రాష్ట్రంలోనే అతి పెద్ద రన్‌వే కలిగిన విమానాశ్రయంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం రూపుదిద్దుకుంది. దీనికి తోడు అతి పెద్ద విస్తీర్ణం కలిగిన విమానాశ్రయంగా రూపుదాల్చింది. ఇటు గన్నవరం, అటు విశాఖ మధ్య అతి పెద్ద ఎయిర్‌పోర్టుగా రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఎయిర్‌పోర్టును రూ.181 కోట్లతో అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా 1750 మీటర్ల విస్తీర్ణం కలిగిన రన్‌వేను 3185 మీటర్లకు విస్తరించారు. రన్‌వేను 45 మీటర్ల వెడల్పున విస్తరించారు. దీంతో ఒకేసారి ఆరు అతి పెద్ద విమానాలు నిలపడానికి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలవనుంది.

rajahmundry 23012019

ఇక్కడ నుంచి నేరుగా విదేశాలకు వెళ్ళే విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన వౌలిక సదుపాయాలతో విమానాశ్రయం రన్‌వేకు రెండు వైపులా 7.5 మీటర్ల వెడల్పున సేఫ్టీ షోల్డర్స్ నిర్మించారు. విశాఖ విమానాశ్రయం వైమానిక విమానాశ్రయంగావుంది. డొమెస్టిక్ విమానాశ్రయంగా గన్నవరం వుంది. ఈ క్రమంలో ఈ రెండు విమానాశ్రయాలకు మధ్యలో అతి పెద్ద విమానాశ్రయంగా రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి చెందింది. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నిర్మాణ పనులను చేపట్టి రన్‌వేను రికార్డు స్థాయిలో పూర్తిచేశారు. ప్రస్తుతం రాత్రి ల్యాండింగ్ విమానాలను కూడా నిర్వహిస్తున్నారు. రన్‌వే సిద్ధం కావడంతో 300 సీటింగ్ కెపాసిటీ కలిగిన సీ-27 వంటి విమానాలు సైతం రానున్నాయి.

rajahmundry 23012019

ప్రస్తుతం ఇక్కడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయడంతో మరో రెండు నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కార్డియోగ్రఫీ సర్వే జరుగుతోంది. ఈ సర్వే అనంతరం ఇక్కడ ఉన్న సదుపాయాలతో కార్డియోగ్రఫీ సర్వే చార్టు రూపొందుతుంది. ఈ ప్రక్రియ రెండు నెలల్లో పూర్తికానుంది. ఆ వెనువెంటనే అంతర్జాతీయ విమానాశ్రయంగా సీ 27 వంటి పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో 16 సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. మూడు ఏఫ్రాన్లు నిర్మించారు. దీంతో ఒకేసారి ఆరు పెద్ద విమానాలు ఆగుతాయి. ఇటు ప్రయాణికులు, అటు లగేజి కలిగిన బెల్లీ కార్గో విమానాలు కూడా రానున్నాయి. గతంలో 380 ఎకరాల విస్తీర్ణంలో వుండే ఈ విమానాశ్రయం 1250 ఎకరాల్లో విస్తరించారు. ఈ విమానాశ్రయానికి చుట్టూ 17 కిలో మీటర్లు రోడ్డు, చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లిలో సుడిగాలి పర్యటన చేపట్టారు. సాయంత్రం సుమారు గం. 4.30 సమయంలో ప్రత్యేక విమానంలో ఢిల్లిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయన, విమానాశ్రయం నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎక నమిక్‌ ఫోరం కార్యక్రమంలో ప్రసంగించారు. ముందుగా ఏపి భవన్ నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది అనుకున్నా, సమయం మించిపోవటంతో, చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచే మాట్లాడారు. సంక్షోభంలో పడిపోయిన వ్యవ సాయానికి సేంద్రీయ సాగే పరిష్కారమని తెలిపారు. వాతావరణ మార్పులు, రసాయన ఎరువుల కారణంగా సాగు ఖర్చు పెరిగిపోవడంతో అంతర్జాతీయంగా వ్యవ సాయం సంక్షోభంలో పడిపోయిందని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఖర్చు లేని సేంద్రీయ సాగు పద్ధతి)ని తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అంతటా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సహజసిద్ధ సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల సంఖ్య 27 లక్షలుగా ఉందని, ఇది మొత్తం వ్యవసాయంతో పోల్చి చూస్తే కేవలం 0.5 శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు అన్నారు.

