ఎన్నికల ముంగిట ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏమి పాలుపోవటం లేదు. అనాలోచిత నిర్ణయాలతో తన గొయ్యి తానే తవ్వు కుంటున్నారు. సాక్షి ఛానల్ ఒక్కటి తప్ప, ఇక మిగాతావి ఏవి చానల్స్ కాదని, నేనే సత్యం చెప్తాను, ఏపి మొత్తం సాక్షినే చూడాలి అనుకునే జగన్, ఇప్పటికే యెల్లో మీడియా అంటూ ఒక లిస్టు తయారు చేసుకున్న జగన్ ఇప్పుడు ఆ లిస్టులో ఉన్న టీవీ5 ని నిషేదించారు. ఆ టీవీ ఛానల్ ప్రతినిధులను తమ పార్టీ కార్యకలాపాలకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఆ ఛానల్ లో జరిగే చర్చా కార్యక్రమాలలో ఇక నుండి తమ పార్టీ తరపున ప్రతినిధులు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయించారు.

tv5 08032019 1

ఇప్పటికి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిని ఇదే రకంగా బ్యాన్ చేసింది. జర్నలిస్టు మూర్తి జాయిన్ అయ్యాక టీవీ5 తమ పట్ల మరింత వ్యతిరేకంగా తయారయ్యిందని జగన్ భావిస్తున్నారు. దీనితో ఈ చర్యకు పూనుకున్నారు. ఈ నిర్ణయాన్ని బహిరంగ పత్రికా ప్రకటన లో చెప్పడం విశేషం. గతంలో టీడీపీ కూడా సాక్షిని తమ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధించింది. ఎప్పటి నుండో ఆ ఛానల్ చర్చా కార్యక్రమాలకు టీడీపీ ప్రతినిధులు హాజరు కారు. ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అంటూ జగన్ బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు. మొన్నటి దాక టీవీ9 కూడా ఈ లిస్టు లో ఉన్నప్పటికీ, కేసీఆర్ తో కలిసిన దగ్గర నుంచి టీవీ9 పేరు ఎత్తటం లేదు.

tv5 08032019 1

మాములు రోజులలో వాక్ స్వతంత్రం గురించి లెక్చర్లు ఇచ్చే జగన మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం విశేషం. రెండు నెలలలో ఎన్నికలు జరగనుండడంతో మీడియా పాత్ర చాలా కీలకం కాబోతుంది. మీడియా ప్రజలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే వచ్చిన బార్క్ టీఆర్ఫీ రేటింగ్లలో టివీ 5 మూడవ స్థానంలో ఉండడం విశేషం. టివీ5 కంటే ముందుగా టీవీ9, ఎన్టీవీ మాత్రమే ఉన్నాయి. ప్రజాదరణ ఉన్న టీవీ ఛానల్ ను ఎన్నికల ముంగిట బ్యాన్ చెయ్యడం అనేది, జగన్ నైజాన్ని తెలియ చేస్తుంది. ఇప్పటికే మూర్తి పేరు చెప్తే బీజేపీ నాయకులకు వణుకు వస్తుంది. మూర్తి మహా టీవీలో ఉండగా, వాళ్లతో ఫుట్ బాల్ ఆడారు. ఇప్పుడు బీజేపీ ఫ్రెండ్, అయిన జగన్ వంతు. తమకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే జగన్ ఇప్పటికే ఏపి పోలీసులని, ఏపి డాక్టర్లని బహిష్కరించారు. ఎన్నికల తరువాత, ఏపి ప్రజలను కూడా బహిష్కరిస్తారేమో..

పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళ ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టు సమాచారం.

bode 0803219 2

ఎమ్మల్యే టికెట్ ఖరారు కావటంతో, గత కొన్ని రోజులుగా బోడె ప్రతి రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, రాత్రి వరకు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న డేటా గొడవ పై కూడా బోడె స్పందించారు. వైసీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శిఖండిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘సేవా మిత్ర’ అనే యాప్ ద్వారా డేటాను అప్‌డేట్ చేస్తుంటే దాన్ని సైతం రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ డేటాను కాజేసేందుకు వైసీపీ టీఆర్‌ఎస్‌తో కలిసి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఫారం 7 పేరుతో వైసీపీ దరఖాస్తు చేసుకొని తమపై ఎదురు దాడి చేస్తోందని అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఎవరెన్ని కుట్రలు చేసినా అవి సాగవని బోడె ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

గుంటూరులో నాలుగు ఎన్టీఆర్‌ విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాలే వారిని పట్టించాయి. ఓ పార్టీకి చెందిన యువకులుగా పోలీసులు వీరిని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న తెల్లవారుజామున గుంటూరులోని స్తంభాలగరువు, నల్లచెరువు, అరండల్‌పేట, నెహ్రూనగర్‌ ప్రాంతాల్లోని నాలుగు విగ్రహాలకు నిప్పు పెట్టడం, పగలగొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ విజయారావు ముగ్గురు సీఐలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణను కొలిక్కి తీసుకొచ్చారు. యువకులు వారి ముఖాలు కనిపించకుండా విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు.

ntr 08032019

ఘటన జరగటానికి ముందు నగరంలో ఓ ప్రాంతంలో ఆందోళన జరిగింది. ఇక్కడ పాల్గొన్నవారు ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ సాగించిన పోలీసులకు క్లూ దొరికింది. ఆందోళనలో పాల్గొన్న వారి ఫొటోలు సేకరించారు. వారు తమ ఫొటోలను ఆ రోజు ఫేస్‌బుక్‌ ఖాతాల్లో అప్‌లోడ్‌ చేశారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోలతో వాటిని ధ్రువీకరించుకుని పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. యువకులను అదుపులోకి తీసుకుని ఆధారాలతో ప్రశ్నించడంతో తప్పు ఒప్పుకున్నారని తెలిసింది. మరో నలుగురు తమకు సంబంధం లేదని బుకాయించినట్లు సమాచారం. ఈ యువకులను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

ntr 08032019

విగ్రహాలను పగలగొట్టే ప్రాంతాలకు ముందుగా ఎర్రచొక్కా ధరించిన ఓ యువకుడు బైకు మీద చేరుకుని అక్కడ పరిస్థితులను గమనించి మిత్రులకు చెప్పడంతో పథకం ప్రకారం నాలుగు బృందాలుగా నాలుగు ప్రాంతాలకు చేరుకుని ధ్వంసం చేసినట్లు సమాచారం. పక్కా ఆధారాలతో పాత్రదారులను గుర్తించారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏటి అగ్రహారానికి చెందిన సైదా, నల్లచెరువుకు చెందిన నాని, గోరంట్లకు చెందిన కిరణ్‌, శివ ప్రసాద్‌ తదితరులు విగ్రహాల ధ్వంసంలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వీరికి వైఎస్ఆర్ పార్టీకి ఏమి సంబంధం, వీరి పాత్ర ఏంటి, ఎవరు చేపించారు అనే విషయం పై ఆరా తీస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫామ్‌-7 దరఖాస్తులను ఎన్నికల సంఘం జల్లెడపడుతోంది. ఓట్లను తొలగించాలంటూ చేసిన దరఖాస్తుల్లో 1.55 లక్షలు తప్పుడువని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... వాటిని తిరస్కరించింది. రాష్ట్రవ్యాప్తంగా 8.76 లక్షల ఫామ్‌-7 దరఖాస్తులు వచ్చాయని, 45వేల సిబ్బందితో నిరంతరాయంగా వాటి పరిశీలన కొనసాగుతోందని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ క్రమంలో దురుద్దేశపూరితంగా దాఖలైనట్లు గుర్తించిన 1,55,696 దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకూ 1,61,005 దరఖాస్తులను పరిశీలించగా... వాటిలో చనిపోయిన వారితోపాటు, బదిలీ అయిన ఓట్లకు సంబంధించిన 5309 దరఖాస్తులు మాత్రమే నిజమైనవని నిర్ధారణ అయిందన్నారు. ఇలా ఓట్ల దొంగల భాగోతం చూసి ఈసీ అవాక్కయింది.. 1,61,005 ఫిర్యాదులలో, కేవలం 5309 మాత్రమే నిజమైనవి తేలింది.

otladonga 08032019

మరో నాలుగైదు రోజుల్లో అన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ద్వారా గంపగుత్తగా వస్తున్న ఫామ్‌-7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందన్నారు. అయితే, జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత ఒక్క ఓటు కూడా తొలగించలేదని ద్వివేది స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో ఫామ్‌-7 దాఖలు చేయగానే ఓట్లు తొలగించినట్లు కాదన్నారు. ఈ అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. నకిలీ దరఖాస్తులపై కేసులు నమోదు చేయడం ప్రారంభించిన తర్వాత ఫామ్‌-7 రాక తగ్గిపోయిందన్నారు. ఫామ్‌-7 దరఖాస్తు చేయొద్దు అనడం తమ ఉద్దేశం కాదని, దాఖలుకు నిజమైన కారణం ఉంటే దరఖాస్తు చేయొచ్చని చెప్పారు. ఫామ్‌-7 దరఖాస్తుల విషయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రకటనలు చేయొద్దన్నారు.

otladonga 08032019

రాజకీయ పార్టీలు ఈసీకి ఒక మాట... మీడియాకు ఒక మాట చెప్పడం వల్ల ప్రజల్లో అపోహలు కలిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ నియమ, నిబంధనల ప్రకారం తాము పని చేస్తామని, ఎలాంటి అనుమానాలకూ తావులేదని ద్వివేది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటు హక్కులేనట్లుగా గుర్తించామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనేదే తన లక్ష్యమన్నారు. ఎవరి పేరు అయినా ఓటరు జాబితాలో లేకపోతే వెంటనే ఫామ్‌-6 దరఖాస్తు చేయాలని ద్వివేది సూచించారు. మంత్రి ఫరూక్‌ కుటుంబంలో ఏడుగురి ఓట్లు గల్లంతైన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... తమ ఎన్నికల సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

Advertisements

Latest Articles

Most Read