ఆంధ్రప్రదేశ్‌లో రూ.21వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ ఔషధ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో సచివాలయంలో మంగళవారం అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ)పై సంతకాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్‌, ఆయా సంస్థల యాజమాన్యాలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఈ భారీ పెట్టుబడులతో 57 వేల మందికి ప్రత్యక్షంగా, 1.65 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సులభతర వాణిజ్య విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

korea 06032019 2

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో మారుతీ ఇస్పాత్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తెలుగు ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ కెమికల్‌ అసోసియేషన్‌, హ్యులెట్‌ ఫ్యాకర్డ్‌ ఇండియా (హెచ్‌పీ), జెడ్‌టీటీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, ఓజోవతి ప్రైవేట్‌ లిమిటెడ్‌, అవాంజ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గోదావరి యూనివర్సిటీ, అకలైట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌, సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, శ్రేయాంధ్ర ఇండస్ట్రియల్‌ హెంప్‌ ఆంధ్ర ప్రైవేటు లిమిటెడ్‌, డ్రీమ్‌వ్యాలీ రిసార్ట్స్‌, ఎస్‌ఏపీఎల్‌ ఇండస్ట్రిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పారిశ్రామిక రంగంలో రూ.21,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒకేరోజు 14 ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ (ఏపీఈడీబీ) ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో) జాస్తి కృష్ణకిశోర్‌తో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు చేసుకున్న ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.22 లక్షల మందికి ఉపాధి లభించనున్నది.

 

korea 06032019 3

కర్నూలు జిల్లాలో 200 ఎకరాల్లో రూ.1,227.01 కోట్ల పెట్టుబడితో ఉక్కు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మారుతీ ఇస్పాత్‌, ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. ప్రకాశం జిల్లాలో 1,100 ఎకరాల్లో ‘ఔషధాలు-రసాయనాల సంఘం’ ఆధ్వర్యంలో రూ.9 వేల కోట్లతో ఎంఎస్‌ఎంఈ ఔషధ పరిశ్రమలు ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.95 లక్షల మంది ఉపాధి. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.710 కోట్ల పెట్టుబడితో విశ్వవిద్యాలయం ఏర్పాటు. కంప్యూటర్‌, బిజినెస్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సులను ప్రవేశపెట్టే ఈ యూనివర్శిటీలో 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు శ్రీసిటీలో రూ.700 కోట్లతో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ తయారీ ప్లాంట్‌, రూ.1,800 కోట్లతో లిథియం బ్యాటరీల పరిశ్రమ. రూ.4,800 కోట్ల పెట్టుబడితో 20 చోట్ల ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌, ఎల్‌సీఎన్‌జీ స్టేషన్లు. సిల్వర్‌ వోక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు. రూ.35 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి. ‘శ్రేయాంత్ర ఇండస్ట్రియల్‌ హేంప్‌ ఆంధ్ర ప్రయివేట్‌ లిమిటెడ్‌’ రూ.1,000 కోట్ల పెట్టుబడితో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.205 కోట్ల పెట్టుబడితో వినోద పార్కు, అయిదు నక్షత్రాల గోల్ఫ్‌ రిసార్ట్‌. హెచ్‌పీ ఇండియా ఆధ్వర్యంలో త్రీడీ ముద్రణ సాంకేతిక కేంద్రం.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి మాయమయ్యాయి. ఈ పత్రాలు చోరీకి గురైనట్టు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు బుధవారంనాడు తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో దాఖలైన రివ్యూ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో వాదనలు సందర్భంగా లాయర్ ప్రశాంత్ భూషణ్ ఓ నోట్‌లో ఉన్న వివరాలు చదువుతుండగా వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించిన డాక్యుమెంట్లు రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని, ప్రస్తుత, లేదా మాజీ ఉద్యోగులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన కోర్టుకు తెలిపారు. ఈ విషయంతో దేశం మొత్తం నివ్వెరపోయింది.

