ఆంధ్రప్రదేశ్ కు చెందిన జనాభా యొక్క ఓట్లు తొలగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ధుమారాన్నే రేపుతోంది.అయితే ఇదంతా చంద్రబాబు కుట్రే బి జగన్ కాదు ఇదంతా జగన్ కుట్రే అని చంద్రబాబు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు.అయితే ఇప్పుడు బయటకి వస్తున్న ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు కలకలంగా మారిన ఈ ఓట్ల తొలగింపు చర్య పక్కాగా ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం తోనే జరుగుతుందన్న అనుమానం వస్తుంది. జగన్ సూచనల మేరకే ఆ పార్టీకి చెందిన నేతలు ఫారం 7 పేరిట కావాలనే తొలగిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయం పైనే నిన్న వైసీపీ కి చెందిన బొత్స సత్యన్నారాయణ కూడా నోరు జారేసారు. జగన కూడా తామే ఫారం 7 ద్వారా, ఓట్లు తొలగిస్తున్నామని ఒప్పుకున్నారు.
కానీ అది తడబాటు అని అనుకుందాం ఇప్పుడు మాత్రం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ తతంగం వెనుక ఉన్నది జగనేనా అన్న సందేహం అయితే తప్పకుండా వస్తుంది.కృష్ణ జిల్లా చంద్రల్లపాడు మండలం ఏటూరులో వైసీపీ బూత్ కన్వీనర్ గా పనిచేస్తున్నటువంటి జానకి రామారావు అనే వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేసేసారు.. ఎవరో చేసిన రాజీనామాకి దీనికి ఏం సంబంధం ఉంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు రహస్యం బయటకు వచ్చింది.ఇతను రాజీనామా చేసిన తర్వాత కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు.తనని కొంత మంది వైసీపీ సీనియర్ నేతలు కలిసి తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని చేపట్టి తన బంధువులు,స్నేహితుల ఓట్లను తొలగించేశారని సంచలనం సృష్టించారు.ఆ తర్వాత ఇదేంటి అని వారిని ప్రశ్నిస్తే నీకేం పర్లేదు మేము చూసుకుంటామని మాట్లాడారని తెలిపారు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరుకు చెందిన వైసీపీ నేత జానకి రామారావు పార్టీపై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ 36వ బూత్ కన్వీనర్‌గా ఉన్న జానకి రామారావు.. తన ప్రమేయం లేకుండానే.. సంతకం తీసుకుని 60 ఓట్లను ఫారం సెవెన్ ద్వారా తొలగించారన్నారు. ఎందుకిలా ఓట్లు తొలగించారని అడిగితే.. అంతా మేం చూసుకుంటామన్నారని వివరించారు. ఓట్ల తొలగింపుతో.. అందరూ తనను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. ఓట్ల తొలగింపులానే మరో కుట్ర చేసి తనపై అభాండాలు వేస్తారనే భయంతో.. టీడీపీలో చేరినట్లు జానకీ రామారావు స్పష్టం చేశారు.తన పేరిట ఓట్ల తొలగింపుపై జానకీ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.