విశాఖను మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటయిన మెడ్‌టెక్ జోన్‌ను గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్ డిస్పోజబుల్స్‌, వైద్య రంగంలో వినియోగించే యంత్ర పరికరాలు, సర్జికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఇంప్లాంట్స్‌, వ్యాధి నిర్ధారణతో పాటు ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత.

sehawag 22012019 1

అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన మెడ్‌టెక్‌ జోన్‌ కు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో, మెడ్‌టెక్‌ జోన్‌ గురించి పుబ్లిసిటీ ఇచ్చింది. ఇదే విషయం పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేసారు.వైజాగ్ AMTZ, ప్రైడ్ అఫ్ ఇండియా అంటూ, ప్రశంసిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేసారు. ఇది సెహ్వాగ్ ట్వీట్.. "Wow ! @AP_MedTechZone shines at the World Economic Forum 2019 as a wonderful example of Sector Specific Innovation Cluster of global excellence. AMTZ is truly going to be a huge pride for India". వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’, మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో ఏర్పాటైతే, మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, మన రాష్ట్రం కాకపోయినా, అక్కడ ఏర్పాటైన కంపనీలు గురించి, అందరికీ తెలిసేలా ట్వీట్ చేసిన సెహ్వాగ్ కు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి.

sehawag 22012019 1

విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్‌లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అవన్నీ ఏర్పాటైతే మొత్తం 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భారత్‌ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, విశాఖలో ఫర్మా సిటీ పెట్టి, అనేక కంపనీలను తీసుకొచ్చారు. ఇప్పుడు మెడ్ టెక్ జోన్ తో, అనేక వైద్య పరికరాల తయారీ కంపెనీలు రానున్నాయి.

ఇది నిజంగా సంచలనమే.. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడూ ఇలా అగ్రెసివ్ గా ఉండరు. చాలా ఆచి తూచి, సాగ దీసి, సవర దీసి, ఉండే నైజం ఆయనది. పోనీలే మారతారు అంటూ వదిలేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఒక సిట్టింగ్ ఎమ్మల్యేని పార్టీ నుంచి సస్పండ్ చేసారంటే అది నిజంగా సంచలనమే. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో పాటు వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు రావడంతో పార్టీ కార్యకర్తల ఏకగ్రీవ తీర్మానం మేరకు మేడాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నేతలు, కార్యకర్తలతో సీఎం తన నివాసంలో సమావేశమయ్యారు. అనర్హుడికి అందలమెక్కించారని, మేడాను సస్పెండ్‌ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో మేడాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చంద్రబాబు సమావేశంలోనే ప్రకటించారు.

cbn 2201201 1

మేడా పార్టీ వీడడం ఖాయమని తేలిపోవడంతో రాజంపేట టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, రాజు స్కూళ్ల అఽధినేత జగన్‌మోహన్‌రాజు, మహిళా నేత పత్తిపాటి కుసుమకుమారి, రెడ్‌బస్‌ యాప్‌ అధినేత చరణ్‌కుమార్‌రాజు తదితరులు రాజంపేట టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక మేడా తప్పుకున్నట్లేనన్న భావనలో ఉన్న ఈ నేతలు ఎవరికి వారు టికెట్ల రేసులో ఉన్నట్లు సమాచారం. మంగళవారం జరిగే సీఎం సమీక్షకు ఈ నేతలు భారీగా వాహన శ్రేణిని ఏర్పాటు చేసి బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.

cbn 2201201 1

సోమవారం సాయంత్రమే పసుపులేటి బ్రహ్మయ్య, వేమన సతీష్‌ తదితరులు తమ అనుచరులను వాహనాల్లో అమరావతికి పంపారు. రెడ్‌బస్‌ యాప్‌ వ్యవస్థాపకుడు చరణ్‌కుమార్‌రాజు సోమవారం ఉదయం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమే్‌షను కలిసి ఈసారి టికెట్‌ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. మంగళవారం జరిగే సీఎం సమీక్షకు హాజరు కావాలని సీఎం రమేష్‌ చరణ్‌రాజును కోరారు. రాజంపేట టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుండడంతో తెర పైకి కొత్త కొత్త నేతలు వస్తున్నారు. రాజంపేట ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాత ధీటైన అభ్యర్థి ఎవరన్నది గుర్తించి ప్రకటించే అవకాశముందని ఆ పార్టీ ముఖ్య నేత తెలిపారు.

