదు. ఈ నేపథ్యంలో... టీడీపీలో బలమైన అభ్యర్థులను ఎంచుకొని వారి వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. అందులో ఉల్లంఘనలు, సమస్యలను భూతద్దం వేసి వెతుకుతున్నారు. ఎక్కడ చిన్న లోపం కనిపించినా... సంబంధిత శాఖల నుంచి ముందు నోటీసు జారీ అవుతాయనే హెచ్చరికలు పంపిస్తున్నారు. దీంతో సదరు నేతలు కంగారుపడిపోయి ఆ శాఖల అధికారులను సంప్రదిస్తున్నారు.

మీరు వెళ్లి ఫలానా నాయకులను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అప్పటికే వీరి వ్యూహమేమిటో అవగతమవుతుంది. ఆ నాయకులను కలవడానికి తటపటాయిస్తే... వచ్చి మాట్లాడాలని ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆ నాయకులను కలిసిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. ‘‘టీడీపీ నుంచి బయటకు వస్తే ఏ సమస్యా ఉండదు. మీ వ్యాపారం హాయిగా చేసుకోవచ్చు. రాజకీయాల కోసం విలువైన ఆస్తులను పాడు చేసుకోవద్దు. మీ మంచికోసమే చెబుతున్నాం’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా... తమ మాట విని లాభపడిన వారు, వినకుండా నష్టపోయిన వారి ఉదాహరణలు కూడా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందో సూచించే ‘సొంత’ సర్వే నివేదికలను వారి ముందు పెట్టి... ‘మైండ్‌గేమ్‌’ ఆడుతున్నారు. వైసీపీలో రాజకీయంగా మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత తమదని, భయాలేవీ పెట్టుకోవద్దని కూడా భరోసా కూడా ఇస్తున్నారు. కొద్దిగా మెత్తబడ్డారనుకొన్న వారిపై ఒత్తిడి మరింత కొనసాగిస్తున్నారు. మరింత విస్తృతం... టికెట్ల జారీ దశలోనే ఒత్తిడి వ్యూహం అమలు చేయడం ప్రారంభమైంది. కొందరి విషయంలో ఇది ఫలించడంతో... పొరుగు నేతల్లో మరింత ఉత్సాహం పెరిగిందని అంటున్నారు. టికెట్లు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు రెండో దశ ప్రయత్నాలు మొదలయ్యాయి.

 

టీడీపీలో టిక్కెట్టు వచ్చి పోటీ చేయడానికి సంసిద్ధులు అవుతున్న వారిలో ఎవరినైనా ఆపడానికి అవకాశం ఉందా అన్నదానిపై దృష్టి సారించారు. పది మంది అభ్యర్థులను లక్ష్యంగా ఎంచుకొని ఒత్తిడి పెంచారని ప్రచారం జరుగుతోంది. దాఖలు చేసిన నామినేషన్‌ను చివరి క్షణంలో ఉపసంహరించుకునేలా చేస్తే అప్పటికప్పుడు టీడీపీకి మరో గట్టి అభ్యర్థి దొరకరని, కొత్తగా నామినేషన్‌ వేయించే అవకాశం ఉండదన్న యోచనతో ఈ వ్యూహానికి రూప కల్పన జరిగిందని అంటున్నారు. పోనీ... సమస్యను గుర్తించిన నియోజకవర్గాల్లో ముందు జాగత్త్రగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్‌ దాఖలు చేయిద్దామంటే, ‘నాపై నమ్మకం లేదా’ అని అసలు అభ్యర్థి అలిగే అవకాశంముంటుంది. వెరసి... అభ్యర్థులమీద అధిష్ఠానానికి... అధిష్ఠానం మీద అభ్యర్థులకు అపనమ్మకం తలెత్తే విపత్కర పరిస్థితికి ఇది దారి తీస్తుంది. ‘పొరుగు’ నుంచి ఒత్తిడికి గురవుతున్న వారిలో కొందరు వాటిని మౌనంగా భరిస్తున్నారు. వాటి గురించి బయట చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒకరిద్దరు అభ్యర్థులు మాత్రం చంద్రబాబును కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం. అంతకు ముందే అధిష్ఠానం వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉంది. సమస్య ఉందనుకొన్న వారితో చంద్రబాబు నేరుగా మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తున్నామని, అనవసర భయాలు పెట్టుకోవద్దని వారికి చెబుతున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు యథావిధిగా ప్రచార రంగంలోకి వెళ్తున్నారు.

ప్రత్యేక హోదా బోరింగ్‌ సబ్జెక్ట్‌ అంటూ విజయవాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ) రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సీఐఐ రాష్ట్ర విభాగం చైర్మన్‌ విజయ్‌ నాయుడు గల్లా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వైసీపీ తరఫున పీవీపీ వచ్చారు. ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక హోదా అంశం ఓ బోరింగ్‌ సబ్జెక్ట్‌ అని, దానిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించారు. సమావేశానికి హాజరైన వారు బిత్తరపోయారు. ఆయన వ్యాఖ్యలు కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

pvp 21032019

ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ నిర్వాకం వల్లే ఏపీలో లక్ష ఎకరాలు నిరుపయోగంగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా అన్నది వైసీపీ నేతలకు బోరింగ్ సబ్జెక్టుగా కనిపిస్తోందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను లోక్ సభ సభ్యులుగా గెలిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి 28,000 ఎకరాలు, లేపాక్షిలో మరో 8,808 ఎకరాలు, బ్రాహ్మణీ స్టీల్స్ కేసులో మరో 10,000 ఎకరాలు జగన్ వల్ల కేసుల్లో చిక్కుకుని నిరుపయోగంగా ఉండిపోయాయని చంద్రబాబు తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ డేటా చోరీకి భారీ కుట్ర చేశారనీ, ఫామ్-7 ద్వారా దాదాపు తొమ్మిది లక్షల ఓట్లను తొలగించేందుకు మరో కుట్ర చేశారని మండిపడ్డారు.

