ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాను అలిగినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు స్పష్టంచేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ తాను తెదేపా కార్యకర్తనని, 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవన్నారు. దిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలోనూ ఆయనతో వెళ్లి రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. శుక్రవారం తాను విశాఖపట్నం వెళ్లడానికి దిల్లీలో విమానం ఎక్కుతుండగా పొలిట్‌బ్యూరో సమావేశ సమాచారం అందిందని, దానివల్లే అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక హాజరు కాలేకపోయానన్నారు.

polit 17022019

అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకీ తెలియజేశానని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ పార్టీలోకి రావడం తనకిష్టం లేదన్నదీ అభూత కల్పనేనన్నారు. ఆయన మంచి వ్యక్తి అని, ఆయన తెదేపాలోకి రావడం స్వాగతించదగ్గ విషయమేనన్నారు. నిన్న ఉదయం నుంచి కొన్ని మీడియా చానల్స్ కావాలని విష ప్రచారం చేసే ప్రయత్నం చేసాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత చంద్రబాబు పై కోపంగా ఉన్నారని, అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నారని, ఈయాన కూడా తొందరలోనే పార్టీ మారతారు అంటూ, ఏకంగా అశోక్ గజపతి రాజు గారి పైనే స్టొరీలు రాసారు.

polit 17022019

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అందుకే రాలేదు అంటూ హడవిడి చేసారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధినేత చంద్రబాబుపై అలిగినందువల్లే అశోక్‌గజపతిరాజు ఈ సమావేశానికి రాలేదని ఆ మీడియా సంస్థలు హడవిడి చేసాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్‌గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణం అంటూ స్టొరీలు అల్లేశారు. అయితే, ఇవన్నీ తప్పుడు వార్తాలు అని, అసలు కారణం ఇది అంటూ, వెంటనే రాజు గారు మీడియా ముందుకు వచ్చి, అసలు విషయం చెప్పారు. ఇప్పుడు పాపం ఈ మీడియా సంస్థల నోట్లో పచ్చి వేలక్కయి పడింది.

ఏపీ ఓటర్ల జాబితాలో 52.67 లక్షల బోగస్‌ పేర్లు ఉన్నాయని పిటిషనర్‌ చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తెలిపింది. పిటిషనర్‌ సమర్పించిన జాబితాలో 50% వివరాలు పునరావృతమయ్యాయని పేర్కొంది. ఏపీలోని ఓటర్ల జాబితాపై పిటిషనర్‌ లేవనెత్తిన వాదన తప్పుల తడకగా ఉందని తేల్చిచెప్పింది. జాబితాలో నకిలీ ఓట్లు ఉన్నాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. రాష్ట్రంలో 52.67 లక్షల నకిలీ ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చారని, వాటిని తొలగించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఈసీ దీనిపై హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించాక చాలాపేర్లు వాస్తవమైనవిగా కనుగొన్నామని, వ్యాజ్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేనందున పిల్‌ను కొట్టేయాలని కోరింది. సంయుక్త ఎన్నికల అధికారి ఆర్‌.మోహన్‌ జయరాం నాయక్‌ హైకోర్టులో ఈ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేశారు.

polit 17022019

‘నకిలీ ఓటర్ల పేర్లు తెరపైకి రావడం, వాటిని తొలగించడం నిరంతర ప్రక్రియ. మృతి చెందిన, వలస వెళ్లిన ఓటర్ల పేర్లు ఒక్కోసారి బహిర్గతమవుతాయి. నిబంధనలను అనుసరించి అలాంటి వాటిని జాబితా నుంచి తొలగిస్తాం. క్షేత్రస్థాయి పరిశీలనలో 1,28,844 పేర్లను జాబితా నుంచి తొలగించాం. అందులో నకిలీవి 31,127 ఉన్నాయి. మిగిలినవి మృతి చెందినవారి, తరలి వెళ్లిన వారి పేర్లు. జాబితాలో నకిలీ పేర్లకు తావివ్వడానికి ఫలానా వారికి దురుద్దేశం ఉందని నిరూపణ కాలేదు. ఏపీలో ఓటు హక్కు ఉండి.. తెలంగాణలో నివాసం ఉంటున్నవారు 18.50 లక్షల మంది ఉన్నారని పిటిషనర్‌ చెబుతున్న నేపథ్యంలో ఏపీలో చిరునామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాం. ఆ చిరునామాలో లేని వారి పేర్లను తొలగించాం’ అని ప్రమాణపత్రంలో ఈసీ పేర్కొంది.

