ఐదుకోట్ల మంది ఆంధ్రుల కలల రాజధానికి రూపం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజ ధాని అమరా వతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతి నిర్మాణ వ్యయాన్ని 70 వేల కోట్లకు పైగా నిర్ధారించినా.. ప్రస్తుతం 39 వేల కోట్ల రూపాయల విలువైన పనులు సాగుతున్నాయి. తెలుగు ప్రజలు అచ్చెరువు పొందేలా ఆకాశ హర్మ్యాలు రూపుదిద్దు కుంటున్నాయి. రాత్రింబవళ్లు వేల సంఖ్యలో కార్మికులు అక్కడ అహరహం శ్రమిస్తున్నారు. నిర్మాణాలన్ని షేర్‌వాల్‌ టెక్నాలజీతో సాగుతున్నాయి. ఈ టెక్నాలజీలో ఇటుకలను వినియోగించరు. పేదలకు ఐదు వేల వరకు నివాసాలు సిద్ధం కావస్తున్నాయి, మొత్తం 61 టవర్లలో 3840 ఫ్లాట్లు సిద్ధం కావాల్సి ఉండగా ఇప్పటికే 1200కు పైగా ఫ్లాట్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ ఫ్లాట్లకు ఇంటీరీయర్‌ పనులు ప్రారంభం అయ్యాయి.

amaravati 08012019

విట్‌, ఎస్సారెమ్‌ వంటి విద్యాసంస్థలు ఇప్పటికే కొలువు దీరాయి. హైకోర్టు భవనం శరవేగంగా నిర్మాణమవుతోంది. జనవరి నెలాఖరు నాటికి హైకోర్టు భవనాన్ని ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. ఆలిండియా సర్వీసు అధికారుల టవర్‌కు సంబంధించిన 12 అంతస్తుల నిర్మాణం 80 రోజుల్లో పూర్తయింది. గజిటెడ్‌ అధికారులు, ఎన్జీఓలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. ఏపిసిఆర్డీ యే ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులుయే మరో వేపున సాగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సాగుతున్న పనులు చూస్తుంటే అక్కడ ఎంతో కోలాహలం కనిపిస్తుంది. సచివాలయం పరిధి లోని సిఎం టవర్‌, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేల, అధికారుల గృహ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. విద్యుత్‌ కాంతుల వెలుగులో జరుగుతున్న నిర్మాణ పనులతో ఆయా ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.

amaravati 08012019

అమరావతి రాజధాని నగరంలో నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్‌, హెచ్‌ఓడి, జీఏడి టవర్ల రాఫ్ట్‌ ఫౌండేషన్‌ రికార్డు సమయంలో పూర్తయింది. 55 గంటల రికార్డు సమయంలో ఫౌండేషన్‌ పూర్తయిందని సైట్‌లొనె సిఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ప్రకటించారు. రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల తుది దశకు జీఏడి టవర్‌కు మొత్తం 11వేల 236 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను నిరాటంకంగా 55 గంటల్లో వేయడం జరిగింది. దేశంలో ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏకముుెత్తంలో ఇలా చేయడం రికార్డు అని అధికారులు చెప్పారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం తర్వాత జీఏడి టవర్‌ రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను కాంట్రాక్ట్‌ సంస్థ ఎన్సీసి ప్రారంభించింది. 500 మంది కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో నిరాటంకంగా పనులు సాగించి విజయవంతంగా పూర్తి చేశారు. పనుల నిమిత్తం ఎనిమిది బూమ్‌ ప్రెసర్స్‌ వాడారు.

