ఎవరో ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ పెడితే, అందులో కొంత మంది డబ్బులు పెట్టుకుంటే, ఆ చిట్ ఫండ్ కంపెనీ చేతులు ఎత్తేసింది. ఇది జరిగింది ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇది ప్రభుత్వానికి సంబందించిన విషయం కాదు. ఆ కంపెనీ ఆస్థులు ఉంటే, అవి వేలం వేసి, ప్రజలకు ఇవ్వటం వరుకే ప్రభుత్వం బాధ్యత. అయితే దీన్ని కూడా రాజకీయంగా వాడుకుని, అసలు ఇప్పటి ప్రభుత్వానికి సంబంధం లేని విషయం అయినా, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. అయితే చంద్రబాబు మాత్రం, దీన్ని రాజకీయ కోణంలో చూడలేదు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజలకు మేలు చెయ్యాలనే ఉద్దేశంతోనే, వారిని అన్ని విధాలుగా ఆదుకోవటానికి ముందుకొచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

agri 07022019

రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ వద్ద రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు తొలుత చెల్లింపులు చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లాస్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా 32లక్షల మంది నుంచి అగ్రిగోల్డ్‌ సంస్థ రూ.6,380 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించింది. ఇందులో ఏపీలోనే 10లక్షలకు పైగా డిపాజిటర్లు ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది.

agri 07022019

అయితే ఇందులో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన మదుపుదారులు 3.5లక్షలు ఉన్నారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పాటు రూ.500 కోట్ల మేర అగ్రిగోల్డ్‌ సంస్థ వివిధ బ్యాంకులను మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. అగ్రిగోల్డ్‌ జారీ చేసిన చెల్లని చెక్కుల విలువ రూ.700కోట్లు మేర ఉంటుందని విచారణలో వెల్లడైంది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తు చేసి వేలం వేసేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున ముందుగా చిన్న మొత్తంలో డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా పేరు చెప్తే, చంద్రబాబు లాగా ఎప్పుడు పని పని అంటూ కష్టపడే నాయకుడిగా పేరు ఉంది. పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేపించటానికి, కట్తల మీద పడుకుని మరీ, పనులు చేపించిన చరిత్ర ఉంది. పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ పూర్తి చెయ్యటానికి, అను నిత్యం కృష్టి చేస్తున్నారు. ఇలాంటి ఉమాని ఓడించటానికి, జగన్ మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆపరేషనే నడుపుతున్నారు. దీని కోసం, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ను బరిలోకి దింపారు. తనను ఓడించిన ప్రత్యర్థిపై ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న కోరికతో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ కొద్ది నెలలుగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

uma 07022019

వసంత కృష్ణప్రసాద్‌ రాకతో మైలవరంలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ప్రలోభాలతో ప్రసన్నం చేసుకునే పనిలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఆటోవాలాలకు కొత్త ఖాకీ బట్టలు అందించడం మొదలు పండుగల పేరుతో మహిళలకు లక్ష చీరలు పంచారు. గోడ గడియారాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో వివిధ సంఘాలకు పెద్ద ఎత్తున ఆర్థికసాయం అందిస్తూ వస్తున్నారు. అడగని వారిదే తప్పు అన్న రీతిలో విచ్చలవిడిగా డబ్బులు పంచడంలో వైసీపీ నేతలు ముందంజలో ఉన్నారు. తమ ప్రలోభాల పర్వానికి పోలీసులు ఎక్కడ అడ్డుతగులుతారోనన్న సంశయంతో తాజాగా పోలీసు అధికారులకే డబ్బులు ఎరవేసి తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే అది బెడిసికొట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

uma 07022019

గడిచిన ఆరు నెలలుగా కృష్ణ ప్రసాద్‌ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పెద్దఎత్తున నియోజకవర్గ ప్రజలకు తాయిలాలనూ అందిస్తున్నారు. మరోవైపు తమకు అడ్డుగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించేందుకు సైతం వైసీపీ నేతలు వెనుకాడటం లేదు. గత సెప్టెంబరులో గుంటుపల్లిలో వైసీపీ బ్యానర్లను తొలగించిన విషయంలో గుంటుపల్లి కార్యదర్శి నల్లారి నరసింహారావును వసంత వెంకట కృష్ణ ప్రసాదు తండ్రి, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు బెదిరించారు. తాజాగా మరోసారి పోలీసులకు లంచాలు ఇచ్చేదుకు తెగబడి వైసీపీ నేతలు మరోసారి తమ బరితెగింపును చాటుకున్నారు.

పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు తిరిగి హైదరాబాద్‌ చేరింది. దర్యాప్తు మొత్తం ఇక.. ఇక్కడినుంచే సాగుతుంది. ఇన్నాళ్లూ ఏపీ పోలీసులు చేసిన దర్యాప్తు నివేదిక అందగానే.. కార్యాచరణ ప్రారంభం కానుంది. ఈమేరకు ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఆరు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు ఇక.. ఒక రాష్ట్రానికే పరిమితం కానుంది. హత్య తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగితే.. మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దొరికింది. అంటే.. డెడ్‌బాడీని రెండు వందల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పోలీసులకు సవాల్‌ విసిరారు నిందితులు. అంతేకాదు.. రాష్ట్రం సరిహద్దులు కూడా దాటించడంతో.. ఈ హత్య కేసు రెండు రాష్ట్రాల పోలీసుల సమస్యగా తయారైంది. అయితే.. ఇప్పుడు ఏపీ పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయంతో కేసు ఒకే రాష్ట్రానికి పరిమితం కానుంది.

మృతుడు అమెరికా పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు.. పారిశ్రామిక వేత్త కావడంతో ఏపీ పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానితులందరినీ ఆగమేఘాల మీద అదుపులోకి తీసుకొని.. కృష్ణా జిల్లా తరలించారు. ఆరు రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. స్వయంగా కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా నిందితులను విచారించారు. తాము చేపట్టిన దర్యాప్తులో బయటపడిన అంశాలను మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి. హత్యకు ముందు జరిగిన పరిణామాలు, హత్య తర్వాత సాగిన దర్యాప్తు వివరాలన్నీ తెలియజేశారు. ప్రధాన నిందితుడిచ్చిన సమాచారం ఆధారంగానే సేకరించిన వివరాలు వన్‌ బై వన్‌ చెప్పారు. అప్పటికే జయరామ్‌ మేనకోడలు శిఖాచౌదరికి ఈ హత్య కేసుతో సంబంధం లేదని తేల్చారు. నిందితురాలిగా చేర్చేందుకు అవసరమైన ఆధారాలు గానీ, డేటా గానీ ఏదీ లభించక పోవడంతో.. ఆమెను వదిలేశారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టిన కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి.. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు.

మరుసటిరోజుకు పరిణామాలు మారిపోయాయి. ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ పోలీసులకు బదిలీ చేశారు. ఈమేరకు ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి మొదటినుంచీ ఈకేసులో ఈ తరహా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. హత్య హైదరాబాద్‌లో జరగడం, నిందితుడి ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే ఉండటం.. మర్డర్‌ప్లాన్‌ స్కెచ్‌ కూడా ఇక్కడి నుంచే సాగడం.. ఇలా అన్ని అంశాలూ హైదరాబాద్‌తోనే ముడిపడి ఉండటంతో.. కేసు దర్యాప్తు హైదరాబాద్‌ పోలీసులకు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అలా అనుకున్నట్లే.. ఏపీ పోలీసులు జయరాం హత్యకేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన జయరాం హత్య కేసు దర్యాప్తు.. ఇక తెలంగాణలోని జూబ్లీహిల్స్ పోలీసులు చేపట్టనున్నారు.

 

ఉత్తరాంధ్రాలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరతారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిశోర్‌ చంద్రదేవ్‌ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యునిగా చేశారు. దాదాపు 30 ఏళ్లు ఆయన పార్లమెంటులో గడిపారు. విజయనగరం జిల్లా కురుపాం రాజుగా అందరికీ తెలిసిన కిశోర్‌ చంద్రదేశ్‌ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే ఫిబ్రవరి 15న జన్మించారు. 1977లో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కొండ దొర సామాజికవర్గం. ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానం పార్వతీపురం నుంచి గతంలో పోటీ చేశారు. ఆ తరువాత అరకులోయ నియోజకవర్గం ఏర్పాటుకాగా 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు.

centerminister 0602019

ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఆయనకు సహాయ మంత్రి పదవి లభించింది. మైన్స్‌, స్టీల్‌, కోల్‌ మంత్రిగా చేశారు. ఆ తరువాత 2011-14 మధ్య రాజ్యసభ సభ్యునిగా చేశారు. అప్పుడు కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వరించారు. ఆయనకు ముక్కుసూటి మనిషిగా పేరుంది. సొంత పార్టీ నిర్ణయాలు, నాయకులను కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తే ఓడిపోతానని కచ్చితంగా తెలిసినా పార్టీ ఆదేశం మేరకు బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు.

 

centerminister 0602019

అయితే పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తంచేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా కిశోర్‌చంద్రదేవ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పనిచేస్తానని ఆయన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అంటే రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీతో ఆయన కలిసి పనిచేస్తారని పరోక్షంగా చెప్పినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికార పక్షం(తెలుగుదేశం) ఒక్కటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో కిశోర్‌ చంద్రదేవ్‌ తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే అరకులోయ ఎంపీ అభ్యర్థి ఆయనే అవుతారని, అందులో అనుమానం అవసరం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తానని కిశోర్‌చంద్రదేవ్‌ ప్రకటించినందున రాజకీయంగా కీలకంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఆయన రాకను తెలుగుదేశం వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిగినట్టు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read