polit 17022019

‘తెలుగు రాష్ట్రాల్లో నకిలీ ఓటర్ల పేర్లుండే అవకాశం అతి తక్కువ. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు ప్రక్రియ నామినేషన్‌ ఉపసంహరించుకునే రోజు వరకు కొనసాగుతుంది. పిటిషనర్‌ ప్రతీ పేరు నమోదు(ఎంట్రీ)ని ప్రత్యేక కేసుగా పేర్కొంటూ మొత్తం 52.67 లక్షల పేర్లు నకిలీవనే నిర్ణయానికి వచ్చారు. వాటిలో 25.47 లక్షలు ఒక్కపేరు (యూనిక్‌) ఉన్నవిగా గుర్తించాం. మిగిలినవి పునరావృతమైనవిగా తెలుసుకున్నాం. చాలామంది తండ్రి, భర్తల పేర్లు ఒకేలా ఉన్నాయి. ఉదాహరణకు ‘నేషనల్‌ ఓటర్‌ సర్వీసు పోర్టల్‌’లో సుబ్రమణ్యం, తండ్రి సత్యనారాయణ అని వెదికినట్లయితే ఒక్క నియోజకవర్గంలోనే 14మంది ఓటర్ల పేర్లు వెల్లడవుతున్నాయి. ఇలాంటివన్ని బోగస్‌ ఓటర్లని అనడం సరికాదు’ అని తెలిపింది.

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు.

sahayam 16022019 2

"అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. భారత సైనికులు నిరంతరం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా వుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు. మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా నిలిపి తెగువ చూపుతూ మనందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. పుల్వామా దాడిలో ఒక్కరు, ఇద్దరు కాదు, 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలి. ఆ వీర జవాన్ల కుటుంబాలకు నైతికస్థైర్యం అందివ్వడం మనందరి తక్షణ కర్తవ్యం. "

sahayam 16022019 3

"సైనికుల జీవితాలను మనం అందించే సాయంతో వెలకట్టలేం. కానీ, మనవంతు సహకారం అందించాల్సిన బాధ్యతను విస్మరించలేం. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుల్వామా ఘాతుకానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఒక్క గొంతుకగా నిలిచి అమరుల కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటిస్తున్నాను. - నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి."

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి మరింత ఉదారంగా సాయంచేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద ఐదెకరాల లోపు రైతులకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని నిశ్చయించారు. గత కేబినెట్‌ సమావేశంలో రూ.10 వేలే ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఏమూలకూ సరిపోదని మంత్రులు, టీడీపీ నేతలు అభిప్రాయపడడంతో భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం.. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం ప్రకటించిన పెట్టుబడి సాయం రూ.6 వేలకు అదనంగా మరో రూ.9 వేలు కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుంది.

polit 17022019

అంటే ఐదెకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ రూ.15 వేలు చొప్పున లభించనున్నాయి. ఐదెకరాలు దాటిన రైతులకు కేంద్రం ఏమీ ప్రకటించకపోయినా.. రాష్ట్రప్రభుత్వమే ‘అన్నదాతా సుఖీభవ’ కింద రూ.10 వేలివ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఐదెకరాలలోపు సాగుభూమి ఉన్న రైతు కుటుంబాలు 54 లక్షలుగా అంచనా వేశారు. ఐదెకరాల కన్నా ఎక్కువున్న రైతు కుటుంబాలు 15 లక్షలుగా భావిస్తున్నారు. ముందుగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.4 వేల చొప్పున రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేలోపే ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 69 లక్షల మందికి లబ్ధి చేకూర్చేందుకు రూ.3,660 కోట్లు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే దాదాపు 15 లక్షలు ఉన్న కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఖరీఫ్‌ వచ్చే నాటికి వీరికి సాయం అందించాలని నిర్ణయించింది.

polit 17022019

‘అన్నదాతా సుఖీభవ’ పథకం అమలుపై శనివారం ఉండవల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం చర్చించింది. రైతులకు కేంద్రం ప్రకటించిన సాయం సరిపోదని పలువురు మంత్రులు సీఎం వద్ద ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం కేంద్రం ఇస్తానంటున్న రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం మరో రూ.9వేలు కలిపి సన్నచిన్న కారు రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ముక్త్యాల ఎత్తిపోతల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో పాటు అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతు కుటుంబానికి రూ.9వేలు అదనంగా ఇస్తామని ప్రకటించారు. రైతు కుటుంబంలో భార్య, భర్త, మైనరు పిల్లలుంటే ఒకే కుటుంబంగా.. అదే పిల్లలు మేజర్లు అయి వారికి పెళ్లిళ్లై ఉంటే వేరే కుటుంబంగా పరిగణిస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read