అన్నదాతల నుంచి అటో డ్రైవర్ల వరకు... చేనేత కార్మికుల నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల వరకు... అనేక వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాన్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీనిద్వారా 54.61 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఇక... ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు విడతల డీఏలో ఒక విడతను ఈ నెల నుంచే ఇవ్వాలని సోమవారం సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది. డీఏ బకాయిల మొత్తం రూ.513 కోట్లను ఉద్యోగులకు వాయిదాల రూపంలో చెల్లించాలని, దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్‌ పే స్కేలు-2015 ప్రకారం మినిమం టైమ్‌ స్కేల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనిప్రకారం వారి వేతనం దాదాపు 50 శాతం పెరుగుతుంది. గతంలో వారికి ఏటా 10 నెలల జీతం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు పది రోజులు మాత్రం మినహాయించి... మొత్తం 12 నెలలకు జీతం ఇస్తారు. ఆటోలు, ట్రాక్టర్లకు కేటగిరీలను బట్టి త్రైమాసిక, జీవిత కాల పన్ను మినహాయించారు. దీని వల్ల 9 లక్షల మంది ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్లు 1.82 లక్షల మంది ట్రాక్టర్‌ యజమానులకు లబ్ధి చేకూరనుంది.

cabinet 22012019

చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా.. చేనేత కార్మికులకు వైద్య- ఆరోగ్య బీమ పథకాన్ని ప్రభుత్వం మళ్లీ తీసుకొస్తోంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో దీనిని చేపడుతున్నారు. అలాగే... బుడగ జంగాల సామాజిక హోదా మార్పుపై శర్మ కమిటీ నివేదికపై మంత్రి మండలి చర్చించింది. రాబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రైతుకు సాయం... రాష్ట్రంలో రైతులకు మరింత మేలు చేసేలా పెట్టుబడి సాయం అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైతులతోపాటు కౌలు రైతులకూ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అమలు చేస్తారు. దీనికి సంబంధించిన తుది విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తారు. అగ్రి గోల్డ్‌ బాధితులకు అండ.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చిన్న డిపాజిట్లను తానే చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.250 కోట్ల మొత్తాన్ని హైకోర్టులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ మొత్తాన్ని చిన్న డిపాజిట్‌దారులకు అందచేస్తారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకంతో వచ్చిన మొత్తాన్ని కూడా దీనికి జతచేస్తూ బాధితులకు చెల్లింపులు చేస్తారు.

cabinet 22012019

2014 జూన్‌ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న 1.26 లక్షల ఇళ్లకు సాయం అందించనున్నారు. ఒక్కో ఇంటికి రూ. 60 వేలు చొప్పున ఇస్తారు. అందులో మరుగుదొడ్డికి రూ.15వేలు కేటాయిస్తారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.756 కోట్లు భారం పడనుంది. అలాగే... 1996-2004 మధ్యలో పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 20వేల యూనిట్లకు రూ.20 కోట్లు చెల్లిస్తారు. అలాగే... అర్బన్‌ హౌసింగ్‌ కోసం భీమునిపట్నం మండలం కొత్త వలసలో 94.86 ఎకరాలు,పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 127.46 ఎకరాలను ల్యాండ్‌పూలింగ్‌లో సమీకరించేందుకు అనుమతించారు.

