బీజేపీతో టీడీపీ కటీఫ్‌ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి నవ్యాంధ్రకు వస్తున్నారు. ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వాటి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత... అక్కడికి సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణ వరకు బాగానే ఉన్నా... మోదీ బహిరంగ సభ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. సభకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగ సభ ‘ఫ్లాప్‌’ అయ్యింది. బీజేపీ నేతలు మూడువేల కుర్చీలు వేశారుకానీ, మూడొందల మందిని కూడా సమీకరించలేకపోయారు.

modi jagan 0902019

దీంతో అమిత్‌ షా సభా వేదిక కూడా ఎక్కకుండా... బస్సుపై నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో... మోదీ సభకు జన సమీకరణ చేయడంపై బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాన్ని సమీకరించటం అంత సులువు కాదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ‘ఏది ఏమైనా, ఎలాగైనా’ మైదానం నిండాలని... దీనికోసం టీడీపీ వ్యతిరేక పక్షమైన వైసీపీ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వైసీపీ కీలక నేతలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకవేళ ప్రధాని సభకు ప్రజాదరణ కరువైతే... చంద్రబాబు వాదనకు బలం చేకూరినట్లవుతుందని, దీనికోసమైనా బీజేపీ సభకు సహకరించాలని వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం!

modi jagan 0902019

బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో సంబంధాలున్న గుంటూరు నగర వైసీపీ యువనేత ఒకరు తన అనుచర గణాన్ని ఈ సభకు తరలించే సన్నాహాల్లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు... ప్రధాని సభకు టీడీపీ అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. తనకు వ్యక్తిగతంగా జనబలం ఉన్న పెదకూరపాడు, గుంటూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి సరిగ్గా ప్రధాని సభ జరిగే రోజునే వందలాది బస్సుల్లో జనాన్ని పోలవరం సందర్శనకు తీసుకెళుతున్నారని తెలిపారు. ఆదివారం భారీ ఎత్తున శుభకార్యాలు ఉండటం కూడా జన సమీకరణకు కొంత అడ్డంకిగా ఉందని కూడా ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక... ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి అపశ్రుతులు, ఎలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

బెంగాల్‌లో సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్ యుద్ధం కొనసాగుతోంది. శారదా స్కామ్ విచారణలో భాగంగా కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ని విచారించేందుకు సీబీఐ ప్రయత్నించగా బెంగాల్ పోలీసులు అడ్డుకోవడం...సీబీఐ అధికారులను బంధించడం..మమతా బెనర్జీ దీక్ష చేయడం వంటి పరిణామాలతో..దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పశ్చిమ బెంగాల్ సీఎం, కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం కోల్‌కతాలో మళ్లీ రగడ నెలకొంది. సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్‌ నాగేశ్వరరావును బెంగాల్ పోలీసులు టార్గెట్ చేశారు. నాగేశ్వరరావు భార్యకు చెందిన పలు కంపెనీల్లో సోదాలు జరిపడంతో తీవ్ర కలకలం రేగింది.

mamtaha 09022019

కోల్‌కతాలో రెండు చోట్ల పోలీసులు దాడులు చేశారు. సాల్ట్‌లేక్ ప్రాంతంలోని ఎంజెలినా మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరో కంపెనీలో సోదాలు జరిపారు. నాగేశ్వరరావు భార్య, కూతురు, ఈ కంపెనీల మధ్య పలు ఆర్థిక లావాదేవీలు జరిగాయని పోలీసులు చెప్పారు. కేవలం లావాదేవీల పరిశీలన కోసమే సోదాలు చేసినట్లు వెల్లడించారు. కోల్ కతా పోలీస్ బృందం బౌబజార్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేస్ విషయంలో ఏంజెలా మర్కంటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎంపిఎల్)పై దాడులు చేశారు. ఫిబ్రవరి 1994లో ప్రారంభమైన ఏఎంపిఎల్ ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్ బిఎఫ్ సి). దీని రిజిస్టర్డ్ కార్యాలయం 5 క్లైవ్ రో (డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సారణి)లో ఉంది. అక్టోబర్ 2018 వరకు ఈ రిజిస్టర్డ్ కార్యాలయం సాల్ట్ లేక్ సిటీ, సెక్టర్-1లోని సీఏ బ్లాక్ లో ఉండేది. ఏఎంపిఎల్ ద్వారా నాగేశ్వరరావు భార్య సంధ్య పలు ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు.