rafael 06032019

వార్తాపత్రికలో ప్రచురితమైన నోట్స్‌ను, రివ్యూ పిటిషన్‌కు జోడించిన వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకోరాదని అటార్నీ జనరల్ వాదించారు. దేశభద్రతతో ముడిపడిన రక్షణ కొనుగోళ్ల వ్యవహారంపైనే కోర్టు విచారణ జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. 'రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎంత సున్నితమైనదో ఇటీవల ఘటనలు చెబుతున్నాయి. వీటి స్క్రూటినీ వల్ల భవిష్యత్ కొనుగోళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో దేశాలు వెనుకంజ వేయవచ్చు. కొందరు పార్లమెంటులో, టీవీ ఛానెల్స్‌లోనూ‌ ఆటంకాలు సృష్టిస్తామని, అంతిమంగా కోర్టుకు వెళ్తామని అనే అవకాశాలు కూడా ఉంటాయి' అని రాఫెల్ డీల్ కేసులో రివ్యూ పిటిషన్లకు వ్యతిరేకంగా వేణుగోపాల్ తన వాదన వినిపించారు.

rafael 06032019

ఫ్రెంచ్ కంపెనీతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకునే విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలు ఆరోపణలకు దిగడంతో రాఫెల్ డీల్ వ్యవహారం చుట్టూ కొద్దికాలంగా వివాదం ముసురుకుంది. ప్రశాంత్ భూషణ్, మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ డీల్‌పై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వారు కోర్టును కోరారు. అయితే, రాఫెల్ డీల్‌ ఒప్పంద ప్రక్రియను సందేహించడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఒప్పందాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. అయితే, తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది.

ఒక పక్క ఇరు రాష్ట్రాల మధ్య డేటా వార్ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పై కక్ష సాధింపుకి దిగింది తెలంగాణా... ఒక పక్క చెరువులు ఆక్రమించుకి, కన్వెషన్ సెంటర్లు కట్టుకున్న వారిని వదిలేసి, తన స్థలంలోనే, భవనం చుట్టూ సెట్‌బ్యాక్‌లో ఫ్యాబ్రికేషన్‌ నిర్మాణాలు చేపట్టారని, ఏపి డీజీపీని కక్ష సాధింపులకి గురి చేసారు. ఉన్నట్టు ఉండి, కేసు బయటకు తీసి, ఉన్న పలంగా నష్టం చేకూర్చారు. హైదరాబాద్‌ ప్రశాసన్‌నగర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఇంటికి సంబంధించి అదనపు నిర్మాణాలను మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేశారు. అయితే దీని పై కోర్ట్ అక్షింతలు కూడా వేసింది. 24 గంటల సమయం ఇస్తే ఏం చేస్తారని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. మార్చి 11 వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది.

dgp 06032019 2

అయినా అప్పటికే దాదపుగా కుల్చివేసారు. ప్లాట్‌ నెంబర్‌ 149లో ఆమోదిత ప్లాన్‌కు అదనంగా ఉన్న ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను తొలగించామని అధికారులు తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మూడో అంతస్తు వరకు నిబంధనల ప్రకారం భవనం చుట్టూ ఉండాల్సిన సెట్‌ బ్యాక్‌ స్థలంలో ఐరన్‌ గిర్డర్లు, ఫ్యాబ్రికేషన్‌ ఫ్రేమ్‌లు ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌కు దక్షిణం-తూర్పు వైపు ఓవర్‌ బ్రిడ్జి నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీటన్నింటినీ కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. భవనం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నట్టు ప్రశాసన్‌నగర్‌ సహకార గృహనిర్మాణ సొసైటీ 2017 జూన్‌ 4న ఫిర్యాదు చేసింది. సెట్‌బ్యాక్‌లో చేపట్టిన నిర్మాణాలకు అనుమతి ఉందా? ఆమోదిత ప్లాన్‌ ప్రకారం భవనం ఉందా? వంటి వివరాలు సమర్పించాలని ఆ మర్నాడే ఠాకూర్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇచ్చింది. అదే నెల 15న అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని మరో నోటీసు ఇచ్చింది.

