ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూకట్‌పల్లి వైసీపీ నేతలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యం కేసుపై చంద్రబాబు.. ఏపీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఏపీ ప్రజల డేటా చౌర్యం జరిగిందంటూ వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీ పై గత మూడు రోజులుగా దాడులు చేస్తున్నారు. చివరకు ఈ కేసు హైకోర్ట్ కు చేరటంతో, నిర్బంధించిన నలుగురుని తెలంగాణా పోలీసులు విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.

ycp 04503019

కాగా, ఏపీ ప్రభుత్వ డేటా ప్రైవసీపై కేసీఆర్ సర్కార్ తీరు తాతకు దగ్గులు నేర్పిస్తున్నట్టు ఉందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన ప్రభుత్వ డేటా ప్రైవసీని వాళ్లు కాపాడతారా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వానికి డేటా ఉందని... తాను కాపాడుకోగలనని అన్నారు. సీక్రెసీ మెయింటెన్ చేయగలనన్నారు. జిల్లాలోని మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవడో దానయ్య పిర్యాదు చేస్తే.. మాపై యాక్షన్ తీసుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. ఏపీకి సంబంధించిన అంశంపై యాక్షన్ తీసుకునే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. జగన్, కేసీఆర్‌తో కుమ్మక్కై ఇద్దరూ కలిసి లాలూచీ పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ycp 04503019

మీ మూలాలు కదిలిపోతాయని, ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదన్నారు. డేటా అనేది ఏపీ సొంతమని, దీనిపై తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఏపీ డేటాను ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్‌లో ఉండే పోలీసులు కాపాడతారంట? ఏపీ చెందిన డాటా ఉందని చెబుతున్నారని.. దాన్ని తమ వద్దకు పంపిస్తే తాము చూసుకుంటామని అన్నారు. దర్యాప్తు చేయడానికి తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. అమెరికాలో డేటా ఉంటే ఎవరో పనిచేస్తున్నారని ఇక్కడ కంపెనీలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. "చట్టపరంగా వెళతా.. వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే.. దాడులు జరుపుతారా? నియంత ప్రవర్తన నా దగ్గర సాగదు. మాదొక రాష్ట్రం.. మీదొక రాష్ట్రం. మాకు అన్యాయం జరిగింది. తెలుగు వాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. ఎక్కడ ఉన్నా పోరాడి రక్షించే బాధ్యత నేను తీసుకుంటా.. పనికి మాలిన రాజకీయాలు వదిలిపెట్టండి’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

కర్నూలు జిల్లా రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులైన కోట్ల, కేఈ కుటుంబాలు దశాబ్దాల విభేదాలు మరచి ఎట్టకేలకు ఒకే పార్టీలోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాత శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు రాజకీయంగా ఆయువుపట్టు లాంటి డోన్‌ నియోజకవర్గాన్ని కోట్ల వర్గం కోరుతుందన్న ఆందోళనతో కోట్ల తెదేపాలోకి రావడాన్ని కేఈ వర్గం తొలుత స్వాగతించలేదు. దీనిపై కేఈ కృష్ణమూర్తి కొన్ని రోజుల క్రితం తన సోదరులు, కుమారుడితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. డోన్‌, పత్తికొండ నియోజవకర్గాల విషయంలో హామీ లభించాకే.. కోట్ల రాకపై తమకు అభ్యంతరం లేదని కేఈ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో డోన్‌ నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌, పత్తికొండ నుంచి కేఈ కుమారుడు శ్యాంబాబు పోటీ చేయాలన్నది వారి ఆలోచన.

cbn 040322019

కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్నల హయాం నుంచీ ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. 1994 శాసనసభ ఎన్నికల నాటికి విజయభాస్కర్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. విజయభాస్కర్‌రెడ్డి డోన్‌ నుంచి పోటీ చేయగా, కేఈ కృష్ణమూర్తి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. పీవీ నరసింహారావు జోక్యం చేసుకుని, కేఈతో నామినేషన్‌ ఉపసంహరింపజేసి.. కర్నూలు అసెంబ్లీ టిక్కెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కోట్ల గెలవగా, కేఈ ఓడిపోయారు. తర్వాత కేఈ వర్గం తెదేపాలో చేరింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలులో తెదేపా నుంచి పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తిని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఓడించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కోట్లపై కేఈ గెలిచారు. 2004 సార్వత్రికఎన్నికల్లో కర్నూలు లోక్‌సభస్థానంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చేతిలో కేఈ కృష్ణమూర్తి, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్ల సుజాత చేతిలో కేఈ ప్రభాకర్‌ ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో డోన్‌లో కోట్ల సుజాతను కేఈ కృష్ణమూర్తి ఓడించారు.

cbn 040322019

వ్యూహాత్మకంగానే ముందుకు.. కర్నూలు జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో తెదేపా మూడు శాసనసభ స్థానాల్లోనే గెలిచింది. మిగిలిన అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ఓడిపోయింది. దీంతో జిల్లాలో పార్టీ బలోపేతంపై తెదేపా నాయకత్వం దృష్టి సారించింది. కర్నూలు, నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, కోడుమూరుల్లో వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. నంద్యాల, కర్నూలు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక కూడా అధికార పార్టీలోకి వచ్చేశారు. ఇప్పుడు జిల్లాలో బలమైన వర్గం కలిగిన కోట్ల కుటుంబం కూడా తెదేపాలో చేరడంతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతమైంది.

డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించిన ఆయన డేటా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కై తెదేపాను దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయమని, అందులో తలదూర్చితే మూలాలు కదులుతాయని హెచ్చరించారు. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. వైకాపాకు చెందిన కొందరు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై దాడి చేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

cbn data 04032019

మన ప్రభుత్వ డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉన్న పోలీసులు కాపాడతారట అంటూ ఎద్దేవాచేశారు. ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేశారని డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. మదనపల్లె గ్రామీణ మండలం చిప్పిలిలో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజ్‌ వద్ద హంద్రీ-నీవా కాలువ ద్వారా చేరుకున్న కృష్ణాజలాలకు ముఖ్యమంత్రి సోమవారం జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంతకుముందు చిప్పిలి సమీపంలో విజయ పాల డెయిరీ, సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.24కోట్ల వ్యయంతో నిర్మించిన టెట్రా ప్యాక్‌ యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు.

cbn data 04032019

నా ఓటూ తొలగిస్తారేమో.. ‘‘బిహార్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వైకాపాకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 8 లక్షల ఓట్లను తొలగించారు. అందుకోసం ఫామ్‌-7 వినియోగించారు. చూస్తుంటే నా ఓటును కూడా తొలగిస్తారేమో. ఓట్ల తొలగింపుపై పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మోదీ, కేసీఆర్‌, జగన్‌.. ముగ్గురూ కలిసి రాష్ట్రంపై ఎన్ని కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘దొంగాటలు వద్దు.. ధైర్యంగా రండి.. మీరేంటో... మేమేంటో తేల్చుకుందాం. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. కోడికత్తిని పెద్ద ఇష్యూ చేశారు. ఐటీ దాడులకు మేం భయపడం. 8 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర చేశారు. బతికి ఉన్న వాళ్ల ఓట్లను కూడా తొలగిస్తున్నారు. ఓట్లను తొలగించడానికి ప్రశాంత్ కిషోర్ ఎవరు? నీ ఆటలు ఇక్కడ సాగవు. ఇది బీహార్‌ కాదు. సైబర్‌ క్రైమ్ చేసే వాళ్లను వదిలిపెట్టం. కోర్టుకీడుస్తాం. ఓటు తీసేసినంత సలువుగా ఆస్తులు కూడా కొట్టేస్తారు’’ అని చంద్రబాబు చెప్పారు.

ఏపీ పోలీసులపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ నిపుణుడు, ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు చేసిన వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్‌పై సైబరాబాద్‌లో లోకేశ్వర్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఒకపక్కన ఆ కేసుపై విచారణ జరుగుతుండగానే ఏపీ పోలీసులు తమ ఇంటికి వచ్చారని.. తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్‌పై విచారణ జరగుతుండగా కేసు ఎలా నమోదు చేస్తారని లోకేశ్వర్ రెడ్డి ప్రశ్నించానని... అయినా బలవంతంగా ఎత్తుకెళ్లడానికి ఏపీ పోలీసులు యత్నించారని ఆయన తెలిపారు. తనను బెదిరించింది ఏపీ పోలీసులని ఆరోపించారు. లోకేశ్వర్ రెడ్డి ఇంటికెళ్లిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

tpolice 04032019

మరో పక్క, ఈ దాడులని ఏపి ప్రభుత్వం ఖండించింది. సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌ జోడి.. టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ మాటల్లో మరోసారి బయటపడిందని మంత్రి లోకేష్‌ చెప్పారు. కేటీఆర్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైసీపీ నేతలు చదువుతున్నారని, వైసీపీ ప్రొడక్షన్‌..టీఆర్‌ఎస్‌ డైరెక్షన్‌లో టీడీపీ సభ్యత్వ, సర్వే డేటా దొంగిలించారని ట్విట్టర్‌లో లోకేష్‌ ఆరోపించారు. డేటా చోరీ చరిత్ర మీదని, బలమైన పార్టీ తమదని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ మోదీ రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేతగా జీతం కావాలని, ఏపీ పోలీసుల రక్షణ కావాలని, ఏపీ ప్రజల ఓట్లు కావాలన్నారు. టీఎస్‌లో ఉంటూ టీఆర్‌ఎస్‌ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.

tpolice 04032019

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ పోలీసుల జోక్యం తమ హక్కులను కాలరాయడమేనని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. డేటా పేరుతో తెదేపాకు సేలందిస్తున్న ఐటీ గ్రిడ్‌ సంస్థపై తెలంగాణ పోలీసుల కేసు నమోదు, విచారణ నేపథ్యంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైకాపా, తెరాస, భాజపా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. వైకాపా నాయకులకు తెలంగాణ పోలీసులపైనే ఎందుకు నమ్మకముందని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఓటేస్తే హైదరాబాద్‌లో ఉండి కేటీఆర్‌తో కలిసి పాలిస్తారా అంటూ పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంతో వైకాపా క్రిమినల్‌ మైండ్‌ బయటపడిందన్నారు. ఆ పార్టీ చరిత్రంతా నేరపూరితమైనదేనన్నారు.

Advertisements

Latest Articles

Most Read