సైబర్‌ హ్యాకింగ్‌తో నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారా?.... ఈవీఎంల హ్యాకింగ్‌ ఆయనకు దుర్నిరీక్ష్య విజయం సాధించిపెట్టిందా? అవునని చెబుతూ లండన్‌లో సోమవారం నాడు జరిగిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న తరుణాన పెను సంచలనం రేపే ఈ విషయాన్ని సయ్యద్‌ సుజా అనే సైబర్‌ నిపుణుడు బయటపెట్టాడు. భారత్‌లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీస్థాయిలో ఎలకా్ట్రనిక్‌ ట్యాంపరింగ్‌ జరిగిందని, ఈవీఎంలన్నింటినీ తక్కువ పౌనఃపున్యం ఉన్న సిగ్నల్స్‌ ద్వారా హ్యాక్‌ చేశారని ఆయన లండన్‌లో ఓ మీడియా సమావేశంలో ఆరోపించారు. ‘‘లో ఫ్రీక్వెన్సీ మిలటరీ గ్రేడ్‌ సిగ్నల్స్‌ను అనిల్‌ అంబానీ సంస్థ అయిన రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌ కామ్‌) అందజేసింది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఈవీఎంలను సులువుగా హ్యాకింగ్‌ చేయడానికి వీలుగా రూపకల్పన చేశారు. ఇందులో లబ్ధిదారు బీజేపీ. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం వెనుక జరిగినదిదే. ఇది ముమ్మాటికీ నిజం’’ అని సుజా పేర్కొన్నారు. ఈవీఎంలను నిషేధించి పాత పద్ధతిలో బ్యాలెట్‌ల రూపంలో ఎన్నికలు జరపాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్న సమయంలో సుజా వెల్లడించిన అంశాలు రాజకీయంగా దుమారాన్ని రేపడమే కాక- 2014 తరువాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు కలిగిస్తున్నాయి.

‘‘ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చన్న విషయం బీజేపీకి బాగా తెలుసు. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నందువల్లే 2014లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ టాంపరింగ్‌ వల్ల కాంగ్రెస్‌ 201 సీట్లు కోల్పోయింది. హ్యాకింగ్‌ను నడిపించిన రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌కు దేశవ్యాప్తంగా 9 చోట్ల కేంద్రాలున్నాయి. తక్కువ స్థాయి మిలటరీ గ్రేడ్‌ సిగ్నల్స్‌ పంపడం ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే పని అక్కడి ఉద్యోగులకూ తెలుసు’’అని సుజా పేర్కొన్నారు. ఆనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సంపత్‌కు కూడా ఈవీఎంల టాంపరింగ్‌ గురించి తెలుసునన్నారు. ‘సంపత్‌ ఆధ్వర్యంలోనే ఈవీఎంల ప్రాసెసింగ్‌ జరిగింది. ముండేకు, ఆయనకు అన్ని విషయాలూ తెలుసు’’ అని పేర్కొన్నారు. వీవీప్యాట్లలో ఓట్ల లెక్కింపుకు బీజేపీ నిరాకరించడం వెనుక కారణం ఇదేనన్నారు. ‘‘2014 సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు, 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ మేం ఆ సిగ్నల్స్‌ను అడ్డుకోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించగలిగింది. 2014 మహారాష్ట్ర, 2017లో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను సైతం బీజేపీ రిగ్గింగు చేసింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ల్లో జరిగిన ఎన్నికల్లో సైతం ఎలకా్ట్రనిక్‌ రిగ్గింగ్‌కు, ఈవీఎంల హ్యాకింగ్‌కు బీజేపీ ప్రయత్నించింది. అయితే మేం వారి సిగ్నల్స్‌ను మధ్యలోనే అడ్డుకోగలిగాం’’ అని సుజా చెప్పుకొచ్చారు. ‘‘ఈ హ్యాకింగ్‌ విషయం బీజేపీ నాయకుడు గోపీనాథ్‌ ముండేకు తెలుసు. ఆయనను కేంద్ర కేబినెట్లోకి తీసుకొన్న 15 రోజులకే హత్యచేశారు.

రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు చూపినప్పటికీ అది నిజానికి హత్య. దానిపై దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారి తంజీల్‌ అహ్మద్‌ -ముండే మరణం హత్యేనని తేల్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి సిద్ధమవుతున్న దశలో ఆయననూ హత్యచేశారు. బెంగళూరులో రచయిత్రి, సామాజిక కార్యకర్త, సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌కు ఈ విషయం చెప్పాం. ఆమె ద్వారా ఈ హ్యాకింగ్‌ వ్యవహారాన్ని భారత్‌లోనే బయటపెట్టాలనుకున్నాం. ఆమె కూడా మా కథనాన్ని ప్రచురించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆమెను కూడా చంపేశారు. టీవీ చర్చల్లో పెద్దగా అరుస్తూ పాల్గొనే ఓ జర్నలిస్టుకు ఈ విషయం చెప్పాం. ఆయన పట్టించుకోలేదు. మా టీమ్‌ సభ్యులందరిపైనా దాడులు జరిగాయి అని సుజా వివరించారు.

Advertisements

Latest Articles

Most Read