ఈ రోజు నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఓట్ల తొలగింపు విషయంలో వైసీపీ ప్రమేయం ఉందని వైఎస్ జగన్ ఒప్పుకున్నారు. వైసీపీ తరపున ఫాం-7 విరివిగా ఈసీకి ఇచ్చిన మాట నిజమేనని ఆయన తెలిపారు. టీడీపీ దొంగ ఓట్లు లక్షల కొద్ది నమోదు చేయించిందని, కాబట్టే.. ఓట్లు తొలగించేలా ఫాం-7 పెట్టామన్నారు. నెల్లూరు సభలో జగన్‌ ఇదే మాటను స్పష్టంగా చెప్పారు. అసలు ఫాం-7 తో జగన్ కు ఏమి సంబంధం ? ఇలా చెయ్యవచ్చా ? ఒకరి ఓటు వారికే తెలియకుండా, ఇలా ఎవరూ పడితే వారు ఓట్లు తొలగించవచ్చా ? అనే వాదనలు మొదలయ్యాయి. చట్ట ప్రకారం జగన్ చేసిన పని నేరం అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగన్, ఈ విషయం చెప్పిన తరువాత మరో సంచలన విషయం బయట పడింది.

viveka 05032019

కొన్ని రోజల క్రితం, జగన్ బాబాయి వైఎస్ వివేకా ఓటు పోయింది అంటూ హడావిడి చేసారు. అయితే ఇప్పుడు జగన్ స్వయంగా ఒప్పుకోవటంతో, వైఎస్ వివేకా ఓటు కూడా, ఫాం-7 తో జగనే స్వయంగా తొలగించారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఇప్పటికే జగన కు, ఆయన బాబాయి , వైఎస్ వివేకా కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆస్తుల గొడవలతో పాటు, టికెట్ విషయంలో కూడా, కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒకానొక సమయంలో , వైఎస్ వివేకా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ఇప్పటికే చంద్రబాబుతో టచ్ లో ఉన్నారనే, ప్రచారం బలంగా జరిగింది. ఈ నేపధ్యంలోనే, జగన్ , ఫాం-7 ఏకంగా సొంత బాబాయి వైఎస్ వివేకా ఓటు కూడా తీయించారా అనే చర్చ కూడా మొదలైంది.

viveka 05032019

మరో పక్క, రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపు కోసం 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించేందుకు భారీగా ఫారమ్‌-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఈ విషయంపై సీఈసీ స్పందించారు. గత పది రోజుల్లోనే 6 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. ఓట్ల తొలగింపు కోసం వస్తున్న అక్రమ దరఖాస్తులపై కేసులు నమోదు తర్వాత ఫారం-7 దరఖాస్తులు తగ్గాయన్నారు. 9 జిల్లాల్లో క్రిమినల్‌, ఐటీ, ప్రజాప్రాతినిధ్య (పీఆర్‌) చట్టాల్లో వివిధ సెక్షన్ల కింద 45 కేసులు నమోదు చేసినట్లు ద్వివేది తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు, తూర్పు గోదావరి-14, కృష్ణా-3, గుంటూరు-1, ప్రకాశం-4, చిత్తూరు-3, అనంతపురం-1, కర్నూలు-8, విశాఖపట్నం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయన్నారు. దొంగ దరఖాస్తులకు సహకరిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలోని మీసేవా సెంటర్లలో పని చేస్తున్న ఆరుగురు సిబ్బందిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఓటు దొంగలు పడిన విషయం తెలిసిందే. తెలంగాణాలో లాగా లక్షల లక్షల ఓట్లు తొలగించి, లబ్ది పొందే కుట్ర, బీహారీ గ్యాంగ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన 8 లక్షల ఓట్లు తొలగించే అతి భారీ కుట్రకు తెర లేపారు. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనే వేలకొద్దీ ఫారం-7 అప్లికేషన్ల సమర్పణతో, ఈ ఓట్లు తొలగింపు జరుగుతుందని తెలుసు కాని, ఎవరు చేపిస్తున్నారో తెలియదు. మా ఓటు పోయింది అంటే మా ఓటు పోయింది అంటూ, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్న టైంలో, ఓట్లు తొలగించమని చెప్పింది నేనే అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో నోరు జారారు. ఫారం 7 ఉపయోగించి, ఓట్లు తొలగిస్తుంది మేమే అంటూ, నెల్లూరు సభలో టంగ్ స్లిప్ అయ్యారు జగన్.