గత 2 దశాబ్దాలుగా సేంద్రీయ సాగు పద్ధతులు అవలంబించే రైతుల సంఖ్యలో పురోగతి చాలా నెమ్మదిగా జరుగుతోందని, ఇందుకు కారణాలను విశ్లేషిస్తే.. రైతులు రసాయన ఎరువులకు అలవాటుపడిపోవడం, ప్రభుత్వం, సమాజం నుంచి తగినంతగా మద్ధతు లభించకపోవడం, అలాగే ఈ విధానంపై సరైన అవగా#హన లోపించడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం ఈ అడ్డంకులు, అవరోధాలను అధిగమించిందని, కేవలం మూడేళ్లలోనే సేంద్రీయ వ్యవసాయ విధానం వాటాను మొత్తం వ్యవసాయంలో 8 శాతానికి పెంచగల్గిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు సేంద్రీయ సాగు చేస్తున్నారని ఈ తరహా వ్యవసాయం చేస్తున్నారన్నారు. 2024 నాటికి మొత్తం రైతులందరినీ స#హజ సిద్ధ వ్యవసాయ విధానం వైపు మళ్లించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. డా. సుభాష్‌ పాలేకర్‌ నేత త్వంలో ఈ మేరకు అవగా#హన, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ చిత్తశుద్ధి, 5,600 మంది అనుభవజ్ఞులైన రైతులు, 1,06,991 స్వయం సహాయక బృందాలు ఆంధ్రప్రదేశ్‌ జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ కి మూలస్తంభాలుగా నిలిచి లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ సమావేశంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి కనబర్చాయి. ఇండోనేషియా మంత్రి లుహూత్‌ ఏపీ అనుసరిస్తున్న సేంద్రీయ సాగు విధానాన్ని తమ దేశంలోనూ అనుసరిస్తామని చెప్పారు. గ్రీన్‌ ్లకమేట్‌ ఫండ్‌ సంస్థ సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రెసిడెంట్‌ పవన్‌ సుఖ్‌దేవ్‌ ఏపీ ప్రభుత్వానికి నేల స్వభావం, వాతావరణం అంశాలపై స#హకరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఐసీఆర్‌ఏఎఫ్‌ (వరల్డ్‌ ఆగ్రోఫారెస్ట్రీ సెంటర్‌) శాస్త్రీయ సహాయం అందించేందుకు ముందుకు రాగా, ఇంటర్నేషనల్‌ నైట్రోజన్‌ ఇనీషియేటివ్‌ ఛైర్మన్‌ మార్క్‌ సుట్టన్‌ గ్లోబల్‌ లకమేట్‌ రీసెర్చ్‌ ఫండ్‌ దక్షిణాసియా #హబ్‌ ఏర్పాటు కోసం 20 మిలియన్‌ అమెరికా డాలర్లు కేటాయిస్తామని తెలిపారు. సేంద్రీయ విధానంలో భాగస్వామిగా ఉన్న బీఎన్పీ పరిబాస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. సేంద్రీయ సాగుపై పరిశోధన కోసం అమరావతిలో గ్లోబల్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సంస్థ సేంద్రీయ సాగుపై సమాచారం, అధ్యయనం, సరికొత్త సేంద్రీయ విధానాలపై పరిశోధనలు చేస్తుందని, సరికొత్త ఆవిష్కరణలతో సేంద్రీయ సాగును మరింత అధునాతనంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుందని తెలిపారు.

రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలందరూ కష్టపడి సమన్వయంతో పనిచేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతోంది.. ఇలాంటి తరుణంలో అంతా మరింత కష్టపడి పనిచేయాలి.. మీరు బాగుంటేనే నాయకుడుగా నాకు మంచి పేరు.. మీలో ఏ ఒక్కరు సక్రమంగా లేకపోయినా నాకే చెడ్డపేరు వస్తుంది.. ఎన్నికలే లక్ష్యంగా అంతా కష్టపడి పనిచేయాలి.. ఏ చిన్న లోపం జరక్కూడదు.. ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఉద్ఘాటించారు. సోమ వారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎన్నికల వ్యూహంపై బాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

dwacra 22012019

ఈనెల 30 నుంచి జరిగే శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా సేకరించిన భావి అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1,2,3 తేదీలలో పింఛను పండుగ నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రిలో జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. నెగటివ్ పబ్లిసిటీ ఎప్పుడూ పనిచేయదన్నారు. నాలుగేళ్లలో 6లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒకరు.. 11 లక్షల కోట్లు జరిగిందని మరొకరు తమపై అభాండాలు వేస్తున్నారని బడ్జెట్‌కు మించిన అవినీతి జరిగిందంటే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. ‘మళ్లీ నువ్వే రావాలి’ అనే నినాదం ప్రజల నుంచి పుట్టుకొచ్చిందని దీంతో వైసీపీలో దడ పుట్టిందన్నారు. అందుకే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు.