pvp 21032019

వైసీపీ అధినేత జగన్ కుట్రలు, డ్రామాలకు అంతేలేకుండా పోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. మోదీ మేలు కోసమే వైసీపీ లోక్ సభ సభ్యులు రాజీనామాలు సమర్పించారని పేర్కొన్నారు. ఎన్నికలు రాకుండా చూసి రాజీడ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా బోరింగ్ అంశమన్న విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీవీపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ, ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ సెటైర్లు వేశారు. "ప్రత్యేక హోదా బోరు కొట్టిందని వైసీపీ మనసులో మాట బైటికొచ్చింది. అంటే సాక్షిలో రాసేటివి దొంగ రాతలు, జగన్ నోట పలికేవి శుద్ధ అబద్దాలు, వైసీపీ ఎజెండా మొత్తం నీటి మూటలు అని తేలిపోయింది. జగన్ సారూ, కెసిఆర్ సారూ... ఇద్దరిదీ ఒకటే మాట ఏపీకి ప్రత్యేక హోదా వద్దు! అంతేగా!!" అని ఆయన ట్వీట్ చేశారు.

ఎన్నికల సమరంలో అప్పుడప్పుగూ కొన్ని విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. కానీ ప్రముఖుల ప్రచారాలు, వివాదాల మధ్య అవి పెద్దగా హైలెట్ కావు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ సాయంతో ఏపీని దెబ్బకొట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారంటూ చంద్రబాబు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ఆయన హైలెట్ చేస్తూ కేసీఆర్‌పై మండిపడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు కేసీఆర్ సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసీఆర్‌గా మారాయంటూ రాయకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

madhav 20032019

ఇంత రాజకీయ గందరగోళం మధ్య తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం ఇప్పుడూ అందరినీ ఆకర్షిస్తోంది. గతంలో తెలంగాణ ఎమ్మెల్యే పనిచేసిన సున్నం రాజయ్య ఈ ఎన్నికల్లో ఏపీలోని రంపచోడవరం నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. తెలంగాణ వ్యక్తి ఇక్కడెలా పోటీ చేస్తున్నారన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. అసలేం జరిగిందంట.. సున్నం రాజయ్య 2014లో ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. దీంతో రాజయ్య స్వగ్రామమైన వీఆర్ పురం మండలంలోని సున్నంవారిగూడెం రంపచోడవరం నియోజకవర్గంలో కలిసింది. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో భాగంగా రంపచోడవరం స్థానం సీపీఎంకు దక్కింది. దీంతో ఆ పార్టీ తరపున సున్నం రాజయ్య బరిలో దిగుతున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే రెండు రాష్ట్రాల అసెంబ్లీలోనూ అడుగుపెట్టిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన కేసులో మాజీ ఎమ్మెల్సీ హెచ్‌.ఎ.రెహ్మాన్‌కు 3 సంవత్సరాల నెల పాటు జైలు శిక్ష విధిస్తూ 17వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పునిచ్చింది. దీంతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2011 జూన్‌ 15న ఉమ్మడి రాష్ట్ర ఉప ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లను గెలుచుకుంది. దీంతో పార్టీ శ్రేణులు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 45లోని వైసీపీ కార్యాలయంలో బాణసంచా కాలుస్తూ.. వేడుకలు నిర్వహించారు. అప్పటి ఎమ్మెల్సీ హెచ్‌.ఎ.రెహ్మాన్‌ను పార్టీ కార్యకర్తలు ఎత్తుకోవడంతో.. ఆయన ఆనందం పట్టలేక.. జేబులో ఉన్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.

madhav 20032019

ఆ సమయంలో అక్కడే విధినిర్వహణలో ఉన్న జూబ్లీహిల్స్‌ ఎస్సై కె.సైదులు (ప్రస్తుతం నల్లకుంట డీఐ).. రెహ్మాన్‌ తన రివాల్వర్‌తో కాల్పులు జరిపిన విషయాన్ని నిర్ధారించుకుని.. ఆయనపై ఐపీసీ 336, ఆయుధ చట్టంలోని సెక్షన్‌ 27(1) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, సాక్షి కూడా ఆయనే. పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సైదులు ఒక్కడే సాక్షి కావడంతో.. ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. కానీ.. సాక్ష్యా ధారాల సేకరణతోపాటు.. కోర్టులో పక్కాగా వాదనలు చేయడం, కౌంటర్లు దాఖలు చేయడం, డిఫెన్స్‌ లాయర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో తడబాటు లేకుండా సమాధానాలిచ్చారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు.. రెహ్మాన్‌ కాల్పులు జరిపింది వాస్తమేనని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనతో ఏకీభవిస్తూ శిక్షను ఖరారు చేశారు.

 

Advertisements

Latest Articles

Most Read