jagan 05032019 2

ఫారం 7 ద్వారా దొంగ ఓట్లుగా చెప్తున్నా ఓట్లు తొలగించమని మేము కోరితే చంద్రబాబుకి నొప్పి ఏంటి అంటూ, నెల్లూరు సభలో జగన్ అన్నారు. మొన్నటి దాక, అసలు మాకు, ఓట్లు తొలగింపుకు సంభందం ఏంటి అంటూ బుకాయిస్తున్న వైసీపీ నేతలకు, జగన్ మాటలు షాక్ ఇచ్చాయి. జగన్ కావాలని అన్నారో, నోరు జారి అన్నారో కాని, మేము ఇన్నాళ్ళు సమర్ధించి బకరాలు అయ్యాము అంటూ వాపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 100కి పైగా నియోజకవర్గాల్లో.. వీలున్నమేరకు ఓటర్లను తొలగించేందుకు భారీగా తప్పుడు ఫిర్యాదులు చేశారని టీడీపీ పేర్కొంటోంది. ఒక్కో నియోజకవర్గంలో 2-3 వేల ఓట్లు తొలగించాలనే దురుద్దేశంతో ఒక భారీస్థాయి వ్యూహం అమలు జరిగిందని అంటోంది. సుమారు 78,000 ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. అంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలోను సగటున 450 ఫిర్యాదుల వరకు వచ్చాయి. ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామాల సంఖ్య కంటే ఈ ఫిర్యాదుల సంఖ్య కొన్ని రెట్లు ఉంది. అంటే ప్రతి గ్రామంలోనూ కొన్ని ఫిర్యాదులు, పట్టణాలు, నగరాల్లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. రాజకీయ యుద్ధంలో భాగంగా...ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేందుకు సాగుతున్న వ్యవహారమేనని అర్థమవుతోంది.

jagan 05032019 3

ఇక్కడ మరో అంశం కూడా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పలు బూత్‌లలో భారీగా ఓట్లు తొలగించాలని ఫిర్యాదుచేశారు. అయితే ఈ ఓటర్ల తొలగింపు ఫిర్యాదులో కూడా తెలివితేటలు ప్రదర్శించారు. తీసేయాలని కోరిన ఓటర్లలో 90 శాతం పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్య ఓటర్లున్నారు. వీరు సామాన్యులు కావడంతో.. అంతగా అందరికీ తెలియరు. ఎవరోలే అనుకుంటారు. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతల పేర్లనూ ఫిర్యాదులో కలుపుతారు. వీరి పేర్లు సుపరిచితం కావడంతో.. స్థానికంగా టీడీపీ వాళ్లు ఆ ఫిర్యాదును చూసినా.. అది వైసీపీకే నష్టం కదా అని వదిలేస్తున్నారు. కానీ 90శాతం పైగా సామాన్య తెలుగుదేశం పార్టీ ఓట్లను పసిగట్టలేకపోతున్నారని టీడీపీ నాయకుడొకరు తెలిపారు. ఇంత పెద్దఎత్తున కుట్రను తమ అధినాయకత్వం ఊహించి ఉండదని అంటున్నారు.

తెలంగాణాలో అక్రమమగా దొంగలించిన టిడిపి డేటా అప్పుడే వైసీపీ చేతికి వచ్చేసింది... ఐటి గ్రిడ్ నుంచి అక్రమంగా దొంగలించిన తెలుగుదేశం కార్యకర్తల డేటాని, తెలంగాణా పెద్దలు, వైసీపీ నేతలకు అప్పగించారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఫోన్లు చేసి మభ్యపెడుతున్నారని, ఒక్కో ఓటుకు రూ. 5వేలు అంటూ ప్రలోభ పెడుతున్నారని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్తకు వచ్చిన ఫోన్‌ వాయిస్‌ రికార్డును మీడియా ముందు ప్రదర్శించారు. గొల్లపూడికి చెందిన శీను నాయక్‌ అనే కార్యకర్తకు వైసీపీ నేతల నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు. ఇలా ప్రతిరోజు వేల మంది కార్యకర్తలకు వైసీపీ నేతలు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపుతున్నారని మంత్రి అన్నారు.