dgp 06032019 3

దీన్ని సవాలు చేస్తూ ఠాకూర్‌ సిటీ సివిల్‌ కోర్టులో వేసిన సూట్‌ను గత ఏడాది ఫిబ్రవరి 5న న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ ఏడాది తరువాత మార్చి 2న తుది నోటీసులు ఇచ్చారు. స్పెషల్‌ డ్రైవ్‌ నేపథ్యంలో నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగానే ఆర్‌పీ ఠాకూర్‌ భవనం చుట్టూ సెట్‌బ్యాక్‌లో ఉన్న నిర్మాణాలు తొలగించామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. డేటా చోరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్తతలు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. డేటా చౌర్యం కేసులో అవసరమైతే ఆంధ్రా పోలీసుల మీద కూడా కేసులు పెడతామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రకటించిన మర్నాడే కూల్చివేతలకు పూనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిటీ సివిల్‌ కోర్టు ఏడాది క్రితం సూట్‌ను కొట్టేస్తే జీహెచ్‌ఎంసీకి ఇప్పుడు గుర్తుకు రావడం వెనుక టైమింగ్‌ ఉందని ఆంధ్రా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఏపీలో ఫారం-7 వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఓట్ల తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు రావడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో ఫారం-7 దరఖాస్తులు ఏకంగా లక్షా 10వేలకు చేరాయి. అంతేకాదు ఏకంగా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటును తొలగించాలంటూ ఆన్‌లైన్ దరఖాస్తు రావడం సంచలనంగా మారింది. తన ఓటును తొలగించాలంటూ ఫారం-7 దరఖాస్తు రావడంతో ఎమ్మెల్యే షాక్ తిన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల ఎం.పైపల్లిలో తనకు ఓటు హక్కు ఉందని.. ఆ ఓటును తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు వెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఓటును తొలగించేందుకు దరఖాస్తు వచ్చిందని ఐరాల తహశీల్దార్ తనకు ఫోన్ చేసి చెప్పడంతో షాకయ్యానన్నారు.

ycp 06362019

పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ తతంగం అంతా చేసింది వైసీపీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఏకంగా ఫారం-7 ఉపయోగించి, సొంత పార్టీ ఎమ్మల్యే ఓటే లేపేసే ప్రయత్నం చేసారు. జగన్ మోహన్ రెడ్డి నిన్న బహిరంగంగా నేనే ఓటు తొలగిస్తున్నా అని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో జగన్ నేర్పిన ఫారం-7 విద్యతో, ఏకంగా వైసీపీలో ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసి, ఓట్లు లేపేసుకుంటున్నారు. ‘మా ఓట్లు తీసేస్తున్నారు’ అని ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసిన వైసీపీ అధినేత జగన్‌... తామే ఇతరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు ఇచ్చినట్లు మొట్టమొదటిసారిగా అంగీకరించారు.

ycp 06362019

తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేలా ఆన్‌లైన్‌లో ఫామ్‌-7 దరఖాస్తులు తామరతంపరగా వస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ అంశాన్ని ఈసీ సీరియ్‌సగా తీసుకోవడంతోపాటు... తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఫామ్‌-7లు సమర్పిస్తున్నది మేమే’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టంగా ప్రకటించడం గమనార్హం. మంగళవారం నెల్లూరులో జరిగిన ‘సమర శంఖారావం’ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘చంద్రబాబు రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు చేర్చించారు. వాటిని తొలగించాలని ఫామ్‌-7 ద్వారా కోరాం’ అని తెలిపారు. అదే సమయంలో... వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తున్న వారి ఓట్లను టీడీపీ తొలగించే కుట్ర చేస్తోందని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read