నలుగురు సహచర ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్‌ సంస్థ ఉద్యోగి అశోక్‌ తెలంగాణ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, గురుడు చంద్రశేఖర్‌, విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు నిర్బంధించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. నలుగురు ఉద్యోగులను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇవాళ, రేపు హైకోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే విచారణ జరపాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఈ నలుగురిని కోర్టు ముందు హాజరుపరిచేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్ ను మరికాసేపట్లో జడ్జి విచారించే అవకాశముందని భావిస్తున్నారు.

highcourt 03022019

తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సైబరాబాద్‌ పోలీసులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంస్థ తెలుగుదేశం పార్టీకి యాప్‌ తయారుచేసి ఇచ్చిందని, దీనిలో ఓటర్లు, వారి ఆధార్‌ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది కేవలం పార్టీకి చెందిన డేటా అని, తెలంగాణా పోలీసులకి ఈ డేటా ఇచ్చే పనే లేదని, కోర్ట్ లోనే ఈ విషయం తేల్చుకుంటామని తెలుగుదేశం అంటుంది.

highcourt 03022019

మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా, ఈ వ్యవహారం పై ఫైర్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌పై భారీ కుట్రకు వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తున్నాయని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని అల్లకల్లోలం చేయడానికి అన్ని వ్యవస్థల దుర్వినియోగానికి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల సేవలు వినియోగించుకుంటారని అన్నారు. ఏపీ ప్రజల డేటా ఉంటే ఏపీ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా... తెలంగాణ పోలీసులకు వైసీపీ ఎలా ఫిర్యాదు చేసిందని ధూళిపాళ్ల ప్రశ్నించారు. అంతా కలిసి ఏపీపై కుట్రలు చేస్తే చూస్తూ కూర్చోమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌కు అధికారం ఉంది కదా అని.. కళ్లు నెత్తికెక్కాయని ధూళిపాళ్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య డేటా యుద్ధం నడుస్తోంది. పోటా పోటీ పిర్యాదులతో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసుల సోదాలతో వివాదం రాజుకుంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. తమ డేటాను తీసుకునేందుకు వైసీపీ, టీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని టీడీపీ ఆరోపించింది. తెలంగాణ పోలీసులను ముందుపెట్టి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారని మండిపడింది. దీనిపై ఏపీ పోలీసులకు పిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న ఐటీ కంపెనీని 30 మంది తెలంగాణ పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారని ఏపీ మంత్రి కళావెంకట్రావ్ అన్నారు.

police 03032019

వారికి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కంపెనీ ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేశారని చెప్పారు. అందుబాటులో లేని ఉద్యోగుల కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి వేధింపులకు గురిచేశారని, ఆ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఐటీ ఉద్యోగులను అరెస్టు చేసి తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు చట్ట వ్యతిరేకంగా సోదాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులను ముందుపెట్టుకుని తెరవెనుక ఉండి నడిపిస్తున్న ముగ్గురు నేతల గుట్టు త్వరలోనే రట్టు చేస్తామని అన్నారు. విజయసాయి రెడ్డి పిర్యాదుపై తెలంగాణ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించి దాడులు చేశారని కళా వెంకట్రావ్ విమర్శించారు.

police 03032019

‘‘ఇరవయ్యేళ్లుగా తెలుగుదేశం కార్యకర్తల డేటాను సేకరించాం. ఏ యూనిట్‌ ఎలా పనిచేస్తుంది? తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటున్నాం. ఆ సాప్ట్‌వేర్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఉంటే ఆ కంపెనీపైకి పోలీసులను పంపిస్తారా? విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం దాడిచేస్తుందా?’’ అని చంద్రబాబు కర్నూలు సభలో నిలదీశారు. ‘‘మా ఆర్థిక మూలాలు పట్టుకొని జగన్‌కు సహకరించాలని మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం’’ అని హెచ్చరించారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు, సేవామిత్రల సమాచారాన్ని సంగ్రహించేందుకే ఈ ఎత్తులు వేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఏపీ టీడీపీ నేతల ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. ఐటీ కంపెనీపై సోదాలను ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య వేడిని రాజేసింది. టీడీపీ తమ ఓట్లను తొలగిస్తోందంటూ వైసీపీ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తోంది. దీనిపై ఈసీని కూడా ఆశ్రయించింది. అయితే ఇదంతా నాటకమేనని గ్రామస్థాయిలో టీడీపీ ఓట్లనే తొలగిస్తున్నారని, దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని టెలీకాన్ఫరెన్స్‌లో నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొందరు టీడీపీ ఓట్లను తొలగించే కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. సైబర్ క్రైమ్ నేరస్తులంతా కుమ్మక్కై ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు కుట్ర చేస్తున్నవారిని వదలవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మంత్రి లోకేష్ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు.