call record 05032019

దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన మీడియా ముందు బహిర్గతం చేశారు. గొల్లపూడికి చెందిన శీనునాయక్ అనే కార్యకర్తకు వైకాపా కాల్ సెంటర్ నుంచి వచ్చిన ఫోన్ వాయిస్ రికార్డును మీడియా సమావేశంలో మంత్రి వినిపించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కొందరు ఓటుకు ఐదు వేలిస్తామంటూ మభ్య పెడుతున్నారని.. స్థానికులే వారిని పోలీసులకు అప్పజెప్పారని మంత్రి తెలిపారు. ఓ మహిళ తనకు ఫోన్ చేసి మీ డేటా అంత మా దగ్గర ఉందని.. జగన్‌ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పారని కార్యకర్త శీను నాయక్ ఈ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రలోభపెట్టి, మభ్య పెట్టే ప్రయత్నం చేశారన్నారు. అయితే.. వైసీపీ ప్రలోభాలకు లొంగేది లేదన్నారు.

call record 05032019

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో డిలీషన్‌ టెక్నాలజీ, ఏపీలో డెవలప్మెంట్ టెక్నాలజీ ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి తెరాస తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏపిలోనూ అదే తరహా కుట్రలను కేసీఆర్ ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఏపీలో తెలంగాణ తరహా కుట్రలను జగన్ కోసం కేసీఆర్ చేస్తున్నారు. వైకాపా ఎంపీ అభ్యర్థులను కేసీఆర్, భాజపా నిర్ణయిస్తున్నాయి. ఫామ్ హౌసుల్లో కూర్చొని రామ్ మాధవ్, కేసీఆర్ వైకాపా ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.’ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో జగన్ కుమ్మక్కై ఏపీ పోలీసులపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.

గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నిందలు వేస్తూ, హడావిడి చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, జగన్ లకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన ఎలక్షన్ కమిషన్.. మొన్న హైకోర్ట్ ఎలా అయితే తెలంగాణా పోలీసులని తిట్టిందో, ఇది అంతకు మించి ఎదురు దెబ్బ. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తెలుగుదేశం పార్టీ ఐటి సర్వీసెస్ మాత్రమే చేస్తుంది అని చెప్పినా వినకుండా, ఆ డేటా మొత్తం నొక్కేసి, వైసీపీకి ఇచ్చే ప్లాన్ వేసారు. అయితే దీని కోసం, ఓటర్ లిస్టు అంతా, ఈ కంపెనీ దొంగతనం చేసింది అని, బయటకు రాని డేటా కూడా వీళ్ళ దగ్గర ఉంది అంటూ హడావిడి చేసారు. అయితే అన్ని రాజకీయ పార్టీల దగ్గర ఉండే ఓటర్ జాబితా, ఆన్లైన్ లో ఉండే ఓటర్ జాబితా మాత్రమే, ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్ద ఉంది అని చెప్పినా, జగన్ తో, కలిసి ఏపి ప్రభుత్వం పై కేసీఆర్ కుట్ర పన్నారు.

ec 005032019

అయితే వీళ్ళకు చెంప పెట్టు అన్నట్టు, ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్ద లభ్యమైన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదేనని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జి.కె. ద్వివేది స్పష్టంచేశారు. పబ్లిక్‌ డొమైన్‌లో ఉండే వివరాలు ఎవరైనా తీసుకొనే వీలుందని చెప్పారు. డేటా వివాదంపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలతో తమకు సంబంధం లేదన్నారు. ఎన్నికల ఉద్యోగులు తప్పుచేసినా క్రిమినల్‌ చర్యలతో పాటు సస్పెండ్‌ చేస్తున్నామని చెప్పారు. ఓటరు జాబితాలో ఆధార్‌, బ్యాంకు ఖాతా లింకు సమాచారం ఉండదని, ఇతర సంక్షేమ పథకాల సమాచారం కూడా ఏదీ ఉండదని ద్వివేది స్పష్టంచేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో ఓటర్ల జాబితా ఎక్కడ నుంచి వచ్చిందో తెలంగాణ కమిషనర్ సజ్జనార్ చెప్పాలన్నారు.

ec 005032019

రాష్ట్రవ్యాప్తంగా 45వేల మంది బూత్‌ లెవెల్‌ అధికారులు ఉండగా.. వారిలో ఎవరోఒకరు పొరపాటు చేసే అవకాశం ఉందన్నారు. ఓట్లు తొలగించాలంటూ వారం రోజుల క్రితం వరకు రోజుకు లక్ష దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు గణనీయంగా తగ్గాయని ద్వివేది తెలిపారు. ఓట్లు తొలగించాలంటూ తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. కేసులు నమోదు కావడంతో ఫారం 7 దరఖాస్తులు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఓట్ల తొలగింపు కోసం మోసం చేస్తే ఈసీ చూస్తూ ఊరుకోదన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని, ఎన్నికల సంఘానికి దురుద్దేశాలు అపాదించడం సరికాదని ద్వివేది వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read