రాష్ట్ర విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి , హామీలు నెరవేర్చకుండా, మోడీ ఏపీకి వెన్నుపోటు పొడిచార‌ని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని త‌న‌ కుట్ర‌లు, కుతంత్రాలు కూడా ఏమీ చేయ‌లేక‌పోవ‌డంతోనే త‌న‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని మంత్రి నారా లోకేష్ మండిప‌డ్డారు. జ‌న్మ‌భూమి స‌భ‌లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ముష్టికుంట్ల గ్రామం వ‌చ్చిన మంత్రి.. ప్ర‌ధాని మోడీ త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ఘాటుగానే స‌మాధానం ఇచ్చారు. `కృష్ణా జిల్లా వారి మ‌నుమ‌డిని..అల్లుడ్ని.` అంటూ ప్ర‌సంగం ఆరంభించారు లోకేష్‌. ``నాకు ఊహ తెలిసేస‌రికి మా తాత విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు, మ‌హానాయకుడు నంద‌మూరి తార‌క‌రామారావు ముఖ్య‌మంత్రి అని, తాను చెడ్డీలు వేసుకునేట‌ప్ప‌టికే త‌న తండ్రి నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని ప్ర‌పంచ ప‌టంలో పెట్టార‌ని చెబుతూ త‌న ఘ‌న‌మైన రాజ‌కీయ వార‌స‌త్వాన్ని స‌భికుల‌కు వివ‌రించారు. తాత ఆశ‌యం, తండ్రి అడుగుజాడ‌ల్లో ప్ర‌జాసేవే ల‌క్ష్యంగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి... గ్రామాల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే తాను చేసిన త‌ప్పా? అని ప్ర‌శ్నించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్ర‌పంచ‌మే ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు చూసేలా ప్ర‌గ‌తి మార్గంలో ప‌య‌నింప‌జేయ‌డ‌మే నేను చేసిన నేర‌మా? అని నిల‌దీశారు. ప్ర‌ధాని మోడీ అధికారంలోకొచ్చేట‌ప్పుడు అవినీతిప‌రుల భ‌ర‌తం ప‌డ‌తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికార‌ని, అయితే అవినీతిప‌రుల్ని త‌న చంక‌నెక్కించుకుని అభివృద్ధికార‌కుల‌ను ల‌క్ష్యంగా దాడులు చేస్తున్నార‌ని లోకేష్ మండిప‌డ్డారు.

మోడీ అవినీతిప‌రుల్ని అరెస్ట్ చేయాలంటే..దొంగ‌బ్బాయి ఆయ‌న ప‌క్క‌నే ఉన్నాడ‌ని ..ఎందుకు అరెస్ట్ చేయ‌లేక‌పోతున్నార‌ని ప్రశ్నించారు. అన్నిరంగాల్లో అభివృద్ది ప‌థంలో ప‌య‌నిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే ల‌క్ష్యంతో త‌న‌పైనా, సీఎం చంద్ర‌బాబుపైనా లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ..క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబుని రోజూ తిట్టే జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి అడుగ‌డుగునా అన్యాయం చేస్తున్న మోడీని ప‌ల్లెత్తుమాట కూడా ఎందుకు అన‌డ‌ని ప్ర‌శ్నించారు. ``అసెంబ్లీకి తాను రాకుండా, త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను రానివ్వ‌ని దొంగ‌బ్బాయి..ఠంచ‌నుగా జీతాలు, అల‌వెన్సులు మాత్రం తీసుకుంటున్నార‌ని ఎద్దేవ చేశారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ప‌ని మానేసి..డ్రామాలాడుతున్నార‌ని విమ‌ర్శించారు. మొన్న‌టివ‌ర‌కూ ప్ర‌త్యేక హోదా కోసమంటూ రాజీనామా నాట‌కం ర‌క్తి క‌ట్టించ‌గా, మోడీ ఇంట్లో విజ‌య‌సాయిరెడ్డి క‌నిపించ‌డంతో ఇది రాజీనామా కాదు.. రాజీడ్రామా అని ప్ర‌జ‌ల‌కు తెలియ‌డంతో మ‌రో కొత్త నాట‌కానికి తెర‌లేపార‌ని ఎద్దేవ చేశారు. లేని సానుభూతి ర‌ప్పించుకునేందుకు కోడిక‌త్తి డ్రామా ఆడితే...చివ‌రికి ఆ క‌త్తి వీరుడు వైసీపీ కార్య‌క‌ర్తే అని తేల‌డంతో...త‌మ‌ను ఆడిస్తున్న ఢిల్లీ మోడీషాల నేతృత్వంలో కోడిక‌త్తి కేసును ఎన్ఐఏకి అప్ప‌గించ‌డం వెనుక కుట్ర‌లు ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని లోకేష్ పేర్కొన్నారు. ఇక ముచ్చ‌ట‌గా మూడోది... ఆవు, అంబులెన్స్ డ్రామాతో జ‌గ‌న్ ఎలా అభాసుపాల‌య్యారో లోకేష్‌ వివ‌రించారు.

త‌న పాద‌యాత్ర‌లో వ‌చ్చిన అంబులెన్స్‌, ఆవూ చంద్ర‌బాబు కుట్ర‌ని ఆరోపించిన దొంగ‌బ్బాయి...చివ‌రికి త‌న యాత్ర‌కు వ‌చ్చి గాయ‌ప‌డిన వైసీపీ కార్య‌క‌ర్త‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు వ‌చ్చిన అంబులెన్స్ అని తెలిసినా..ఇదే డ్రామా కొన‌సాగించ‌డం, ఆయ‌న కుట్ర రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని లోకేష్ విమ‌ర్శించారు. కుల‌, మ‌త‌, ప్రాంతాల పేరుతో ఏపీలో చిచ్చు ర‌గిలించేందుకు దొంగ‌బ్బాయి ఢిల్లీ పెద్ద‌ల‌తో క‌లిసి ప‌న్నుతున్న కుట్ర‌లు, తెలుగువారి ఐక్య‌త ముందు కొట్టుకుపోతాయ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పోరాడితే కేసులు, ఐటీ,ఈడీ దాడుల‌తో బెదిరిస్తున్నార‌ని, ఇటువంటి దాడుల‌కు బెదిరే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ఎస్‌పి, బీఎస్పీ పొత్తు ఖ‌రారైన నేప‌థ్యంలో అఖిలేష్‌యాద‌వ్‌పై సీబీఐ కేసులు బ‌నాయించార‌ని లోకేష్ ఆరోపించారు. సోము వీర్రాజుతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తెలుగులో తిట్టించి...హిందీలో అనువ‌దించుకుని మ‌రీ రాక్ష‌సానందం పొందుతున్న మోడీ...నీ కుట్ర‌లు తెలుగువారి ముందు సాగ‌వంటూ హెచ్చ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ, బీజేపీ నేత‌లు క‌లిసి ఓట్ల‌డిగేందుకు వ‌స్తార‌ని..వారిని సాద‌రంగా ఆహ్వానించి భోజ‌నం పెట్టి...ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎప్పుడు ఇస్తార‌ని నిల‌దీయాలని లోకేష్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు తెలుగుదేశం గెలుచుకునేలా మీరంతా కృషి చేస్తే ..దేశ‌ప్ర‌ధానిని మ‌న సీఎం చంద్ర‌బాబే ఎంపిక చేసి.. ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా, విభ‌జ‌న హామీల‌న్నీ సాధించుకోవ‌చ్చ‌ని సూచించారు. వేలాది మంది కార్య‌క‌ర్త‌లు ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించినందుకు ప్ర‌తీ ఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు అంటూ మంత్రి నారా లోకేష్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్‌ నేత సతీశ్‌రెడ్డిని పులివెందుల అసెంబ్లీ స్థానంలో జగన్‌పై పోటీకి నిలుపనుంది. కొద్దిరోజుల క్రితం కడప జిల్లా ముఖ్యులతో సమావేశమైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వాన్ని తెలియజేశారు. గత ఎన్నికల్లో కూడా ఆయనపై సతీశే పోటీచేశారు. జగన్‌ తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కూడా సతీశ్‌ పోటీ చేయడం విశేషం. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట వంటి పులివెందులలో గత 20 ఏళ్లుగా ఆయనే టీడీపీ అభ్యర్థిగా తలపడుతున్నారు.

pulivendula 008012019

వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే ఓట‌మి పాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప‌లో ముఖ్యంగా పులివెందుల‌లో అభివృద్ధి కార్యక్రమాలు, కృష్ణా జలాలు, వైసీపీ నుంచి చేరికల ఆసరాగా సంఖ్య పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే టీడీపీకి దక్కింది. మిగిలిన అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం చూపిస్తున్నా టీడీపీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం.. విభేదాలతో తరచూ వీధికెక్కడం ఆ పార్టీకి సమస్యగా మారింది. అయినా ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ వైసీపీకి గట్టి సవాల్‌ విసిరింది. అయితే, ఈ టెంపోను వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించి.. జ‌గ‌న్‌నే ఓడించాల‌ని బాబు వ్యూహం ప‌న్నారు.

pulivendula 008012019

అయితే, గెలుపు గుర్రంగా భావిస్తున్న సతీశ్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇక‌, ఇక్క‌డ బ‌రిలో ఎవ‌రున్నా.. టీడీపీ నాయ‌కులు మూకుమ్మ‌డిగా ఇక్క‌డ వాలిపోయి.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ చేయ‌నున్నారు. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్లు.. సీఎం.ర‌మేష్‌, బీటెక్ ర‌విలు అటు పొలిటిక‌ల్‌గాను ఇటు ఆర్థికంగాను కూడా జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కొన్ని మండ‌లాల‌ను వారు పంచుకుని మ‌రీ టీడీపీని బ‌లోపేతం చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ జెండా ఎగిరేలా నేత‌లు పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ అక్కడ ఓడించడం సాధ్యం అవుతుందా ? అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గుతారా ? లేక వైఎస్ సెంటిమెంట్ వైపే ఉంటారా అనేది చూడాలి..

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చివరి అంకానికి చేరుకుంది. రేపటితో(జనవరి 09) ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. ముగింపును గ్రాండ్‌గా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. దాదాపు సంవత్సరం నుంచి జగన్ కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేశారు. పాదయాత్ర పార్టీకి మైలేజ్ తీసుకొస్తుందని వైసీపీ భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాదే ఎన్నికల సమరం. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్మలాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

pulivendula 008012019 2

విజయవాడలో వైసీపీకి బలమైన నేతగా ఉన్న వంగవీటి రాధా అలకపాన్పు ఎక్కారు. ఓ వైపు వైసీపీ కేడర్ అంతా ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభకు సిద్ధపడుతుండగా వంగవీటి రాధా నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఆయన ఇచ్ఛాపురం వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విభేదాలే కారణమని ఆయన సన్నిహితులంటున్నారు.

pulivendula 008012019 3

మరోవైపు పాదయాత్ర ముగింపు సభకు కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించారని తనను ఆహ్వానించలేదని అందుకే దూరంగా ఉంటున్నట్లు రాధా చెబుతున్నారు..! వంగవీటి రాధా గత కొంత కాలంగా, వైసీపీ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో తాను పార్టీ మారుతునట్టు వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క గౌతం రెడ్డితో, జగన్ ఆడించిన గేమ్, ఇప్పటికీ రాధాను, తన వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. గౌతం రెడ్డి అన్ని మాటలు అన్నా, సస్పెన్షన్ ఎత్తిసి మరీ, జగన్ మళ్ళీ తన పక్కన చేర్చుకోవటంతో, రాధా అవమానం అయినా, భరిస్తూ వచ్చారు. ఇప్పుడు పార్టీలో ఇంత ముఖ్యమైన సభ జరుగుతూ ఉన్నా, రాధాకి ఆహ్వానం రాలేదు అంటే, ఇక జగన్, రాధాని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే...

Advertisements

Latest Articles

Most Read