భాజపా రాజకీయ పాచికలను బట్టబయలు చేసిన ఆడియో బాంబు.. కొత్త రూపు సంతరించుకుంది. బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి విడుదల చేసిన ఈ ఆడియో పూర్తి భాగం బుధవారం మాధ్యమాల్లో మరో సంచలనంగా మారింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్‌, ప్రీతమ్‌ గౌడ, దళ్‌ ఎమ్మెల్యే తనయుడు శరణేగౌడ దాదాపు 80 నిమిషాల పాటు సంభాషణల్లో పాల్గొన్నట్లు ఇందులో గుర్తించారు. ఈ ఆడియోలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌, ప్రధానమంత్రి నరేంద్రమోది, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, మాజీ ప్రధాని దేవేగౌడలపై మరింత స్పష్ట సంభాషణలు వినిపించాయి. తన కుమారుడు విజయేంద్రను ‘ఆపరేషన్‌ కమల’ ప్రక్రియకు కీలక బాధ్యుడంటూ యడ్యూరప్ప ప్రత్యేకంగా శరణగౌడతో చెప్పటం, హాసన భాజపా ఎమ్మెల్యే ప్రీతమ్‌ గౌడ దేవేగౌడ, కుమారస్వామిల ఆరోగ్యంపై చర్చించటం వివాదంగా మారాయి.

audio 14022019

ఇప్పటికే స్పీకర్‌పై వచ్చిన ఆరోపణలు విచారణ దిశగా కొనసాగుతుంటే దేవేగౌడపై చేసిన వ్యాఖ్యలు హాసనలో గొడవలకు దారి తీశాయి. శరణేగౌడ తన తండ్రిని రాజీనామా చేయిస్తే రూ.10 కోట్లు తక్షణం ముట్టజెపుతామని, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేందుకు స్పీకర్‌ నుంచి కూడా అడ్డంకి తొలగించుకునేలా యడ్యూరప్ప, శివనగౌడ నాయక్‌ సంభాషించటం చూస్తే రూ.కోట్లు రాజకీయాలనెలా నిర్దేశించాయో తెలుస్తోంది. గవర్నర్‌, ప్రధాని తదితరులు ఈ ఆపరేషన్‌ కమలకు సహకరిస్తారని కూడా యడ్యూరప్ప, శివనగౌడ నాయక్‌ వ్యాఖ్యానించారనేది ఇందులోని మరో కీలకాంశం.

audio 14022019

ముందు రూ.20 కోట్లు ఇస్తామని, నాగనగౌడను ముంబై వెళ్లి అధికారపార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో కలిసేలా, బీజేపీలో చేరేలా ఒప్పిస్తే మరో రూ.2.5 కోట్లు ఇస్తామని శరణగౌడతో నాయక్‌ అనడం ఇందులో వినిపించింది. కాగా.. ‘ఆపరేషన్‌ కమల్‌’ ఆడియో వివాదం హింసాత్మకంగా మారింది. హాసన్‌లో బుధవారం బీజేపీ, జేడీఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. హాసన్‌ ఎమ్మెల్యే ప్రీతంగౌడ ఇంటిపై జేడీఎస్‌ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేస్తామని యడ్యూరప్ప చెప్పారు.

మోడీ, అమిత్ షా ప్లాన్ ప్రకారం, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భగంగా, చంద్రబాబు దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్లాన్ వేసారు. దీని కోసం కేసీఆర్ రంగంలోకి దిగి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ ను కలిసి హడావిడ్ చేసారు. వాళ్ళని చంద్రబాబు వైపు వెళ్ళకుండా ప్లాన్ వేసారు. అయతే మొన్నటి వరకు ప్రతిపక్షాలు అన్నీ, ఎన్నికల తరువాతే అలయన్స్ పెట్టుకునే వ్యూహం పన్నాయి. దీంతో కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ డ్రామా సజీవంగా ఉన్నట్టు అయ్యింది. అయితే నిన్న ఢిల్లీలో సమావేశం అయిన ప్రతిపక్ష పార్టీలు, కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి వచ్చాయి.

federalfront 14022019

కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) ద్వారా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సీఎంపీ ముసాయిదా రూపకల్పన బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందానికి అప్పగించాయి. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏదో ఒకరోజు సమావేశం జరపాలనే నిర్ణయానికొచ్చాయి. బుధవారం దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసంలో విపక్ష నేతలు సుదీర్ఘంగా సమావేశం జరిపి ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌అబ్దుల్లా పాల్గొన్న ఈ సమావేశం అనుకోకుండా జరిగింది.

federalfront 14022019

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మెజారిటీ స్థానాలు ఉన్న కూటమికే రాష్ట్రపతి ఆహ్వానం పంపాలని సర్కారియా కమిషన్‌, సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎన్నికల ముందే ఒక మహాకూటమి ఏర్పాటు చేయాలని చంద్రబాబు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. అనంతరం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ... నిర్మాణాత్మక చర్చలు జరిగాయని చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాన్ని కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేరుస్తామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, రాజకీయ ఒత్తిళ్లకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా ఎదుర్కోవాలో తాము ఎదుర్కొంటామని చెప్పారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా రూపొందించి అందరికి అందిస్తారని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో, ఇక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి నిన్నటితో సమాధి పడినట్టు అయ్యింది. దేశంలో ఉన్న అన్ని విపక్షాలు ఎన్నికల ముందే ఏకం అయ్యాయి. ఒక్క కేసీఆర్, ఒవైసీ, జగన్ మినహా, అన్ని విపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. నవీన్ పట్నాయక్ ఎలాగూ ముందు నుంచి ఏ కూటమిలోను ఉండరు కాబట్టి, ఆయనను పక్కన పెడితే, దేశంలోని విపక్షాలు అన్నీ ఏకం అయ్యాయి.

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో భీమిలి అసెంబ్లీ టికెట్ అవంతి ఆశించినప్పటికీ అనకాపల్లి ఎంపీగా అధిష్టానం బరిలోకి దింపిందని తెలుస్తోంది. ఈసారైనా భీమిలి సీటిస్తారని ఆశించినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించారని త్వరలోనే వైసీపీలో చేరతారని సమాచారం. వైసీపీలోకి వస్తే అవంతి కోరుకున్న భీమిలి అసెంబ్లీ టికెట్టే కాకుండా మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అలెర్టయిన అధిష్టానం ఆయన్ను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

cbn 14022019

అయితే, ఈరోజు విశాఖపట్నం వైసీపీ నేతలను ఇంటికి పిలిపించుకున్న జగన్.. అవంతి శ్రీనివాస్ చేరికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయమై పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం ఈరోజు అవంతి శ్రీనివాస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని జిల్లా నేతలకు సూచించారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్ ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అవంతి టీడీపీ అధిష్ఠానాన్ని కోరగా, ముందస్తు హామీ ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ వైసీపీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కాగా, అవంతికి భీమిలి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

cbn 14022019

ఇదిలా ఉంటే.. అవంతి కోసం భీమిలి సీటు వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం పార్టీనేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఆమంచితో పాటు మరో ఇద్దరు టీడీపీని వీడతారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు పార్టీ నుంచి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని తెలుగుతమ్ముళ్లతో చెప్పారు. ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని.. బిజీగా ఉన్నా ఆమంచితో గంట సేపు మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీనేతలకు చంద్రబాబు గుర్తు చేశారు.

 

అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, ప్రజాసంఘాల నాయకులు ధర్మపోరాట దీక్ష చేస్తే ఆ ఖర్చుపై అనవసర రాజకీయం చేస్తారా.. అంటూ రాష్ట్ర మంత్రిమండలి ఆగ్రహం ప్రకటించింది. అందుకోసం రూ.10కోట్లు వెచ్చించారంటూ దుష్ప్రచారం చేయడంపై మంత్రివర్గ సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వెలగపూడి సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశంలో దిల్లీ ధర్మపోరాట దీక్ష, మోదీ చేసిన విమర్శలపై చర్చ జరిగింది. దీక్ష నిమిత్తం రూ.2.83 కోట్ల ఖర్చుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.1.23కోట్లు రైళ్లకు, రూ.1.60 కోట్లు ఏపీ భవన్‌ వద్ద ఖర్చులకు వినియోగించినట్లు పేర్కొన్నారు.

deeksha 14022019

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011 సెప్టెంబర్‌ 17న నరేంద్రమోదీ సద్భావన మిషన్‌ పేరుతో చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష వ్యయం కంటే చాలా ఎక్కువన్న అంశమూ చర్చకు వచ్చింది. మోదీ దీక్ష స్వార్థానికి, ఆయన పార్టీ ప్రయోజనాల కోసం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందని చంద్రబాబు నాయుడు అన్నారు. నోట్ల రద్దుతో ప్రజలంతా నష్టపోయారని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. ‘‘1972 తర్వాత దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. మోదీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు... ఆందోళనకు దిగారు. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడుందని మోదీని సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రధానికి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవు. "

deeksha 14022019

"మేమంతా ఎక్కడ చదువుకున్నామో చెప్పగలం.. మోదీ చెప్పగలరా? రఫేల్‌‌ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయి. ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలి.. త్వరలోనే కుర్చీ దిగుతారు. దేశంలో విపక్ష నేతల చరవాణులను ట్యాప్‌ చేస్తున్నారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేశారు. కేజ్రీవాల్‌ తన పరిపాలనలో దిల్లీలో అద్భుతాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ను సైతం అడ్డుకున్నారు.. ఎందుకో చెప్పాలి? మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాం. అందరు విపక్ష నేతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. భాజపా నేతలపై మాత్రం ఒక్క దాడి జరగలేదు. మోదీ అప్రజాస్వామ్య పాలన నుంచి విముక్తి కలిగించేందుకే మేమంతా ఏకమయ్యాం’’ అని చంద్రబాబు వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read