సినిమా హీరోలో, రాజకీయాలు, రెండు రంగాలు మనకు ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఎంతో మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఎన్టీఆర్ తప్ప, ఎవరూ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. చిరంజీవి లాంటి ఎక్కువ మంది అభిమానులు ఉన్న హీరో కూడా, జీరో అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కూడా తేలిపోనుంది. అయితే ఈ మధ్య రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో, ఇప్పుడు మహేష్ బాబు పేరు కూడా వినిపిస్తుంది. రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోల లిస్టులో మహేశ్ బాబు కూడా చేరుతున్నారు అంటూ కొన్ని మీడియా సంస్థలుహడావిడి చేస్తున్నాయి.

mahesh 1322019

మహేశ్ బాబు నాన్న సూపర్ స్టార్ కృష్ణ..కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పనిచేశారు. అలాగే ఆయన సొంత బావ గల్ల జయదేవ్ తెలుగు దేశం తరుపున గుంటూరు లోక్ సభ సభ్యునిగా పనిచేస్తున్నారు. మరోవైపు మహేశ్ బాబాయి ఆదిశేషగిరి రావు ఎన్నో ఏళ్లుగా రాజకీయాలో కొనసాగుతూనే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ..తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈయన టీడీపీలో జాయిన్ కావడంతో మహేశ్ బాబు కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని, మహేష్ బాబు సపోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీ పై ఆయన భార్య నమ్రత క్లారిటీ ఇచ్చారు.

mahesh 1322019

'రాష్ట్రానికి ఎంతో చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నా భర్తకు చాలా గౌరవం ఉంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ఉండటాన్ని చూసి ఆయన చాలా గర్విస్తుంటారు. చంద్రబాబు పక్కన మహేష్ కనిపించినంత మాత్రాన... ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు కాదు.' అని నమ్రత తెలిపారు. టీడీపీ తరపున మహేష్ ప్రచారం చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా... అలాంటిదేమీ ఉండదని నమ్రత స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి మహేష్ ప్రచారం చేయబోరని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికగానీ, రాజకీయపరమైన లక్ష్యాలు కానీ మహేష్ కు లేవని తెలిపారు. మహేష్ సమయమంతా సినిమాలకే సరిపోతోందని... కుటుంబంతో గడిపే సమయమే ఆయనకు ఫ్రీ టైమ్ అని చెప్పారు. కనీసం స్నేహితులను కలవడానికి కూడా మహేష్ బయటకు వెళ్లరని తెలిపారు.

వచ్చే ఎన్నికల కోసం, ఇప్పటి నుంచే జగన్ బ్యాచ్ విచ్చలవిడిగా సిద్ధమవుతుంది. ఒక పక్క కేంద్రం సపోర్ట్, మరో పక్క, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్ట్ తో, దేనికైనా తెగించేందుకు రెడీ అవుతుంది. అయితే, దొంగే దొంగ దొంగ అన్నట్టు, ముందుగా ఫోకస్ అంతా చంద్రబాబు పై తేవటానికి, చంద్రబాబు అయుదు వేలు పంచుతాడు, చంద్రబాబు ఓట్లు తొలగిస్తున్నాడు, ఒక సామాజికవర్గం వారిని తప్పించాలి అంటూ, ఎదురుదాడి చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం తాను చెయ్యల్సింది, తాను చేస్తున్నాడు. మొన్నటికి మొన్న, కృష్ణా జిల్లాలో పోలీసులకు డబ్బులు కవర్లు పంపిస్తూ దొరికిపోయిన జగన్ బ్యాచ్, ఇప్పుడు ప్రజలను ప్రలోభాలు పెట్టే పనులు, ఇప్పటి నుంచే మొదలు పెట్టింది.

chevireddy 13022019

ఓటర్లను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రలోభాలకు గురి చేస్తున్నారని చిత్తూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి, తుడా చైర్మన్ జి. నర్సింహ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి తగిన ఆధారాలను ఆయన సమర్పించారు. రూ.10 కోట్ల విలువైన లక్ష గడియారాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని చెవిరెడ్డిపై ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నర్సింహ యాదవ్ మాట్లాడుతూ, పది కోట్ల రూపాయల విలువ చేసే సరుకు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. దీనిపై నిగ్గు తేల్చాల్సిందిగా ఈసీ అధికారులను కోరామని అన్నారు.

chevireddy 13022019

ఒకో ఓటుకు ఐదు వేల రూపాయలు అడగమని వైసీసీ అధినేత జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా ఈసీ స్పందించి, జగన్ పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి కనుక ఆయనపై ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతి సంపాదనతో కోట్లను కూడగట్టిన జగన్, ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కో నియోజకవర్గంలో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, దీనిపై ఈసీ నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మల్యే, పార్టీ మారితే, నియోజకవర్గంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. స్థానిక క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉంటుంది. పార్టీతో ఉండే వారు కొందరు అయితే, ఆ పార్టీ మారిన నాయకుడితో వెళ్ళే వారు మరి కొందరు. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. మాకు పట్టిన దరిద్రం వదిలింది అంటూ, ఈ రోజు నియోజకవర్గం అంతా తెలుగుదేశం శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశంకి రాజీనామా చేస్తున్నా ని చెప్పి, జగన్ మొహన్ రెడ్డిని కలవగానే, అందరూ పండుగ చేసుకున్నారు. అసలు అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే, ఆమంచి జగన్ ను కలిసిన తరువాత మాట్లాడిన మాటలు.