mamtaha 09022019

2011 మార్చిలో సంధ్య రూ.25 లక్షలు ఏఎంపీఎల్ నుంచి అప్పు తీసుకున్నారు. 2011-2014 మధ్య కాలంలో ఆమె మూడు విడతల్లో రూ.1.14 కోట్లు ఏఎంపీఎల్ కు అప్పు ఇచ్చారు. 2012లో రూ.35.56 లక్షలు, 2013లో రూ.38.27 లక్షలు, 2014లో రూ.40.29 లక్షలను సంధ్య రుణం ఇచ్చారు. దాడుల్లో స్వాధీనం చేసుకొన్న పత్రాలలో నాగేశ్వరరావు కుమార్తె కంపెనీ నుంచి జీతంగా డబ్బు పొందినట్టు కోల్ కతా పోలీసులు గుర్తించారు. 2013-14 నుంచి 2015-16 వరకు ‘ఇచ్చిన చిరునామాలోని’ (సాల్ట్ లేక్ సెక్టార్-1 అడ్రస్ లో నివాసం ఉంది) కంపెనీ ఆమెకు రూ.14 లక్షలు జీతంగా ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. 2014లో కేవలం ఒకేఒక్క రోజులో రూ.4.5 లక్షలను ఏడాదంతటికీ జీతంగా ఇచ్చినట్టు కోల్ కతా పోలీస్ వర్గాలు తెలిపాయి.

ఒక పక్క దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఒక వైపు ఉండి, మోడీ నిరంకుశ వైఖరికి నిరసనగా పోరాటం చేస్తుంటే, కేసీఆర్, జగన్ మాత్రం, మోడీ వైపే ఉండి భజన చేస్తున్నారు. మమత బెనర్జీ విషయంలో కూడా, వీరిద్దరూ ఇదే ఫాలో అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆన్ రికార్డులో మమత విషయం పై ఇరువురు స్పందించలేదు. మొదటి సారి, బెంగాల్‌లో జరిగిన పరిణామాల్లో అక్కడి సీఎం మమతాబెనర్జీదే తప్పని వైసీపీ తీర్మానించింది. మమతాబెనర్జీ రాజ్యాంగాన్ని ఉల్లఘించారన్నది వైసీపీ నిర్ణయమని ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మమత ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినందుకే మద్దతు ఇవ్వలేదని ఆయన చెప్పారు.

mamatah 09022019

సీబీఐ అధికారులకు సహకరించడం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. మమత తప్పు చేశారని ఆరోపించారు. ఆమె తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఎందుకు సహకరించలేదని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యవహారంలో మొత్తంగా వైపీసీ, ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించినట్లయింది. ఎలాంటి సమాన్లు లేకుండా బెంగాల్ కమిషనర్ ఇంటిపై దాదాపు 50 మంది సీబీఐ అధికారులు దాడికి వెళ్లడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ ప్రమేయంతోనే సీబీఐ ఇలా వ్యవహిరిస్తోందని మమత ఆరోపిస్తూ మూడు రోజుల పాటు దీక్ష చేశారు. కమిషనర్ సుప్రీంకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించడంతో ఆమె దీక్ష విరమించారు.