dwacra 22012019

నిన్నునమ్మం బాబు అనే ప్రచారం ఇందులో భాగమే అన్నారు. వైసీపీ నెగటివ్ భావజాల పార్టీ అని, ప్రతిపక్షనేత జగన్ నెగటివ్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆరేళ్ల క్రితం వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారని, అందుకే ప్రజలు పట్టించుకోవటంలేదని స్పష్టం చేశారు. ప్రజల్లో పాజిటివ్‌నెస్‌కే ప్రాధాన్యత ఉంటుందన్నారు. సానుకూలతవైపే వారు మొగ్గుచూపుతారని ప్రతికూలతలను వ్యతిరేకిస్తారన్నారు. గత నాలుగున్నరేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించాం.. పెద్దఎత్తున పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం.. ఇంత అభివృద్ధి, సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నామని, సీమ జిల్లాలకు సాగునీరందిస్తున్నామని పునరుద్ఘాటించారు. కేంద్రం తోడ్పాటు లేకున్నా స్వయంకృషితో రాష్ట్భ్రావృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

ఆడపడుచులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ఇప్పటికే పసుపు-కుంకుమ కింద భారీమొత్తంలో నగదు మొత్తాన్ని అందించిన ప్రభుత్వం, మరోసారి డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.10వేలు ఇచ్చేందుకు నిర్ణయించింది. పాత గ్రూపు సభ్యులకే కాకుండా, ఈ మధ్యకాలంలో ఏర్పడిన అన్ని సంఘాలకు, వాటిలోని సభ్యులకు కూడా ఈ నగదు మొత్తాన్ని ఇవ్వనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఏకకాలంలో చెక్‌ల రూపంలో ఈ నగదును అందించి, మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ కానుక వల్ల జిల్లాలో దాదాపు 6లక్షల14వేల మంది మహిళలకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి సభ్యురాలికి రూ.4వేల విలువచేసే స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద తరహాలో లబ్ధి చేకూర్చుతుండటంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

dwacra 22012019

డ్వాక్రా మహిళల ప్రగతి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక దశ నగదును పంపిణీ చేసేశారు. పెట్టుబడి నిధి, చంద్రన్న చేయూత, పసుపు-కుంకుమ కింద నాలుగు విడతల్లో డ్వాక్రా సభ్యులకు చెల్లింపులు చేశారు. తొలి రెండు విడతల్లో రూ.3వేల చొప్పున జమ చేయగా, మలి రెండు విడతల్లో మరో రూ.2వేలను సభ్యురాలి ఖాతాలోకి జమ చేశారు. మొత్తంగా నాలుగు విడతల్లో ప్రతి ఒక్క సభ్యురాలికి రూ.10వేలను వారి ఖాతాలో వేశారు. 2014, మార్చి 31 నాటికి ఉన్న గ్రూపులకు, అందులోని సభ్యులకు మాత్రమే ఎన్నికల హామీలో భాగంగా ఈ నగదును అందించారు. అప్పుడు మొత్తం 56,408 గ్రూపుల్లోని దాదాపు 5లక్షల70వేల మందికి రూ.570 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.

dwacra 22012019

మొదటి దశలో సభ్యులందరికీ నగదును అందజేసిన ప్రభుత్వం మరోమారు డ్వాక్రా సంఘాల సభ్యులకు భారీ కానుకను అందించేందుకు నిర్ణయించింది. దీంతో డ్వాక్రా సంఘాల సభ్యుల ఆనందం మరింత రెట్టింపు కానుంది. జిల్లాలో ప్రస్తుతం గ్రూపుల సంఖ్య 60,645 దాటింది. ఈ గ్రూపులో పరిధిలో ఇప్పుడు 6లక్షల14వేల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కూడా రూ.10వేల చొప్పున పసుపు- కుంకుమ కింద ప్రభుత్వం కానుకను ఇవ్వనుంది. మొత్తం రూ.610 కోట్లను ఈ డ్వాక్రా సంఘాల సభ్యులకు చెల్లించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మహిళలకు రూ.10వేల కానుకతో పాటు వారిని మరింతగా ముందుకు నడిపించేందుకు వీలుగా స్మార్ట్‌ఫోన్లను కూడా ప్రభుత్వం అందించనుంది.

Advertisements

Latest Articles

Most Read