votes 02032019

 ప్రతి గ్రామంలోనూ టీడీపీ ఓట్లను తొలగించేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. బిహార్ గ్యాంగ్ డైరెక్షన్‌లో దొంగబ్బాయి. చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో టీడీపీని ఎదుర్కొనే దమ్ములేకే వైసీపీ దద్దమ్మ పనులు చేస్తోందని లోకేష్ దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించారని, దీని వెనుక ఉన్న కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని చంద్రగిరి టీడీడీ నేత నాని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో గతంలో ఉన్న ఓట్లు, తాజా ఓటర్ల లిస్టులో తొలగించిన తర్వాత ఓటర్ లిస్టులను ఆయన మీడియాకు చూపించారు. ప్రతి మండలంలోనూ టీడీపీ ఓటర్లను కుట్రపూరితంగా తొలగించారని, సైబర్ నేరానికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

votes 02032019

రెండు రోజుల క్రితం, ఒకే రోజు 5 వేలు ఓట్లు తొలగించారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రమ్రంతా ఓట్లు తొలగింపుపై ఒకేసారి లక్షల్లో అభ్యంతరాలు ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల అధికారులకు చేరాయి. దీంతో జిల్లా ఎన్నికల అధికారులు సైబర్‌క్రైం జరిగినట్టు గ్రహించి ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఏపీ అంతటా ఓట్లు తొలగింపు అలజడి ఆరంభమైంది. 13 జిల్లాల్లో 5 లక్షల 20 వేల ఓట్లు ఫారం-7 ద్వారా డిలీషన్ కోసం 24 గంటల్లో అప్‌లోడ్ కావడం పట్ల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 32000 ఓట్లు ఒక్కరోజులో తొలగింపునకు ఫారం-7 అప్‌లోడ్ కావడం గమనార్హం. ఈ పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించాలంటూ తమకు అభ్యంతర పత్రం వచ్చిందంటూ యంత్రాంగం.. మరోపక్క అభ్యంతరం వ్యక్తం చేసిన పత్రంలో సిఫార్సు చేసిన వారి పేర్లు కూడా స్థానికులదే కావడం.. ఇదే విషయమై అధికారులు విచారణతో గ్రామాల్లో ఓట్లు తొలగించే ఫారమ్-7 పెను అలజడినే సృష్టించింది.

ఏపీ-తెలంగాణ మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడులు చేస్తున్నారు. టీడీపీ వివరాలున్న సర్వర్లను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. మొత్తం 200 మంది ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చేరుకున్నారు. ఏపీలోని లబ్ధిదారుల డాటా మొత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

itcompany 03032019

శనివారం అర్ధరాత్రి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వద్ద ఆంధ్రా, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీకి చెందిన సేవామిత్రలు, బూత్‌ కన్వీనర్లు, కార్యకర్తల సభ్యత్వ వివరాలు ఉన్న సర్వర్లను ఓపెన్‌ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. శనివారం సాయంత్రం నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనే తెలంగాణ పోలీసులు ఉన్నారు. తమను లోపలికి అనుమతించాలని ఏపీ పోలీసులు పట్టుబట్టారు. సర్వర్లను, ఉద్యోగులను తీసుకెళ్లడానికి వీలులేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు వచ్చారని ఏపీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ డేటాతో వైసీపీ నేతలకు పనేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగులను ఇబ్బందిపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం గట్టిగా హెచ్చరించారు. మరోవైపు టీడీపీ నేతలు ఆంధ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

itcompany 03032019

ఇదిలా ఉంటే.. అర్ధరాత్రి ఈ ఇష్యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదని సదరు కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కర్ కోసం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చారు. అప్పటికే తెలంగాణా పోలీసులు ఆ కంపెనీలో ఇంకా సోదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆంధ్రా పోలీసులని లోపలకి పంపించలేదు. ఇక్కడ ఉద్యోగి మిస్ అయ్యారని కేసు పెట్టారని, ఆయన ఆచూకి తెలుసుకోవటానికి వచ్చామని చెప్పటంతో, ఇక తెలంగాణా పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలిపారు. భాస్కర్‌ను తమకు అప్పచెప్పాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు.

 

Advertisements

Latest Articles

Most Read