mamatah 09022019

బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ మమత దీక్షకు మద్దతు పలికాయి. వారంత మమతకు సంఘీభావం ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్‌ఎస్, వైసీపీలు బెంగాల్ పరిణామాలపై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. రాష్ట్రాల హక్కుల కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. రెండు సార్లు మమతను కలిశారు. అయినప్పటికీ ఈ పరిణామాలపై కేసీఆర్ స్పందించకపోవడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఫెడరల్ ఫ్రెంట్‌లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్న వైసీపీ కూడా మౌనంగా ఉంది. మమతకు సంఘీభావం తెలియజేయలేదు. మమత రాజ్యాంగాన్ని ఉల్లఘించిదని వైసీపీ నేతలు జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. మోదీకే వైసీపీ మద్దతు అని పరోక్షం చెబుతున్నారు.

ఆపరేషన్‌ కమలతో రాష్ట్ర రాజకీయాలను దిశానిర్దేశం మార్చాలన్న బీజేపీ ఎత్తుగడలకు కాంగ్రెస్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ చేసింది. బడ్జెట్‌కు మూడు గంటల ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్‌ గురుమిట్కల్‌ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ గౌడతో చేసిన బేరసారాల ఆడియోను విడుదల చేసి కమల దళాన్ని ఖంగు తినేలా చేసింది. కర్నాటక రాజకీయ సంక్షోభం సంచలన మలుపు తీసుకుంటోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతోందని ముఖ్యమంత్రి కుమార్ స్వామి ఆరోపించారు. కర్నాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్ ఎడ్యూరప్ప... జేడీఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడినట్టు చెబుతున్న ఓ ఆడియో టేపును ఆయన మీడియాకు విడుదల చేశారు.

kumarswamy 09022019

సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాత్రి 1:30 సమయంలో నాకు ఈ సమాచారం అందింది. మా పార్టీ ఎమ్మెల్యే అర్థరాత్రి సమయంలో నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అలాంటి విధేయత గల నాయకుల వల్లే మా పార్టీ ఇంకా రాష్ట్రంలో నిలిచిఉంది. ఎమ్మెల్యే నాగనగౌడ కంద్కూర్ కుమారుడు శరణకు ఎడ్యూరప్ప రూ.25 లక్షలు ఆశచూపారు. దీంతోపాటు ఆయన తండ్రికి మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారు..’’ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని బలహీనపర్చే ఉద్దేశం లేదని బీజేపీ పదే పదే చెబుతోందనీ.. కానీ తెరవెనుక మాత్రం అందుకు విరుద్ధంగా కుట్రలు పన్నుతోందని సీఎం ఆరోపించారు. ‘‘ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టబోమని బీజేపీ చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మన రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఎలా ఉండాలో పాఠాలు చెబుతారు. కానీ మరోవైపు మీ సన్నిహితుల ద్వారా ఇదే సూత్రాన్ని కాలరాసేలా ప్రోత్సహిస్తారు. మీకు నిజంగా నీతి అనేది ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నా...’’ అని కుమారస్వామి పేర్కొన్నారు.

kumarswamy 09022019

సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న వారెవరో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలుపై నేను ఇప్పుడు ఆధారాలు బయటపెడుతున్నాను. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేందుకు బీజేపీ ఎలా ప్రయత్నిస్తున్నదో చూసి మీరే న్యాయం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..’’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మరో పక్క, నలుగురు కాంగ్రెస్‌ అసంతృప్తులు బీజేపీ చెంతనే ఉన్నట్లు దాదాపు తేలిపోయింది. విప్‌ జారీలో ఉన్నా సమావేశాలకు గైర్హాజరు అవుతుండడంతో ఆ నలుగురికపైనా ఏకకాలంలో చర్యలకు సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. అసంతృప్తులు నలుగురిని ఏకకాలంలో వేటు వేసేలా సర్జికల్‌ స్ట్రైక్‌ తరహాలో స్పీకర్‌కు సిఫారసు చేశారు. నలుగురిపై వేటు పడ్డంతో మిగిలిన అసంతృప్తులు అప్రమత్తమయ్యారు.

 

Advertisements

Latest Articles

Most Read