amanchi 13022019

"జగన్మోహన్ రెడ్డి నీతివంతుడుగా ఉంటాడు, నాలాంటి నీతిమంతులు అందరూ జగన్మోహన్ రెడ్డితో నడవాలి, నీతివంతమైన రాజకీయాలకు నేను పెట్టింది పేరు" అంటూ ఆమంచి చెప్పిన ఈ డైలాగ్ తో, రాష్ట్రమంతా పడి పడి నవ్వుతుంది. ఇది ఇలా ఉంటే ఆమంచి జగన్ ను కలుస్తున్నాడు అని తెలియగానే, చంద్రబాబు రంగంలోకి దిగారు. తక్షణమే రంగంలోకి మాజీ మంత్రి కరణం బలరాంను దించారు. చీరాల తెలుగుదేశం నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో, కరణం బలరాం హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. అలాగే కరణం బలరాంకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

amanchi 13022019

ఈ గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందంటూ ఫ్లెక్సీల్లో ముద్రించడంతో చీరాల ఎమ్మెల్యే టిక్కెట్ ఆయనకు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మనల్ని నమ్మించి వంచించిన నాయకులకు బుద్ధిచెప్పాలే తిరగబడ్డ తెలుగుబిడ్డ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఇదిలా ఉండగా, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి కరణం బలరాం టీడీపీ తరఫున బరిలోకి దిగుతారనే టాక్ వినబడుతోంది. కరణం బలరాంను చీరాల నుంచి బరిలోకి దింపితే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, కరణం వర్గాల మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయని చంద్రబాబు భావిస్తున్నట్టు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏదైనా ఆమంచి దరిద్రం వదిలినందుకు, తెలుగుదేశం శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి.

బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేన, తరుచూ మోడీ, షా విధానాలను ఎండగడుతూ వస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, శివసేన ఒక్కటే ఎన్డీఏలో పెద్ద మిత్రపక్షంగా ఉంది. అయితే వారు కూడా మోడీ, షా ల వైఖరి పై విసుగెత్తిపోయినా, ఇంకా ఎన్డీఏ నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో, సోమవారం చంద్రబాబు ఏపి హక్కుల కోసం, ఢిల్లీలో జరిగిన దీక్షకు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హాజరై, శివసేన పార్టీ తరుపున మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహం పై, మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని, మా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే ఈ విషయం పై బీజేపీ మండి పడుతుంది. మా మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబుకి ఎలా మద్దతు ఇస్తారంటూ శివసేన పై విమర్శలు గుప్పించారు.

sivasena 13022019

అయితే, ఈ విషయం పై, శివసేన ఘాటుగా బీజేపీకి సమాధానం చెప్పింది. తన అధికారిక పత్రిక సామ్నాలో శివసేన ఈరోజు కథనాన్ని ప్రచురించింది. మర్యాద పూర్వకంగానే చంద్రబాబు సభకు తాము హాజరయ్యామని తెలిపింది. మిత్రపక్షాలతో సరైన విధంగా వ్యవహరించడం లేదని బీజేపీని విమర్శించింది. ఎన్నికల తర్వాత కావాల్సినన్ని సీట్లు రాకపోతే చంద్రబాబు మద్దతును బీజేపీ కోరదనే గ్యారంటీ ఏముందని శివసేన ప్రశ్నించింది. చంద్రబాబు తలుపును బీజేపీ సీనియర్లు కొట్టరనే నమ్మకం ఏముందని నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోయిందని... ఆ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకమని తెలిపింది.

sivasena 13022019

చంద్రబాబుకు తాము సంఘీభావం తెలిపితే... ఏదో ఆకాశం వచ్చి కేంద్ర ప్రభుత్వంపై పడినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడింది. ఎన్డీయేతో కలిసున్నంత కాలం చంద్రబాబును గొప్ప నేతగా కొనియాడారని... ఎన్డేయే నుంచి బయటకు వచ్చిన హఠాత్తుగా ఆయన అంటరానివాడు అయిపోయాడని విమర్శించింది. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారని మండిపడింది. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్టల్ గురు, జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మఖ్బూల్ భట్ ల మృత అవశేషాలను తెప్పించాలని జమ్ముకశ్మీర్ లోని మెహబూబా ముఫ్తీ పార్టీ (పీడీపీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు ఫయాజ్ అహ్మద్ డిమాండ్ చేస్తున్నారని... మొన్నటి దాకా ఆ పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకుందని శివసేన విమర్శించింది. దీనిపై ఎవరికీ ఎలాంటి సమస్య లేదని... చంద్రబాబు వద్దకు వెళ్లినందుకు మాత్రం తమను తీవ్రంగా విమర్శిస్తున్నారని మండిపడింది.

Advertisements

Latest Articles

Most Read