నిన్నటి మోడీ గుంటూరు పర్యటన పై, జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ అని, 5 కోట్ల మంది ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఒక రోజు తరువాత తీరిగ్గా వచ్చిన జగన్, పూర్తిగా ముసుగు తీసేసాడు. తన పార్టీ ప్రతినిధి చేత, నిన్నటి మోడీ పర్యటన, తరువాత మోడీకి చంద్రబాబు చెప్పిన సమాధానం పై, తన పార్టీ తరుపున అభిప్రాయం చెప్పించారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న మూడ్ లో, ఇది నిజంగా షాకింగ్ ప్రకటనే. ఎంతటి వారైనా ఎంతో కొంత పౌరుషం ఉంటుంది. అలాంటింది రాయలసీమ, పులివెందుల అని చెప్పుకునే జగన్, మోడీ మనకు చేస్తున్న అన్యాయం పై, కనీసం పౌరుషం, సిగ్గు, రోషం, ఆత్మగౌరవం లేకుండా, మోడీకి జై కొడుతూ, ఏపి ప్రజలను నిలువునా ముంచేశారు. ఈ రోజు వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి ప్రెస్ మీట్ చూస్తే, ప్రతి ఆంధ్రుడు సిగ్గుతో తలదించుకుంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన సంస్కారహీనంగా ఉందని, ఆంధ్రుల పరువు తీసే విధంగా ఉందని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. సోమవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని ఏపీకి అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా? అంటూ విమర్శించారు. ఏపీకి మోదీ అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి... మనకు ఏం కావాలో చెప్పాలన్నారు. అంతేగానీ ఇలా అవమానించడం సరికాదన్నారు. చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీ సీఎంగా ఉండటం శోచనీయమన్నారు. కనీసం మోదీని స్వాగతించేందుకు కూడా ప్రొటోకాల్ అధికారులు, మంత్రులు వెళ్లలేదని, ఇంతకంటే దుర్మార్గం లేదని ఆయన అన్నారు. మోదీని చంద్రబాబు అవమానించారని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
నిన్నేమో మోడీ వచ్చి చంద్రబాబుని బిలో ది బెల్ట్ తిడుతూ, ప్రధాని పదవికే మచ్చ తీసుకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని ఒక్క మాట అనడు. అవినీతి పై పోరాటం అంటూ, ఇటు పక్క A1ని, ఇటు పక్క A2ని కూర్చోబెట్టుకుని, ఏపి పై యుద్ధానికి వస్తున్నారు. నిన్నటి మోడీ మీటింగ్ కు కూడా, జగన్ మోహన్ రెడ్డి తన మనుషులుని పెట్టి, సభ సక్సెస్ చెయ్యాలంటూ ఆదేశాలు ఇచ్చారు. మోడీ జగన్ ను ఒక్క మాట అనరు, మరో పక్క జగన్ మోడీని ఒక్క మాట అనరు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీని ఎవరన్నా తిడితే తట్టుకోలేరు. చివరకు 5 కోట్ల మంది మోడీని వ్యతిరేకిస్తుంటే, మోడీని తిట్టటం తప్పు, ఆయన్ను ఒక్క మాట కూడా అనకూడదు అంటూ, ఖండనలు ఇస్తున్నారు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి.